కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రత?
Published Thu, Jan 9 2014 11:08 PM | Last Updated on Mon, May 28 2018 1:46 PM
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ సర్కారు భావిస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో రిఫరెండం నిర్వహించాలన్న ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలకు నిరసనగా హిందు రక్షాదళ్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. కేజ్రీవాల్ భద్రతకు సంబంధించి ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే యూపీ పోలీసులపైనే విమర్శలు వస్తాయని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో జెడ్ కేటగిరి భద్రతను తీసుకునే విధంగా ఢిల్లీ సీఎంను ఒప్పించాలని వారు భావిస్తున్నారు. గతంలో కేజ్రీవాల్‌కు, ఆప్ కార్యాలయానికి యూపీ పోలీసులు భద్రత ఇచ్చేందుకు ముందుకొచ్చినా.. దానిని ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే.
Advertisement