సీఎంకు దినేష్రెడ్డి వత్తాసు: శంకర్రావు | Dinesh Reddy Supports Kirankumar Reddy: Shankar Rao | Sakshi

సీఎంకు దినేష్రెడ్డి వత్తాసు: శంకర్రావు

Oct 10 2013 2:14 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎంకు దినేష్రెడ్డి వత్తాసు: శంకర్రావు - Sakshi

సీఎంకు దినేష్రెడ్డి వత్తాసు: శంకర్రావు

సీఎం కిరణ్‌, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఇద్దరూ తోడు దొంగలేనని మాజీ మంత్రి పి.శంకర్రావు అన్నారు.

హైదరాబాద్: సీఎం కిరణ్‌, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఇద్దరూ తోడు దొంగలేనని మాజీ మంత్రి పి.శంకర్రావు అన్నారు. సీఎం డైరెక్షన్‌ మేరకే దినేష్‌రెడ్డి వ్యవహరించారని ఆయన ఆరోపించారు. సీఎం, ఆయన సోదరుడు సంతోష్‌రెడ్డి చట్టవ్యతిరేక చర్యలకు దినేష్‌రెడ్డి వత్తాసు పలికారని అన్నారు. దినేష్రెడ్డి డీజీపీగా పదవీ విమరణ పొందిన వెంటనే సీఎం కిరణ్పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్‌రెడ్డిని తప్పించడం ఖరారైపోయిందని అంతకుముందు శంకర్రావు అన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. హైకమాండ్‌ సీఎం ప్లగ్ పీకేయడం ఖాయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement