
నటి షీలా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారామె. ‘‘మా పెళ్లి రోజు మాకెంతో ప్రత్యేకమైనది. మేం ఇద్దరం కలిసి ఓ నూతన జీవితాన్ని ఆరంభించాం. నా వివాహం జరిగింది’’ అంటూ తన పెళ్లి ఫొటోను షేర్ చేశారు షీలా. చెన్నైకి చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యాపారవేత్తను షీలా పరిణయమాడారు. 2000–2010 సమయంలో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా పలు సినిమాలు చేశారామె. తెలుగులో ‘పరుగు’ (2008), ‘మస్కా’ (2009), ‘అదుర్స్’ (2010) వంటి సినిమాల్లో నటించారు. 2011లో వచ్చిన ‘పరమవీరచక్ర’ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు షీలా.
Comments
Please login to add a commentAdd a comment