నన్ను ఆగంతకులు వెంటాడారు | Shankar Rao ask z-category security | Sakshi
Sakshi News home page

నన్ను ఆగంతకులు వెంటాడారు

Published Tue, Dec 24 2013 1:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నన్ను ఆగంతకులు వెంటాడారు - Sakshi

నన్ను ఆగంతకులు వెంటాడారు

మాజీ మంత్రి శంకర్రావు ఆరోపణ

సాక్షి, హైదరాబాద్: తనను ఎవరో వెంటాడుతున్నారని, తనకు జెడ్ కేటగిరీ రక్షణ కల్పించాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. శంకర్రావు సోమవారం రాత్రి తన కుమార్తె సుస్మితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం కంటోన్మెంట్ బోర్డు నుంచి మంకీ క్యాప్‌లు ధరించిన ఐదుగురు ఆగంతకులు తనను కారులో వెంబడించారని ఆరోపించారు. ఏపీ 9 టీఆర్ నెంబరుతో గల గ్రే కలర్ ఫార్చూనర్ కారులో ఆగంతకులు ఉన్నట్లు తెలిపారు. సీఎం ఎర్రచందనం కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా ప్రాపర్టీస్, గాలి జనార్దన్‌రెడ్డి, 26 జీవోలు తదితర అక్రమాలను తాను వెలుగులోకి తెచ్చానని... అది నచ్చనివారెవరో  తనను వెంబడించారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. తన తండ్రిని హతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, ఆయనకేమైనా జరిగితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిదే బాధ్యత అని శంకర్రావు కుమార్తె సుస్మిత సోమవారం రాత్రి మారెడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement