గిదేందే శంకరన్న .... | sonia gandhi temple hero shankar rao disappointed after being denied ticket | Sakshi
Sakshi News home page

గిదేందే శంకరన్న ....

Published Tue, Apr 8 2014 1:09 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

గిదేందే శంకరన్న .... - Sakshi

గిదేందే శంకరన్న ....

అధిష్టానానికి వీర విధేయుడిగా పేరుగాంచిన శంకర్రావు అలియాస్ శంకరన్నకు కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చింది. తనతో పాటు తన కుమార్తె సుస్మితకు టికెట్టు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. టిఆర్‌ఎస్‌ నుండి వచ్చిన వివేక్‌, వినోద్‌లకు టికెట్టు ఇచ్చి, శంకర్రావును దూరం పెట్టి చెయ్యి మార్కు చూపించి షాక్ ఇచ్చింది. దాంతో ఆరుసార్లు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన తనకు టికెట్ నిరాకరించడంపై గుస్సాగా ఉన్న ఆయన తన అనుచరులతో  కలిసి భవిష్యత్ కార్యచరణను రూపొందించుకోవటంలో బిజీగా ఉన్నారు.

ఇక తమకు గిట్టనివాళ్లపై కేసులు పెట్టించటాని కాంగ్రెస్ అధిష్టానం శంకర్రావును ఆటలో అరటిపండుగా ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధిష్టానం అనుగ్రహంతో మంత్రి పదవి అలంకరించిన శంకర్రావు తననోటికి వచ్చినట్టు మాట్లాడ్డం, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించి అధిష్టానానికి తలనొప్పిగా మారటంతో ఆయన్ని పార్టీ పదవి నుంచి పీకేసి పక్కన కూర్చోపెట్టింది.

దాంతో సోనియమ్మ భజన చేయటమే కాకుండా శంక్రరావు అవకాశం ఉన్నప్పుడల్లా తన విధేయతను చాటుకునేవారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆమెకు  గుడి కూడా కట్టించేశారు. అంతేనా... సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సోనియా పేరు పెట్టాలంటూ శంకర్రావు ప్రతిపాదన కూడా తెచ్చారు. అయితే శంకరన్నని కాంగ్రెస్ అధిష్ఠానం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదోమో అనిపిస్తోంది.

తనకు సీటు ఇవ్వకపోయినా పర్లేదు మా అమ్మాయికైనా ఇవ్వండని శంకర్రావు వినయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. రాజకీయాలలో అతి చేస్తే పరిణామాలు ఎలా వుంటాయన్నదానికి శంకర్రావు ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. దాంతో గదేందే శంకరన్న సీన్ రివర్స్ అయ్యిందని చెవులు గుసగుసలాడుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement