Z plus category security
-
చిరాగ్ పాశ్వాన్‌కు జెడ్– కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ/పాట్నా: ఎన్డీయే కీలక భాగస్వామి, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయనకు జెడ్– కేటగిరీ భద్రత కల్పించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు ఇప్పటిదాకా శశస్త్ర సీమాబల్‌కు చెందిన చిన్న బృందం రక్షణ కల్పించేది. 41 ఏళ్ల చిరాగ్ పాశ్వాన్.. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు కూడా. లోక్ జనశక్తి బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పొత్తుపెట్టుకొని పోటీచేసిన ఐదు లోక్‌సభ స్థానాలను నెగ్గిన సంగతి తెలిసిందే. -
జగన్ కు ప్రాణహాని.. Z+ కేటగిరీ
-
Sharad Pawar: నాపై నిఘాకే జెడ్ ప్లస్ భద్రత
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తన కదలికలపై అధికారిక సమాచారం కోసమే తనకు జెడ్ ప్లస్ భద్రతను కలి్పంచి ఉండొచ్చని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్‌కు వీఐపీ భద్రతలో అత్యున్నతమైన జెడ్ ప్లస్ భద్రతను బుధవారం కేంద్రం కల్పించింది. 55 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బృందం ఆయనకు రక్షణ కలి్పస్తారు. ముప్పును అంచనా వేసి కేంద్ర ఏజెన్సీలు ఈ మేరకు సిఫారసు చేశాయని కేంద్రం పేర్కొంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీపై అడగ్గా.. భద్రత పెంపునకు కారణాలు తనకు తెలియదని పవార్ విలేకరులతో అన్నారు. ‘ముగ్గురికి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో నేనొకడినని హోంశాఖ అధికారి ఒకరు నాకు తెలిపారు. మిగతా ఇద్దరు ఎవరని అడగ్గా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షాలని ఆ అధికారి బదులిచ్చారు’ అని పవార్ వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నాపై నిఘాకు ఈ ఏర్పాటు చేశారేమోనని 83 ఏళ్ల పవార్ అన్నారు. విపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లు భాగస్వాములనే విషయం తెలిసిందే. -
పవార్‌కు ‘జడ్ ప్లస్’ భద్రత
న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎప్పీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. వీఐపీ భద్రతలో జడ్ ప్లస్ అత్యధిక రక్షణ కవచం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన 83 ఏళ్ల శరద్ పవార్‌కు జడ్ ప్లస్ రక్షణను కలి్పంచాలని కేంద్ర హోంశాఖ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)ను కోరింది. జడ్ ప్లస్ కేటగిరీ కింద 55 మంది సాయుధ సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణ కలి్పస్తారు. కేంద్ర ఏజెన్సీలు ముప్పును అంచనా వేసి.. శరద్ పవార్‌కు అత్యంత పటిష్టమైన భద్రతను కలి్పంచాలని సిఫారసు చేశాయి. -
కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు జెడ్ ప్లస్ భద్రత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జెడ్–ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు గురువారం కేంద్ర హోం శాఖ ఆదేశాలిచ్చింది. ఆయన భద్రతకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారి వివరించారు. దేశంలో ఆయన ఎక్కడికెళ్లినా సీఆర్పీఎఫ్ జవాన్లు వెన్నంటి ఉంటారు. రానున్న ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. అందుకే ఆయనకు భద్రతను పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇకపై ఆయనకు 24 గంటలపాటూ మూడు షిఫ్టుల్లో 30 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు రక్షణ కల్పిస్తారు. దీంతోపాటు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, పైలట్, ఎస్కార్టు సమకూరుస్తారు. ప్రధాని మోదీకి అత్యంత కట్టుదిట్టమైన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రత ఉంది. దేశంలో అధిక ముప్పు ఉన్న వారికి అందించేదే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత. ఆ తర్వాత ఎక్స్, వై కేటగిరీలుంటాయి. -
కేరళ గవర్నర్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే?
తిరువనంతపురం: సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌కు సీఆర్పీఎఫ్ బలగాలతో Z+ కేటగిరి భద్రతను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ రాజ్‌భవన్‌కు తెలియజేసింది. ఈ విషయాన్ని కేరళ రాజ్‌భవన్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొంది. సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ అయిన స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా(SFI) శనివారం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనకు దిగారు. గవర్నర్ ఆరిఫ్ కొట్టారక్కర జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరుకావటానికి వెళుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో విసిగిపోయిన గవర్నర్ ఆరిఫ్.. అనూహ్యంగా రోడ్డు పక్కన్న ఉన్న ఓ షాప్ ముందు బైఠాయించారు. తనపై నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొని.. అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో జరిగింది. గవర్నర్ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పోలీసులకు తెలియజేశారు. నిరసన ఘటనపై గవర్నర్ ఆరిఫ్ .. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌పై విమర్శలు చేశారు. పినరయ్ విజయన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో అధర్మం, అశాంతిని ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడితో సహా పలువురి నాయకులపై కోర్టుల్లో క్రిమినల్ కేసులు ఉన్నా సీఎం పినరయ్ విజయన్ వారిని కాపాడటానికి పోలీసులకు దిశానిర్ధేశం చేస్తున్నారని విమర్శించారు. ఇక కొంత కాలంగా కేరళ సీఎం, గవర్నర్ మధ్యలు విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా గతంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సైతం గవర్నర్ ఆరిఫ్పై పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. చదవండి: తలొగ్గిన సర్కార్.. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్స్టాప్ -
వరుసగా బెదిరింపు ఈమెయిళ్లు.. అంబానీ భద్రత గురించి తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. గతంలో రూ.20 కోట్లు, రూ.200 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో మెయిళ్లు రాగా.. తాజాగా రూ.400 కోట్ల డిమాండ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులు ముఖేశ్ అంబానీపై ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆయనకు కల్పిస్తున్న భద్రత అలా ఉంది మరి! ప్రస్తుతం అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతేడాది నుంచే భద్రతను పెంచింది. గతంలో ముంబైలోని ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో బాంబు భయం తర్వాత పారిశ్రామిక వేత్తల భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. భద్రత ఎవరికంటే.. ప్రముఖులకు సంఘ విద్రోహశక్తుల నుంచి అపాయం ఉందని భావిస్తే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేస్తుంది. వీరిలో అత్యధిక ప్రజాదరణ కలిగి..వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని నిఘా సంస్థలు అందించే సమాచారం ఆధారంగా భద్రత అందిస్తారు. సంఘ విద్రోహశక్తుల నుంచి వీరిని కాపాడడం వారి విధి. నిఘా సంస్థ అందించే రిపోర్ట్ ఆధారంగా వివిధ రకాల భద్రతా కేటగిరీలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారికి కేటాయిస్తుంది. ప్రమాదాలను అంచనా వేసి భద్రతా వర్గాన్ని ఐదు గ్రూపులుగా విభజించింది. వాటిలో ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్పీజీ వర్గాలున్నాయి. భారత్‌లోని వీఐపీలు, వీవీఐపీలు, ఇతర ఉన్నత స్థాయి లేదా రాజకీయ ప్రముఖులకు ఈ రకమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. అయితే గతేడాది నుంచి ముకేశ్ అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత అందిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత అంటే.. రక్షణలో ఎస్పీజీ తర్వాత జెడ్ ప్లస్ భద్రత అనేది రెండో అత్యధిక స్థాయి భద్రతా. ఇందులో భాగంగా 10+ ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసు అధికారులతో కలుపుకుని 55మంది సిబ్బంది వీరికి రక్షణగా ఉంటారు. వీరంతా మార్షల్ ఆర్ట్స్, పోరాట శిక్షణలో నైపుణ్యం పొందినవారు. ఈ కేటగిరీలో భాగంగా 5+ బులెట్‌ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. దేశంలో ఇప్పటివరకు కేవలం 43 ప్రముఖులకు మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు. భద్రత సిబ్బంది వేతనాలు, ప్రయాణ భత్యాలు, వాహనాలు వంటి ఖర్చులను సందర్భాన్ని బట్టి వివిధ ఏజెన్సీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రత పొందే వ్యక్తులు, సంస్థలు భరిస్తాయి. ఎస్పీజీ మాత్రం దేశ ప్రధానికి భద్రత కల్పిస్తుంది. -
ముకేశ్ అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ భద్రత.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ (z plus security) భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం దేశంలోనే ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారికి భద్రత కల్పిస్తుందని తెలిపింది. విదేశాలకు వెళ్లినప్పుడు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారికి భద్రతా ఏర్పాట్లు చేయాలని కోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాలతో ముఖేష్ అంబానీ కుటుంబానికి భారత్‌తో పాటు ఇతర దేశాల్లో సైతం జెడ్ ప్లస్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహించే కమాండోలు వారికి రక్షణగా నిలవనున్నారు. అయితే అత్యంత ఖరీదైన జెడ్ ప్లస్ కేటగిరీకి అయ్యే ఖర్చు ముఖేష్ అంబానీయే భరించాలని సుప్రీం కోర్టు కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. జెడ్ ప్లస్ భద్రత ఎందుకు? ఇటీవల కాలంలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. దీంతో భద్రత దృష్ట్యా కేంద్రం అంబానీలకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. అయితే వీరికి భద్రత కల్పించడంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ హైకోర్టుల్లో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో..ఒక వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పుడు..ఆయనకు కల్పించే భద్రతను ప్రాంతానికి లేదా నగరానికి పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. ముకేశ్ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు మన దేశంలోనూ, విదేశాల్లోనూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనికోసం అయ్యే ఖర్చులను అంబానీలే భరించాలని స్పష్టం చేసింది. -
జోడో యాత్రలో భద్రతా వైఫల్యం.. రాహుల్‌ను హగ్ చేసుకునేందుకు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం కనిపించింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో మంగళవారం పాదయాత్ర జరుగుతుండగా.. భద్రతా వలయాన్ని చేధిస్తూ ఓ వ్యక్తి రాహుల్ వద్దకు పరుగెత్తుకొచ్చాడు. జెడ్ ప్లస్ సెక్యూరిటీని దాటుకొని వచ్చిన ఎల్లో జాకెట్ ధరించిన వ్యక్తి రాహుల్‌ను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. రాహుల్ పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు భారత్ జోడోయాత్రలో ఉన్న రాహుల్‌కు జెడ్-ప్లస్ కేటగిరి భద్రత కల్పించిన విషయం తెలిసిందే. అయితే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న సీఆర్పీఎఫ్ సరైన భద్రత కల్పించడంలో విఫలమవుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. చదవండి: మోదీపై విపక్షాలది దుష్ప్రచారమే కాగా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని తండాలో మంగళవారం ఉదయం భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్తోఆటు పార్టీ సీనియర్ నాయకులు హరీష్ చౌదరి, రాజ్ కుమార్ చబ్బేవాల్‌లు రాహుల్ గాంధీతో యాత్రలో పాల్గొన్నారు. Security breach under the AAP govt. This is how AAP is providing security to Rahul Gandhi Ji. pic.twitter.com/kyTV6fMHxr — Shantanu (@shaandelhite) January 17, 2023 -
పారిశ్రామికవేత్త అదానీకి జెడ్ కేటగిరి భద్రత
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద్రత కల్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఖర్చుని అదానీయే భరిస్తారు. నెలకి రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. 33 మంది కమాండోలు ఆయనకు కాపలాగా ఉంటారు. ఇదీ చదవండి: 75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ -
మమత ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు.. తలలు పట్టుకున్న పోలీసులు!
కోల్‌కత: జడ్ ప్లస్ భద్రత ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి అర్ధరాత్రి ప్రవేశించాడు ఓ ఆగంతకుడు. రాత్రంతా ఆ ప్రాంగణంలోనే ఉన్నాడు. ఉదయం 8 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తిని సీఎం నివాసం ఆవరణలో చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అనుకొని తాను సీఎం నివాసంలోకి ప్రవేశించినట్లు నిందితుడు తెలిపాడు. కానీ అర్ధరాత్రి సమయంలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏం పని? అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేక తడబడ్డాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అర్ధరాత్రి సీఎం నివాసంలోకి అక్రమంగా చొరబడ్డందుకు హఫీజుల్ మొల్లాపై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ నిమిత్తం అతడ్ని జులై 11 వరకు కస్టడీకి తరలించారు. కోల్‌కతాలోని సీఎం నివాసంలోకి ప్రవేశించిన ఈ వ్యక్తి పేరు హఫీజుల్ మొల్లా. వయసు 30 ఏళ్లకుపైగా ఉంటుంది. ఉత్తర 24 పరగణాలు జిల్లా హష్నాబాద్‌కు చెందిన ఇతడు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:20 గంటల సమయంలో కాళీఘాట్ ప్రాంతంలోని హరీష్ ఛటర్జీ వీధి 34బీలో గోడ దూకి మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించాడు. పటిష్ఠ భద్రత ఉన్నా.. ఎవరికంటా పడకుండా లోనికి వెళ్లాడు. చదవండి👉🏾మరాఠ ప్రజలకు కొత్త సీఎం షిండే బంపరాఫర్ హఫీజుల్ చెప్పేది నిజమేనా? విచారణలో అతడు ఒక్కోసారి ఒక్కో సమాధానం చెబుతున్నాడని పోలీసులు చెప్పారు. మొదట అతను పండ్లు అమ్మేవాడిని చెప్పాడని, ఆ తర్వాత డ్రైవర్‌నని మాట మార్చాడని పేర్కొన్నారు. అయితే అతడ్ని చూస్తే మానసిక స్థితి సరిగ్గాలేని వ్యక్తిలా కన్పిస్తున్నాడని పేర్కొన్నారు. సీఎం నివాసంలోకి ప్రవేశించడానికి ముందు ఆదివారం అతడు ఎక్కడెక్కడ తిరిగాడో తెలుసుకుంటున్నామని, అతడు చెప్పిన వివరాల ప్రకారం మ్యాప్ రూపొందిస్తున్నామని వివరించారు. దీనిపై విచారణ చేపట్టి అతడు చెప్పింది నిజమో కాదో తేలుస్తామన్నారు. భద్రతా భయాలు.. ఓ సాధారణ వ్యక్తి జడ్ ప్లస్ భద్రత ఉన్న సీఎం నివాసంలో ప్రవేశించడం భద్రతా భయాలను రేకెత్తించింది. ఉదయం 8 గంటల వరకు అతడ్ని ఎవరూ గుర్తించకపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చదవండి👉🏾బెంగళూరులో చెత్త సంక్షోభం -
ద్రౌపది ముర్ముకు జెడ్ ప్లస్ భద్రత.. 24న నామినేషన్
న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము (64)కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ కమాండోల 'జెడ్ ప్లస్' భద్రతను ఆమెకు కల్పించినట్లు కేంద్ర అధికారులు బుధవారం వెల్లడించారు. జెడ్ ప్లస్ రక్షణ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత స్థాయి సెక్యురిటీ. 24న నామినేషన్ ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. కాగా, కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఎంపికైన సంగతి తెలిసిందే. (క్లిక్: అంచెలంచెలుగా ఎదిగిన ఆదివాసీ బిడ్డ) -
డేరా బాబా.. హార్డ్‌కోర్ క్రిమినల్ కాదంట!
డేరా సచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జడ్ ఫ్లస్ లెవల్ సెక్యూరిటీ అందించడం తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఖలిస్థాన్ ప్రేరేపిత సంస్థల నుంచి డేరా బాబాకు ప్రాణహాని ఉందన్న కారణం చెబుతూ.. జెడ్‌ఫ్లస్ లెవల్ ప్రొటెక్షన్ కల్పించింది హర్యానా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. అభ్యంతరాలపై హర్యానా సర్కార్ వివరణ ఇచ్చుకుంది. ఫర్లాగ్(తాత్కాలిక సెలవు) మీద ప్రస్తుతం బయట ఉన్న డేరాబాబాకు జెడ్‌ఫ్లస్ సెక్యూరిటీ అందించడం తప్పేం కాదని సమర్థించుకుంది. ఈ మేరకు హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ‘డేరా సచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ హార్డ్ కోర్ క్రిమినల్ ఏంకాదు. శిక్షలు అనుభవిస్తున్న కేసుల్లోనూ స్వయంగా ఆయనే హత్యలు చేయలేదు. నేరపూరిత కుట్ర, సహ నిందితుడిగా మాత్రమే ఉన్నారు. హర్యానా ప్రిజనర్స్ యాక్ట్ కూడా ఆయన్ని హార్డ్ కోర్ క్రిమినల్‌గా పరిగణించకూడదని చెబుతోంది’ అని జైళ్ల శాఖ రూపొందించిన ఆ నివేదికను హైకోర్టుకు సమర్పించింది ప్రభుత్వం. 2017లో పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో హర్యానా జైళ్ల శాఖ 21 రోజుల ఫర్లాగ్ జారీచేయగా.. ఫిబ్రవరి 7వ తేదీన బయటకు వచ్చిన గుర్మీత్ తన గురుగ్రామ్ ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే పంజాబ్ ఎన్నికలను ప్రభావం చేసేందుకే డేరా బాబా బయటకు వచ్చాడని, పైగా ఒక క్రిమినల్‌కు జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ అందించడం ఏంటని? అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వాన్ని వివరణ కోరింది హైకోర్టు. వివరణ.. సునారియా జైళ్ల సూపరిడెంట్ సునీల్ సంగ్వాన్ ఈ మేరకు హర్యానా ప్రభుత్వం తరపున హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. హర్యానా అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్నాకే గుర్మీత్‌కు ఫర్లాంగ్ జారీ చేసినట్లు వెల్లడించారు. డేరా చీఫ్‌ను హర్యానా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్(టెంపరరీ రిలీజ్)యాక్ట్ కింద హార్డ్‌కోర్ క్రిమినల్‌గా పరిగణించరాదని ఏజీ జనవరి 25నే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతదేశంలో భద్రతా కేటగిరీ X, Y, Y-Plus, Z మరియు Z-Plus. చివరిది జెడ్ ఫ్లస్ వర్గం ప్రముఖులకు మాత్రమే కేటాయించబడుతుంది. ఈ కేటగిరీలు కాకుండా.. SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కవర్ కేవలం ప్రధాని, వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పిస్తారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలకు కూడా ఎస్పిజి భద్రత కల్పించారు. కానీ ఇది తరువాత Z-ప్లస్ కేటగిరీకి మార్చేశారు. Z-ప్లస్ కేటగిరీలోని వ్యక్తులు మొబైల్ సెక్యూరిటీకిగానూ 10 మంది భద్రతా సిబ్బందిని, నివాస భద్రత కోసం ఇద్దరిని (ప్లస్ ఎనిమిది మంది) అందిస్తారు. Z-Plus స్థాయి భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు అందిస్తారు. -
జడ్ కేటగిరీ భద్రత అంటే ఏమిటి?
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో గురువారం హత్యాయత్నం జరగడంతో ఆయనకు సీఆర్ఫీఎఫ్తో జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే తనకు జెడ్ కేటగిరీ భద్రత అవసరం లేదని అసదుద్దీన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో జెడ్ కేటగిరీ భద్రతపై చర్చ జరుగుతోంది. ఎవరెవరికి రక్షణ కల్పిస్తారు? దేశంలో అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) సమాచారం ఆధారంగా ఎవరెవరికీ ఏ స్థాయి భద్రత కల్పించాలనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. ప్రధానమంత్రి, హోం మంత్రితో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లు చేస్తారు. వీరితో పాటు ముప్పు పొంచి ఉందని భావించే వారు కూడా ప్రభుత్వ భద్రతను పొందుతారు. వారికి మాత్రమే ఎస్పీజీ భద్రత! మన దేశంలో ఎక్స్, వై, వై-ప్లస్, జెడ్, జెడ్-ప్లస్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కింద భద్రతా విభాగాలను వర్గీకరించారు. ఎస్పీజీ అనేది ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్దేశించబడింది. (చదవండి: చావుకు భయపడే వ్యక్తిని కాదు.. జెడ్ కేటగిరి భద్రత వద్దు) ఏయే కేటగిరికి ఎంత? ► ఎక్స్ కేటగిరి రక్షణ ఉన్నవారికి ఒక గన్‌మ్యాన్‌ని మాత్రమే కేటాయిస్తారు. ► వై కేటగిరి కింద ఒక గన్‌మ్యాన్, స్టాటిక్ సెక్యూరిటీ కోసం ఒకరు (ప్లస్ ఫోర్ రొటేషన్‌లో) ఉంటారు. ► వై-ప్లస్ సెక్యురిటీ కలిగిన వారికి ఇద్దరు గన్మెన్లు (ప్లస్ నలుగురు రొటేషన్‌లో), నివాస భద్రత కోసం ఒకరు (ప్లస్ నలుగురు రొటేషన్) ఉంటారు. ► జెడ్ కేటగిరిలో ఆరుగురు గన్మెన్లు, ఇంటి వద్ద కాపలాలకు మరో ఇద్దరిని ( ప్లస్ 8) పెడతారు. ‘జెడ్- ప్లస్’ను వారే చూసుకుంటారు జెడ్- ప్లస్ రక్షణ ఉన్న వారికి 10 మంది సాయుధ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయిస్తారు. నివాస భద్రత కోసం మరో ఇద్దరిని (ప్లస్ 8) నియమిస్తారు. జెడ్- ప్లస్ భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు చూసుకుంటారు. ఇతర కేటగిరీ భద్రత కోసం ఢిల్లీ పోలీసులు లేదా ఐటీబీపీ, సీఆర్ఫీఎఫ్ సిబ్బందిని వినియోగిస్తారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?) -
స్త్రీ శక్తి.. మరో అడుగు
సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) స్త్రీసాధికారత, శక్తియుక్తులకు సంబంధించి మూడు చారిత్రక అద్భుతాలకు వేదిక అయింది. కొన్ని నెలలు వెనక్కి వెళితే... నక్సల్స్‌ను ఎదుర్కోవడం కోసం ఏర్పాటు చేసిన ‘కోబ్రా కమాండో’లో మహిళల ప్రాతినిధ్యం లేదు. అయితే 34 మంది మహిళలతో ‘కోబ్రా’ దళాన్ని ఏర్పాటు చేసి మహిళలు లేని లోటును పూరించారు. ‘కోబ్రా’కు ఎంపికైన వారియర్స్ మూడు నెలల పాటు అడవుల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. గుర్‌గ్రామ్ కదార్‌పుర్‌లో కోబ్రా వుమెన్ వారియర్స్ ప్రదర్శించిన యుద్ధవిన్యాసాలు అబ్బురపరిచాయి. వారి మాటల్లోని ఆత్మవిశ్వాసం ఆకట్టుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి అభినందనలు తెలియజేస్తూ ‘హిస్టరీ ఇన్ మేకింగ్’ అని ట్విట్ చేసింది సీఆర్పీఎఫ్. 2012లో వరల్డ్స్ ఫస్ట్ ‘ఆల్– ఉమెన్ పారామిలటరీ పైప్‌బ్యాండ్’ను ఏర్పాటు చేసింది సీఆర్పీఎఫ్. ఇక తాజా విషయానికి వస్తే... సీఆర్పీఎఫ్ జడ్–ప్లస్ కేటగిరి కోసం విధులు నిర్వహించడానికి ఎంపికైన 32 మంది ఉమెన్ వారియర్స్ వివిధ విభాగాల్లో పదివారాల పాటు శిక్షణ పొందారు. ఈ నెలలోనే కొత్త బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్... మొదలైన వారికి రక్షణగా నిలవనున్నారు. రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో వీఐపీ రాజకీయ నాయకుల రక్షణ బాధ్యతల్లో పాలుపంచుకోనున్నారు. గతంలో జడ్–ప్లస్ కమాండో విభాగంలో పురుషులు మాత్రమే ఉండేవారు. తాజా అడుగుతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది సీఆర్పీఎఫ్. -
‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) కేంద్రం ఉపసంహరించింది. ఎస్పీజీ నుంచి సీఆర్పీఎఫ్ బలగాల సంరక్షణలోని జడ్ ప్లస్ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ భద్రతను కేంద్రం తగ్గించడం గమనార్హం. 1991లో ఎల్టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. గాంధీ కుటుంబానికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే భద్రత తొలగించినట్లు అధికారులు స్పష్టంచేశారు. దీంతో ఎస్పీజీలోని సుమారు 3 వేల మంది సైనికులు కేవలం ప్రధానికే భద్రత కల్పించనున్నారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే స్థాయికి దిగజారిందంటూ అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. కేంద్రం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆనంద్ శర్మ అన్నారు. -
చంద్రబాబుకున్న ‘జెడ్ ప్లస్’ను కుదించలేదు
సాక్షి, అమరావతి: చంద్రబాబుకున్న భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయలేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆయనకున్న జెడ్ ప్లస్ కేటగిరినీ కూడా తగ్గించలేదని, కాన్వాయ్‌కు జామర్ సదుపాయం కూడా కల్పించామని పునరుద్ఘాటించారు. చంద్రబాబు నిర్ధిష్టంగా ఫలానా వ్యక్తినే ప్రధాన భద్రత అధికారి (సీఎస్ఓ)గా నియమించాలని కోరుతున్నారని, అది ఆచరణ సాధ్యం కాదని ఏజీ చెప్పారు. ఒకవేళ చంద్రబాబు కోరిన అధికారినే సీఎస్ఓగా నియమిస్తే భవిష్యత్తులో మరికొందరు ఇదే రకమైన అభ్యర్థనలు చేసే అవకాశం ఉందని, దీనివల్ల పలు సమస్యలు వస్తాయన్నారు. చంద్రబాబుకు ఏర్పాటు చేసిన సీఎస్ఓ విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న భద్రతను కుదించిందని, గతంలో ఉన్న విధంగానే తనకు భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్ మరోసారి విచారించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి.కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు భద్రతను కేంద్రం పునః సమీక్షించిందని, ప్రస్తుతం ఆయనకున్న ఎన్ఎస్జీ భద్రతను అలాగే కొనసాగించాలని నిర్ణయించిందని చెప్పారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. మూడు షిప్టుల్లో ఐదుగురు చొప్పున కానిస్టేబుళ్లను ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లనే ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. సీఎస్‌వోలను ఇద్దరిని ఇవ్వాల్సి ఉండగా, ఒక్కరినే ఇచ్చారని చెప్పారు. ఈ వాదనలను ఏజీ తోసిపుచ్చారు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ భద్రతే ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో జామర్ సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు. -
లాలూకు ఎన్ఎస్జీ భద్రత ఉపసంహరణ
సాక్షి, పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు కొనసాగుతున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రతను కేంద్రం ఉపసంహరించింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్న ఆయనకు ఎన్ఎస్జీ కమెండోలు గార్డులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాలూకు ఉన్న జెడ్‌ప్లస్ క్యాటగిరీ నుంచి జెడ్‌కు కుదించింది. పలువురు ప్రముఖులకు ప్రస్తుతం అందజేస్తున్న భద్రత సదుపాయాలపై కేంద్ర హోంశాఖ ఇటీవలే సమీక్షించిన విషయం విదితమే. కాగా జెడ్‌ప్లస్ భద్రతలో ఎన్ఎస్జీ కమాండోలు రక్షణగా ఉంటారు. ఇకపై లాలూకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. దీని ప్రకారం ఆయనకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండోలు రక్షణ ఉంటుంది. మరోవైపు లాలూకు భద్రత కుదింపుపై ఆయన కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ స్పందించారు. ఒకవేళ తన తండ్రికి ఏమైనా జరిగితే అందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తన తండ్రిని హతమార్చడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితేన్ రామ్ మాంఝీకి ప్రస్తుతం ఉన్న జెడ్ క్యాటగిరీ భద్రతను పూర్తిగా తొలగించారు. కేంద్రమంత్రి హరిభాయ్ పి. చౌదరికి ప్రస్తుతం ఉన్న జెడ్ క్యాటగిరి భద్రతను వైప్లస్కు కుదించారు. దీని ప్రకారం భద్రత సిబ్బంది సంఖ్య తగ్గుతుంది. ఇంతకుముందు ఆయన కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన సమయంలో జెడ్ క్యాటగిరీలో భారీగా రక్షణ సిబ్బందిని నియమించారు. -
అమృతానందమయికి జెడ్ కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఆధ్మాత్మిక ప్రబోధకురాలు మాతా అమృతానందమయికి కేంద్రం ‘జెడ్ కేటగిరీ’ భద్రతను కేటాయించింది. దీంతో అనుక్షణం ఆమె వెన్నంటి 24 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. యోగా గురువు బాబా రాందేవ్ తరువాత జెడ్ కేటగిరీ భద్రత పొందిన రెండో ఆధ్యాత్మిక వేత్త మాతానే. మాతాకు, ఆమె ఆశ్రమానికి ప్రత్యేక శిక్షణ పొందిన 40 మంది సీఆర్పీఎఫ్ కాపలాగా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మాతాకు ఆశ్రమం చుట్టుపక్కలే ముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు కేంద్రానికి నివేదిక సమర్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఎక్కడికైనా ప్రయాణిస్తే కాన్వాయ్‌లో రెండు ఎస్కార్ట్ వాహనాలుంటాయి. మరోవైపు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి విజయ్ సాంప్లాకు ‘వై ప్లస్’ భద్రతను కల్పించారు. -
యోగికి జెడ్ ప్లస్ సెక్యురిటీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి అత్యంత కట్టుదిట్టమైన జెడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీని కల్పించారు. కేంద్ర పారామిలటరి బలగాలతో యోగి ఆదిత్యనాథ్ కు జెడ్ ప్లస్ కేటగిరీ వీవీఐపీ సెక్యురిటీని కల్పిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఆ కేటగిరీ కింద ఆయన ఎక్కడికి వెళ్లినా నేషనల్ సెక్యురిటీ గార్డు కమాండోలు ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాచుకుని రక్షణ కల్పిస్తారు. ఓ పైలట్, భద్రతాదళలతో కూడిన ఎస్కార్ట్ వాహనం ఎప్పుడూ యోగి వెంట వెళ్లనుంది. మొత్తం 25-28 మంది కమాండోలు అధునాతన ఆయుధాలతో యోగికి రక్షణ కల్పించనున్నారు. యోగి నివాసం చుట్టూ కూడా సెక్యురిటీ కాపలా కాయనుంది. ఎక్కువ భద్రత ముప్పు ఉన్న వీవీఐపీలకు మాత్రమే ఈ జెడ్ ప్లస్ సెక్యురిటీని అందిస్తారు. ఇటీవల ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఉత్తరప్రదేశ్ ను బీజేపీ సొంతం చేసుకోవడంతో, ఐదు సార్లు గోరఖ్ పూర్ ఎంపీగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్ మార్చి 19న ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే యోగి ఇప్పటివరకు 'వై' కేటగిరీ వీవీఐపీ సెక్యురిటీని మాత్రమే పొందారు. ఈ కేటగిరీ కింద ఆయన వెంట ఇన్నిరోజులు కేవలం 2-3 కమాండోలు మాత్రమే ఉన్నారు. ఆశ్చర్యకరంగా యోగికి ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్ కూడా పదవిలోకి వచ్చిన కొన్ని రోజులకే జెడ్-ప్లస్ కేటగిరీ సెక్యురిటీని పొందారు. -
హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కు 'జడ్' కేటగిరి భద్రత
న్యూఢిల్లీ: తనకు జడ్ కేటగిరి భద్రత కల్పించుకోవడాన్ని మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమానాథ్ సింగ్ సమర్థించుకున్నారు. తనకు ప్రాణహాని ఉన్నందునే జడ్ కేటగిరి రక్షణ పొందానని వెల్లడించారు. ఆరేళ్ల క్రితం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తనను జడ్ కేటగిరి భద్రత కల్పించాలని ఆయనే ఆదేశాలు జారీచేశారు. దీనిపై పలువురు ప్రైవేటు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు ఈ పిటిషన్ సుప్రీంకోర్టు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. స్పందన తెలపాలని మేఘాలయ ప్రభుత్వాన్ని కోరింది. జస్టిస్ ఉమానాథ్ సింగ్ గతేడాది సెప్టెంబర్ 28న తన వివరణను సీల్డ్ కవర్ లో పెట్టి సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ లేఖను పిటిషనర్ న్యాయవాదికి, మేఘాలయ ప్రభుత్వానికి ఇవ్వాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. తన చర్యను ఉమానాథ్ సింగ్ సమర్థించుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా తనకు జడ్ కేటగిరి కొనసాగించేలా మేఘాలయ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. -
అమర్ సింగ్‌కు జెడ్ కేటగిరి భద్రత
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, ములాయం సింగ్ సన్నిహితుడు అమర్ సింగ్‌కు భద్రత పెంచారు. ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అమర్ సింగ్‌కు తక్షణం భద్రతను పెంచాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో తీవ్ర విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గంలో ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, 200 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగా.. ములాయం వర్గంలో సోదరుడు శివపాల్ యాదవ్, అమర్ సింగ్‌తో పాటు కొందరు మాత్రమే మిగిలారు. అమర్ సింగ్‌ను అఖిలేష్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2008లో అమర్ సింగ్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించారు. 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమర్ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులకు భద్రత తగ్గించారు. ఇటీవల అమర్ సింగ్‌కు వస్తున్న బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం మళ్లీ భద్రత పెంచింది. -
జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా చాలదట!
-
జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా చాలదట!
అక్కడ ఒకే కుటుంబంలో ముగ్గురికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. అయినా అది సరిపోదని, తమకు మరింత భద్రత కావాలని అంటున్నారు. పంజాబ్‌లోని అకాలీదళ్ ప్రభుత్వం ఈ తరహా వింత కోరికలతో కేంద్ర ప్రభుత్వానికి సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే అక్కడ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కొడుకు, ఉప ముఖ్యమంత్రి అయిన సుఖ్బీర్ బాదల్, మంత్రివర్గంలో కీలక సభ్యుడు బిక్రమ్ సింగ్ మజీతియా.. ఈ ముగ్గురికీ ఇప్పటికే జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉంది. వీళ్లలో మజీతియా.. ఉపముఖ్యమంత్రికి బావమరిది. భద్రత పెంచాలంటూ గత వారమే అభ్యర్థన వచ్చిందని, అయితే.. దేశంలో అత్యున్నత స్థాయి భద్రత అయిన జడ్ ప్లస్ తర్వాత ఇంక ఏమివ్వాలో అర్థం కావడం లేదని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. 88 ఏళ్ల ముఖ్యమంత్రికి నేషనల్ సెక్యూరిటీ గార్డులు భద్రత ల్పిస్తారు. ఆయన కొడుకును, అతడి బావమరిదిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది రోజుకు 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు. జడ్ ప్లస్ భద్రత కింద దాదాపు 30-40 మంది కేంద్ర భద్రతా సిబ్బంది, రెండు ఎస్కార్ట్ వాహనాలు ఇస్తారు. ముఖ్యమంత్రి కుటుంబీకులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని, అందులోనూ ఇటీవలే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ నాయకుడి మీద దాడి జరిగిన నేపథ్యంలో భద్రతను పెంచాలని అకాలీదళ్ వర్గాలు అంటున్నాయి. పంజాబ్ ఆర్ఎస్ఎస్ డిప్యూటీ చీఫ్, రిటైర్డ్ బ్రిగెడియర్ జగదీష్ గగ్నేజాపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. -
కరుణకు కేంద్రం ఝలక్
సాక్షి ప్రతినిధి, చెన్నై : కాంగ్రెస్‌తో భాయ్ భాయ్‌గా మెలుగుతున్న డీఎంకే అధినేత కరుణానిధికి కేంద్రప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. అసెంబ్లీలో ఇదివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు బ్లాక్ కమెండోస్ భద్రతను ఉపసంహరించుకుంది. దేశంలోని అత్యంత ప్రముఖ నేతలకు కేంద్ర ప్రభుత్వం బ్లాక్ కమెండోస్ భదత్రను కల్పించడం అనవాయితీగా వస్తోంది. ఇలాంటి భద్రతా చర్యల్లో నాలుగు కేటగిరిలు ఉన్నాయి. జెడ్ ప్లస్, జెడ్, వై, ఎక్స్ పేర్లతో నేతలకు భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని, మాజీ ప్రధానులకు, వారి కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తారు. ఇతరులకు అప్పటి పరిస్థితులను బట్టి జెడ్ ప్లస్ కేటాయిస్తారు. ప్రస్తుతం దేశంలో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వారి కుటుంబసభ్యులకు మరి కొంతమందితో కలుపుకుని మొత్తం 15 మంది నేతలకు బ్లాక్ కమెండోస్తో కూడిన జెడ్ ప్లస్ భద్రతను కల్పించారు. డీఎంకే అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా కరుణానిధికి బ్లాక్ కమెండోస్ భద్రత కల్పించారు. ఆ తరువాత ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ భద్రతా కొనసాగుతోంది. కాగా, దేశంలోని పలువురు నేతలకు జెడ్‌ప్లస్ భద్రతను ఉపసంహరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా ఆ జాబితాలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరు చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని చేజిక్కించుకోగా మిత్రపక్ష డీఎండీకేకు డీఎంకే కంటే ఎక్కువ సీట్లు రావడంతో విజయకాంత్ ప్రతిపక్ష నేతగా మారారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. అయితే డీఎంకే ఆరంభం నుండి అసెంబ్లీలో అధికార పక్షం లేదా ప్రతిపక్ష హోదాను అందుకున్న కరుణానిధి ఈసారి ఆ హోదా నుండి తప్పుకున్నారు. వృద్ధ్దాప్యం లేదా భావివారసుడు అనే కారణంతో స్టాలిన్‌కు ప్రతిపక్షనేత హోదాను కరుణ కట్టబెట్టారు. అసెంబ్లీకి వచ్చినా రాకున్నా ఇటీవలి వరకు కరుణానిధినే ప్రతిపక్ష నేతగా చలామణి కాగా స్టాలిన్ ప్రవేశంతో బ్లాక్ కమెండోస్ భద్రత కూడా చేజారిపోయింది. రాష్ట్రంలోనే సీనియర్ నేతైన కరుణానిధికి బ్లాక్ కమెండోస్ భద్రతను ఉపసంహరించడం వెనుక రాజకీయం ఉందేమోనని కాంగ్రెస్, డీఎంకేలు కారణాలు వెతుకుతున్నాయి. అసెంబ్లీలో సీటేదీ : సీఎంను ప్రశ్నించిన కరుణ అసెంబ్లీ హాజరయ్యేందుకు అనువుగా అక్కడ సీటేదని డీఎంకే అధ్యక్షులు కరుణానిధి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అన్నాడీఎంకే పాలన, కచ్చదీవుల అప్పగింత, స్వాధీనం తదితర అంశాలపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడిగా చర్చ సాగింది. ప్రతిపక్ష నేతగా స్టాలిన్ సహా తదితర డీఎంకే సభ్యులు అధికార పార్టీ విమర్శలను సాధ్యమైన మేరకు అడ్డుకున్నారు. అదే సమయంలో కరుణానిధి అనేక పత్రికా ప్రకటనలతో జయలలితను నిలదీశారు. ఇందుకు తీవ్రంగా స్పందించిన జయలలిత...బైట నుంచి ప్రకటనలు గుప్పించడం కాదు, అసెంబ్లీలో మాట్లాడాలని సీఎం సవాలు విసిరారు. జయ సవాల్‌కు స్పందించిన కరుణానిధి, చక్రాల కుర్చీతో లోనికి వచ్చేందుకు అసెంబ్లీలో వసతి ఏదీ అని ఆమెను ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కాదన్న కారణంగా వెనుక వరుసలో సీటు కేటాయించడం ద్వారా అసెంబ్లీకి రాకుండా చేశారని ఆయన విమర్శించారు. -
ఖడ్గ మృగానికి Z+
చుట్టూ కమాండోల రక్షణ.. కంటికి రెప్పలా కాపాడుకునే అధికారులు.. ప్రతి క్షణం పరిచర్యలు చేసే సిబ్బంది.. సాధారణంగా ఇలాంటి సౌకర్యాలన్నీ ఏ వీవీఐపీకో కల్పిస్తారు. ఇక్కడ మాత్రం ఓ తెల్ల ఖడ్గమృగానికి ఇస్తున్నారు. ఎందుకంటే.. ఇది ప్రపంచంలో ఉన్న ఏకైక తెల్ల ఖడ్గమృగం. సూడాన్‌లో ఉన్న ఈ ఖడ్గమృగాన్ని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆఖరికి కొమ్ము వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో దాన్ని కోసేశారు కూడా. 43 ఏళ్ల వయసున్న ఈ రైనో.. 50ఏళ్ల వరకు మాత్రమే బతికే అవకాశముందట.. ఈ సమయంలో ఎలాగైనా ఈ జాతిని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. -
సీఎంకు భద్రత పెంపు
సాక్షి, చెన్నై : రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం నివాసానికి భద్రతను పెంచారు. గ్రీన్ వేస్ రోడ్డును భద్రతా వలయంలోకి తెచ్చారు. సీఎం భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు. అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలితకు జైలు శిక్ష నేపథ్యంలో సీఎంగా ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. భారంగానే ఆ బాధ్యతల్ని చేపట్టిన ఆయన ఇంతవరకు ముఖ్యమంత్రి చాంబర్లోకి అడుగు పెట్టలేదు. తమ అమ్మ జయలలిత మళ్లీ సీఎం అవుతారన్న కాంక్షతో పూజాధికార్యక్రమాల్ని ఓ వైపు నిర్వర్తిస్తూనే, మరో వైపు ఆమె అడుగు జాడల్లో, సూచనలు, సలహాలతో ప్రభుత్వాన్ని ముందుకు సాగించే పనిలో పడ్డారు. అదే సమయంలో సీఎంగా తనకు దక్కే అన్ని రకాల సౌకర్యాలను పన్నీరు నిరాకరించారు. సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తికి జడ్ కేటగిరి భద్రత ఉంటుంది. అయితే, తనకు ఎలాంటి భద్రత వద్దని తిరస్కరించారు. సీఎంకు కల్పించే కాన్వాయ్ సంఖ్యను, హడావుడిని తగ్గించేశారు. మంత్రిగా ఉన్న సమయంలో తనకు కేటాయించిన సౌకర్యాలు, భద్రతనే ఆయన కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా సీఎం ఇంటిని టార్గెట్ చేసి ముట్టడి కార్యక్రమాలు సాగించే పనిలో కొన్ని సంఘాలు పడ్డాయి. అయితే, శనివారం చోటు చేసుకున్న హఠాత్పరిణామంతో తప్పని సరిగా సీఎంకు భద్రతను పెంచాల్సిందేనన్న నిర్ణయానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం వచ్చింది. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నివాసం గ్రీన్ వేస్ రోడ్డులో ఉంది. ఈ రోడ్డులో పన్నీరు సూచన మేరకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్ట లేదు. ఆయన నివాసం వద్ద మాత్రం మంత్రికి కల్పించే భద్రతా సిబ్బంది మాత్రం ఉంటూ వచ్చారు. తాజాగా ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించడం, పిట్ట గోడను దూకి లోనికి వెళ్లేందుకు యత్నించడం వంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసు యంత్రాం గం తీవ్రంగా పరిగణించింది. సీఎం పన్నీరు సెల్వం తిరస్కరించినా సరే, ఆయనకు భద్రతను పెంచాల్సిందేనన్న నిర్ణయానికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. ఆమ్ ఆద్మీ ముట్టడికి భద్రతా ైవె ఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిం చడంతో విచారణకు ప్రత్యేక బృందం సైతం రంగంలోకి దిగింది. ఈ బృందం పరిశీలనతో సీఎం ఇంటి పరిసరాల్లోని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటయ్యాయి. ఆయా మార్గల్లో భద్రతా సిబ్బంది నియమించారు. అనుమానిత వాహనాలను తనిఖీ నిమిత్తం వారికి ఆదేశాలు సైతం ఇచ్చారు. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఆయన ఇంటి వద్ద పదుల సంఖ్యలో భద్రతా సిబ్బందిని విధులకు నియమించారు. సీఎం పన్నీరు సెల్వంకు భద్రతను పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఆమ్ ఆద్మీ ముట్టడిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించడంతో, ఆ ఘటన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిపై బదిలీ వేటు వేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు గుసగుసలాడటం కొసమెరుపు. -
విగ్రహానికి జడ్ ప్లస్ భద్రత...
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి భద్రతను పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. 190 అడుగుల ఎత్తైన ఈ స్మారక విగ్రహానికి రూ.1900 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో పాటు ఈ ప్రాంతాన్ని సందర్శక స్థలంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోనుంది. కంటికి కనిపించని రాడార్ల సాయంతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డులు.. చత్రపతి విగ్రహానికి జడ్ ప్లస్ ప్లస్ భద్రతను కల్పించనున్నారు. బంకర్లు వాడకంతో పాటు ఇందుకోసం ప్రత్యేక భద్రత విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. టెర్రరిస్టు దాడులు లాంటివి జరగకుండా, 26/11 లాగ ముంబై పట్టణంలోకి ఉగ్రవాదులు ప్రవేశించడానికి వీలులేకుండా చేయడానికి ఆ ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. 2019 నాటికి ఇక్కడి చత్రపతి విగ్రహాన్ని రోజుకు కనీసం 10 వేల మంది సందర్శిస్తారని మహారాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. విగ్రహానికి చుట్టూ 16 హెక్టార్లలో నారిమన్ పాయింట్ కు 2.6 కిలోమీటర్ల దూరం నుంచి రాడార్ల సిస్టమ్ ను వినియోగిస్తారు. దాడులు లాంటివి జరిగినప్పుగు భద్రతా బలగాలు రక్షణ పొందేందుకు బంకర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలతో మెమోరియల్ పై నిఘా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముంబై పోలీసులు, తీరప్రాంత బలగాల సమన్వయం కోసం ప్రత్యేక భద్రతా విభాగాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
జెడ్ ప్లస్ భద్రతకు కేజ్రీవాల్ నో!
-
ఆప్ శాసనసభా పక్ష నేతగా కేజ్రీవాల్
-
ఆప్ శాసనసభా పక్ష నేతగా కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. శాసనసభలో తమ నాయకుడిగా కేజ్రీవాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ నెల 14న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. 70 సీట్లున్న శాసనసభలో ఆప్ 67 స్థానాల్లో జయభేరీ మోగించింది. బీజేపీ కేవలం 3 సీట్లు గెలవగా, కాంగ్రెస్ బోణీ కొట్టలేకపోయింది. -
అరవింద్ కేజ్రీవాల్ కు జెడ్ కేటగిరి భద్రత
న్యూఢిల్లీ: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భద్రత మరింత పెంచనున్నారు. కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రతను ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. ఆయన రక్షణ కోసం కనీసం 30 కమెండోలను కేటాయించనున్నటు ఓ పోలీస్ అధికారి చెప్పారు. ఆప్ శాసనసభ పక్ష నేతగా కేజ్రీవాల్ ఎన్నికైన వెంటనే జెడ్ కేటగిరి భద్రత కల్పించనున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరి భద్రత ఏర్పాటు చేస్తారు. గజియాబాద్‌లో నివాసం ఉంటున్న కేజ్రీవాల్‌కు ప్రస్తుతం 12 మంది పోలీసులు భద్రతగా ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సంచలన విజయం సాధించింది. 70 సీట్లున్న అసెంబ్లీలో ఆప్ 67 స్థానాల్లో జయభేరి మోగించింది. -
మాజీలకు ‘తగ్గిన’ భద్రత
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రులతోపాటు కొందరు కీలక నాయకులకు కల్పిస్తున్న భద్రత స్థాయిని తగ్గించింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజకీయ ద్వేషంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పలువరు ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో పాటు మొత్తం 13 మందికి ‘జెడ్ ప్లస్’ భద్రత ఉండేది. వీఐపీలకు కల్పిస్తున్న భద్రతా చర్యలపై అధ్యయనానికి రాష్ట్ర సర్కారు ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ చేసిన సూచనల మేరకు కొందలు మాజీ మంత్రులకు భద్రత స్థాయిని తగ్గించారు. ఇలా తగ్గించినవారిలో ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ (జెడ్), మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ (వై), మాజీ హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్ (ఎక్స్), మాజీ మంత్రులు నారాయణ్ రాణే (ఎక్స్), ఛగన్ భుజ్‌బల్ (ఎక్స్), మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ (ఎక్స్) తదితర నాయకులున్నారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ భద్రతను జెడ్ నుంచి ఎక్స్‌కు తగ్గించారు. ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మాజీ హోంశాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్, మాజీ స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్, మాజీ మంత్రులు జితేంద్ర అవద్, సునీల్ తట్కరే, జయంత్ పాటిల్, నసీం ఖాన్, నీలేష్ రాణే, నితేష్ రాణే, రాణా జగ్జీత్ సింగ్, శివరామ్ దల్వీ, పరశురామ్ ఉపర్కర్ల భద్రతను పూర్తిగా తొలగించారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ (జెడ్‌ప్లస్), శివసేన పార్టీ అధ్యక్షులు ఉద్ధవ్‌ఠాక్రే (జెడ్), ఎమ్మెన్నెస్ అధ్యక్షులు రాజ్ ఠాక్రే (జెడ్), పోలీసు కమిషనర్ రాకేష్ మారియా (జెడ్‌ప్లస్), ఏటీఎస్ చీఫ్ హిమాంశు రాయి (జెడ్) భద్రతను పెంచారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే, ఇతర నాయకులైన ఏక్నాథ్ శిందే, సుధీర్ మునగంటివార్, రామ్ శిందే, రంజిత్‌పాటిల్ తదితరులకు వై భద్రతను కల్పిస్తున్నారు. మాజీ మంత్రుల సతీమణులకు నో సెక్యూరిటీ..! మాజీ మంత్రుల సతీమణులకు కూడా గతంలో ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పించేవారు. కానీ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సతీమణి సత్వశీలా చవాన్‌తోపాటు నారాయణ రాణే భార్య నీలం రాణే, అజిత్ పవార్ భార్య సునేత్య పవార్ల భద్రతను పూర్తిగా తొలగించారు. అయితే ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ సతీమణి ప్రతిభా పవార్‌తోపాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ భార్య అమృతా ఫడణ్వీస్లకు ఎక్స్ భద్రతను కల్పిస్తున్నారు. -
రాందేవ్‌కు జెడ్ కేటగిరి భద్రత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం యోగా గురు బాబా రాందేవ్‌కు జెడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. రాందేవ్‌కు వస్తున్న బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రత సంస్థల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాందేవ్‌కు ఉత్తరాఖాండ్‌లో మాత్రమే జెడ్ కేటగిరి భద్రత కల్పించేవారని, ఇక నుంచి దేశ వ్యాప్తంగా ఆయన ఎక్కడికెళ్లినా ఇదే భద్రత ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. రాందేవ్ ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీని కలిశాక భద్రతను పెంచారు. ఆయన కోసం 40 మంది కమెండోలను కేటాయించారు. -
ఆ భద్రత అవసరం లేదు..
సాక్షి, ముంబై: తనకు పోలీసులు ఏర్పాటుచేసిన జెడ్ ప్లస్ భద్రతను నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన పోలీసు ఉన్నతాధికారుల కమిటీకి ఓ లేఖ రాశారు. అందులో తనకు ప్రస్తుతం కేటాయించిన జెడ్ ప్లస్ భద్రతను తొలగించి సాధారణ వై స్థాయి భద్రత కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి అనేది రాష్ట్రంలో అత్యున్నత పదవి కావడంతో ఆ పదవిలో కొనసాగుతున్న వ్యక్తి కోసం 150 మంది పోలీసు అధికారులు, ఇతర సిబ్బందితోపాటు జెడ్ ప్లస్ భద్రత ఉంటుంది. కాని ఫడ్నవిస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి భద్రత తీసుకోలేదు. ఆ తర్వాత కూడా ఇతర పదవుల్లో కొనసాగినప్పటికీ తాత్కాలికంగా మినహా శాశ్వతంగా ఎప్పుడు పోలీసు భద్రత కోరలేదు. కాని ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. ముంబైలో ప్రభుత్వ అధికార నివాసమైన వర్షా బంగ్లా, నాగపూర్‌లో ఆయన నివాస బంగ్లా వద్ద కూడా భారీగా పోలీసులను నియమించారు. ధరంపేట్‌లో ఉన్న ఇంటికి కూడా పోలీసు భద్రత కల్పించారు. ఇలా భారీగా పోలీసులను మోహరించడంవల్ల ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ధరంపేట్‌లో ఇంటివద్ద ఉన్న పోలీసులను తొలగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా తను నాగపూర్ వచ్చినప్పుడు సొంత బంగ్లాలో కాకుండా ప్రభుత్వం బంగ్లాలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దీంతో సొంత ఇంటివద్ద నియమించిన పోలీసు బలగాలను తొలగించాలని కోరారు. తనకు ఎవరివల్ల ముప్పు లేదని, భారీ స్థాయిలో భద్రత అవసరం లేదని వెంటనే జెడ్ కేటగిరి భద్రతను తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. కాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా మావోయిస్టులతో వారికి ఎల్లప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని పోలీసులు భావిస్తున్నారు. అయితే సీఎం ఫడ్నవిస్ కేవలం సాధారణ వై భద్రత కల్పించాలని కమిటీని కోరడంతో పోలీసులు ఆయోమయంలో పడిపోయారు. -
జెడ్ కేటగిరీ ఉపసంహరించలేదు
జగన్ భద్రతపై హైకోర్టులో ఏపీ ఏజీ ఏజీ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన న్యాయమూర్తి హోంశాఖ అధికారులకు నోటీసులు విచారణ 2 వారాలకు వాయిదా హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డికి జెడ్ కేటగిరీ భద్రతను ఉపసంహరించలేదని ఏపీ అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఏజీ చెప్పిన విషయాన్ని రికార్డ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, హోంశాఖ అధికారుల కు నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. మూడేళ్లుగా తనకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని మాత్రమే కేటాయించడాన్ని సవాలు చేస్తూ వైఎస్ జగన్ సోమవారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం జస్టిస్ రామ్మోహనరావు విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ జగన్‌కు ప్రాణహాని ఉందన్న నిఘావర్గాల నివేదికలతో మూడేళ్ల నుంచి (6+6) వ్యక్తిగత భద్ర తాసిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారులతో జెడ్ కేటగిరీ భద్రత కొనసాగిస్తూ వస్తున్నారని, ఎ టువంటి నోటీసు ఇవ్వకుండా భద్రతను ఉపసంహరించారని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ భద్రత తొలగింపునకు సంబంధించిన ఉత్తర్వులను చూపాలని కోరారు. అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని, ఈ నెల 13 నుంచి జెడ్ కేటగిరీ భద్రత సిబ్బంది రావడం మానేశారని సీతారామ్మూర్తి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ జగన్‌కు జెడ్ కేటగిరీ భద్రతను తొలగిం చలేదని చెప్పారు. ఏజీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్న న్యాయమూర్తి, ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేశా రు. కాగా కుదించిన తన భద్రతను యథాతథం గా పునరుద్దరించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇ వ్వాలన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రాణహాని ఉన్న వ్యక్తుల జాబితాలో సుబ్బారెడ్డి పేరు లేదని, అందువల్లే ఆయనకు భద్రతను కుదించామన్న ఏజీ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి రామ్మోహనరావు, విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. -
కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు
-
తొలంగింపు అన్యాయం
-
భద్రత తొలగింపు అన్యాయం: వైఎస్ జగన్
‘జెడ్ కేటగిరీ’పై హైకోర్టుకు విన్నవించిన జగన్ కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు సమాచారం కూడా లేదు నాకు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు నివేదికలు ఇచ్చాయి అయినా కూడా జెడ్ కేటగిరీ తొలగించారు జెడ్ కేటగిరీని పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి భద్రత కుదింపుపై వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: తనకున్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గత మూడేళ్లనుంచి తనకు కొనసాగుతూ వచ్చిన జెడ్ కేటగిరీ భద్రతను యథాతథంగా కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వైఎస్సార్ జిల్లా ఎస్పీ, రాష్ట్రస్థాయి భద్రత సమీక్ష కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మావోయిస్టులపై నిషేధం విధించారని, ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా భద్రతనిచ్చారని, అందులో భాగంగా తనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించారని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. మావోయిస్టుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు కొనసాగుతూ వస్తోందని తెలిపారు. ‘నా తండ్రి మరణించిన తరువాత కూడా నాకు జెడ్ కేటగిరి భద్రత కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి కూడా ఇదే రకమైన భద్రత కల్పిస్తూ వస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులకు ఇప్పటికీ జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. ప్రతిపక్షనేతగా నాకు కేబినెట్ హోదా ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 13న ప్రతివాదులు నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా నాకున్న జెడ్ కేటగిరి భద్రతను ఉపసంహరించారు. ఉపసంహరణకు సంబంధించి ఇప్పటివరకు నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. హైదరాబాద్‌లో నివాసం ఉండే నేను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇరు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాను. రాజకీయ దురుద్దేశాల్లో భాగంగానే ఇరు ప్రభుత్వాలు కలిసి నా భద్రతను ఉపసంహరించాయి. నాకున్న ప్రాణహానికి, ఈ విషయాన్ని ధృవపరుస్తున్న నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భద్రతను ఉపసంహరించారు. నాకు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. అందువల్ల నాకున్న జెడ్ కేటగిరి భద్రతను మెరుగుపరిచి, దానిని కొనసాగించాలని నిఘా వర్గాలు చెప్పాయి. నిఘా వర్గాల నివేదికలకు విరుద్ధంగా ప్రతివాదులు నాకున్న జెడ్ కేటగిరి భద్రతను ఉపసంహరించారు. నాకు జెడ్ కేటగిరి భద్రతను కల్పించేటప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ప్రాణహాని ఉన్న వ్యక్తులు, నాయకులు భద్రత కోసం సంబంధిత అధికారులను ఆశ్రయించవచ్చునని ఇదే హైకోర్టు ధర్మాసనం 1996లో స్పష్టమైన తీర్పునిచ్చింది. రాజకీయ దురుద్దేశాలతో నాకు తొలగించిన జెడ్ కేటగిరి భద్రతను యథాతథంగా పునరుద్దరించేలా ప్రతివాదులను ఆదేశించండి’ అని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. తనకు హైదరాబాద్‌లో ఉన్న (2+2) భద్రతను ఉపసంహరించి, ప్రకాశం జిల్లాలో (1+1) భద్రతను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కూడా సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
భారత కెప్టెన్ ధోనికి భద్రత తగ్గింపు!
రాంచీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి భద్రతను కుదిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వీఐపీలకు ఏర్పాటు చేస్తున్న భద్రతపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో ధోనికి భద్రత తగ్గించామని పోలీసు అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. భారత కెప్టెన్ కు ఎలాంటి ముప్పులేదని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాజీవ్ తెలిపారు. ఇప్పటి వరకు తొమ్మిది మందితో కూడిన జెడ్ కేటగిరి భద్రత ఉండేది. తాజా నిర్ణయంతో ధోని భద్రత 'వై' కేటగిరికి మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వై కేటగిరిలో ఏడుగురు పోలీసు సిబ్బంది భద్రతగా ఉంటారని పోలీసులు తెలిపారు. ధోని భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన పడకూడదని.. సొంత పట్టణానికి ఎప్పుడొచ్చినా.. జెడ్ కేటగిరి కంటే ఎక్కువ భద్రతనే ఏర్పాటు చేస్తామని రాజీవ్ అన్నారు. గతంలో ధోనికి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకే తాము జెడ్ కేటగిరి భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ధోనికి ఎలాంటి ముప్పు లేదని ఆయన అన్నారు. రాంచీలోని హార్మూలో ధోని నివాసముంది. రాంచీని సందర్శించిన ప్రతిసారి డియోరి ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాకుండా సొంత పట్టణంలో మోటార్ సైకిల్ నడపడానికి ధోని ఇష్టపడుతారని పోలీసులు తెలిపారు. -
అమిత్ షాకు జెడ్ ప్లస్ భద్రత
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్‌షాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు. అమిత్ షా భద్రతకు తీవ్రమైన ముప్పు ఉందన్న భావనతోనే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయంతీసుకున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. జెడ్‌ప్లస్ కేటగిరీలో భాగంగా, అమిత్ షాకు సీఆర్పీఎఫ్ కమాండోలు 24గంటలూ భద్రత కల్పిస్తారని, ఆయన ఇంటివద్ద సాయుధ గార్డులు ఉంటారన్నాయి. అమిత్ దేశంలో ఎక్కడికి వెళ్లినా, ఆయనకు ఉన్నతస్థాయి భద్రత కల్పిస్తారు. ఆయనకు ఇప్పటి వరకూ గుజరాత్ పోలీసుల భద్రత కల్పిస్తూవస్తున్నారు. -
అమిత్ షాకు జెడ్ ప్లస్ భద్రత
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు. అమిత్ షా భద్రతకు తీవ్రమైన ముప్పు ఉందన్న భావనతోనే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయంతీసుకున్నట్టు అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతలో భాగంగా, అమిత్ షాకు సీఆర్పీఎఫ్ కమాండోలు 24గంటలూ భద్రత కల్పిస్తారని, ఆయన నివాసం వద్ద సాయుధ గార్డులతో రక్షణ ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. అమిత్ షా దేశంలో ఎక్కడికి వెళ్లినా, ఆయనకు ఉన్నతస్థాయి భద్రత కల్పిస్తారు. ఆయనకు ఇప్పటి వరకూ గుజరాత్ పోలీసుల భద్రత కల్పిస్తూవస్తున్నారు. -
మోడీ భార్యకు జెడ్ కేటగిరి భద్రత కల్పించండి
భోపాల్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భార్య జశోదా బెన్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీ గాక కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ డిమాండ్ రావడం విశేషం. ఉగ్రవాదులకు ఆమె లక్ష్యంగా మారే అవకాశముందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అభయ్ దుబె, రవి సక్సేనా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకే ఈ మేరకు లేక రాశారు. చిన్న వయసులోనే జశోదా బెన్ను వివాహం చేసుకున్న మోడీ మూడేళ్లు మాత్రం కలిసున్నారు. ఆ తర్వాత వైవాహిక జీవితానికి పూర్తిగా దూరమై రాజకీయాల్లో నిమగ్నమైపోయారు. కాగా తన వైవాహిక జీవితంపై ఎన్ని విమర్శలు వచ్చినా స్పందించని మోడీ తాజా ఎన్నికల నామినేషన్లో తన భార్య పేరును ప్రస్తావించారు. దీంతో జశోదా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
కేజ్రీవాల్‌కు యూపీలో జడ్ కేటగిరీ, ఢిల్లీలో రహస్య భద్రత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇష్టం ఉన్నా.. లేకపోయినా ఆయనకు మాత్రం జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల కౌశాంబి ప్రాంతంలోని ఆయన ఇంటివద్ద మొత్తం 30 మంది భద్రతా సిబ్బంది అనుక్షణం పహరా కాస్తుంటారు. అయితే ఢిల్లీలో మాత్రం రహస్య భద్రత మాత్రమే కల్పిస్తున్నారు. శనివారం నాడు ఢిల్లీ సచివాలయం వెలుపల నిర్వహించిన 'జనతా దర్బార్'లో అత్యధిక స్థాయిలో జనం రావడం, వారిని నియంత్రించడం కూడా సాధ్యం కాకపోవడం లాంటి సంఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్‌కు తెలియకుండానే ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంతకుముందే ప్రకటించారు. సామాన్య ప్రజల రూపంలో ఆయనకు ముప్పు కలిగించే శక్తులు వచ్చే ప్రమాదం ఉన్నందున భద్రత తప్పనిసరిగా కల్పిచాల్సిందేనని ఆయన అన్నారు. అయితే ఘజియాబాద్ పోలీసులు ఎన్నిసార్లు కోరినా కేజ్రీవాల్ మాత్రం తనకు భద్రత అవసరం లేదని కుండబద్దలుకొట్టి చెబుతున్నారు. గత వారం కూడా ఆయన ఇంటికి కిలోమీటరు దూరంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై కొందరు దుండగులు దాడిచేసి తగలబెట్టినా.. దాన్నీ తేలిగ్గానే తీసుకున్నారు. దాంతో ఇక ఆయనకు 24 గంటలూ జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు ఘజియాబాద్ పోలీసు అధికారి ధర్మేంద్రసింగ్ తెలిపారు. ఆయన ఇంటి బయట ఎప్పుడూ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వారితో పాటు ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు కూడా ఉంటారు. కేజ్రీవాల్ ఎప్పుడు బయటకెళ్లినా ఆయనతో పాటు సాయుధులతో కూడిన రెండు కార్లు వెంట ఉంటాయి. -
నేటి నుంచి కేజ్రీవాల్‌కు ‘జెడ్’ భద్రత
ఘజియాబాద్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు ఘజియాబాద్ ఎస్ఎస్పీ ధర్మేంద్ర సింగ్ తెలిపారు. వ్యక్తిగత భద్రతను కేజ్రీవాల్ పదేపదే నిరాకరిస్తున్నప్పటికీ యూపీ సర్కార్ ఆదేశాల మేరకు తామీ నిర్ణయం తీసుకున్నట్టు సింగ్ ఆదివారం ఇక్కడ వివరించారు. సోమవారం నుంచి 30 మంది సిబ్బందితో కూడిన పోలీసు బృందం 24 గంటలూ కేజ్రీవాల్‌కు భద్రత కల్పిస్తుందని, వీరిలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారని వివరించారు. అదేవిధంగా కేజ్రీవాల్ నివసిస్తున్న ఘజియాబాద్‌లోని కౌశాంబిలో ఉన్న గిరినార్ అపార్ట్మెంట్ వెలుపల 8 మంది పోలీసులు భద్రత కల్పిస్తారని తెలిపారు. -
సీఎం కేజ్రీవాల్‌కు ‘జెడ్’ కేటగిరి భద్రత
లక్నో: ఢిల్లీ సరిహద్దులో ఉన్న ఘజియాబాద్‌లో నివాసముంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. భద్రత విషయంలో కేజ్రీవాల్ మొదటినుంచి తిరస్కరిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం కౌశంబీలోని సీఎం నివాసానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ(హోం) ఎ.కె.గుప్తా, డీజీపీ రిజ్వాన్ అహ్మద్ కమిటీ నిర్ణయించినట్లు అదనపు డీజీపీ ఒ.పి.సింగ్ తెలిపారు. ఢిల్లీపోలీసులకు ఈ విషయమై సమాచారం పంపించామని, అలాగే ఘజియాబాద్ జిల్లా పోలీసులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఆయన చెప్పారు. గత బుధవారం కౌశంబీలోని ఆప్ కార్యాలయంపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. -
భద్రత వద్దేవద్దని పునరుద్ఘాటించిన కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: చేతిపై జీవనరేఖ చాలా పొడవుగా ఉందని, తన ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని, తనకు భద్రత అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించడం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... తనకు భద్రత అవసరం లేదన్నారు. కేజ్రీవాల్ నివాసం యూపీలోని ఘజియాబాద్‌లో ఉన్నందువల్ల ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం యూపీ సర్కారుకు లేఖ రాయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రత సమకూర్చింది. అయి తే కేజ్రీవాల్ దీనిపై ప్రతిస్పందిస్తూ తనకు భద్రత అవసరం లేదని చెప్పారు. తన చేతిలో జీవన రేఖ చా లా పొడవుగా ఉందని ఆయన నవ్వుతూ అన్నారు. ప్రజలతో మమేకం కావడానికే రోడ్లపై జనతా దర్బార్... ప్రజలతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవడం కోసమే రోడ్డుపై జనతా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రజల మనసులలో ఎన్నో గోడలున్నాయని, పెద్ద బంగ్లా, పెద్ద వాహనం, ఎర్రబుగ్గ చూసి వారు వెనుకంజ వేస్తారని, సచివాలయం వంటి సువిశాలమైన ప్రభుత్వ కార్యాలయంలోకి రావడానికి భయపడతారని, జనాల మనసుల్లోని ఈ అడ్డుగోడల హద్దును తొలగించడం కోసమే రోడ్డుపై ప్రజలను కలవాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదమే..! ఆప్ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక చర్యలు చేపట్టడంలో చిన్న చేపలపై దృష్టి సారిస్తూ పెద్ద చేపలను ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ఉన్న అవినీతి ఆరోపణల విషయంలో మిన్నకుండి పోతుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. అవినీతి విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని ఈ విషయంలోనూ చర్యలు చేపడతామని చెప్పారు. విద్యుత్తు కంపెనీలు తమ ఆర్థిక వ్యవహారాలను తామే చక్కదిద్దుకోవాలన్నారు. ఆప్‌పై కిరణ్‌బేడీ విమర్శలు... జన్‌లోక్‌పాల్ ఉద్యమ సమయంలో కేజ్రీవాల్‌తో కలసి పనిచేసిన ఆమ్ ఆద్మీ పార్టీపై కిరణ్ బేడీ సంధించారు. ఆప్ ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ ప్రారంభించడంతోపాటు షీలాదీక్షిత్‌ను తప్పుపట్టిన లోకాయుక్తా నివేదికపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రత?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ సర్కారు భావిస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో రిఫరెండం నిర్వహించాలన్న ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలకు నిరసనగా హిందు రక్షాదళ్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. కేజ్రీవాల్ భద్రతకు సంబంధించి ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే యూపీ పోలీసులపైనే విమర్శలు వస్తాయని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో జెడ్ కేటగిరి భద్రతను తీసుకునే విధంగా ఢిల్లీ సీఎంను ఒప్పించాలని వారు భావిస్తున్నారు. గతంలో కేజ్రీవాల్‌కు, ఆప్ కార్యాలయానికి యూపీ పోలీసులు భద్రత ఇచ్చేందుకు ముందుకొచ్చినా.. దానిని ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. -
‘జెడ్’ కేటగిరీ భద్రత వద్దన్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మొదట్నుంచీ విభిన్న పంథాలో నడుస్తున్న ఆరవింద్ కేజ్రీవాల్ భద్రత విషయంలోనూ ప్రత్యేకత చాటుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నందున నిబంధనల ప్రకారం ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పిస్తామన్న ఢిల్లీ పోలీసుల అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. తనకు దేవుడే పెద్ద రక్షకుడని, ఎలాంటి అదనపు భద్రత అక్కర్లేదని పేర్కొంటూ సోమవారం ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. ఎస్కార్టు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది(పీఎస్వో) కూడా వద్దని సూచించారు. ‘‘నాకు సెక్యూరిటీ కల్పించాలన్న మీ ప్రతిపాదనకు కృతజ్ఞతలు. మీకు ఇంతకుముందే చెప్పినట్లు నాకు ఎలాంటి భద్రత అవసరం లేదు. దేవుడే నాకు పెద్ద రక్షకుడు. అయితే నేను ప్రసంగించే వేదికల వద్ద జన సమూహాన్ని నియంత్రించేందుకు సాయంగా ఉండండి’’ అని తన లేఖలో అరవింద్ పేర్కొన్నారు. -
నన్ను ఆగంతకులు వెంటాడారు
మాజీ మంత్రి శంకర్రావు ఆరోపణ సాక్షి, హైదరాబాద్: తనను ఎవరో వెంటాడుతున్నారని, తనకు జెడ్ కేటగిరీ రక్షణ కల్పించాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. శంకర్రావు సోమవారం రాత్రి తన కుమార్తె సుస్మితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం కంటోన్మెంట్ బోర్డు నుంచి మంకీ క్యాప్‌లు ధరించిన ఐదుగురు ఆగంతకులు తనను కారులో వెంబడించారని ఆరోపించారు. ఏపీ 9 టీఆర్ నెంబరుతో గల గ్రే కలర్ ఫార్చూనర్ కారులో ఆగంతకులు ఉన్నట్లు తెలిపారు. సీఎం ఎర్రచందనం కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా ప్రాపర్టీస్, గాలి జనార్దన్‌రెడ్డి, 26 జీవోలు తదితర అక్రమాలను తాను వెలుగులోకి తెచ్చానని... అది నచ్చనివారెవరో తనను వెంబడించారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. తన తండ్రిని హతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, ఆయనకేమైనా జరిగితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిదే బాధ్యత అని శంకర్రావు కుమార్తె సుస్మిత సోమవారం రాత్రి మారెడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
జైల్లోనూ 'జడ్ ప్లస్' కావాలి: లాలూ
రాంచీ: జైల్లోనూ తనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగించాలని బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోరారు. అయితే లాలూ విజ్ఞప్తిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. జైల్లో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగించేది లేదని కోర్టు స్పష్టం చేసింది. 'దాణా కుంభకోణంలో దోషిగా నిర్ధారణయిన తర్వాత.. జైల్లోనూ తనకు భద్రత కొనసాగించాలని కోర్టును లాలూ అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది' అని జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్(లా లండ్ ఆర్డర్), జైలు సూపరిండెంటెంట్ ధర్మేంద్ర పాండే తెలిపారు. గత కొన్నేళ్లుగా లాలూకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగుతోంది. జైలుకు వెళ్లే వరకు ఆయనకు నేషనల్ సెక్యురిటీ గార్డ్ బ్లాక్ కమెండోస్ ఆయనకు భద్రత కల్పిస్తూ వచ్చారు. లాలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం రాంచీ శివార్లలోని బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ కేసులో లాలూ సహా మిగతా 37 మందికి అక్టోబర్ 3న శిక్షను ఖరారు చేయనున్నారు. రెండేళ్లకు పైబడి శిక్ష పడితే ఆయన లోక్‌సభ సభ్యత్వం తక్షణం రద్దవుతుంది. -
కేసీఆర్‌కు జడ్‌ప్లస్ అయితే సీమాంధ్రులకు ఎంత?
-
కేసీఆర్‌కు జడ్‌ప్లస్ అయితే సీమాంధ్రులకు ఎంత?
హైదరాబాద్ నగరంలో ఉండే సీమాంధ్రుల భద్రతపై స్ఫష్టత వచ్చే వరకు విభజన ప్రక్రియ చేపట్టకూడదని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోనే ప్రముఖ నేత అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌కు జెడ్‌ప్లస్ భద్రత కావాలంటే... హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్రులకు ఎంత రక్షణ కావాల్సి ఉంటుందని అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 31, సెప్టెంబర్ 1వ తేదీలలో కూకట్‌పల్లిలో దీక్ష చేపట్టనున్నట్లు శ్రీనివాసరాజు వివరించారు. -
కేసీఆర్ హత్యకు సుపారీ
ఆయనకు జెడ్ ప్లస్ రక్షణ కల్పించాలి: హరీశ్, ఈటెల సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను హత్య చేసేందుకు సుపారీలు ఇచ్చినట్టుగా తమ వద్ద ఆధారాలున్నాయని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ఉపనాయకుడు టి.హరీష్‌రావు వెల్లడించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ సుపారీలు ఎవరిచ్చారో కూడా తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. కేసీఆర్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని హెచ్చరించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు అందిస్తామని హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్‌కు హాని తలపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపుతామనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రక్షణకు ఇంటెలిజెన్స్ అదనపు డీజీని మూడు రోజుల క్రితమే కలిసినట్టు ఈటెల రాజేందర్ చెప్పారు. పనికిరాని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేసీఆర్‌కు కేటాయించారని, దానికి బదులుగా మరో వాహనాన్ని ఇవ్వాలని కోరినట్లుగా చెప్పారు. ఎస్ఆర్సీలో చర్చ తరువాతే నిర్ణయం: ప్రస్తుతం జెడ్ కేటగిరీలోనున్న కేసీఆర్‌కు భద్రతను మరింత పెంచాలని కోరుతూ ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐజీ మహేష్ భగవత్‌కు విన్నపం అందజేశారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని కోరా రు. దీనిపై భద్రత సమీక్ష కమిటీ(ఎస్ఆర్సీ)లో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. జడ్ ప్లస్ కేటగిరీకి మారితే:రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాత్రమే జెడ్ ప్లస్ భద్రత ఉంది. కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ మాజీ సహాయ మంత్రి విద్యాసాగరావులకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట మంత్రులకు వై కేటగిరీ భద్రత ఉంది. కేసీఆర్‌కు జెడ్ కేటగిరీ కింద 6+2 సాయుధ రక్షకులు (గన్‌మెన్), బులెట్‌ప్రూఫ్ వాహనం, ఒక ఎస్కార్టు వాహనం, ఎస్కార్టు సిబ్బందితో పాటు ఆయన నివాసం వద్ద గార్డును ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీకి మారితే సాయుధ రక్షకుల సంఖ్య రెట్టింపు అవుతుంది.