Santosh Reddy
-
ఒక్కసారిగా చిదిమిన జీవితాలు.. ఆ గ్రామంలో విషాదఛాయలు..
సాక్షి, ఖమ్మం: అశ్వాపురంమండలంలోని మల్లెలమడుగు గ్రామంలో హైస్కూల్ సమీపంలో మొండికుంట – భద్రాచలం రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మొండికుంట గ్రామానికి చెందిన యువకులు ఎడ్ల సంతోష్‌రెడ్డి (32), మీ సేవ కేంద్రం నిర్వాహకుడు కందిమళ్ల శ్రీధర్‌రెడ్డి (37) మృతి చెందారు. సంతోష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి బైక్‌పై మొండికుంట నుంచి భద్రాచలం వెళ్తుండగా హైస్కూల్ సమీపంలో మొండికుంట వైపు వెళ్తున్న ట్రాక్టర్ లైట్లు లేకుండా అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో ఎడ్ల సంతోష్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీధర్‌రెడ్డిని 108 ద్వారా భద్రాచలం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంతోష్‌రెడ్డి పాల్వంచ కేటీపీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు గతంలో వివాహం జరగగా దంపతులు విడిపోయారు. మరో పది రోజుల్లో మరో యువతితో వివాహం జరగనుంది. వివాహానికి సంబంధించిన పనులపై శ్రీధర్‌రెడ్డితో కలిసి బైక్‌పై భద్రాచలం వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శ్రీధర్‌రెడ్డి మొండికుంట గ్రామంలో ఎన్నో ఏళ్లుగా మీ సేవ కేంద్రం నిర్వహిస్తూ ఓ దినపత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేశ్‌కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇవి చదవండి: 'నన్ను మోసం చేశాడంటూ..' యువకుడి ఇంటి ముందే.. యువతి -
యాదగిరీశుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
యాదగిరిగుట్ట: రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ సంతోష్‌రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆచార్యులు జస్టిస్ సంతోష్‌రెడ్డికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ట అలంకార మూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జస్టిస్ సంతోష్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
TS: రైతు బిడ్డ సంతోష్‌రెడ్డికి 4వ ర్యాంక్
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరి గ్రామానికి చెందిన రైతు బిడ్డ రామస్వామి సంతోష్‌రెడ్డి. శుక్రవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా 4వ ర్యాంక్ దక్కించుకున్నాడు. 360 మార్కులకు గాను 331 మార్కులు సాధించాడు. రైతు చంద్రశేఖర్‌రెడ్డి, సంతోష దంపతుల కుమారుడైన సంతోష్‌రెడ్డి బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. ఐఐటీలో ర్యాంక్ సాధించాలన్నది ఇతని బలమైన కోరిక. కల నెరవేరింది...: ‘మొదటి నుంచి నాకు ఐఐటీ చదవాలని కోరిక. అందుకు అనుగుణంగా పరీక్షకు సిద్ధమయ్యా. మంచి ర్యాంక్ వస్తుంది అనుకొన్నా. కానీ, ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. నా కల నెరవేరినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ కోర్సులో చేరతా. -
JEE Advanced Result 2021: అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టారు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. ఈ పరీక్ష ఫలితాలను శుక్రవారం నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. ఇందులో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా టాప్–10లో ర్యాంక్‌ల్లో మూడు మనోళ్లు కైవసం చేసుకున్నారు. రామస్వామి సంతోష్‌రెడ్డి.. 4వ ర్యాంక్, పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి.. 5వ ర్యాంక్, మొదుళ్ల హృషికేష్‌రెడ్డి 10వ ర్యాంక్ దక్కించుకున్నారు. వీరితో పాటు సవరం దివాకర్ సాయి 11వ ర్యాంక్, ఆనంద్ నరసింహన్ 17వ ర్యాంకు సాధించారు. రిజర్వ్ కేటగిరీల్లో నలుగురు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. వీరిలో రామస్వామి సంతోష్‌రెడ్డి(ఈడబ్ల్యూఎస్), నందిగామ నిఖిల్(ఎస్సీ), బిజిలి ప్రచోతన్ వర్మ(ఎస్టీ), గొర్లె కృష్ణచైతన్య(ఓబీసీ–పీడబ్ల్యూడీ) ఉన్నారు. జోన్లవారీగా ర్యాంక్‌లు చూస్తే... టాప్–100లో ఐఐటీ బాంబే (28), ఐఐటీ ఢిల్లీ (28), ఐఐటీ హైదరాబాద్ (27), ఐఐటీ కాన్పూర్ (3), ఐఐటీ ఖరగ్‌పూర్ (1), ఐఐటీ రూర్కీ (13) ఉన్నాయి. ఈసారి జేఈఈ ర్యాంక్‌ల్లో విద్యార్థినుల వెనుకబాటు కనిపించింది. జాతీయస్థాయిలో టాప్–100లో ఒక్కరు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఐఐటీ ఢిల్లీ జోన్ పరిధిలోని కావ్య చోప్రా 98వ ర్యాంకు సాధించి మహిళల్లో టాపర్‌గా నిలిచింది. తెలుగు విద్యార్థినుల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో పల్లె భావన 107వ ర్యాంక్‌తో అగ్రస్థానం దక్కించుకుంది. 41,862 మంది అర్హత... జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 1,51,193 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా... 1,41,699 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 41,862 మంది అర్హత మార్కులు సాధించారు. అర్హత మార్కులు సాధించిన వారిలో 6,452 మంది విద్యార్థినులున్నారు. ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన మృదుల్ అగర్వాల్‌కు 360 మార్కులకుగాను 348 మార్కు లు వచ్చాయి. ఇక, మహిళల్లో టాప్‌లో నిలిచిన కావ్య చోప్రాకు 286 మార్కులు లభిం చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ రా శారు. వీరిలో సుమారు 7 వేల మంది అర్హత మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. టాప్ 500 ర్యాంక్‌ల్లో మనోళ్లు... ఐఐటీ హైదరాబాద్ పరిధిలో టాప్ 500 ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులు 135 మం ది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏడు జోన్లు ఉం డగా.. అందులో అత్యధికంగా ఐఐటీ బాం బే పరిధిలో 137 మంది ర్యాంక్‌లు సాధించారు. ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు అధికంగా ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ–108, ఐఐటీ గౌహతి–9, ఐఐటీ కాన్పూర్–24, ఐఐటీ ఖరగ్‌పూర్–38, ఐఐటీ రూర్కీ–49 ర్యాంక్‌లు సాధించాయి. 27న తొలి విడత సీట్లు... జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ర్యాంక్‌లు వెలువడటంతో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 22న మాక్ సీట్ అలకేషన్–1 చేస్తారు. 24న మాక్ సీట్ అలకేషన్–2 ఉంటుంది. 25న విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్ల చాయిస్‌ను ఇవ్వాలి. 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. కంప్యూటర్ ఇంజనీర్‌ను అవుతా మాది ఒంగోలు. నాకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 331 మార్కులు వచ్చాయి. ప్రతివారం పరీక్ష రాయడం, అందులో జరిగే పొరపాట్లు సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం, సమయపాలన పాటించడమే నా విజయానికి ప్రధాన కారణాలు. రోజుకి ఎనిమిది గంటలు చదివాను. ఏపీఈసెట్‌లో 23వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. – పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా.. మాది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు. విజయవాడలో ఇంటర్ చదవా. ఇంటర్ పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రోజుకు 14 గంటలు శ్రమించా. అమ్మ శ్రీదేవి ఎస్బీఐలో మేనేజర్. నాన్న జగదీశ్వర్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. ఏపీఈసెట్‌లో 25వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 99 పర్సంటైల్ సాధించాను. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా. చదువు పూర్తయ్యాక వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పిస్తా. – మొదుళ్ల హృషికేష్‌రెడ్డి తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. సంస్థాన్ నారాయణపురం: జేఈ ఈ అడ్వాన్స్‌డ్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన పల్లె భావన బాలికల విభాగంలో ఆలిండియా రెండో ర్యాం క్, దక్షిణ భారత్‌లో మొదటి ర్యాంక్ సాధించింది. మెయిన్స్‌లో 4 ర్యాంక్ దక్కించుకుంది. భావన మాట్లాడుతూ.. అ«ధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అడ్వాన్స్డ్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించానని పేర్కొంది. సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా.. కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నందిగామ నిఖిల్ జాతీయస్థాయిలో ఎస్సీ కేటగిరీ లో మొదటిర్యాంక్ సాధించాడు. 360 మార్కులకుగాను 283 మా ర్కులు సాధించాడు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలన్నదే తన ఆశయమని నిఖిల్ తెలిపాడు. మిర్యాలగూడ విద్యార్థికి 19వ ర్యాంక్ మిర్యాలగూడ అర్బన్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కుర్ర శ్రీనివాస్ జాతీయస్థాయిలో 19వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కిరణ్‌కుమార్, డైరెక్టర్లు అభినందించారు. -
కొత్త జీవితం
నటి షీలా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారామె. ‘‘మా పెళ్లి రోజు మాకెంతో ప్రత్యేకమైనది. మేం ఇద్దరం కలిసి ఓ నూతన జీవితాన్ని ఆరంభించాం. నా వివాహం జరిగింది’’ అంటూ తన పెళ్లి ఫొటోను షేర్ చేశారు షీలా. చెన్నైకి చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యాపారవేత్తను షీలా పరిణయమాడారు. 2000–2010 సమయంలో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా పలు సినిమాలు చేశారామె. తెలుగులో ‘పరుగు’ (2008), ‘మస్కా’ (2009), ‘అదుర్స్’ (2010) వంటి సినిమాల్లో నటించారు. 2011లో వచ్చిన ‘పరమవీరచక్ర’ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు షీలా. -
మూడో రోజు రెండు నామినేషన్లు
సాక్షి, మెదక్ రూరల్: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మెదక్ లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో పోటీ చేసేందుకు బుధవారం మూడో రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సంతోష్‌రెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థిగా సిద్దిపేటకు చెందిన బన్సీలాల్‌లు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణకు కౌటర్లను ఏర్పాటు చేశామన్నారు. కానీ 18, 19 తేదీల్లో నామినేషన్లు రాలేదన్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణకు సమయం ఉండగా 21, 23, 24 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. అందువల్ల 22, 25వ తేదీల్లో మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. -
మమ్మల్ని పట్టించుకోకపోతే పాతరేస్తాం
రామాయంపేట (మెదక్): తమను పట్టించుకోని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేటలో సంఘం జిల్లా అధ్యక్షుడు అమరసేనారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లా డారు. రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారని ఆయన చెప్పారు. తమ కుల సంఘం అభ్యున్నతి విషయమై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1,000కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి కులస్తుల ఐక్యత, అభివృద్ధే ధ్యేయంగా అక్టోబర్ 2న వేములవాడ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు సంతోష్‌రెడ్డి తెలిపారు. 12న హైదరాబాద్‌లో యాత్ర ముగుస్తుందన్నారు. అనంతరం పాదయాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు. గతంలో బ్రాహ్మణులను, తాజాగా వైశ్య సంఘాలను విమర్శించిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే ఆయనను గ్రామాల్లో తిరగనివ్వ బోమని సంతోష్‌రెడ్డి హెచ్చరించారు. -
గుప్తనిధుల డబ్బులు ఇస్తానని..
విద్యావంతులు కూడా మూఢ నమ్మకాల బారిన పడుతున్నారు. గుప్త నిధుల పేరిట జరిగిన వాగ్వాదం.. ఓ హత్యకు దారి తీసింది. ఆలశ్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న సంతోష్ రెడ్డి.. తన బాబాయి కుమారుడు మైనిక్ రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బు ఆశా చూయించి అతని వద్ద నుంచి రూ.10లక్షల వరకూ తీసుకున్నాడు. తనకు గుప్త నిధులు లభించాయని.. వాటికి శాంతి పూజ చేయడానికి అవసరమైన రూ.2లక్షలు ఇస్తే పూజలు అనంతరం రూ.15లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బుకు ఆశపడిన అన్న పది లక్షల వరకూ ఇచ్చినా.. తమ్ముడు నిధికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన తమ్ముడు అన్నను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఏడాది జనవరి 30న సంతోష్‌రెడ్డి మిస్సింగ్ కేసు నమోదవడంతో.. విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. -
ఆపద్‌బంద్
తిప్పర్తి మండలం వెంకట్రాదిపాలానికి చెందిన పులిచింతల సంతోష్ రెడ్డి గతేడాది మార్చి 29న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇతనికి సంబంధించిన ఫైల్ ఆర్డీఓ నుంచి కలెక్టరేట్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 29న వచ్చింది. అంటే వ్యక్తి మృతిచెందిన ఏడాది తర్వాత ఫైల్ పంపడం వల్ల ఆపద్బంధు కింద పొందాల్సిన సాయం కోల్పోవాల్సి వచ్చింది. నీలగిరి : వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలను ఆపత్కాలంలో ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆపద్బంధు పథకం ఆగిపోయింది. ఇంటి పెద్దనో.. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వారు ప్రభుత్వం అంతో ఇంతో ఆర్థికంగా ఆదుకుంటుందని ఆశగా దరఖాస్తు చేసుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. ఇంటి వ్యక్తి చనిపోయిన బాధ ఒకవైపు ఉంటే..అటు అధికారుల తీరుతో బాధిత కుటుంబాలు మరింత కుంగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, విద్యుదాఘాతం, అగ్ని ప్రమాదాలు, వడదెబ్బ మృతులు, ఇతర ప్రమాదాలబారిన పడి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆపద్బంధు పథకం కింద రూ.50 వేల వరకు ఆర్థికసాయం అందుతుంది. నిబంధనల ప్రకారం అయితే మరణించిన వ్యక్తి కుటుంబాలకు తక్షణమే ఈ పథకం కింద ఆర్థికసాయం అందించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం వల్ల నెలల తరబడి వే చి చూడాల్సి వస్తోంది. పలు సందర్భాల్లో ఈ దరఖాస్తులను ముఖ్యమంత్రి సహాయనిధికి మళ్లించాల్సి వస్తోంది. తద్వార బాధిత కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ దరఖాస్తులను సీఎం రిలీఫ్ ఫండ్‌కు మళ్లించడం ద్వారా కేవలం రూ.20 వేలు మాత్రమే వారికి అందుతుంది. ప్రతి ఏడాది నవంబర్ 1 తేదీ నుంచి తర్వాతి ఏడాది నవంబర్ 2 వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఆపద్బంధు పథకం కింద వర్తింపజేస్తారు. ఈ గడువు దాటిని తర్వాత ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను సీఎం సహాయ నిధికి పంపిస్తున్నారు. అధికారుల అలసత్వం... 2013-14 సంవత్సరానికిగాను జిల్లావ్యాప్తంగా ఆపద్బంధు పథకం కింద 224 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పంపడంలో తహసీల్దార్లు, ఆర్డీఓలు తీవ్ర జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్డీఓల నుంచి వచ్చిన ఫైళ్లపై కలెక్టరేట్ అధికారులు లేనిపోని కొర్రీలు పెట్టి మరింత జాప్యం చేస్తున్నారు. అధికారులు చేస్తున్న ఇలాంటి తప్పిదాల వల్ల జిల్లాలో 25 దరఖాస్తులు సీఎం రిలీఫ్ ఫండ్ కు మళ్లించాల్సి వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రద్దు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.16 లక్షల చెక్కులు ర ద్దయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 56 కుటుంబాలకు చెందిన చెక్కులు రద్దు అయినట్లు తెలుస్తున్నప్పటికీ అనధికారికంగా ఈ మొత్తం ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ముందు సీఎం సహాయం నిధి కింద జిల్లాకు రూ.16 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఈ చెక్కుల కాలపరిమితి నెలరోజుల మాత్రమే ఉంటుంది. ఎన్నికల హడావిడి కారణంగా బాధిత కుటుంబాలకు చెక్కులు జారీ కావడంలో జాప్యం జరిగింది. దీంతో ఈ నిధికి మంజూరైన సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వానికి తిప్పి పంపారు. చె క్కుల కాలపరిమితి ముగియడంతో బ్యాంకర్లు కూడా ఆ చెక్కులు చెల్లవని చెప్పారు. దీంతో సీఎం సహాయ నిధి కోసం బాధిత కుటుంబాలు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నా అధికారుల్లో ఏమాత్రమూ చలనం లేకుండా పోయింది. కుటుంబ పోషణ భారంగా మారింది నా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుటుంబాన్ని పోషించే కుమారుడు మరణించడం వల్ల పోషణ భారంగా మారింది. నా పెద్ద కొడుకు ఓ షాపులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వాహనాల టైర్లకు పంక్చర్లు అతికిస్తూ జీవనం సాగిస్తున్నాం. ఆపద్బంధు పథకానికి దరఖాస్తు చేసి నాలుగు మాసాలు కావస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. - శివలింగాచారి, మర్రిగూడ, నల్లగొండ అప్పుల బాధ వెంటాడుతోంది నా భర్త యాదయ్య రోడ్డు ప్రమాదంలో మరణించి పది మాసాలైంది. నాటినుంచి మా కుటుంబం అప్పులబాధతో ఆర్థిక స మస్యలు ఎదుర్కొంటున్నాను. మా అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆపద్బంధు పథకం ద్వారా వెంటనే డబ్బులు వస్తాయని అధికారులు చెప్పారు. రెండుసార్లు ఇంటికి వచ్చి వివరాలు తీసుకున్నారు. కలెక్టర్ కార్యాల యానికి రావాలని చెప్పి వెళ్లారు. ఇప్పటివరకు ప్ర భుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. - వై.యశోద, నెమ్మాని, నార్కట్‌పల్లి మండలం -
ఈతకు వెళ్లి ఎంబీఏ విద్యార్థి దుర్మరణం
తొగుట, న్యూస్‌లైన్ : సరదాగా స్నేహితులతో కలిసి చెరువులో ఈతక ని వెళ్లి అందులో మునిగి ఎంబీఏ విద్యార్థు ఒకరు గు రువారం మృతిచెందాడు. ఎస్ఐ జార్జ్ కథనం మేరకు.. మండలంలోని పెద్దమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన పన్యాల ముత్యంరెడ్డి, యాదమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు పన్యాల సంతోష్‌రెడ్డి ఉన్నాడు. సంతోష్‌రెడ్డి సిద్దిపేటలోని ఎంల్లకి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ ఏడాది చదువుతున్నాడు. అ యితే వేసవి సెలవులు కావడంతో స్వగ్రామానికి వచ్చా డు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామానికి చెందిన ఇ ద్దరు స్నేహితులు కరుణాకర్‌రెడ్డి, సాయికుమార్రెడ్డిల తో కలిసి గ్రామ శివారులో ఉన్న పెద్దచెర్వుకు ఈతకని వెళ్లారు. అయితే వీరికి ఈత రాకపోవడంతో ముగ్గురూ చెరువు గట్టునే ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో సంతోష్‌రెడ్డి ఈత కొడుతూ కొద్ది లోనికి వెళ్లాడు. అ క్కడ జేసీబీ గుంత ఉండడంతో అందులో మునిగిపోయాడు. సంతోష్‌రెడ్డిని కాపాడేందుకు స్నేహితులు సా హసం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని సంతోష్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలిం చినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి ముత్యంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామంలో విశాదఛాయలు.. అందరితోనూ కలివిడిగా ఉండే సంతోష్‌రెడ్డి మృతి చె ందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నా యి. ఒక్కగానొక్క కుమారుడు చేతికి అందివచ్చే క్రమం లో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, బంధువులు, మృతుని స్నేహితులు చెరువు వద్దకు చేరుకుని కన్నీటి పర్యాంతమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రాజాగౌడ్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కూచి మహిపాల్‌రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, పన్యాల ఎల్లారెడ్డి, రాజిరెడ్డి, రాధాకిషన్‌రెడ్డి, లతో పాటు మరికొందరూ సంఘటనా స్థలానికి చేరుకోని మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. -
సీఎంకు దినేష్‌రెడ్డి వత్తాసు: శంకర్రావు
హైదరాబాద్: సీఎం కిరణ్, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఇద్దరూ తోడు దొంగలేనని మాజీ మంత్రి పి.శంకర్రావు అన్నారు. సీఎం డైరెక్షన్ మేరకే దినేష్‌రెడ్డి వ్యవహరించారని ఆయన ఆరోపించారు. సీఎం, ఆయన సోదరుడు సంతోష్‌రెడ్డి చట్టవ్యతిరేక చర్యలకు దినేష్‌రెడ్డి వత్తాసు పలికారని అన్నారు. దినేష్‌రెడ్డి డీజీపీగా పదవీ విమరణ పొందిన వెంటనే సీఎం కిరణ్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్‌రెడ్డిని తప్పించడం ఖరారైపోయిందని అంతకుముందు శంకర్రావు అన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. హైకమాండ్ సీఎం ప్లగ్ పీకేయడం ఖాయమన్నారు. -
'సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలు బయటపెట్టాలి'
హైదరాబాద్: మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి స్థాయి దిగజారి మాట్లాడారని మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పదవిలో ఉన్నప్పుడు దినేష్‌రెడ్డి మాట్లాడితే విలువ ఉండేదన్నారు. హత్యకేసులో ఓ మంత్రి ప్రమేయం ఉందని చెప్పిన దినేష్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆ మంత్రిపై కేసు దాఖలు చేయకుండా సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలను దినేష్‌రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దినేష్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించాలని కేఎల్ఆర్ సూచించారు.