ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. శాసనసభలో తమ నాయకుడిగా కేజ్రీవాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ నెల 14న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. 70 సీట్లున్న శాసనసభలో ఆప్ 67 స్థానాల్లో జయభేరీ మోగించింది. బీజేపీ కేవలం 3 సీట్లు గెలవగా, కాంగ్రెస్ బోణీ కొట్టలేకపోయింది.