కిరణ్ కంటే నేనే బెటర్: శంకర్రావు | I Am better than Kiran Kumar Reddy for CM Post: Shankar Rao | Sakshi
Sakshi News home page

కిరణ్ కంటే నేనే బెటర్: శంకర్రావు

Published Thu, Nov 14 2013 10:47 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిరణ్ కంటే నేనే బెటర్: శంకర్రావు - Sakshi

కిరణ్ కంటే నేనే బెటర్: శంకర్రావు

సికింద్రాబాద్: తెలంగాణవాసుల ఎన్నోయేళ్ల కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి గుడి నిర్మిస్తానని..ఇందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు విజ్ఞప్తి చేశారు. మారేడుపల్లి డివిజన్ పరిధిలో రెండెకరాల ప్రభుత్వభూమిని కేటాయిం చాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ త్వరలో లేఖ రాస్తానని ప్రకటించారు.

గురువారం బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీల్డ్‌కవర్ సీఎం అని,ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు లేదని ఎద్దేవాచేశారు. అర్హత ప్రాతిపదికన చూస్తే కిరణ్ కంటే తనకే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

అధిష్టానం దయవల్ల ముఖ్యమంత్రి అయిన కిరణ్..అదే అధిష్టానాన్ని తిట్టడం ఆయన మూర్ఖత్వమన్నారు. నెహ్రూ-ఇందిర కుటుంబం తమ జీవితాల్ని దేశానికి అంకితం చేశాయన్నారు. సోనియాను విమర్శించడం సీమాంధ్ర నేతలకు అలవాటుగా మారిందని, వారికి తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement