delhi-assembly-election-2015
-
చరిత్ర తిరగరాసిన ‘సామాన్యుడు’
సందర్భం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ సృష్టించిన ప్రళయం అపూర్వమని చెప్పాలి. అయితే, కేజ్రీవాల్ నిజాయితీకి మారుపేరయినా, ఆయన మంత్రివర్గ సహచరులందరూ తనలా కలకాలం నీతిమంతులుగా ఉండగలరని చెప్పలేము. ఆయన రాజకీయ నాయకు డు కాడు. రాజకీయ కుటుం బంలో జన్మించిన వాడూ కా డు. అయినా, ఇప్పుడు భార తదేశంలో ‘కేజ్రీవాల్’ అంటే ఎంత మోజు! ఎంత క్రేజు! మరీ, మొన్న దేశ రాజధాని ఢిల్లీలో ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ (సగటు మనిషి) పాగా వేయడంతో ఆయన పేరు ప్రపంచ పరివ్యాప్తమైంది. ఆ పార్టీ ఆవిర్భవించి కిందటి నవంబర్ నెలకు రెండేళ్లు. పుట్టిన ఏడాదికే ఆయన పేరు, ఆ పార్టీ పేరు ప్రజల నాల్కలపై ఆడసాగాయి. ఒకప్పుడు పేరు ఉచ్చారణే తికమకగా ఉండేది! పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి నవారు లేకపోలేదు. కానీ, ఆ ఎన్టీఆర్ ఎక్కడ? ఈ కేజ్రీ వాల్ ఎక్కడ? ఆయన సినీ గ్లామర్ అనితర సాధ్యం, ఈయనో.. గ్లామర్‌కు ఆమడ దూరం. అసలు గ్లామర్ ఉంటే కదా! ఔను! ఇన్‌కమ్‌టాక్స్ జాయింట్ కమిషనర్ గా ఉన్నవాడికి గ్లామర్ ఎక్కడినుంచివస్తుంది? కాగా అవినీతి ఇప్పుడు కొత్తగా రాలేదు. అది అనాదిగా మనిషి రక్తంలో ఎంతోకొంత స్థాయిలో పుట్టుకతోనే ఉంటూ వచ్చింది. అసలు అవినీతి అంటే ఏమిటి? నీతి కానిదం తా అవినీతి కాదా? మన రామాయణ, మహాభారతా లనే తీసుకోండి. పరదారాపహరణం- రావణుని చర్య- అవినీతి కాదా? మహాభారతం మాత్రం? నిండు పేరోల గంలో వదిన వరుస ద్రౌపది వలువలూడ్చాలని ప్రయ త్నించడం దుర్యోధనుని అవినీతికి పరాకాష్ట కాదా? ప్రస్తుత కాలానికి వస్తే, తాను ఒక పార్టీకి చెందిన వాడినని నమ్మించి, ప్రజల ఓట్లను వేయించుకుని, ఎన్ని కైన తరువాత డబ్బుకోసమో, పదవి కోసమో మరో పార్టీలోకి దూకడం నమ్మకద్రోహమనే అవినీతి కాదా? లంచం ఇస్తే కానీ ప్రభుత్వ అధికారి పెన్షన్ ఇవ్వడా? అధికారి చెయ్యి తడిపితే కానీ కాగితం కదలదా? అవినీతి, అన్యాయం, అక్రమం, బడుగు జీవుల నిరాదరణ - భారతదేశంలో వీరవిహారం చేస్తున్నాయి. ఈ అవినీతికి సగటు మానవుడు బలిపశువు అయిపోతు న్నాడు! అందువల్లనే, ముంబైలో ఒక ఖైర్నార్ (మునిసి పల్ కమిషనర్), ఢిల్లీలో అన్నా హజారే, బాబా రామ్ దేవ్ వంటివారు ఎందరో అవినీతి నిర్మూలనోద్యమానికి నడుంకట్టారు. వారిసహ ప్రయాణికుడే కేజ్రీవాల్ కూడా. అయితే, అవినీతి నిర్మూలనకు నిరాహారదీక్షలు, ప్రచారోద్యమాల వల్ల ప్రయోజనం లేదని, అవినీతికి పుట్టిల్లు రాజకీయరంగమేనని నమ్మిన కేజ్రీవాల్ రాజ కీయ రంగంనుంచే అవినీతి నిర్మూలన ప్రారంభం కావా లని ఆమ్ఆద్మీ పార్టీని స్థాపించాడు. ఈక్రమంలో ఆయ న మార్గనిర్దేశకుడు హజారేకు దూరమైనాడు కూడా. 128 సంవత్సరాల మహా చరిత్ర సృష్టించిన కాం గ్రెస్ ఎక్కడ? ఎక్కడి భారతీయ జనతాపార్టీ? ఆ కాం గ్రెస్‌ను మొన్నటి ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ఆద్మీ పార్టీ నామ రూపాలు లేకుండా చేసింది! కిందటి సంవత్సరం జరి గిన లోక్‌సభ ఎన్నికలలో అఖండ విజయం సాధించి, ఆ తరువాత జరిగిన అసెంబ్లీల ఎన్నికలలో కూడా జైత్ర యాత్ర చేస్తున్న బీజేపీకి మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని కలలో బ్రేక్ పడ్డమేకాక కేవలం మూడంటే మూడు స్థా నాలు రావడం దేశానికే కాదు, ఆ పార్టీకి దిగ్భ్రాంతి కలి గించింది. ఇది కేజ్రీవాల్ సృష్టించిన ఎన్నికల సునామీ! భారతదేశంలో మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఆమ్ఆద్మీ ప్రళయం లాంటిది ఏ పెద్ద రాష్ట్రం లోనూ వచ్చినట్లు కనిపించదు. కాకపోతే, చిన్న రాష్ట్ర మైన సిక్కింలో నార్ బహదూర్ భండారీ కొత్తగా పెట్టిన సిక్కిం సంగ్రామ పరిషత్తు, ఆ తరువాత పవన్ కుమార్ చామ్లింగ్ ఆ అసెంబ్లీలోని 32 స్థానాలనూ కైవసం చేసు కున్న చరిత్ర ఉన్నా, ఢిల్లీ ఎక్కడ? సిక్కిం ఎక్కడ? దేశ రాజధానికి, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల కంటే చిన్నది సిక్కింకు పోలిక ఎక్కడ? అక్కడ క్షీణ దశలో ఉన్న కాంగ్రెస్‌ను ఓడించడం ఎవరికైనా నల్లేరుపైన నడకే! అయితే, కేజ్రీవాల్‌కు ఇకనుంచి మరో పరీక్ష ప్రారం భమౌతుంది. అధికారం అవినీతికి దారితీస్తుంది, అత్య ధిక అధికారం అతి అవినీతికి దారితీస్తుందన్న సూక్తి కేజ్రీ వాల్‌కు తెలిసే ఉండాలి. అధికారంలో ఉన్న వ్యాధే అది! అది నిజంగా అంటువ్యాధి. ఎంత నీతిపరుడినైనా అవి నీతిపరుడిగా మార్చివేస్తుంది. అవినీతి చేయకపోయినా ఆ ముద్రపడుతుంది. లేదా, అవినీతి అంటకడతారు. ఒకానొక దశలో భారత రాజకీయ రంగంలో ముగ్గు రు మిస్టర్ క్లీన్లు ఉండేవారు. రాజీవ్‌గాంధీ, డాక్టర్ మన్మోహన్సింగ్, మాజీ రక్షణ మంత్రి ఆంటోనీ. అయితే ఆ తరువాత రాజీవ్‌గాంధీపై బోఫోర్స్ మచ్చపడింది. మన్మోహన్ సింగ్ నీతిమంతుడైనా, ఆయన మంత్రివర్గం లోని కొందరి అవినీతి కుంభకోణాల ఛాయలు ఆయ నపై పడ్డాయి. ఇక మూడవ మిస్టర్ క్లీన్ ఆంటోనీపై కూడా రక్షణశాఖ ఆయుధాల కొనుగోలులో కొన్ని ఆరో పణలు వచ్చాయి. కేజ్రీవాల్ ఎంత నీతీనిజాయితీలకు మారుపేరైనా, ఆయన మంత్రివర్గంలోని మంత్రులం దరూ ఆయన అంతగా కలకాలం నీతిమంతులుగా ఉండగలరని చెప్పలేము. వారిపై ఏదో ఒకరూపంలో అవినీతి చినుకులు పడితే అవి కేజ్రీవాల్‌పై కూడా చిందే ప్రమాదం ఉంది! మరి, అధికారంలోనే అవినీతి ఉంది కదా! కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఒక్కరిపైన అవినీతి చిను కులు పడినా, అవి ఆయనను నమ్ముకున్న ఆమ్ ఆద్మీ లను హతాశుల్ని చేస్తాయి! అంతేకాదు. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ తనను వెన్నుపోటు పొడిచిన తన పుత్ర సమానుడు బ్రూటస్ను ఉద్దేశించి, ‘‘నువ్వు కూడానా బ్రూటస్’’ అని నిర్ఘాంతపోయినట్లు, సామాన్యులు ‘‘నువ్వు కూడానా కేజ్రీవాల్’’ అని నిర్ఘాంతపోయే సన్నివేశం రాకుండా ఆయన తన ప్రభుత్వాన్ని వెయ్యి కళ్లతో కనిపెట్టి ఉండ టం అవసరం! కాగా, మొన్న డిల్లీ ఎన్నికలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సామాన్యుని హెచ్చరికగా కూ డా పరిగణించాలి. తాను తలుచుకుంటే, సామాన్యుడు అతి సామాన్యుని సయితం మహానాయకుని చేయగల డని దీన్ని బట్టి అర్థం కావడం లేదా? (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు) -
'ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ఆరెస్సెస్'
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దారుణంగా ఓడిపోవడాన్ని ఆరెస్సెస్ ఇంకా జీర్ణించుకోలేక పోతుంది. పార్టీ నేతలకు కూడా తెలపకుండా రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడంపై ఆరెస్సెస్ ప్రశ్నలు లేవనెత్తింది. ఈ విషయాలపై తమ పత్రిక 'పాంచజన్య' లో భిన్న కథనాలు ప్రచురించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ ఎంపిక సరైనదేనా అని ఆరెస్సెస్ ప్రశ్నించింది. ఢిల్లీ బీజేపీ నేత హర్షవర్ధన్‌ను లేదా స్థానిక నాయకుడిని ఎవరినైనా బరిలో నిలిపింటే పరిస్థితి భిన్నంగా ఉండేదని అభిప్రాయపడింది. తాజాగా ఢిల్లీలో బీజేపీ ఓటమి నేపథ్యంలో తన పత్రికలో 'ఆకాంక్షోం కి ఉదాన్' (గాలిలో మేడలు ), 'వాదె, సవాల్, కేజ్రీవాల్' (హామీలు, ప్రశ్నలు, కేజ్రీవాల్) శీర్షికలతో రెండు వార్త కథనాలు ప్రచురించింది. 'బీజేపీ ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాపై ఆధారపడటం కూడా ఓటమికి కారణమైంది. కిరణ్ బేడీ అభ్యర్దిత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... పార్టీలో సమిష్టితత్వం లోపించింది. మరీ ముఖ్యంగా కార్యకర్తల సెంటిమెంట్లను గౌరవించకపోవడం ఓటమికి దారి తీసింది' అని మనోజ్ వర్మ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పార్టీ ఓటమికి పలు తప్పిదాలే కారణమని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. కాగా ఆ అంశాలను పాంచజన్యలో ఎన్నికలకు ముందే ప్రచురించడం విశేషం. బీజేపీ నేతలు ఇప్పటికీ పార్టీ ఓటమిపై విశ్లేషిస్తున్నారు. బీజేపీకి చెందిన కొందరు నాయకులు మాత్రం.. 'పార్టీకి కంచుకోటగా ఉన్న కృష్ణానగర్ సీటు కోల్పోవడం గమనించినట్లయితే, బీజేపీ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఎన్నికలలో సహకరించలేదన్నది వాస్తవం' అని విశ్లేషిస్తున్నారు. సీఎం అభ్యర్ధిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదు. -
ఎన్నికల రాజకీయాల్లో ఓడిపోయా:కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: ఎన్నికల రాజకీయాల్లో తాను ఓడిపోయానని బీజేపీ నేత, ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్‌బేడీ తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత ఈ మాజీ ఐపీఎస్ అధికారి సోమవారం దానిపై వివరణ ఇచ్చారు. శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ ఎన్నికల రాజకీయ పరీక్షలో గెలవలేకపోయానని ఆమె తన బ్లాగు ద్వారా విడుదల చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే, తాను మానసికంగా మాత్రం ఓడిపోలేదని ఆమె అన్నారు. తన అనుభవాన్ని పణంగా పెట్టి పోరాడినా అది సరిపోలేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు ఆప్ ఇచ్చిన ఉచిత నీరు, విద్యుత్తు చార్జీల తగ్గింపు వంటి వాటివైపు మొగ్గు చూపారన్నారు. కానీ, వీటి వల్ల దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందన్నారు. కృష్ణానగర్ నియోజకవర్గంలో తన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని ఆమె అన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఓటమికి కారణం తాను కాదని, బీజేపీయేనని వ్యాఖ్యానించి కలకలం సష్టించిన సంగతి తెలిసిందే. -
మంత్రిత్వ శాఖ తీసుకోని ముఖ్యమంత్రి
సాధారణంగా ముఖ్యమంత్రులంటే.. మంత్రులందరిలోకీ ముఖ్యమైన వారు. అందుకే చాలా ముఖ్యమైన శాఖలు తీసుకుంటారు. కానీ, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం విభిన్నంగా వ్యవహరించారు. తనకు శాఖలేవీ వద్దని చెప్పారు. ఆయన మొత్తం మంత్రులందరి పనితీరును పర్యవేక్షిస్తుంటారని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా తెలిపారు. ఆర్థికశాఖ, విద్యుత్ శాఖ సహా కీలక శాఖలన్నీ మనీష్ వద్దే ఉన్నాయి. ప్రధానంగా అవినీతి నిర్మూలన, ధరల నియంత్రణ, నిరంతరాయంగా విద్యుత్, నీటి సరఫరా మీద ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దృష్టి పెడుతుందని సిసోదియా చెప్పారు. ప్రజలకు వీలైనంత ఉత్తమ సేవలు అందించడమే తమ తొలి ప్రాధాన్యమని ఆయన అన్నారు. రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా కేజ్రీవాల్ వెన్నంటే ఉన్న, అత్యంత నమ్మకస్థుడైన సిసోదియా .. ఆర్థిక, ప్రణాళిక, సేవ, విద్య, ఐటీ, సాంకేతిక విద్య, పాలనా సంస్కరణలు, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, భూమి.. భవనాల విజిలెన్స్, ఇతర మంత్రులకు కేటాయించని అన్ని శాఖలను చూస్తారు. గతంలో కూడా కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న సత్యేంద్ర జైన్ ఈసారి ఆరోగ్య శాఖతో పాటు పరిశ్రమలు, నీటిపారుదల, వరద నియంత్రణ, ప్రజాపనుల శాఖలు చూసుకుంటారు. కొత్తమంత్రుల్లో ఒకరైన గోపాల్ రాయ్ ఉపాధి కల్పన, అభివృద్ధి, కార్మిక, రవాణా శాఖలు చూస్తారు. జితేందర్ సింగ్ తోమర్‌కు న్యాయ, పర్యాటక, కళ, సాంస్కృతిక, హోం మంత్రిత్వశాఖలు అప్పగించారు. ఆసిమ్ అహ్మద్ ఖాన్ ఆహార, పర్యావరణ, అటవీ శాఖలు చూస్తారు. సందీప్ కుమార్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖ, భాష, ఎస్సీ, ఎస్సటీ సంక్షేమ శాఖలు అప్పగించారు. -
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
-
మాది ప్రజల ప్రభుత్వం
న్యూఢిల్లీ: రామ్ లీలా మైదానంలో కిక్కిరిసిన అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా, మంత్రులుగా అసిమ్ అహ్మద్ , సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, సందీప్ కుమార్, జితేంద్ర తోమర్ ప్రమాణం స్వీకారం చేశారు.లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ వీరితో ప్రమాణం చేయించారు. అనంతరం కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాను, తన మంత్రివర్గం 24 గంటలూ కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తన గొంతు బాగా లేదంటూనే... ఇన్ సాన్ కా ఇన్ సాన్ హై... మన్నాడే పాడిన పాటను కేజ్రీవాల్ పాడుతుంటే అభిమానులంతా ఆయనతోపాటు గొంతుకలిపారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ సీఎం కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు... * ఢిల్లీ ప్రజలకు మా మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ మమ్మల్నిఇంత గొప్పగా ఆదరిస్తారని అనుకోలేదు. * మాకు ఓటు వేశారా లేదా అనే దాంతో ప్రమేయం లేకుండా .. మా ప్రభుత్వం అందరిదీ. నేను ఒక్కడినే కాదు ఢిల్లీలోని ప్రతి పౌరుడూ ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్టే. * ఢిల్లీ శాంతికాముక నగరం. మతపరంగా ఢిల్లీని విభజించాలనుకుంటే సహించం.దీపావళి, క్రిస్టమస్, ఈద్ సమానంగా జరుపుకుందాం. * అతి త్వరలోనే జనలోక్ పాల్ బిల్లును తీసుకొస్తాం. * భారతదేశంలో మొట్టమొదటి అవినీతి రహిత నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దుతాం * ఆసుపత్రులు, రోడ్లు నిర్మిస్తాం. మహిళలకు భద్రత ఉండేలా ఢిల్లీని తయారుచేస్తాం. * మీరు పన్నులు చెల్లించండి..మేం వాటిని మంచి పనులకు ఉపయోగిస్తాం. * ఇండియా ప్రపంచ కప్ గెలుచుకోవాలి. టీమిండియా సభ్యులకు మా అభినందనలు * కిరణబేడీ నా సహోదరి లాంటివారు. అజయ్ మాకెన్ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేత. వారిద్దరి సూచనలు, సలహాలు తప్పక స్వీకరిస్తాం. * రెడ్ కార్పెట్, వీఐపీ సంస్కృతులను మారుస్తాం. చాలా దేశాల్లో ప్రధానమంత్రులు బస్ స్టాప్ లలో వేచి ఉంటారు. -
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
-
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ శనివారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా ఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రెండోసారి ప్రమాణం చేశారు. కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా, సందీప్ కుమార్, అసీం అహ్మద్ ఖాన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, జితేంద్రసింగ్ తోమర్ ...మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా హస్తినలో కనీవినీ ఎరుగని రీతిలో ఆమ్ఆద్మీ పార్టీ 96 శాతం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న విషయం విదితమే. 70 స్థానాలకు గానూ 67 స్థానాలను ఆప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. -
గతంలో రైలులో.. ఈసారి మాత్రం కారులో..
lన్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ప్రపంచ రికార్డు సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీ ముఖ్యనేత అరవింద్ కేజ్రీవాల్ ముఖమంత్రిగా, ఆరుగురు సభ్యుల కేబినెట్ తో ఈరోజు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. ఘజియాబాద్ లోని రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయ్యాయి. గతంలో మెట్రోరైలు లో ప్రయాణిస్తూ, ప్రజలను పలకరిస్తూ ప్రమాణస్వీకరానికి హాజరై సంచలనం సృష్టంచిన కేజ్రీవాల్ ఈ సారి మాత్రం కారులో రోడ్డుమార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కాగా గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కేజ్రీవాల్ బాగా నీరసపడ్డారని ఆప్ తెలిపింది. అయితే ఆయన ఆరోగ్యం సహకరిస్తే ఈ సారికూడా మార్గమధ్యంలో ప్రజలను కలుస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం 10.30కి ఇంటినుంచి బయలుదేరతారు. మరోవైపు ప్రోటోకాల్ నిబంధనలు అనుసరించి అన్ని రక్షణ ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసిన తరువాత రాజ్ ఘాట్ ని సందర్శించి గాంధీకి నివాళు లర్పిస్తారు. అనంతరం సెక్రటేరియట్ కు వెడతారని అధికార వర్గాలు తెలిపాయి. -
కేజ్రివాల్‌కి ఫిబ్రవరి 14th స్పెషల్ డే
-
నేడు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం
-
రేపు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. శనివారం కేజ్రీవాల్ ఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వేదిక రామ్‌లీలా మైదానంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్.. కేజ్రీవాల్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కేజ్రీవాల్ అత్యంత సన్నిహితుడు మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను కోరారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 67 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. బీజేపీ కేవలం మూడు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ బోణీ కూడా కొట్టలేకపోయింది. -
సామాన్యుడి సక్సెస్ వెనుక...
ఆప్ విజయం ఒక్కరిది కాదు తెరవెనుక కృషి చేసిన వారెందరో.. న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 432 మంది అభ్యర్థులను నిలబెడితే 413 మంది డిపాజిట్లను పోగొట్టుకున్న పార్టీ... కేవలం 2.07 శాతం ఓట్లే సాధించిన పార్టీ.. నాలుగంటే నాలుగే ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీ.. తన ప్రాథమిక రణక్షేత్రమైన ఢిల్లీలో సున్నా అయిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తిరిగి కోలుకుంటుందని కనీసం ఎవరైనా ఊహించనైనా లేదు.. అప్రతిహత విజయ పరంపరతో మాంఛి ఊపు మీద ఉన్న నరేంద్రమోదీ గొంతు వింటే చాలు.. ఢిల్లీ ప్రజలు పొలోమని పరుగులు పెట్టి కమలంపై మీట నొక్కేస్తారన్న బీజేపీ ధీమా నీరు గారుతుందని ఎవరైనా ఊహించారా? మోదీ గెలుపు బాటలో కేజ్రీవాల్ స్పీడ్ బ్రేకర్‌గా మారతారని ఎవరి కైనా తట్టిందా? కానీ, ఢిల్లీలో అక్షరాలా జరిగింది అదే. అట్టడుగుకు పడిపోయారనుకున్న కేజ్రీవాల్ ఊహించని వేగంతో సునామీ తరంగంలాఎగసి వచ్చారు. దాని ధాటికి మోదీతో సహా సమస్త పార్టీలు ఎక్కడికి పోయా యో తెలియనంతగా కొట్టుకుపోయాయి. ఇదంతా కేవలం కేజ్రీవాల్ ఒక్కడి వల్లో.. లేక ఆయనతో పాటు పార్టీతరపున చానళ్లలో రోజూ కనపడే నాయకుల వల్లనో జరిగింది కాదు. ఈ విజయంవెనుక తెరముందుకు రాని ముఖాలు, ఎవరికీ వినిపించని పేర్లు ఉన్నాయి. నిరాశా, నిస్పృహల్లో ఉన్న పార్టీకి జవసత్వాలు అందించింది ఈ తెరవెనుక బృందమే. సోషల్ మీడియా టీం: ఈ బృందానికి నాయకత్వం వహించింది అభినవ్. ఇతని పేరు ఫేస్బుక్ వాడే వాళ్లలో చాలామందికి పరిచయమే. ఇతని బృందమే.. సోషల్ నెట్‌వర్క్‌ను అత్యంత బలంగా వాడే మోదీ అండ్‌కోను అధిగమించి ప్రజల్లోకి పార్టీని తీసుకుపోగలిగింది. మధ్యతరగతి సహా అన్ని వర్గాల్లోకి పార్టీ తీసుకుపోవటంలో అభినవ్ బృందం రేయింబవళ్లు శ్రమించింది. కాల్ క్యాంపెయిన్: అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తరువాత ఢిల్లీ ప్రజల్లో పార్టీ పట్ల ఏర్పడిన భ్రమలను తొలగించటం కోసం ఆమ్ ఆద్మీపార్టీ కాల్క్యాంపెయిన్ను ప్రారంభించింది. దీని ద్వారా ఫోన్లో ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు చెప్పటం.. వారిలో అయోమయాన్ని తొలగించి.. తిరిగి పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంచటంలో ఈ రకమైన ప్రచారం ఆప్‌కు బాగా దోహదపడింది. 22ఏళ్ల ఫార్మసిస్ట్ మహజ్, అతని స్నేహితులు గౌతమ్, ఆకాశ్‌లు ఈ బృందానికి నేతృత్వం వహించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఆందోళనల్లోనూ ఈ టీమ్ చురుకైన పాత్ర పోషించింది. మీడియా మేనేజ్మెంట్: దేశ ప్రజల్లో ఎంతమంది గమనించారో లేదో కానీ, గత కొన్ని నెలలుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వార్త టెలివిజన్‌లో రాకుండా రోజు గడిచిపోయిన దాఖలా లేదు. విలేకరుల సమావేశం కానీ, ప్రెస్‌నోట్ కానీ, ఢిల్లీ రాజకీయాలపై ఆప్ కేంద్రంగా విశ్లేషణలు కానీ లేని రోజు లేదు. మీడియా ముందు కీలక మైన అంశాలను లేవనెత్తడం, తమ రాజకీయపు ఎత్తుగడలపై చర్చించుకునే లా చేయటంలో ఆప్ సూపర్ సక్సెస్ అయింది. ప్రముఖ పాత్రికేయులు నాగేంద్ర శర్మ అతని సహచరులు దీపక్ వాజపేయి, వందనా, మితాలీ నేహా, వికాస్ యోగి వంటి వాళ్ల బృందం దీన్ని పర్యవేక్షించింది. పార్టీ నేతలు, మీడియాకు మధ్య ఒక బలమైన సమన్వయం కుదిరేలా వీళ్లు కృషి చేశారు. వీరికి పార్టీ అధికార ప్రతినిధి ఆతీషి మౌలానా మార్గదర్శకత్వం వహించారు. వార్ రూమ్: పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను, వ్యూహ ప్రతివ్యూహాలను రచించి అమలు పరచిన టీం. ప్రత్యర్థుల ఎత్తుగడలను విశ్లేషించి కార్యాచరణను నిర్ణయించటంలో ఈ బృందం కీలక భూమికను నిర్వహించింది. ఆశిశ్ తల్వార్, రాజేశ్ తల్వార్, దిలీప్ పాండే, దుర్గేశ్, ఆశుతోశ్, ఆతిశీ, స్వాతి, వందనలు ఈ థింక్‌టాంక్‌లో భాగస్వాములు. డేటా మేనేజ్మెంట్: పార్టీపై రకరకాలుగా వచ్చే ఆరోపణలు.. స్పందనలు, విశ్లేషణలు, తదితర సమాచారాన్ని అంతా భద్రపరచటంకోసం ఆప్ ఏకంగా ఓ డేటామేనేజిమెంట్ వ్యవస్థను నెలకొల్పింది. అవసరమైన మేరకు దీన్ని వినియోగించుకునేలా ఏర్పాటు చేసింది. ఆశిష్ తల్వార్, దుర్గేశ్ పాఠక్లుదీన్ని పర్యవేక్షించారు. ఫండింగ్ మేనేజిమెంట్: పార్టీకి వచ్చే విరాళాలు పార్టీ ప్రధాన కార్యదర్శి పంకజ్ గుప్తా పర్యవేక్షణలో జరిగాయి. విరాళలను పరిశీలించి అవినీతికి ఆస్కారం లేకుండా తీసుకునే ప్రయత్నం పంకజ్ చేశారు. ప్రచార నిర్వహణ ఎన్నికల్లో అత్యంత కీలకమైంది ఎన్నికల ప్రచారం. ఆప్‌కు సంబంధించిన మొత్తం 70 మంది అభ్యర్థుల ప్రచారాన్ని ఒకే బృందం కేంద్రంగా పర్యవేక్షించింది. ఏ నియోజక వర్గానికి ఏ నాయకుడు వెళ్లి ప్రచారం చేయాలి? ఏయే అంశాలు ప్రస్తావించాలి? అన్న వాటిని జాగ్రత్తగా నిర్ణయించి అమలు చేసే బాధ్యతను ఆశిష్ తల్వార్ చేపట్టారు. గత ఎన్నికల్లో వీధి వీధికీ చీపురుపట్టి ఊడ్చే ప్రచారానికి కూడా ఈయనే నేతృత్వం వహించారు. ఇక పార్టీ అధినేత ప్రచార వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించింది గోపాల్ మోహన్, మురళీధరన్, రోహిత్, రుచా పాండే మిశ్రాల బృందం. కేజ్రీవాల్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎవరితో ఫోన్లో మాట్లాడతారు? ఎవరిని ఎప్పుడు కలుస్తారు? ఎప్పుడు ఏం తింటారు అన్న అన్ని విషయాలనూ ఈ బృందమే పర్యవేక్షించింది. ఆయనకు మాట్లాడేందుకు తగిన సమాచారాన్ని కూడా ఈ బృందమే అందించింది. బజ్ కాంపెయిన్ ఆప్‌ను ప్రజలకు చేరువ చేయటంలో ప్రభావవంతమైన పాత్ర పోషించింది ఈ బృందమే. ప్రజల్లో ఆప్‌కు అనుకూల వాతావరణాన్ని కల్పించటం కోసం రోడ్ల కూడళ్లలో యువతీయువకులు ప్లకార్డులు పట్టుకుని నిలుచోవ టం.. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఆప్ కార్యకర్తల ఫ్లాష్ మాబ్ ద్వారా తమ పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి పంపించ టం.. ఫుట్‌పాత్‌లపై ఆటపాటలు, రకరకాల వాయిద్యాలు వాయించటం వంటి వినోద కార్యక్రమాలకు నేతృత్వం వహిం చింది అదితీ రశ్మి, భాస్కర్, ఆనంద్, నందన్ మిశ్రా. వీరిలో నందన్ మిశ్రా ప్రదర్శనల్లో ప్రత్యక్షంగా పాల్గొంటే.. మిగతా వారు వాటి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
మోదీతో కేజ్రీవాల్ సమావేశం
-
మోదీతో కేజ్రీవాల్ సమావేశం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గురువారం భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించారు. కాగా కేజ్రీవాల్ బుధవారం కేంద్రమంత్రులతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన విషయం తెలిసిందే. కాగా సరిగ్గా ఏడాది క్రితం రాజీనామా చేసిన రోజునే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కనీవిని ఎరుగని రీతిలో జాతీయ పార్టీలను మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు భారీస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఆప్‌కు ఐటీ శాఖ నోటీసులు
న్యూఢిల్లీ: నకిలీ కంపెనీల నుంచి భారీగా విరాళాలు తీసుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటు న్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. అలాగే కాంగ్రె స్, మరో 48 సంస్థలకూ శ్రీముఖాలు జారీ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందురోజైన సోమవారమే ఇవి జారీ అయ్యాయి. విరాళాలు అందించిన సంస్థలు, వ్యక్తుల వివరాలను కోరుతూ పలు రాజకీయ పార్టీలు, సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సందర్భంగా పార్టీలకు విరాళాలరూపంలో భారీగా నల్లధనం వచ్చినట్లు సీబీడీటీ అనుమానిస్తోంది. ఢిల్లీలోని నకిలీ కంపెనీల నుంచి ఆప్‌కు నిరుడురూ. 2 కోట్లకు నాలుగు చెక్కులు అందాయని, అదంతా నల్లధనమేనని ఆ పార్టీ నుంచి విడిపోయిన అనుబంధ సంస్థ అవామ్ వెల్లడించిన విషయం సంగతి తెలిసిందే. ఓట్లను కొనేవారికే టికెట్లు ఇచ్చారు ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓట్లను కొనేవారికే టికె ట్లు ఇచ్చారని, నల్లధనాన్ని విరాళాలుగా స్వీకరించారని ఆప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శాంతి భూషణ్ ఆరోపించారు. కేజ్రీవాల్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని బుధవారం శాంతిభూషణ్ బ్లాగులో రాశారు. -
ఆమ్ ఆద్మీకి బీజేపీ ఎంపీ ధన్యవాదాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి కంటే కాంగ్రెస్ గల్లంతుకావడం బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌కు అమితాన్నందాన్ని కలిగించినట్టుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో తమ ఓటమిని అంగీకరిస్తున్నామని సాక్షి మహారాజ్ అన్నారు. కాగా నలుగురు పిల్లల్ని కనాలన్న తన వ్యాఖ్యల వల్ల పార్టీ ఓడిపోలేదని పేర్కొన్నారు. -
పైకెళ్లింది కింద పడాల్సిందే
ఢీల్లీ ఫలితాలపై విదేశీ మీడియా న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విదీశీ మీడియా ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభావాన్ని దష్టిలో పెట్టుకొని ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తితోనే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై ప్రపంచ మీడియా దృష్టి పెట్టింది. అనూహ్యంగా ఆప్ సునామీనే సష్టించి 70 సీట్లలో 67 సీట్లను కైవసం చేసుకోవడంతో మంచి కవరేజీ ఇచ్చింది. ఆప్ ‘రాజకీయ భూకంపం’ సష్టించినట్లు వ్యాఖ్యానించడంతోపాటు ఆప్‌ను ప్రశంసించింది. ‘పైకెళ్లిన వస్తువు కింద పడాల్సిందే’ అంటూ మోదీని ఉద్దేశించి విమర్శలు కూడా చేసింది. ఆప్ సాధించిన ఫలితాలు పరిపాలనా వ్యవహారాల్లో, ఆర్థిక సంస్కరణలపై ప్రధాని మోదీపై తీవ్ర ఒత్తిడి పెంచిందని న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకత్వంలో వ్యాఖ్యానించింది. అయితే అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ఈ ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. భారత్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయని వ్యాఖ్యానించింది. అవినీతి ప్రక్షాళన నినాదంతో వచ్చిన ఓ సామాన్యుడి పార్టీ చేతిలో మోదీ పార్టీ దిగ్భ్రాంతికరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. పెకైళ్లిన వస్తువు కింద పడాల్సిందేనంటూ న్యూటన్ భౌతికశాస్త్ర సూత్రాన్ని సీఎన్ఎన్ వ్యాఖ్యానించింది. మోదీకి ఇది మొదటి శరాఘాతం అని బీబీసి వ్యాఖ్యానించింది. మోదీకి ఇది పిడుగుపాటని లండన్ నుంచి వెలువడే ది టెలిగ్రాఫ్ వ్యాఖ్యానించింది. -
ఆప్ ఎన్నికల ఖర్చు రూ. 20 కోట్లే
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ సాధించిన అఖండ విజయం ఎన్నికల రణరంగంపై అనాదిగా మనలో వేళ్లూనుకుపోయిన ఎన్నో ఆపోహలను ఒక్కసారిగా పటాపంచలు చేసిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కాని నిజం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో జరిగే ఏ ఎన్నికల్లోనైనా కొత్త పార్టీ నెగ్గుకు రావాలంటే ఆషామాషీ కాదని, అందుకు మందీ మార్బలంతోపాటు కావాల్సినంత డబ్బు ఉండాలన్నది సార్వజనీక సత్యంగా చెబుతుంటారు రాజకీయ పండితులు. కానీ ప్రజల పక్షాన పనిచేయాలనే పట్టుదల, అంకిత భావం ఉన్న గుప్పెడు మనుషులుంటే చాలు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు తీసుకరావచ్చని నిరూపించారు కేజ్రీవాల్ బృందం. ఆ బృందం ఆవిష్కరించిన సరికొత్త అధ్యాయంలో పరిగణలోని తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యాంశాలు.... సమున్నత ఆశయం...దాన్ని అమలు చేయడానికి సరైన వ్యూహం, చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉంటే ఓ చిన్న బృందం కూడా ప్రపంచాన్నే మార్చేయవచ్చు ఎన్నికల్లో పోటీ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నదన్న మాట ఇక నిన్నటిది.అంతగా ఆర్థిక బలం లేనివారు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే కొత్త బాటకు దారి చూపింది ఆప్ విజయం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టింది కేవలం 20 కోట్ల రూపాయలలోపే అంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే బీజేపీ ఒక్క ప్రింట్ మీడియాలోనే ప్రచారానికి 20 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఒక్క పోలింగ్ రోజునే ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. ఈ 20 కోట్ల రూపాయలను సమీకరించడానికి కూడా ఆప్ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఆన్లైన్ విరాళాలు తీసుకోవడంతోపాటు కేజ్రీవాల్ విందు సమావేశాల ద్వారా విరాళాలు వసూలు చేశారు. తనతో విందారగించాలంటే 20 వేల రూయాలు విరాళాలు ఇవ్వాలంటూ ముందుకెళ్లారు. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడం కోసం ఆప్ భారీ బహిరంగ సభలకు, మోటారు వాహనాల ర్యాలీలకు స్వస్తి చెప్పి వీధి సభలను ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పాటు చేసిన 700 జన సభలకు సరాసరిన 10వేల చొప్పున 70 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఆప్‌కు ఢిల్లీలో కార్యకర్తల బలం లేకపోయినా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగితూ ప్రచారం చేశారు. వారితో పాటు కేజ్రీవాల్ కూడా కలియతిరుగుతూ ఎన్నికలన్ని రోజులు ప్రజల మధ్యనే గడిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని ఎలా పరిష్కరిస్తామో సూచిస్తూ మీడియాను కూడా ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో మీడియా కూడా ప్రజాగళంకాక తప్పలేదు. -
'జెడ్ ప్లస్' భద్రతను తిరస్కరించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అదనపు భద్రతను తిరస్కరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతర ఆప్ నాయకులు మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ప్రజల మనిషి అని, ఆయనకు ఎలాంటి భద్రతా అవసరం లేదని చెప్పారు. కేజ్రీవాల్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఆప్ వర్గాలు స్పందించాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 70 సీట్లున్న అసెంబ్లీలో ఆప్ 67 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆప్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన కేజ్రీవాల్ ఈ నెల 14న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. -
ఢిల్లీ అభివృద్ధికి సహకరిస్తాం: వెంకయ్య
న్యూఢిల్లీ : ఢిల్లీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, పార్టీ ఎమ్మెల్యే మనీష్ సిసోడియా బుధవారం ఉదయం వెంకయ్యను కలిశారు. ఈ భేటీ అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అనధికార కాలనీల క్రమబద్దీకరణ, కొత్త కళాశాలలు, స్కూళ్ల స్థలాల అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి రావాలని కేజ్రీవాల్ ఆహ్వానించారని ఆయన తెలిపారు. వెంకయ్యతో భేటీపై సిసోడియా మాట్లాడుతూ ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరామన్నారు. ఢిల్లీలో అనాధికార కాలనీలను క్రమబద్దీకరించడానికి కేంద్రం సహకరించాలని కోరామని సిసోడియా తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి ఢిల్లీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి, గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని సిసోడియా తెలిపారు. -
రేపు మోదీని కలవనున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. గురువారం ఉదయం 10.30లకు ఆయన మోదీని కలవనున్నట్టు ఆప్ తెలిపింది. కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న రాంలీలా మైదానంలో ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్టు ఆప్ పేర్కొంది. కాగా, 2013 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. జనలోక్‌పాల్ బిల్లును బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుకోవడంతో 49 రోజులకే 2014, ఫిబ్రవరి 14న సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన సరిగ్గా సంవత్సరం తరువాత ఈ ఫిబ్రవరి 14న ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడం విశేషం. ఒంటిచేత్తో పార్టీని గెలిపించిన అరవింద్ కేజ్రీవాల్.. న్యూఢిల్లీ నియోజకవర్గంలో సమీప బీజేపీ ప్రత్యర్థి నుపుర్ శర్మపై 31,583 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియాకు డిపాజిట్ కూడా దక్కలేదు. -
మర్యాదపూర్వక భేటీయే...
-
మర్యాదపూర్వక భేటీయే...
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా ఢిల్లీలో అనధికార కాలనీల సమస్యలపై చర్చ జరిపినట్లు సమాచారం. సుమారు 60 లక్షల మంది అనధికారిక నివాసాల్లో ఉంటున్నారని, ఆ ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని వెంకయ్యను కోరినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్‌తో మనీష్ సిసోడియా కూడా వెంకయ్యను కలిసినవారిలో ఉన్నారు. మరోవైపు వెంకయ్యతో కేజ్రీవాల్ మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ఆప్ తెలిపింది. కాగా కేజ్రీవాల్ ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా భేటీ కానున్నారు. -
జంప్ జిలానీలకు షాక్
న్యూఢిల్లీ: వేర్వేరు కారణాలతో పార్టీలు మారిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో అత్యధికం ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్, ఆప్‌ను వదలి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ, అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎంఎస్ ధీర్, జేడీయూ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ తదితరులు ఉన్నారు. తీరథ్ పటేల్ నగర్లో ఆప్ అభ్యర్థి హజారీలాల్ చౌహాన్ చేతిలో 34,638 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బిన్నీని మనీశ్ సిసోడియా(ఆప్) 28,761 ఓట్ల ఆధిక్యంతో, ధీర్‌ను ప్రవీణ్ కుమార్(ఆప్) 20,450 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన ఆల్కా లాంబా, బీఎస్పీ నుంచి ఆప్‌లోకి వచ్చి షాహీరాంలు గెలిచారు. -
బీజేపీ కేవలం 3 స్థానాల్లో విజయం
-
ప్రేమికుల రోజునే ప్రమాణ స్వీకారం
-
ప్రచారార్భాటం.. తప్పుడు వ్యూహాలు
► బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైకి చెప్పుకోకపోయినా.. మోదీ పాలనకు రెఫరెండంగానే భావించింది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా పార్టీలోని హేమాహేమీలనందరినీ ప్రచారంలోకి దింపింది. 300 మంది ఎంపీలనూ భాగస్వాములను చేసింది. ► క్షేత్రస్థాయి సంబంధాలకు, ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉంది. మోదీ హవానే నమ్ముకుంది. ► లోక్‌సభ ఎన్నికల్లో మాదిరే కళ్లు చెదిరే ప్రకటనలు, భారీ సభలు, మీడియా మేనేజ్మెంట్తో విజయం సాధించవచ్చనుకుంది. భారీ ప్రచార ఖర్చు ఓటర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ► స్థానిక నేతలను, ఏళ్లపాటుపార్టీని నమ్ముకున్న నాయకులను కాదని, కనీసం వారిని సంప్రదించకుండానే.. పార్టీతో ఏ మాత్రం సంబంధం లేని బేడీని రంగంలో దింపి వ్యూహాత్మకంగా దిద్దుకోలేని పొరపాటు చేసింది. నాయకత్వ లక్షణాల్లోనూ, వాక్చాతుర్యంలోనూ, రాజకీయ అనుభవంలోనూ బేడీ కేజ్రీకి సరితూగలేకపోయారు. ► అకస్మాత్తుగా బేడీని సీఎం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ శ్రేణులు మనఃస్ఫూర్తిగా ప్రచారంలో పాల్గొనలేదు. ► {పధాని స్థాయిలో ఉన్న మోదీ కేజ్రీవాల్‌ను అరాచకవాది అంటూ తిట్టిపోయడం, హుందాగా వ్యవహరించకపోవడం ఢిల్లీ ఓటర్లకు రుచించలేదు. మోదీ సహా ఆ పార్టీ నేతలంతా కేజ్రీవాల్‌పై విరుచుకుపడటం కేజ్రీవాల్‌కే కలిసొచ్చింది. ► బీజేపీ అనుకూల హిందూత్వ సంస్థలన్నీ ప్రచారంలో పాలు పంచుకోవడం, వారి హిందూత్వ వ్యాఖ్యలు.. అన్ని మతాల ప్రజలు విశేష సంఖ్యలో ఉండే ఢిల్లీలో బీజేపీకి ప్రతికూలంగా మారాయి. ► అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సందర్భంగా మోదీ తన పేరున్న రూ. 10 లక్షల విలువైన సూట్ ధరించడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఉదంతం సోషల్ మీడియాలో విరివిగా ప్రచారమైంది. లోక్‌సభ ఎన్నికల్లో చాయ్ వాలా ఇమేజ్‌తో సామాన్యులను ఆకట్టుకున్న మోదీలో.. అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చిన ఈ మార్పు.. మోదీపై ఓటర్ల దృక్కోణంలోనూ మార్పును తీసుకువచ్చి, బీజేపీని దెబ్బతీసింది. ► అధికారంలోకి రాగానే మంచి రోజులొచ్చాయంటూ ఊదరగొట్టిన బీజేపీ 8 నెలల పాలనలో సామాన్యుడికి నిజంగా ఒరిగిందేమీ లేకపోవడం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా పరిణమించింది. ► తన పర్యటనను ముగించుకొని వెళుతూ ‘భారత్‌లో మతసహనం’ అవసరాన్ని ఒబామా నొక్కిచెప్పడంతో దేశవిదేశాల్లో పెద్ద చర్చే జరిగింది. ఎన్నికలకు ముందు బీజేపీకి ఇది ప్రతికూలమే. -
కొత్త సభకు ఆరుగురు మహిళలు, నలుగురు ముస్లింలు
ఈసారి ఢిల్లీ అసెంబ్లీకి ఆరుగురు మహిళా నేతలు ఎన్నికయ్యారు. అందరూ ఆప్ వారే. అన్ని పార్టీల నుంచి మొత్తం 66 మంది బరిలో దిగగా రాఖీ బిర్లా, బందన, సరితాసింగ్, అల్కా లాంబా, ప్రమీల, భావనా గౌర్ గెలిచారు. 2013 ఎన్నికల్లోనూ ఎన్నికైన ముగ్గురు మహిళలు ఆప్ వాళ్లే. ఎన్నికల ప్రచారంలో మహిళా భద్రతకు పెద్దపీట వేసిన పార్టీలు వారికి తగినన్ని టికెట్లు ఇవ్వడంపై మాత్రం శ్రద్ధ చూపలేదు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి మొత్తం 19 స్థానాల్లోనే మహిళలకు అవకాశమివ్వడం గమనార్హం. ఇక నలుగురు ముస్లిం అభ్యర్థులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరంతా కూడా ఆప్ అభ్యర్థులే. 68 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో నిలవగా అమానతుల్లా ఖాన్, హజీ ఇష్రాఖ్, అసిమ్ అహ్మద్‌ఖాన్, ఇమ్రాన్ హుస్సేన్ గెలుపొందారు. -
లెఫ్ట్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు ఘోర పరాభవం ఎదురైంది. ఏడు వామపక్ష పార్టీలు లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో ఏకమై 15 స్థానాల్లో పోటీకి దిగగా కనీసం ఒక్క స్థానంలోైనె నా డిపాజిట్ దక్కలేదు. ఏ ఒక్క అభ్యర్థికీ కనీసం వెయ్యి ఓట్లు లభించలేదు. ఎస్‌యూసీఐ-సీ తరుపున బాద్లీ నుంచి పోటీ చేసిన రాకేశ్ కుమార్‌కు గరిష్టంగా 947 ఓట్లు పడ్డాయి. నాలుగు చోట్ల మినహా మిగతా స్థానాల్లో లెఫ్ట్ అభ్యర్థులకు కనీసం 500 ఓట్లు కూడా రాలేదు. కాంగ్రెస్, బీజేపీలను అధికారానికి దూరంగా ఉంచాలన్న ఆలోచనతో లెఫ్ట్ పార్టీలు తాము పోటీచేయని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటెయ్యాలని తమ మద్దతు దారుల్ని కోరాయి. -
ఎన్నికల చరిత్రలో అరుదైన విజయాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని ఆప్ సొంత చేసుకుంది. 1993 నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నా ఇప్పటిదాకా ఇలా పూర్తి ఏకపక్షంగా ఓటరు తీర్పు ఇవ్వలేదు. దేశంలో ఒక పార్టీ ఇలా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి కొన్ని విజయాలను చూస్తే... ⇒ 2009లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ మొత్తం 32 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 2004లో 31 స్థానాలను నెగ్గింది. 1994 నుంచి ఇప్పటిదాకా ప్రతీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఆ పార్టీ తరఫున పవన్ చామ్లింగ్ సీఎంగా కొనసాగుతున్నారు. గతేడాది జూన్‌లో జరిగిన ఎన్నికల్లో 22 స్థానాల్లో నెగ్గి వరుసగా ఆరోసారి ఆయన సీఎం పీఠం అధిష్టించారు. ⇒ 2010లో బిహార్ అసెంబ్లీ పోరులో జేడీయూ-బీజేపీ కూటమి 243 స్థానాలకుగాను 206 సీట్లలో గెలిచింది. ⇒ 1991లో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే-కాంగ్రెస్ కూటమి 234 సీట్లకుగాను 225 సీట్లలో నెగ్గింది. జయలలిత తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో కరుణానిధికి చెందిన డీఎంకే కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. ⇒ 1996లో తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 234 స్థానాలకుగాను 221 సీట్లలో విజయ ఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత కూడా ఓడిపోయారు. ⇒ 1989లో సిక్కింలో సిక్కిం సంగ్రామ్ పార్టీ మొత్తం 32 స్థానాల్లో నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ పార్టీని 1984లో నర్ బహదూర్ భండారీ స్థాపించారు. -
జనలోక్‌పాల్ పోరాటం మర వొద్దు: హజారే
రాలెగావ్‌సిద్ధి: కేజ్రీవాల్‌ను అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే అభినందించారు. ‘మోదీ ప్రభుత్వం ఎనిమిది నెలల కిందట కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక వేత్తలకు మాత్రమే మంచిరోజులు వచ్చాయి. అందుకే ఎన్నికల ఫలితాలు ఆప్‌కు అనుకూలంగా వచ్చాయి’ అని రాలెగావ్‌సిద్ధిలో విలేకర్లతో అన్నారు. జనలోక్‌పాల్ బిల్లు కోసం ఇదివరకు చేసిన పోరాటాన్ని మరవకూడదని ఆయన ఒకప్పటిన తన సహచరుడైన ఆప్ అధినేతకు సూచించారు. -
కేజ్రీవాల్‌కు మోదీ అభినందనలు
ఢిల్లీ అభివృద్ధికి సహకరిస్తామని హామీ చాయ్ పే చర్చకు ఆహ్వానం న్యూఢిల్లీ: హస్తినలో విజయ దుందుభి మోగించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన సాయమంతా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన కేజ్రీవాల్‌కు ట్వీట్ చేశారు. ఆప్ నేతను ‘చాయ్ పే చర్చ’కు కూడా ఆహ్వానించారు. తనను అభినందించినందుకు ప్రధానికి కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుంచి సాయం కావాలని మోదీని కోరారు. త్వరలోనే ప్రధానిని కలుసుకుని, ఢిల్లీకి సంబంధించిన అంశాలపై చర్చిస్తానని వెల్లడించారు. సోనియా, రాహుల్ అభినందనలు కేజ్రీవాల్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా అభినందించారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌ను ఎన్నుకున్నారని, వారి తీర్పును గౌరవిస్తామని రాహుల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఒడిశా సీఎం, బేజేడీ నేత నవీన్ పట్నాయక్ తదితరులు కూడా కేజ్రీవాల్‌ను అభినందించారు. -
మోదీపై విమర్శల వర్షం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ మిత్రపక్షాలతోపాటు, ప్రత్యర్థి పార్టీలు కూడా ప్రధాని మోదీపై నిప్పులు చెరిగాయి. ఇది ప్రధానికి ఓటమి అని, కమలనాథులు ఆత్మవిమర్శ చేసుకోవాలని శివసేన ధ్వజమెత్తగా, అహంకారం ఓడిపోయిందని, దేశానికి మార్పు అవసరమని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికల ఫలితాలపై ఎవరేమన్నారంటే.. ‘‘బీజేపీ ఓటమి ప్రధాని మోదీ ఓటమి. దేశమంతా మోదీ గాలి వీస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ గాలికంటే ఢిల్లీలోని సునామీ శక్తిమంతమని అక్కడి ప్రజలు నిరూపించారు’’ - శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ‘‘ఈ రోజు అహంకారం, రాజకీయ ప్రతీకారం ఓడిపోయాయి. బీజేపీ బెలూన్ పగిలిపోయింది’’ ‘‘మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ చీఫ్) ‘‘లవ్ జీహాద్, ఘర్ వాపసీవంటి వాటివల్లే హస్తినలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది’’ - అఖిలేశ్ యాదవ్(యూపీ సీఎం, ఎస్పీ నేత) ‘‘ఫలితాలు మోదీ పనితీరుకు కొలమానం. దేశంలోని అన్ని ప్రాంతాల వారూ నివసించే ఢిల్లీలో బీజేపీ ఓటమి.. దేశ మనోగతానికి ప్రతిబింబం’’ - నితీశ్ కుమార్(జేడీయూ నేత) ‘‘ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఫలితాలు దానికి నిదర్శం’ - రాందాస్ (పీఎంకే-బీజేపీ మిత్రపక్షం) ‘‘ఆప్‌ది చరిత్రాత్మక విజయం’ - యోగా గురువు బాబా రామ్‌దేవ్ ‘‘ఆప్ గెలుపుకాదు బీజేపీవ్యతిరేకవాదుల గెలుపు’ - ఎంజీ వైద్య(ఆరెస్సెస్ నేత) ‘‘బీజేపీ, మోదీలు అజేయులు కారని తేలింది’ -ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్ నేత) ‘‘ప్రజలే గొప్పవాళ్లని తేలింది. అయితే కశ్మీర్లో బీజేపీతో కలసి మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యత్నానికి దీనికి సంబంధం లేదు’’ - నయీమ్ అక్తర్ (పీడీపీ ప్రతినిధి) ఢిల్లీ ఓటమిపై మంత్రులతో మోదీ సమీక్ష ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడడంతోమోదీ మంగళవారం పార్టీకి చెందిన సీనియర్ మంత్రులతో సమావేశమై సమీక్షించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే.. జెట్లీ, రాజ్‌నాథ్, వెంకయ్య తదితరులతో గంటన్నర భేటీ అయ్యారు. వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. అర్థం చేసుకోలేకపోయాం ఢిల్లీ ప్రజల మనసును మేం అర్థం చేసుకోలేకపోయాం. ఏదేమైనా వారి తీర్పును ఆమోదిస్తున్నాం. గతంతో మాదిరే ఇకపైనా వారికి సేవ చేస్తాం. - బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ కేంద్రం పనితీరుకు కొలమానం కాదు ఫలితాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుకు కొలమానం కాదు. ప్రజలు స్థానిక అంశాల ఆధారంగా ఓటేశారు. వరుసగా 8 ఎన్నికలు ఎదుర్కొన్నాం. ఏడిటింటిలో గెలిచి, ఇప్పుడు తొలిసారి ఓడాం. బీజేపీ తన తప్పులు సరిదిద్దుకుంటుంది. - కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు -
ప్రశ్నార్థకంగా మారిన బేడీ భవితవ్యం
న్యూఢిల్లీ: ‘ఇది నా ఓటమి కాదు. ఇది బీజేపీ ఓటమి’ ఢిల్లీ ఎన్నికల్లో ఎదురైన అవమానకర ఓటమిపై బీజేపీ నాయకురాలు కిరణ్‌బేడీ స్పందన ఇది. మాజీ పోలీస్ అధికారి అయిన కిరణ్ బేడీ వీలుకుదిరినప్పుడల్లా రాజకీయ నాయకులపై విరుచుకుపడుతుండేవారు. అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులను వేదిక కూడా ఎక్కనివ్వని ఆమె, అనుకోనిరీతిలో బీజేపీలో చేరడం, ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎన్నికవడం, ఎన్నికల్లో ప్రజల వ్యతిరేకతతో ఘోర ఓటమిని మూటగట్టుకోవడం అంతా రెండు వారాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఈ ఎన్నికల్లో చవిచూసిన ఓటమితో అప్పుడే ఆమె భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కిరణ్‌బేడీ పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో అనేక క్లిష్ట పరిస్థితులను చాకచక్యంతో ఎదుర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున రాజకీయ నాయకురాలిగా అరంగేట్రం చేశారు. ఈ ఎన్నికలే ఆమె జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న అతి క్లిష్టమైన పరీక్ష. ‘టఫ్ టాస్క్ మాస్టర్’గా పేరుగాంచిన బేడీని ముందుపెట్టి ఢిల్లీ పీఠం ఎక్కాలని బీజేపీ భావించింది. దీంతో 1993 తర్వాత అత్యంత హోరాహోరీగా సాగిన ఎన్నికలుగా ఇవి మారిపోయాయి. కానీ ఫలితాలకు వచ్చేసరికి బేడీ నేతృత్వంలోని బీజేపీ కేవలం మూడు నియోజకవర్గాలకే పరిమితమైపోయింది. సాక్షాత్తూ బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన బేడీ... కృష్ణానగర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి ఎస్.కె.బగ్గా చేతిలో ఓటమి పాలయ్యారు. 1993 నుంచి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేంద్రమంత్రి హర్షవర్ధ(బీజేపీ) గెలుపొందుతూ వస్తున్నారు. అలాంటి నియోజకవర్గం నుంచి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు. బేడీపై గెలుపొందిన ఎస్.కె.బగ్గాకి మితభాషి, మంచి వ్యక్తిగా ప్రజల్లో పేరుంది. బగ్గా స్థానిక వ్యక్తి కాగా బేడీ బయటి నుంచి వచ్చి పోటీ చేశారు. ఆమె ఓటమికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అంతే కాకుండా బేడీ పాల్గొన్న సభలకు ప్రజాదరణ కూడా అంతంత మాత్రమే లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలు కూడా పేలవంగా మారాయి. ఢిల్లీ ఐరన్ లేడీగా ముద్ర ఉన్న బేడీ... 1982లో కన్నాట్ సర్కస్ వద్ద పార్కు చేసి ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కారును నెట్టుకుపోవడం వంటి ఘటనలు గురించిన వార్తలు ఈ ఎన్నికల సమయంలో హల్చల్ చేశాయి. దీంతో ‘ఒక డీసీపీ ఎప్పుడూ అలాంటి పనులు చేయరని’ ఆ ఘటనపై ఆమె వివరణ ఇచ్చుకున్నా నష్టం మాత్రం జరిగిపోయింది. -
రికార్డులు బద్దలు
ఎక్కువైనా.. తక్కువైనా ఆప్‌దే రికార్డు.. న్యూఢిల్లీ: కేజ్రీవాల్ సునామీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీల రికార్డులు బద్దలైపోయాయి. పశ్చిమ ఢిల్లీ లోని వికాస్పురి స్థానంలో ఆప్ అభ్యర్థి మహీందర్ యాదవ్ బీజేపీ అభ్యర్థి సంజయ్‌సింగ్‌పై ఏకంగా 77, 665ఓట్ల మెజారిటీతో గెలిచారు. బురారీ స్థానంలో ఆప్ అభ్యర్థి సంజీవ్ ఝా బీజేపీకి చెందిన గోపాల్ ఝాపై 67,950 ఓట్ల మెజార్టీతో రెండో అతి పెద్ద విజయాన్ని నమోదు చేశారు. ఓఖ్లాలో అమానతుల్లాఖాన్ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బ్రహమ్సింగ్పై 64, 532 ఓట్ల తేడాతో గెలిచారు. సుల్తాన్పూర్ మజ్రాలో ఆప్ అభ్యర్థి సందీప్‌కుమార్‌కు బీజేపీ అభ్యర్థి ప్రభు దయాళ్‌పై 64,439 ఓట్ల మెజారిటీ వచ్చింది. డియోలీలో ఆప్ విజేత ప్రకాశ్ బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్‌పై 63, 937 ఓట్ల మెజారిటీని సాధించారు. బావనాలో ఆప్ అభ్యర్థి వేద్ ప్రకాశ్ బీజేపీ అభ్యర్థి గుజన్సింగ్ను 50, 023 ఓట్ల తేడాతో ఓడించారు. ద్వారక నుంచి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు ఆదర్శ్ శర్మ కమలనాథుల అభ్యర్థి ప్రద్యుమ్న రాజ్‌పుత్‌పై 39,366 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్, బీజేపీ ప్రత్యర్థి నుపుర్‌శర్మను 31,583 ఓట్ల తేడాతో ఓడించారు. 20 వేలు.. అంతకంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆప్ అభ్యర్థులు మొత్తం 45 మంది ఉండటం విశేషం. కేవలం 22మంది మాత్రమే 20వేలకంటే తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. అతితక్కువ మెజారిటీ సాధించిన రికార్డును కూడా ఆపేసొంతం చేసుకుంది. నజఫ్‌గఢ్ ఆ పార్టీ అభ్యర్థి కైలాష్ గెహ్లాట్ ఐఎన్ఎల్డీ అభ్యర్థిపై కేవలం 1,555 ఓట్ల తేడాతో గెలిచారు. కృష్ణానగర్‌లో బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేడీపై ఎస్కే బగ్గా సాధించిన మెజారికీ 2277 ఓట్లు మాత్రమే. షకుర్బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్‌కు లభించిన ఆధిక్యం 3133 ఓట్లు. అంచనాలను మించిన విజయం న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేలిచెప్పాయి కానీ... ఈ స్థాయి గెలుపును ఎవరూ ఊహించలేదు. సాధారణ మెజారిటీని దాటుతుందని సగటున ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే ఆప్ సునామీనే సృష్టించింది. ఇండియా న్యూస్- యాక్సిస్ పోల్ అందరికంటే ఎక్కువగా ఆప్‌కు 53 సీట్లు వస్తాయని చెప్పింది. న్యూస్ 24 టుడే- చాణక్య పోల్ 48 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ మంగళవారం ఆప్ గ్రాఫ్ అమాంతం ఎగబాకి 67ను తాకింది. -
కేజ్రీవాల్‌కే పూర్తి మార్కులు: బేడీ
న్యూఢిల్లీ: ‘కేజ్రీవాల్‌కు పూర్తి మార్కులు. ఆయనకు నా అభినందనలు. కేజ్రీవాల్ ఆయన పార్టీ ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమల్లోకి తెస్తారని ఆశిస్తున్నా..’ అని బేడీ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు ‘ధర్నా’లతో ఎలాంటి లాభం ఉండదు. ఘర్షణాత్మక వైఖరిని విడనాడాలి. బలమైన సహకార ధోరణిని అవలంబించాలి..’’ అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినందుకు బేడీ విచారం తెలిపారు. ‘మీ అంచనాలకు అందుకోలేకపోయినందుకు మన్నించా’లని కార్యకర్తలను కోరారు. అయితే ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యత స్వీకరించడానికి నిరాకరించారు. ఎన్నికల్లో తాను ఓడిపోలేదని పార్టీ ఓడియిందని.. ఓటమిపై పార్టీలో అంతర్మథనం జరపాలని ఆమె వ్యాఖ్యానించారు. -
జడ్ ప్లస్ కేటగిరి భద్రత
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసులు మంగళవారం జడ్ ప్లస్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేశారు. సాయుధులైన 36 మంది కమాండోలను ఆయన రక్షణ కోసం కేటాయించనున్నారు. ఆయన ఇంటి వద్ద మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు సాయుధులైన గార్డులను నియమిస్తారు. ఒక పైలట్ వాహనంతో పాటు రెండు ఎస్కార్ట్ వాహనాలను ఆయన వాహన శ్రేణికి జత చేస్తారు. ఇంతకుముందు సీఎంగా చేసినప్పుడు కేజ్రీవాల్ భద్రతను నిరాకరించడం తెలిసిందే. అయినప్పటికీ ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు సుమోటోగా ఆయనకు భద్రతా ఏర్పాట్లు చేశారు. -
ఒక్కోటి రూ.200!
ఆప్ సునామీతో మంగళవారం ఢిల్లీలో ‘చీపురు కట్ట’ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పార్టీ గుర్తు అయిన ‘జాడూ’ చేతిలో పట్టుకొని సంబరాల్లో పాల్గొందామని ఆప్ శ్రేణులు వాటిని కొనడానికి ఎగబడ్డారు. దుకాణదారులు ఈ గిరాకీని ఊహించి తగినన్ని చీపురుకట్టలు స్టాక్ పెట్టినా... అన్నీ అయిపోయాయి. సాధారణంగా రూ.30 నుంచి రూ.50 పలికే చీపురు కట్ట ఏకంగా రూ. 200 పలికిందట. ఇంత ధర పెట్టడానికి సిద్ధమైనా దొరకకపోవడంతో కొన్నిచోట్ల ఆప్ అభిమానులు ఉసూరుమన్నారు. -
‘ఆప్’ కే దిల్ మే!
నిరాడంబరంగా, హుందాగా సాగిన ఆప్ ప్రచారం విమర్శలకు దూరం; రెచ్చగొట్టినా సంయమనం ఏం చేస్తామో చెప్పేందుకే ప్రాధాన్యం పక్కాగా ప్రచారం; ప్రతీ ఓటరుకూ చేరిన సందేశం ఆప్ ఘన విజయం వెనక కారణాలివే! నేషనల్ డెస్క్: ఢిల్లీ ఫలితాలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించడం ఒక ఆశ్చర్యమైతే.. కనీసం 30 అయినా వస్తాయనుకున్న బీజేపీకి ముచ్చటగా మూడంటే మూడే సీట్లు రావడం మరో ఆశ్చర్యం. అయితే, ఈ ఫలితాల వెనక ఒకవైపు ఆప్ పకడ్బందీ వ్యూహం, నిరాడంబర ప్రచార తీరు, నిజాయితీతో కూడిన హామీలు ఉండగా.. మరోవైపు, బీజేపీ ప్రచారార్భాటం, కేజ్రీవాల్‌పై మోదీ వ్యక్తిగత విమర్శలు, సీఎం అభ్యర్థిగా బేడీ ఎంపిక మొదలైనవి ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని(7) స్థానాలు గెలుచుకున్న బీజేపీ కేవలం 8 నెలలు తిరగకుండానే ఇంత దారుణంగా పరాజయం పాలవ్వడానికి.. ఆర్థికంగానూ, హంగూఆర్భాటాల్లోనూ బీజేపీకి ఏమాత్రం సరితూగని ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య, అద్భుత విజయం సాధించడానికి ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీలు అనుసరించిన ప్రచార తీరు, అది చూపిన ప్రభావం ప్రధాన కారణం. దానిపై విశ్లేషణ.. నిజాయితీ.. నిరాడంబరత ‘పాంచ్ సాల్.. కేజ్రీ వాల్’ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన నినాదాల్లో ఒకటి. ఐదేళ్ల పాటు కేజ్రీవాల్‌కు అధికారమివ్వాలని అభ్యర్థిస్తూ ఆప్ సాగించిన ఆ ప్రచారం సరైన దిశగానే సాగినట్లు ఈ ఫలితాలతో తేలింది. ► ఆమ్ ఆద్మీ పార్టీ మొదట్నుంచీ సామాన్యుడిని ప్రతీకగా చేసుకుంది. నీతి, నిజాయితీలను ఆలంబనగా చేసుకుంది. హంగూ ఆర్భాటాలకు, ఆడంబరాలకు దూరంగా ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ అదే మార్గంలో వెళ్లింది. ► క్షేత్రస్థాయి ప్రచారం పైననే ఎక్కువ దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రకటన వెలువడటానికన్నా ముందు నుంచే ప్రజలకు దగ్గరగా ఉంది. బూత్ స్థాయిలో ఇన్‌చార్జ్‌లను నియమించింది. ► భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలపై కన్నా.. చిన్నతరహా జన సభలపై ఎక్కువ దృష్టి పెట్టింది. కాలనీలు, బస్తీల్లో జన సభలు నిర్వహించి, స్థానిక ప్రజలతో వ్యక్తిగత సాన్నిహిత్యం పెంచుకుంది. అలాంటివి వందకు పైగా నిర్వహించింది. దాదాపు అన్నింటిలో కేజ్రీవాల్ పాల్గొనేలా ప్రణాళికలు రచించింది. ► పేద, మధ్యతరగతి, యువతరం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ.. వారికి దగ్గరయింది. బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రత్యామ్నాయంగా, సరికొత్త రాజకీయ శక్తిగా వారికి విశ్వాసం కలిగించింది. ► స్వచ్ఛంద కార్యకర్తల(వాలంటీర్లు) సంఖ్యను భారీగా పెంచుకుంది. 2013 ఎన్నికల నాటికి దాదాపు 25 వేలున్న ఆప్ వాలంటీర్లు ఈ ఎన్నికల నాటికి రెట్టింపయ్యారు. వారి సేవలను ఈ ఎన్నికల్లో విరివిగా ఉపయోగించుకుంది. ఢిల్లీ వెలుపలినుంచి కూడా వాలంటీర్లు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. ► భారీ ప్రకటనలు, హోర్డింగ్‌లతో కూడిన ప్రచారం కన్నా.. వార్తాచానళ్లలో చర్చలు, రేడియోల్లో చిన్నచిన్న ఆకర్షణీయ ప్రకటనలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ► ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకుంది. అందుకు 24 గంటల పాటు పనిచేసే నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ► కేజ్రీవాల్ సహా కీలక నేతలకున్న ఆంగ్లంపై పట్టు, వారి వివరణాత్మక సంవాద తీరు.. ప్రత్యర్థులను తిట్టిపోయడం కాకుండా, సంయమనంతో వ్యవహరించిన విధానం.. తామేం చేయాలనుకుంటున్నామో, ఏం చేయగలమో చర్చల సందర్భంగా, ప్రచార ప్రసంగాల్లో స్పష్టంగా వివరించడం.. ఇవన్నీ చదువుకున్న పట్టణ ప్రజలను, యువతను బాగా ఆకర్షించింది. ► ఆర్థికంగా అంత పట్టులేని ఆప్.. తమకందిన నిధుల వినియోగంలో మంచి చాతుర్యాన్ని చూపింది. భారీగా ఖర్చయ్యే బహిరంగ సభలు, భారీ ప్రకటనలు, హోర్డింగ్‌లకు దూరంగా ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువమంది ప్రజలకు దగ్గరయ్యే మార్గాలను ఎంచుకుంది. పై పాయింట్లలో పేర్కొన్న పద్ధతులన్నీ దాదాపు తక్కువ ఖర్చయ్యేవే. ► కార్పొరేట్ల నుంచి నిధులు అంతగా రాకపోవడంతో.. కమ్యూనిటీ ఫండింగ్పై దృష్టి పెట్టింది. కేజ్రీవాల్‌తో విందుకు హాజరవాలని అనుకుంటున్నవారినుంచి రుసుమును వసూలు చేసి వినూత్నంగా నిధుల సేకరణ జరిపింది. ► {పచారంలో ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలకు దూరంగా ఉంది. ఏ సందర్భంలోనూ కఠిన పదజాలాన్ని ఉపయోగించలేదు. దుందుడుకుతనం చూపలేదు. ప్రత్యర్థుల తిట్లనూ పట్టించుకోలేదు. ఇది హుందాతనాన్ని కోరుకునే పట్టణ ఓటర్లను గణనీయంగా ఆకర్షించింది. ► గతంలో అధికారం అప్పగించినప్పటికీ.. 49 రోజులకే రాజీనామా చేయడంపై ప్రజల్లో ఆగ్రహం ఉందన్న విషయాన్ని గుర్తించిన ఆప్.. ఆ దిశగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రాజీనామా చేయడం పొరపాటేనంటూ కేజ్రీవాల్ పదేపదే చెప్పడంతో ఆయన నిజాయితీపరుడని ప్రజలు భావించారు. దాదాపు తాను పాల్గొన్న ప్రతీ సభలోనూ కేజ్రీవాల్ తన పొరపాటును ఒప్పుకోవడం విశేషం. ► సీఎంగా ఉన్న 49 రోజుల్లో కేజ్రీవాల్ చేసిన మంచి పనులు ప్రజలు గుర్తుంచుకున్నారు. ఉచిత తాగునీరు, విద్యుత్ చార్జీల తగ్గింపు, అవినీతి నిరోధానికి చర్యలు.. మొదలైనవి కేజ్రీవాల్‌కు ప్రజలను దగ్గర చేశాయి. ► ఆప్ ఈ ఎన్నికలకు పెట్టిన మొత్తం ఖర్చు దాదాపు రూ. 20 కోట్లు కాగా.. బీజేపీ కేవలం పత్రికల్లో ప్రకటనలకే అంత మొత్తాన్ని వెచ్చించింది. -
పడి లేచిన కెరటం
పేరు : అరవింద్ కేజ్రీవాల్ జననం: 1968, ఆగస్టు 16 తల్లిదండ్రులు: గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతాదేవీ స్వస్థలం: హర్యానాలోని ిసివానీ కుటుంబం: భార్య సునీతా (ఈమె కూడా ఐఆర్ఎస్ అధికారి), ఇద్దరు పిల్లలు (కూతురు హర్షిత, కుమారుడు పుల్కిత్) విద్యాభ్యాసం: ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి తొలి ఉద్యోగం: 1989నుంచి మూడేళ్లు టాటా స్టీల్స్‌లో ఉద్యోగం. సివిల్స్ వైపు: అఖిల భారత సర్వీసులకు పోటీ పడేందుకు 1992లో ఉద్యోగానికి రాజీనామా. పరీక్షల తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపిక. సామాజిక కార్యక్రమాలు: ఉద్యోగం చేస్తూనే సామాజిక కార్యకర్తగా గుర్తింపు. ఆర్టీఐ చట్టం కోసం అలుపెరగని పోరు. పురస్కారాలు: ఆర్టీఐ చట్టం కోసం చేసిన కృషికిగాను 2006లో రామన్మెగాసెసే అవార్డు పూర్తిస్థాయి కార్యకర్తగా: పూర్తి స్థాయిలో సామాజిక సేవ కోసం 2006 ఫిబ్రవరిలో ఐటి విభాగంలో జేసీ ఉద్యోగానికి రాజీనామా. ‘పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్’ పేరుతో ఎన్జీవో ఏర్పాటు. ఆహారపు అలవాట్లు: శాకాహారం మాత్రమే. ‘ధర్నేబాజ్’ అని విమర్శించారు.. ‘అరాచకవాది’ అని ముద్రలేశారు.. పబ్లిక్స్టంట్లు అంటూ ఎద్దేవా చేశారు..! వీటన్నింటినీ చీపురుకట్టతో తుడిచి పారేసి ఆ సామాన్యుడు అసామాన్యమైన విజయాన్ని లిఖించాడు!! అప్రతిహతంగా సాగిపోతున్న బీజేపీ విజయయాత్రకు బ్రేకులు వేశాడు. ప్రజల మనసును గెల్చుకొని మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించబోతున్నాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమం పునాదులపై ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్.. ఆది నుంచీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంతే స్థాయిలో వివాదాలూ ఆయన్ను చుట్టుముట్టాయి. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆప్.. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టి సంచలనం సృష్టించింది. 28 స్థానాలు నెగ్గి మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయినా.. కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ గద్దెనెక్కారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి కుటుంబానికి 667 లీటర్ల వరకూ ఉచితంగా నీరందించారు. అవినీతిపై హెల్ప్‌లైన్, కామన్వెల్త్ క్రీడల స్కాంలో మాజీ సీఎం షీలా దీక్షిత్‌పై ఎఫ్ఐఆర్, చమురు ధరల పెంపు విషయంలో రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సహా నాటి కేంద్రమంత్రి వీరప్ప మొయిలీపై కేసు పెట్టడం దాకా.. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ సంచలనాలే! నేరస్తులపై చర్యలు తీసుకోలేని ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా పార్లమెంట్‌కు సమీపంలోనే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ధర్నాలు చేయడం ఏంటంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఇలా కొద్ది రోజులే పదవి ఉన్నా రోజుకో సంచలనాన్ని నమోదు చేశారు కేజ్రీవాల్! అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లుపై వివాదం నేపథ్యంలో 2014, ఫిబ్రవరి 15న సీఎం పదవికి రాజీనామా చేశారు. పదవి చేపట్టిన 49 రోజులకే రాజీనామా చేయడంపైనా విపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. అనంతరం కేజ్రీవాల్.. సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించి పార్టీని మిగతా రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీతో తలపడి ఓడిపోయారు. అటు ఢిల్లీలోనూ ఆప్ ప్రభావం చూపించకపోవడంతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. బీజేపీ విజయయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికలు రావడంతో ఈసారీ కమలానిదే విజయమని అంతా భావించారు. అయితే కేజ్రీవాల్ ఎక్కడా స్థైర్యాన్ని కోల్పోలేదు. ప్రతిపక్షాల విమర్శలను లెక్కజేయకుండా ముందుకు ఉరికారు. పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. తాను సీఎం పదవి నుంచి తప్పుకోవడం తప్పేనని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఈసారి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ ఆయన చేసిన అభ్యర్థన ప్రజల హృదయాలను తాకింది. అందుకే సరిగ్గా సంవత్సరం కిందట ఏ పీఠాన్ని అయితే వదులుకున్నారో.. అదే పీఠాన్ని ఏడాది తిరిగే లోపే జనం ఆయనకు బహుమానంగా అందజేశారు! కేజ్రీవాల్ స్వగ్రామంలో సంబరాలు భివానీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజయం సాధించడంతో హరియాణాలోని భివానీ ప్రాంతంలో గల కేజ్రీవాల్ స్వగ్రామం సివానీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. బాణసంచా పేల్చడంతో పాటు స్వీట్లు పంచుకున్నారు. అక్కడే ఉండే కేజ్రీవాల్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆప్ విజయం మా అందరికి ఆనందాన్ని కలిగించింది. మా కుటుంబ సభ్యులందరం వేడుకలు జరుపుకున్నాం. ఇది ప్రజా విజయం’ అని కేజ్రీవాల్ సోదరుడు సుమన్ వ్యాఖ్యానించారు. -
2013 కన్నా ఆప్ ఓట్లు రెట్టింపు
2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓట్ల శాతం రెట్టింపవగా.. బీజేపీ ఓట్ల శాతం కేవలం ఒక్క శాతమే తగ్గటం విశేషం. నాటి ఎన్నికల్లో ఆప్‌కు 29.5 శాతం ఓట్లు పోలవగా.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏకంగా 54.3 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి నాడు 32.2 శాతం ఓట్లు లభించగా.. ఇప్పుడు అది 31 శాతానికి తగ్గింది. అయితే.. 2013లో 24.55 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి కేవలం 9.7 శాతం ఓట్లకు పడిపోయింది. ప్రధానంగా నాటి కాంగ్రెస్ ఓట్లే ఇప్పుడు ఆప్‌కు మళ్లాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. -
మధ్యతరగతిలో మసకబారిన మోదీ ప్రతిష్ట...
మోదీకి అనుకూలంగా వస్తున్న ప్రచారం పక్కకు జరిగిపోయింది. అంతా బాగుందనే భావన తొలగిపోవటం మొదలైం ది. సంఘ్ దుందుడుకు వ్యక్తులను మందలించటానికి మోదీ నిరాకరించటం.. ఆయనను నిర్ణయాత్మకమైన నేతగా చూసిన మధ్య తరగతి మద్దతుదారుల్లో ఆయన ప్రతిష్టను మసకబార్చింది. చరిత్ర పుస్తకాలను తిరగరాయటం, సంస్కృత భాషను ప్రవేశపెట్టటం, పురాతన కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీని కనుగొనటం వంటి అంశాల వెనుక ఉన్న అనివార్యతలేమిటో అంతుచిక్కనివి. మోదీ మౌనాన్ని.. గత 30 ఏళ్లలో ఏ ప్రధానికీ లేనంతటి సంపూర్ణ అధికారంతో వచ్చిన అహంకారంతో కూడిన ఉదాసీనతగా భావించారు. క్రిస్మస్ రోజును సుపరిపాలన దినంగా ప్రకటించటాన్ని నిరంకుశత్వ దెబ్బగా భావించారు. ఈ పరిస్థితుల్లో.. బీజేపీకి అపరిమిత అధికారం కట్టబెట్టటంలో ఉన్న ప్రమాదాల గురించి మధ్య, ఉన్నత తరగతి సమావేశాల్లో చర్చించుకోవటం వినిపించింది. ఈ భయాలకు.. విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధన చేసినట్లు మంత్రులకు, ఎంపీలకు మోదీ బోధనలు చేయటం, అధికారులతో వ్యవహరిస్తున్న తీరుపై కథనాలు ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలోనే.. బీజేపీలోకి కిరణ్‌బేడీని బరిలోకి దింపాలన్న వారి నిర్ణయాన్ని.. అతివిశ్వాసంతో తీసుకున్న నిర్ణయంగా పరిగణించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనలో సైతం మోదీ వ్యవహరించిన తీరు.. ఆయన్ను ఇంటి పేరుతో పిలవటం, తన పేరును అల్లిన ఖరీదైన దుస్తులు ధరించటం.. మోదీ ‘మహత్వోన్మాదం’ వ్యక్తీకరణగా భావించారు. -
కాంగ్రెస్ -0
ఆప్ దెబ్బకు హస్తం ఔట్ న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆప్ దెబ్బకు కాంగ్రెస్ కకావికలమైంది! సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసి, పార్లమెంట్లో కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని కాంగ్రెస్‌కు ఢిల్లీ ఎన్నికలు చుక్కలు చూపాయి. ఢిల్లీ ఎన్నికల చరిత్రలో కనీవినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేకపోవడం ఢిల్లీలో ఆ పార్టీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్... 63 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. సీఎం పీఠంపై ఆశలు పెట్టుకోకపోయినా కొద్ది స్థానాలైనా వస్తాయని ఆ పార్టీ భావించింది. అందుకు తన వంతుగా గట్టి ప్రయత్నమే చేసింది. ఎన్నికల బరిలో కొత్త ముఖాలను దింపింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ర్యాలీలు నిర్వహించి శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అధికారికంగా ప్రకటించకపోయినా ప్రచార కమిటీ చీఫ్ అజయ్ మాకెన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల ముందుకు పంపింది. సదర్‌బజార్ నుంచి పోటీ చేసిన మాకెన్ కూడా డిపాజిట్ కోల్పోయి మూడో స్థానానికి పరిమితం కావడం పార్టీకి మింగుడుపడడం లేదు. కేజ్రీవాల్‌పై పోటీకి దిగిన పార్టీ సీనియర్ నేత కిరణ్ వాలియా కూడా దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఇక గ్రేటర్ కైలాశ్ నుంచి బరిలోకి దిగిన రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ డిపాజిట్ కోల్పోయి 6,102 ఓట్లతో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా పరిగణించే మైనారిటీలు కూడా ఈసారి చేయిచ్చారు. వారంతా ఆప్ వైపే మళ్లారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు నెగ్గితే అందులో ఐదు స్థానాలు మైనారిటీల సంఖ్య ఎక్కువున్నవే. మాకెన్ రాజీనామా ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ ఎన్నికల ఇన్చార్జి అజయ్ మాకెన్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పీసీ చాకో, రాష్ట్ర పీసీసీ అధినేత అరవిందర్ సింగ్ లవ్లీ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి మంచి రోజు లు రావాలంటే భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పార్టీ నేత రాజీవ్ శుక్లా అన్నారు. కాగా, కాంగ్రెస్ పరాజయం నేపథ్యంలో... ప్రియాంక గాంధీ రాజకీయాలలోకి రావాలన్న డిమాండ్ మళ్లీ మొదలైంది. మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు ప్రియాంకకు మద్దతుగా పార్టీ కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. -
భార్య మద్దతు వల్లే ఈ విజయం
కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ‘‘నా భార్య నాతో వెన్నంటి ఉండి మద్దతు తెలపడం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఎన్నికల సమయంలో అమె ప్రజల ముందుకు ఎప్పుడూ రాలేదు. కానీ అన్ని వేళలా నాకు మద్దతుగా నిలిచారు’’ అని తన భార్య సునీతను ఉద్దేశించి కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడే ఉన్న సునీతను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. -
సభలు 4.. సీట్లు 3
మోదీ హైస్పీడ్‌కు బ్రేక్ ఢిల్లీ కమలానికి మిగిలింది మూడే సీట్లు న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ మోదీ ప్రచారం చేసిన సభల సంఖ్య మేరకైనా బీజేపీకి సీట్లు దక్కలేదు. సుడిగాలిలాగా నాలుగు ర్యాలీలలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధానంగా ఆమ్‌ఆద్మీపార్టీని లక్ష్యం చేసుకున్నారు. 16 సంవత్సరాల తరువాత రాజధాని అభివృద్ధి పథంలో నడిచే సమయం వచ్చిందన్నారు. కానీ ఈ మాటలేవీ ఓటర్ల చెవికెక్కలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ తో సహా మహామహులందరినీ చీపురుతో ఊడ్చేశారు. చావుతప్పి కన్నులొట్టపోయినట్లు మూడే మూడు సీట్లు దక్కించుకుని టీమ్ మోదీ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. రోహిణి నియోజక వర్గం నుంచి విజేందర్ గుప్తా, విశ్వాస్ నగర్ నుంచి ఓం ప్రకాశ్ శర్మ, ముస్తఫాబాద్ నుంచి జగ్దీశ్ ప్రధాన్‌లు మాత్రమే గెలుపు సర్టిఫికేట్లు అందుకున్నారు. రోహిణి నియోజకవర్గంలో విజేందర్ గుప్తా ఆప్ అభ్యర్థి సీఎల్ గుప్తాపై 5,367 ఓట్ల తేడాతో గెలిచారు. ముస్తఫాబాద్‌లో జగదీశ్ ప్రధాన్ కాంగ్రెస్ అభ్యర్థి హసన్ అహ్మద్‌పై 6,031 ఓట్ల మెజారిటీతో విజయం పొందారు. ఇక్కడ ఆప్ మూడో స్థానంలో నిలిచింది. ఇక విశ్వాస్‌నగర్ నుంచి ఓం ప్రకాశ్ శర్మ ఆప్ అభ్యర్థి అతుల్ గుప్తాపై దాదాపు 10వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దింపిన కిరణ్‌బేడీ, ఇరవైఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న కృష్ణానగర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి ఎస్కే బగ్గాపై బేడీ 2,277 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలకు ముందు బీజేపీలోకి దూకిన కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణ తీరథ్ పటేల్ నగర్లో, జనక్‌పురిలో బీజేపీ సీనియర్ నేత జగదీశ్ ముఖీ, బదర్పూర్ నుంచి రామ్‌వీర్‌సింగ్ బిధురీలు ఓడిపోయారు. కేజ్రీవాల్‌పై పోటీకి దిగిన నుపుర్ శర్మ ఘోరంగా ఓడిపోయారు. సీనియర్ ఆప్ నేత మనిష్ సిసోడియా.. తన పాత సహచరుడు వినోద్ కుమార్ బిన్నీపై పట్పర్గంజ్లో తిరుగులేని ఆధిక్యంతో గెలుపొందారు. కాగా, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీపై విజయం సాధించిన ఎస్కే బగ్గా బేడీ స్థానికురాలు కారనిఅన్నారు. -
అందరి అండతో అందలం
‘ఆప్’కి అన్ని వర్గాల మద్దతు బీజేపీ, మోదీలకు దూరమైన మధ్యతరగతి, ఉన్నత వర్గాల ఓట్లు న్యూఢిల్లీ: ఢిల్లీ వాసులు గత ఏడాది (2014లో) జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు పార్లమెంటు స్థానాలనూ భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో మోడీ హవా ఉత్తర భారతదేశాన్నంతటినీ చుట్టేసింది. అయితే.. అదే సమయంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి.. అంతకుముందు ఏడాది (2013) కంటే మూడు శాతం ఓట్లు పెరగడాన్ని గుర్తించలేకపోయింది. ఆప్‌కు ఆ మూడు శాతం ఓట్లు పెరగడానికి.. ఆ పెరిగిన నేపథ్యం రీత్యా చాలా ప్రాధాన్యం ఉంది. 2013 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు దిగువ తరగతుల్లో చాలా బలమైన పట్టు ఉందనే విషయంలో సందేహం లేదు. అదే సమయంలో మధ్యతరగతి ఓట్లను కూడా కొంత వరకూ ఆకర్షించింది. అయితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని ఓట్లను సాధించలేకపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని తరగతుల వారి నుంచీ ఓట్లు సాధించటమే కాదు.. మోదీ ‘సుపరిపాలన’ నినాదంతో మధ్యతరగతి నుంచి అనూహ్యమైన మద్దతును గెలుచుకుంది. అదే ఎన్నికల్లో ఆప్‌కు మూడు శాతం ఓట్లు పెరగడానికి కారణం.. దిగువ తరగతులు, మతపరమైన మైనారిటీల వారు ఆ పార్టీకి అనుకూలంగా మరింత ఎక్కువగా సంఘటితమవటం.. అది కూడా దెబ్బతిన్న కాంగ్రెస్ నుంచి ఇటువైపు మళ్లి ఉండటం కావచ్చు. 2013 ఎన్నికల్లో బీజేపీ, ఆప్ రెండిటికీ దక్కిన ముస్లిం ఓట్లు 12 శాతంగానే ఉండగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఆ ఓట్లు ఆప్‌కు 56 శాతం రాగా.. బీజేపీకి కేవలం 2 శాతం ఓట్లే దక్కాయి. ఈసారి కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుందని భావించారు. అందుకే ఎన్నికల ప్రచారంలో మతపరమైన విభజన, వర్గ విభజన చర్చలు నడిచాయి. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై విశ్వాసముంచి భారీగా మద్దతిచ్చిన మధ్యతరగతి, ఉన్నత తరగతి ప్రజల నమ్మకాన్ని.. బీజేపీ, మోదీ ఏ మేరకు చెదరగొట్టారన్నది ఈ ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన అంశం. ఉన్నత తరగతి ఓట్లనూ గెల్చుకున్న ఆప్... ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ ఓట్లను కొల్లగొడుతుందని ముందుగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్నాయి. అయితే.. ఆప్‌ను ఏకంగా 67 సీట్లలో గెలిపించిన ఈ తరహా ప్రజాతీర్పు.. ఉన్నత తరగతి ఓట్లను కూడా ఆ పార్టీ గణనీయంగా గెలుచుకోగలిగిందనేదానికి స్పష్టమైన సంకేతం. తాజా ఎన్నికల్లో ఆప్‌కు 54.3 శాతం ఓట్లు వస్తే.. బీజేపీకి 32.7 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 46 శాతం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 65 శాతం బ్రాహ్మణ ఓట్లను సంపాదించింది. అదే సమయంలో ఆ వర్గానికి చెందిన ఓట్లు ఆప్‌కు 2013లో 23 శాతం, 2014లో 22 శాతం లభించాయి. ఈ ఎన్నికల్లో ఆ సంఖ్యలు కూడా రెండు పార్టీల మధ్య మారిపోయినట్లు ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. బీజేపీ రాజకీయాలపై ఆ వర్గాల్లో ఆందోళన ఈ ఎన్నికలను.. మతతత్వం - లౌకికవాదం చర్చపై ప్రజాతీర్పుగా ఎవరూ పేర్కొనలేదు. కానీ.. మతప్రాతిపదికగా వర్గసమీకరణ చేసే బీజేపీ ఎత్తుగడలపై భయాలు.. ఢిల్లీ ఎన్నికల్లో అంతర్లీన ప్రచారాంశాలుగా మారాయి. సంఘ్ నేతలు తమ ఖాకీ నిక్కర్ల జేబుల నుంచి వరుసపెట్టి బయటకు తీస్తున్న అంశాల పట్ల మధ్యతరగతి, ఉన్నత తరగతి వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. లవ్ జిహాద్, ఘర్ వాపసి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీపై వివాదం, బీజేపీ ఎంపీల దుందుడుకు వ్యాఖ్యలు, పితృస్వామ్యంతో సతమతమవుతున్న మహిళలకు పురాతన పరిష్కారాలు చూపడం.. ఇలా అంతూపొంతూ లేకుండా హిందుత్వ దుడుకు వ్యక్తుల చర్యలు కొనసాగుతున్నాయి. మోదీ, పరిపాలన, అభివృద్ధికి సంబంధించి ఆయన అతిశయ ప్రచారంలో మంత్రముగ్ధులై ఉన్న ఢిల్లీ మధ్యతరగతి వారికి.. ఈ పరిణామాలు.. విస్మరించదగిన మతిలేని దళాల కోతిచేష్టలుగానో.. ఢిల్లీని తాకనంత సుదూరాన ఎక్కడో జరుగుతున్న పరిణామాలుగానో భావించి ఉండొ చ్చు. కానీ.. ఇటీవలి నెలల్లో ఈ పరిణామాలు చాలా దగ్గరగా చోటుచేసుకోవటం మొదలైంది. ఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత బవానా, నాంగ్లోయి, నంద్ నగిరి, ఓఖ్లాల్లో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు కల్పిత ప్రయత్నాలు జరిగాయి.. రెండు నెలల్లో మొత్తం ఐదు చర్చిలపై దాడులు జరిగాయి. ఈ పరిణామాలతో సంఘ్ గురించి మధ్య, ఉన్నత తరగతి ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న భయాలు రగులుకున్నాయి. మధ్యతరగతి, ఉన్నత తరగతి వర్గాలు.. బీజేపీ మతతత్వ పోకడల వల్ల లేక అటువంటి రాజకీయాలు సామాజిక సుస్థిరత, శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తాయని ఆ పార్టీకి దూరమయ్యారా? అనేది చెప్పటం కష్టం. చర్చిలపై దాడులకు సంబంధించి ఏ బీజేపీ కార్యకర్తనూ నిందితుడిగా పేర్కొనలేదనేది వాస్తవం. అయినా.. అధికార పార్టీకి అనుసరించే తరహా రాజకీయాలు.. హింస అనివార్యమనే వాతావరణం సృష్టిస్తాయని దాదాపు ఏకగ్రీవంగా గుర్తిస్తారు. ఇది.. మహాత్మా గాంధీ హంతకుడైన నాథూరాంగాడ్సేను ప్రస్తుతించటంలో చక్కగా ప్రతిబింబిస్తుంది. మోదీ ప్రతి మూడు వారాలకోసారి మహాత్ముడిని ప్రస్తుతిస్తుండటం.. మరోవైపు ఆయన పార్టీ ఎంపీలు, కార్యకర్తలు గాడ్సేను కీర్తిస్తుండటం కొంత గందరగోళానికి గురిచేస్తుంది. ఇదంతా ప్రత్యేకించి ఢిల్లీ మధ్యతరగతిని ఆందోళనకు గురిచేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఉత్సాహంగా మద్దతివ్వటానికి కారణమైన ఉత్తమ పాలన అనే భావనను బీజేపీ రాజకీయాలు అతిక్రమిస్తున్నట్లు కనిపించటమే దీనికి కారణం. బురదజల్లుడు ప్రచారంతోనూ నష్టం ఇక ఎన్నికల ప్రచారంలోనూ ఆప్‌పైన, కేజ్రీవాల్‌పైన బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో.. భరోసా ఇస్తూ, కలలు అల్లుతూ, తన ఎజెండా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేసిన మోదీ అదృశ్యమయ్యారు. కేజ్రీవాల్ దురదృష్టవంతుడు, నక్సలైట్, అరాచకవాది, 49 రోజుల ఉత్పాతం అంటూ విమర్శలు మొదలుపెట్టారు. అమిత్‌షా మరొక అడుగు ముందుకువేసి.. కేజ్రీవాల్‌ను ప్రజలు కొట్టిచంపేవాళ్లని.. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆప్ హవాలా మార్గాల ద్వారా విరాళాలు తీసుకుంటోందని బీజేపీ ఆరోపించింది. కానీ.. తానేమో రోజుల తరబడి దినపత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు జారీ చేసింది. ఈ కారణాల వల్ల.. ఢిల్లీలో తమ ఓటు ద్వారా మోదీ, బీజేపీలను హెచ్చరించాలని మధ్యతరగతి, ఉన్నత తరగతి వర్గాలు భావించాయి. ఫలితంగా.. ఆప్‌కు మద్దతుగా ఉండేది దిగువ తరగతి వర్గాల వారికే పరిమితమన్న భావన పొరపాటని రుజువుచేస్తూ.. సంపన్న వర్గాల ఓట్లనూ ఆ పార్టీ కొల్లగొట్టింది. ఢిల్లీలో అత్యంత సంపన్న ప్రాంతాలుగా పరిగణించే న్యూఢిల్లీ, ఆర్.కె.పురం, గ్రేటర్ కైలాశ్, మాల్వియానగర్లలోనూ ఆప్ ఘన విజయం సాధించింది. -
ఆప్ విజయంపై స్పందనలు..
కేజ్రీవాల్‌కు అభినందనలు సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు అభినందనలు. ప్రజలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచిస్తున్నారనేందుకు ఢిల్లీ ఫలితాలు ఒక ఉదాహరణ. కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆహ్వానించడం ద్వారా ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ప్రజాస్వామిక ఆకాంక్షను ఆమ్ ఆద్మీ గతంలో బలపరిచింది. కేజ్రీవాల్ నాయకత్వంలో అన్ని రంగాల్లో ఢిల్లీ పురోగమించాలి. - కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం దేశ రాజధాని అయిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి అభినందనలు. ఈ విజయం ప్రజాస్వామ్యం గొప్పదనానికి నిదర్శనం. - చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఫలితాలు మోదీకి హెచ్చరిక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీకి హెచ్చరికలాంటివి. భవిష్యత్తు రాజకీయాలకు ఇవెంతో ఉపయోగపడతాయి. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీని మట్టి కరిపించడం ద్వారా ప్రజలు లౌకిక శక్తులకు మద్దతుగా ఉన్నామని స్పష్టం చేశారు. - బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొత్త సంస్కృతికి అద్దం ఢిల్లీ ఫలితాలు కొత్త రాజకీయ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీల తర్వాత లోక్‌సత్తా, ఆప్ వంటి పార్టీల నాలుగో తరం రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. - జయప్రకాశ్ నారాయణ, లోక్‌సత్తా సామాన్యుని బలం తెలిసింది ప్రజాస్వామ్యంలో సామాన్యుని బలమేంటో ఢిల్లీ ఫలితం తేల్చి చెప్పింది. మోసపూరిత హామీలతో ఏపీ ప్రజలను టీడీపీ నిలువునా వంచించింది. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం, నేతలు వింత పోకడలకు పోకుండా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహారించాలి. - వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎంపీ, కడప బీజేపీ ఎనిమిది నెలల పాలనకు రెఫరెండం కేంద్రంలో బీజేపీ 8 నెలల పాలనకు, దేశ ప్రజల అభిప్రాయాలకు ఢిల్లీ ఎన్నికల తీర్పు కొలమానం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదనే స్థాయిలో బీజేపీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీకి దేశమంతటా ఇదే తీర్పు తప్పదు. కాంగ్రెస్ దారుణ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటాం. - కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఉత్తమ్, గీతారెడ్డి, చిరుమర్తి లింగయ్య ఆప్ విజయం.. ప్రజా చైతన్యానికి నిదర్శనం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను అత్యధిక స్థానాల్లో గెలిపిస్తూ ఇచ్చిన తీర్పు.. ప్రజల చైతన్యానికి నిదర్శనం. ఇది కే ంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, మతవాద, మితవాద విధానాలకు వ్యతిరేకమైనది. - సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి భారత రాజకీయాల్లో కీలక ఘట్టం డబ్బుతో రాజకీయాలను మార్చవచ్చన్న భావన తప్పని ఢిల్లీ ఫలితాలు స్పష్టం చేశాయి. సామాన్యులు తలచుకుంటే ఎవరినైనా మట్టికరిపించగలరని రుజువైంది. ధన రాజకీయాలను నమ్ముకునే వారికి ఈ ఫలితాలు గొడ్డలిపెట్టు. భారత రాజకీయాల్లో ఇదో కీలక ఘట్టం. - టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొత్త రాజకీయ సంస్కృతికి ప్రజల ఆహ్వానం భారతదేశంలో కాంగ్రెస్, బీజేపీ కాకుండా మూడోపార్టీ బలంగా వస్తే ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ ఫలితాలు స్పష్టం చేశాయి. నూతన రాజకీయ సంస్కృతిని ప్రజలు ఆహ్వానిస్తారని అనడానికి ఇవి ఉదాహరణగా నిలుస్తాయి. మోదీ సృష్టించిన భ్రమలు తొలగిపోయాయి. - ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ కాంగ్రెస్, బీజేపీలపై వ్యతిరేకత కాంగ్రెస్, బీజేపీ అవలంబించిన ఒకే రకమైన అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పిది. రెండు జాతీయ పార్టీలను తిరస్కరించారు. తమకు సేవలందిస్తామని కేజ్రీవాల్ చెప్పడంతో పాటు కొంచెం సంక్షేమంపై కూడా వాగ్దానం చేయడంతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. - ప్రొఫెసర్ హరగోపాల్ సామాన్యుడి విజయమిది సామాన్యులు కూడా ఎలాంటి శక్తినైనా ఎదిరించి, ప్రజాస్వామ్య పద్ధతిలో విజయం సాధిస్తారనడానికి ఢిల్లీ ఫలితాలు తార్కాణం. తమ సమస్యలు ఆప్ అధికారంలోకి వస్తే పరిష్కారమవుతాయని ప్రజలు విశ్వసించారు. బీజేపీ ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై ప్రజల నిరసనగా ఈ తీర్పును చూడాలి. - దేవీప్రసాద్, టీఎన్జీవో అధ్యక్షుడు మోదీ పతనానికి మొదటి ‘కేక’ ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ గెలుపు దేశ ప్రధాని నరేంద్రమోదీ పతనానికి మొదటి ‘కేక’ అవినీతి, మతోన్మాదాలకు ఎదురొడ్డి పోరాడినందునే ఢిల్లీ ప్రజలు ఆప్‌కి పట్టం కట్టారు. ఈ ఏడాది జూలై 26న విజయవాడలో ప్రారంభించనున్న నవ్యాంధ్ర పార్టీకి, ఆప్‌కు స్నేహ సంబంధాలు par కొనసాగుతాయి. - ఏపీ దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తిపద్మారావు -
అహంకార రాజకీయంపై జనాగ్రహం
-కె రామచంద్రమూర్తి ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఎన్నికల ప్రణాళికను విస్మరించి, ప్రజలను పట్టించుకోకుండా, తామే సర్వజ్ఞులమనీ, సర్వాధికారులమనీ, భాగ్యవిధాతలమనీ విర్రవీగే రాజకీయ నాయకుల వీపు విమానం మోత మోగడం తథ్యమని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోదీ అనుభవాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే వారికే మంచిది. అధికారం తలకెక్కించుకున్న నాయకులకు అవకాశం వచ్చినప్పుడు అన్ని చోట్లా ఓటర్లు ఇదే గుణపాఠం చెబుతారు. తస్మాత్ జాగ్రత. భారతీయ జనతా పార్టీ(భాజపా) నాయకులు పత్రికా ప్రకటనలో చెప్పినట్టు నిజంగానే అరవింద్ కేజ్రీవాల్‌ది ఉపద్రవ గోత్రమే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భాజపా, కాంగ్రెస్‌ల పాలిట ఉపద్రవంగానే పరిణమించాయి. రెండేళ్ల కిందట పుట్టిన పార్టీ ధాటికి తట్టుకోలేక రెండు జాతీయ పార్టీలూ గింగిరాలు తిరిగాయి. స్వతంత్ర భారత పార్లమెంటరీ చరిత్రలో కనీవినీ ఎరుగని సునామీని మనం కళ్లారా చూశాం. 70 స్థానాలలో 67 స్థానాలు గెలుచుకోవడం ఢిల్లీలోనే కాదు భారత దేశంలోనే ఒక చరిత్ర. ఇది అపరచాణక్యులలాగా అభినయించే ‘సర్వే’శ్వరులకు సైతం ఊహకందని అపూర్వ పరిణామం. తొమ్మిది మాసాల కిందట ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలనూ గెలుచుకొని, అరవై అసెంబ్లీ విభాగాలలో మెజారిటీ సాధించిన భాజపా అసెంబ్లీ ఎన్నికలలో పరమచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పే సాహసం ఏ సంస్థా చేయలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుస్తుందని చెప్పాయి కానీ ఇంత ఘనవిజయం సాధిస్తుందని చెప్పలేకపోయాయి. కాంగ్రెస్ ముక్త్ భారత్ (కాంగ్రెస్ లేని భారత దేశం) నినాదంతో జైత్రయాత్ర ప్రారంభించిన నరేంద్రమోదీ కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయగలిగాడు కానీ భాజపా ముక్త్ ఢిల్లీ (భాజపా లేని ఢిల్లీ) ఆవిష్కారాన్ని ఆపలేకపోయాడు. ఆందోళన చేయడం, ఎన్నికలలో వినూత్నంగా, సృజనాత్మకంగా ప్రచారం చేయడం, విజయం సాధించడం ఒక ఎత్తు. సుపరిపాలన అందించడం ఒక ఎత్తు. ఢిల్లీ తర్వాత ఆప్ విస్తరించే అవకాశం పంజాబ్‌లో దండిగా ఉంది. లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్‌లో నాలుగు స్థానాలను (మూడొంతుల స్థానాలను) ఆప్ గెలుచుకుంది. అధికార అకాలీదళ్ పట్లా, ప్రతిపక్ష కాంగ్రెస్ పట్లా ప్రజలకు సదభిప్రాయం లేదు. ఆప్‌కు ప్రజాదరణ అభించే అవకాశం ఉంది. అయితే, ఆప్ విజయావకాశాలు మంగళవారం సాధించిన విజయంపై ఆధారపడి ఉండవు. రేపటి నుంచి ఆప్ ప్రభుత్వం పరిపాలించే తీరు ఆ పార్టీ విస్తరణావకాశాలను నిర్ణయిస్తుంది. మార్కెట్ ఎకానమీ, ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనాలనే లోగడ కాంగ్రెస్ కానీ ఇప్పుడు భాజపా కానీ అనుసరిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ఆవిష్కరించే అవకాశం ఆప్‌కు ఉన్నది. ఆప్‌కు అగ్ని పరీక్ష అధికారంలోకి రాగానే ఆరంభం అవుతుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ కొన్ని వారాల పాటు సాగుతుంది. నరేంద్రమోదీ, అమిత్‌షాలు చేసిన తప్పిదాలపైన తర్జనభర్జనలు తప్పవు. లోక్‌సభ ఎన్నికలలో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నది కనుకనే ఆమ్ ఆద్మీ పార్టీ తేరుకొని బలం పుంజుకొని అసాధారణ విజయం సాధించింది. భాజపా నాయకత్వం కూడా ఢిల్లీ అనుభవం నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. ఈ ఎన్నికల నుంచి అన్ని రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులూ నేర్చుకోవలసిన పాఠాలు అనేకం. వీటిలో ఒకటి మాత్రం అందరికీ వర్తిస్తుంది. ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఎన్నికల ప్రణాళికను విస్మరించి, ప్రజలను పట్టించుకోకుండా, తామే సర్వజ్ఞులమనీ, సర్వాధికారులమనీ, భాగ్యవిధాతలమనీ విర్రవీగే రాజకీయ నాయకుల వీపు విమానం మోత మోగడం తథ్యమని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఢిల్లీ ప్రజలు ఆప్‌కి పాజిటివ్‌గా (సకారాత్మకంగా) ఓటు చేసి ఉండవచ్చును కానీ మోదీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని కూడా భావించాలి. మోదీ-షా ద్వయం అహంకారపూరితంగా వ్యవహరించడం ఢిల్లీలో జీవితపర్యంతం జనసంఘ్‌కూ, భాజపాకూ వీరవిధేయులుగా ఉన్నవారికి సైతం ఆగ్రహం కలిగించింది. పోలింగ్ మూడు వారాలు ఉన్నదనగా కిరణ్‌బేడీని పార్టీలోకి స్వాగతించి ప్రచారసారథ్యం అప్పగించడంతో ఆగకుండా, ఆప్‌లో ఉండగా మోదీనీ, భాజపానూ నిర్దాక్షిణ్యంగా దుయ్యబట్టిన షాజియా ఇల్మీని పార్టీలో చేర్చుకోవడాన్ని పాతతరం భాజపా నాయకులు ఏ మాత్రం హర్షించలేకపోయారు. రామ్‌జాదోం, హరామ్‌జాదోం అంటూ ఒక మంత్రి అనడాన్ని ఆక్షేపించకపోవడమే కాకుండా పార్లమెంటులో ఆమెను సమర్థించినందుకు వారు మోదీని క్షమించలేదు. ఢిల్లీలో సంఘ్పరివారం ప్రాబల్యం మొదటి నుంచీ ఉన్నప్పటికీ చర్చిలపై దాడులు ఎన్నడూ జరగలేదు. ఈ ఎన్నికల సమయంలోనే ఎందుకు జరిగాయంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేక కారణాలు భాజపా దారుణ ఓటమికీ, ఆప్ చారిత్రక విజయానికీ దారి తీశాయి. కాంగ్రెస్ కుప్పకూలిపోవడం, కాంగ్రెస్ పార్టీకి ఇంతకాలం ఓటు చేస్తూ వచ్చిన దళితులూ, మైనారిటీలూ మూకుమ్మడిగా ఆప్‌కు తరలిపోవడం కూడా భాజపా పరాజయానికి దారితీసిన కారణాలలో ఒకటి. ఆమ్ ఆద్మీని (సామాన్య పౌరుడిని) విస్మరించడం ఎంతటి బలమైన రాజకీయ పక్షానికైనా ఆత్మహత్యాసదృశమని ఢిల్లీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. ఎనిమిది మాసాలకు పైగా ఢిల్లీ రాష్ట్రం కేంద్ర పాలనలోనే ఉంది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ భాజపా ప్రాబల్యంలోనే ఉంది. కానీ పేద, దిగువ మధ్యతరగతికి జరిగిన మేలంటూ ఏమీ లేదు. ఈ తరగతి ప్రజలు మాత్రమే కాకుండా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఆప్‌కు ఓటు వేయడానికి కారణం మోదీకి అహంకారం పెరిగిందనీ, సొంతపార్టీలో ఉన్న మతవాదులను నియంత్రించడంలో విఫలమైనాడనీ వారు భావించడమే. ఎన్నికలలో విజయాలు సాధించి ప్రభుత్వాలు నడుపుతున్న రాజకీయ పార్టీలకూ, వాటి సారథులకూ ఢిల్లీ ఎన్నికలు చేసే ఈ హెచ్చరిక అత్యంత విలువైనది. దీన్ని పెడచెవిన పెడితే పదవికి ప్రమాదం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోదీ అనుభవాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే వారికే మంచిది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (తెదేపా)లపై విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీపైన తెదేపా అభ్యర్థులుగా ఎన్నికలలో పోటీ చేసిన ఏడుగురికి పార్టీ తీర్థం ఇచ్చి మంత్రిపదవులతో సత్కరించడాన్ని పుష్కరంపాటు తెలంగాణ రాష్ట్ర సమితిని (టీఆర్ఎస్) అంటిపెట్టుకున్న నాయకులు ఎట్లా హర్షిస్తారు? ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలు అమలు చేయకుండా ప్రణాళికలో రేఖామాత్రంగా కూడా సూచించని పనులు చేస్తున్న చంద్రబాబునాయుడిని ప్రజలు ఎట్లా ఉపేక్షిస్తారు? రైతుల రుణ మాఫీ హామీని సక్రమంగా చేయకుండా, వారి పొలాలను వారి ఆమోదం లేకుండా స్వాధీనం చేసుకోవడాన్ని ఎట్లా సహిస్తారు? అధికారం ఉన్నది కదా అని మోదీ భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయించడాన్ని దేశంలో రైతులు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోక ఏం చేస్తారంటూ అధికారంలో ఉన్నవారు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం తాజాగా ఢిల్లీ ఓటర్లు చెప్పారు. అధికారం తలకెక్కించుకున్న నాయకులకు అవకాశం వచ్చినప్పుడు అన్ని చోట్లా ఓటర్లు ఇదే గుణపాఠం చెబుతారు. తస్మాత్ జాగ్రత. -
సామాన్యుడి ‘కేక’
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం 70 స్థానాలకు గానూ 67 సీట్లలో గెలుపు బీజేపీకి ఊహించని పరాభవం; కేవలం 3 స్థానాల్లో విజయం ఖాతా తెరవని కాంగ్రెస్, ఇతర పార్టీలు ఫిబ్రవరి 14న సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం అద్భుతం సృష్టించిన ఢిల్లీ ఓటర్లకు కృతజ్ఞతలు సత్యమార్గంలో వెళ్తే ప్రపంచం తోడుంటుందని వ్యాఖ్య కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ అభినందనలు; ఢిల్లీకి కేంద్ర సాయంపై హామీ న్యూఢిల్లీ: రికార్డులు బద్దలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ తెల్లబోయాయి. రాజకీయ పండితులు నివ్వెరపోయారు. బీజేపీ చావుదెబ్బ తిన్నది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఢిల్లీలో ‘సామాన్యుడు’ కదం తొక్కాడు. ఓట్ల సునామీ సృష్టించాడు. ప్రభంజనమై ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టాడు. మోదీ హవాను, అమిత్ షా చాణక్యాన్ని, బీజేపీ విజయ ప్రస్థానాన్ని అడ్డుకుని వారికి గర్వభంగం కలిగించాడు. ‘ఆమ్ ఆద్మీ’ సృష్టించిన ఓట్ల సునామీలో బీజేపీ, కాంగ్రెస్‌లు కొట్టుకుపోయాయి. మొత్తంమీద చీపురు పార్టీ ఢిల్లీని క్లీన్‘స్వీప్’ చేసి, కొత్త రాజకీయాలకు దారులు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను బీజేపీకి అందించిన ఢిల్లీ ప్రజలు.. సంవత్సరం తిరగకుండానే ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించి గుణపాఠం చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం ఆవిష్కృతమైంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘన విజయం సాధించింది. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో మొత్తం 70 స్థానాలకు గానూ 67 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, ఎవరూ ఊహించని స్థాయిలో అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం మించిన ఈ ఫలితాలు ఆప్ ప్రభంజనానికి నిదర్శనంగా నిలిచాయి. మిగతా 3 స్థానాలను గెలుచుకున్న బీజేపీకి చావుతప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి ఏర్పడింది. ఊహించినట్లే కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. 1989లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం సంగ్రామ పరిషత్ పార్టీ మొత్తం 32 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించగా, ఆ తరువాత దాదాపు ఆ స్థాయి విజయం ఆప్కే సాధ్యమైంది. ఇది సామాన్యుడి గెలుపని, సత్యం సాధించిన విజయమని ఫలితాలు వెల్లడైన అనంతరం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ అద్భుతాన్ని చేసిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సత్యమార్గంలో ఉన్నవారికి విశ్వంలోని శక్తులన్నీ తోడుగా నిలుస్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం మధ్యాహ్నం కేజ్రీవాల్‌కు ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన కేజ్రీవాల్.. తమకు కేంద్ర సహకారం అవసరమని, త్వరలో వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కూడా ‘అరవింద్‌కు పూర్తి మార్కులు’ అంటూ కేజ్రీవాల్‌ను అభినందించారు. సరిగ్గా ఏడాదికి.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న రాంలీలా మైదానంలో ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం సమావేశమైన ఆప్ నూతన ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా మూజు వాణి ఓటుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్ పేరును ఆయన సన్నిహిత నేత మనీశ్ సిసోడియా ప్రతిపాదించారు. ఈ గెలుపుతో గర్వపడొద్దని, అహంకారపూరిత వైఖరి వల్లనే కాంగ్రెస్, బీజేపీలు ఓడిపోయాయని పార్టీ ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా కేజ్రీవాల్ సూచించారు. అనంతరం మనీశ్ సిసోడియాతో కలిసి కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలుసుకుని, ప్రభుత్వ ఏర్పాటుపై తమ సంసిద్ధతను వ్యక్తపర్చారు. 2013 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. జనలోక్‌పాల్ బిల్లును బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుకోవడంతో 49 రోజులకే 2014, ఫిబ్రవరి 14న సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన సరిగ్గా సంవత్సరం తరువాత ఈ ఫిబ్రవరి 14న ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడం విశేషం. ఒంటిచేత్తో పార్టీని గెలిపించిన అరవింద్ కేజ్రీవాల్.. న్యూఢిల్లీ నియోజకవర్గంలో సమీప బీజేపీ ప్రత్యర్థి నుపుర్ శర్మపై 31,583 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియాకు డిపాజిట్ కూడా దక్కలేదు. మట్టికరచిన హేమాహేమీలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం దెబ్బకు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ సహా బీజేపీ, కాంగ్రెస్ల్లోని హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. అందులో చాలామందికి కనీసం ధరావత్తులు దక్కలేదు. ఆయా పార్టీల కంచుకోటల్లో సైతం ఆప్ విజయం సాధించింది. బీజేపీకి కంచుకోట కృష్ణానగర్ నుంచి పోటీ చేసిన కిరణ్‌బేడీ ఆప్ అభ్యర్థి ఎస్కే బగ్గా చేతిలో 2 వేల ఓట్ల పై చిలుకు తేడాతో చిత్తయ్యారు. కృష్ణానగర్ బీజేపీ సీనియర్ నేత హర్షవర్ధన్ సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ అజయ్ మాకెన్ సదర్ బజార్ స్థానంలో రాజకీయ అనుభవం అస్సలు లేని ఆప్ అభ్యర్థి సోమ్‌దత్ చేతిలో 50 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాకెన్‌కు కూడా కనీసం డిపాజిట్ దక్కలేదు. ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేశారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ(కాంగ్రెస్) కూడా గ్రేటర్ కైలాశ్ స్థానంలో ఓటమి పాలయ్యారు. జగదీశ్ ముఖి, రామ్‌వీర్ సింఘ్ బిధూరి, కృష్ణ తీరథ్ తదితర బీజేపీ ప్రముఖులు.. ఏకే వాలియా, హరూన్ యూసుఫ్, చౌదరి ప్రేమ్‌సింగ్, రాజ్‌కుమార్ చౌహాన్, మహాబల్ మిశ్రా తదితర కాంగ్రెస్ నాయకులు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఢిల్లీశాఖ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా(రోహిణి), జగదీశ్ ప్రధాన్(ముస్తాఫాబాద్), ఓం ప్రకాశ్ గుప్తా(విశ్వాస్ నగర్) మాత్రమే విజయం సాధించారు. ఈ ఓటమి తమకు దెబ్బేనని అంగీకరించిన బీజేపీ నేతలు.. ఈ ఫలితాలు మోదీ పాలనకు రెఫరెండం మాత్రం కాదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయానంతరం జరిగిన మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి, జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఓట్లశాతం సాధించిన బీజేపీకి ఢిల్లీ ఫలితాలు ఒక గుణపాఠమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానిని ఆహ్వానిస్తాం: ఆప్ శనివారం సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ఆప్ తెలిపింది. అలాగే ఢిల్లీలో శాంతిభద్రతల అంశంపై చర్చించేందుకు బుధవారం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కోరామని, అటువైపు నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని ఆప్ అధికార ప్రతినిధి ఆశిష్ ఖైతాన్ తెలిపారు. గర్వం తలకెక్కొద్దు.. ఫలితాలు వెలువడటం ప్రారంభమైనప్పటి నుంచీ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు సంబరాలు చేసుకుంటున్న ఆప్ కార్యకర్తలనుద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ విజయాన్ని నెత్తికెక్కించుకుని అహంకారం ప్రదర్శించవద్దని వారికి హితవు పలికారు. ‘అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రజలు మనల్ని శిక్షిస్తార’ని హెచ్చరించారు. ‘ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. మీరు అద్భుతం చేశారు. మనం సత్యమార్గంలో ఉంటే ప్రపంచంలోని శక్తులన్నీ మనకు తోడుగా నిలుస్తాయి’ అన్నారు. కాగా, బీజేపీ పరాజయంతో ఆ పార్టీపై ధ్వజమెత్తేందుకు ప్రత్యర్థులకు అవకాశం చిక్కింది. ఈ పరాజయం మోదీ ఓటమేనన్న అన్నాహజారే వ్యాఖ్యతో తాను ఏకీభవిస్తానని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ట్వీట్ చేశారు. మోదీ హవాను అవహేళన చేస్తూ.. ‘కెరటం కన్నా సునామీ పెద్దదని ఈ ఫలితాలు రుజువుచేశాయి. ఢిల్లీ గద్దెపైనున్న పెద్దలకు ఇదొక సందేశం’ అని పేర్కొన్నారు. బీజేపీ బుడగ పేలిపోయిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. అహంకారం, రాజకీయ కక్షసాధింపు ధోరణుల వల్లనే బీజేపీ ఓడిపోయిందని విమర్శించారు. ఒక మఫ్లర్వాలా: అరవింద్ కేజ్రీవాల్ వయసు 46 సర్కారీ పదవిని వదిలి సామాన్యుడితో మమేకమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ వేదికగా చీపురు పట్టి రాజకీయాల దుమ్ము దులిపారు. తొలిసారే ఢిల్లీ పీఠమెక్కి సీఎంగా వీధుల్లో ధర్నాలు చేశారు. 49 రోజులకే గద్దెదిగి ‘ఏకే-49’గా విమర్శకులకు ఆయుధమయ్యారు. క్షమాపణ కోరుతూ మళ్లీ జనాల్లోకే వెళ్లారు. మరొక్క చాన్స్ ప్లీజ్ అని వేడుకున్నారు. అవినీతి, అక్ర మాలను కడిగేస్తానని భరోసా ఇచ్చారు. అదే ఊపుతో తాజా ఎన్నికలను ఊడ్చేసి ‘ఏకే-67’గా మారిపోయారు. సామాన్యుడు కాస్తా అసామాన్యుడయ్యారు. ఒక సూట్‌వాలా: నరేంద్ర మోదీ వయసు 64 అచ్చమైన హిందీతో స్వచ్ఛమైన హిందుస్థానీగా అందరినీ ఆకట్టుకున్నారు. అమెరికాలో మెరిశారు. ఒబామాను రప్పించారు. పది లక్షల సూటుతో ఆహార్యంలో అదరహో అనిపించారు. అలతి అలతి మాటలతో మెప్పించారు. పథకాల ఊసులతో మురిపించారు. హోరెత్తే కార్యక్రమాలతో ఆడంబరం చేశారు. కానీ ప్రజలకు మొహం మొత్తింది. ఈ ఆడంబరాలు ఇక చాలని భావించారు. వరుస విజయాలతో బీజేపీ దిగ్విజయంగా నిర్వహిస్తున్న అశ్వమేధయాగాన్ని హస్తినలో అడ్డుకున్నారు. ఒక ఢిల్లీవాలా సామాన్యుడు కాదు.. అసామాన్యుడు కుళ్లు రాజకీయాలతో ఢిల్లీవాలా విసిగెత్తిపోయాడు. అవినీతిపై గర్జించాలని కలలుగన్నాడు. తన ఆకాంక్షలను నెరవేర్చే సర్కారు కోసం తపించాడు. రాజకీయాలను కడిగేసేందుకు చీపురుతో వీధుల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని అక్కున చేర్చుకున్నాడు. పూటకో మాట మార్చే నాయకులను పక్కనబెట్టి నిజాయతీకే పట్టంకట్టాడు. హంగు, ఆర్భాటాలను కట్టిపెట్టాలంటూ బీజేపీకి దిమ్మదిరిగే తీర్పునిచ్చాడు. తనపై ఉంచిన బాధ్యతలను మధ్యలోనే వదిలినందుకు సారీ చెప్పిన కేజ్రీవాల్‌ను క్షమించాడు.‘సామాన్యుడికి కావాల్సింది ఇస్తా’నన్న అసామాన్యుడికే ఢిల్లీ పీఠాన్ని మళ్లీ అప్పగించాడు. -
చీపురుపుల్లల విప్లవం
కేజ్రీవాల్ పార్టీ సాధించిన విజయం స్వతంత్ర భారత చరిత్రలోనే ఘనమైనదిగా కీర్తిని నమోదు చేసుకోగలిగింది. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో నేడు ప్రతిపక్షం లేదు. ఉన్నా కంటితుడుపు బలమే. ఈ ఫలితాలు భారతదేశ రాజకీయాలలో సరికొత్త పరిణామా లకు దారితీస్తాయని ఇప్పుడే అంచనాలు మొదలైనాయి. వేగవంతమైన సమీకరణలకు కారణమవుతాయని కూడా అంతా నమ్ముతున్నారు. ఇటీవల యువతను విశేషంగా ఆకర్షించిన రాజకీయ పక్షం ఆప్. ఇది ఊదర ద్వారా వచ్చిన వాపు కూడా కాదు. ‘పాలనాక్రమంలో సిద్ధాంత ప్రాతిపదికలేని ప్రయోగాల ప్రమాదం ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుకావచ్చు. ఆ క్రమంలోనే పాలకుడు తప్పులు చేస్తాడు. ఆ తప్పుల మూలంగా గొలుసుకట్టు పరిణామాలు చోటుచేసుకుంటాయి. అవి ఒకప్పుడు విషాదంగానూ, మరొకప్పుడు హాస్యాస్పదంగానూ మారవచ్చు. కానీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ‘ఆప్’ మాత్రం సంక్షోభ దశను తట్టుకుని కూడా బలంగా నిలదొక్కుకుంది’. -ప్రొఫెసర్ శివ్విశ్వనాథన్ (9-2-‘15) అన్నా హజారే నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఆరంభమైన అవినీతి వ్యతిరేకోద్యమంతో సన్నిహిత సంబంధం కలిగినవారు అరవింద్ కేజ్రీవాల్. అన్నాకు ఆయన సన్నిహిత సహచరుడు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు (ఐఆర్ఎస్) చెందిన కేజ్రీవాల్ భారత రాజకీయాలలో ‘కొరకరాని కొయ్య’. ‘దేశీయ తయారీ సరుకు’ కేజ్రీ మొదట యూపీఏ (కాంగ్రెస్) ప్రభుత్వానికీ, ఆ తరువాత ఎన్డీఏ (బీజేపీ) పాలనా శక్తులకూ సవాలుగా నిలిచారు. ఢిల్లీ శాసనసభకు మొన్న జరిగిన ఎన్నికలలో ఒక వెల్లువలా ఓట్లు సాధించి అధికార పీఠం వైపు అడుగువేశారు. మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏరికోరి తెచ్చుకుంది. ఆ పార్టీలో మరెవరూ ‘మొనగాడు’ లేనట్టు పోలింగ్ జరగడానికి పది పన్నెండు రోజుల ముందు ఆమెను పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించారు. నిజానికి అన్నా ఆరంభించిన అవినీతి వ్యతిరేకోద్యమంలో ఆమె కూడా భాగస్వామి. కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి పట్టు ఉన్న ఢిల్లీ నగరంలో, కేజ్రీవాల్‌కు దీటుగా నిలబడగల ప్రత్యర్థిగా ఆ పార్టీ బయటి వ్యక్తి బేడీని ఎంచుకుంది. ఆ పార్టీ ఓటమికి ఇదే తొలిమెట్టు. తొలి ప్రయత్నం కేజ్రీవాల్ మొదటి నుంచి అవినీతి వ్యతిరేకోద్యమాలతోనే పేరు తెచ్చుకున్నా రు. నవంబర్, 2012లో ఆప్‌ను ఏర్పాటు చేసి, జాతీయ కన్వీనర్‌గా ఎన్నికై, ఆ మరుసటి సంవత్సరమే ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పోటీకి దిగారు. 70 స్థానా లు ఉన్న ఢిల్లీ శాసనసభలో ఆప్‌కు 28 స్థానాలు వచ్చాయి. తొలి ప్రయత్నంలో ఢిల్లీకి ఏలిక కాగలిగిన మెజారిటీకి కొంచెం ఇవతల ఉండిపోయారు. అయినా కాంగ్రెస్ మద్దతుతో డిసెంబర్ 28, 2013న ఆయన ముఖ్య మంత్రిగా ప్రమా ణ స్వీకారం చేశారు. 49 రోజుల తరువాత ఫిబ్రవరి 14, 2014న రాజీనామా చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టలేకపోయినందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా ఉద్యమ నాయకత్వం ఇచ్చిన అనుభవంతో ఆప్ ఆ వ్యవధిలోనే కొన్ని మౌలిక ప్రయోజనాలను నెరవేర్చాలని భావించిం ది. కానీ అవసరమైన ఆధిక్యం అసెంబ్లీలో లేదు. తాను ఆశించిన మేరకు అలాంటి చట్టాలను వెలువరించడానికి తన బలంతో సాధ్యంకాదు కనుకనే కేజ్రీవాల్ పదవి నుంచి అర్ధంతరంగా వైదొలిగారు. ఇది దుందుడుకుగా కనిపించింది. అయినా సంవత్సరానికల్లా ఆప్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. చరిత్ర సృష్టించిన గెలుపు కేజ్రీవాల్ పార్టీ సాధించిన విజయం స్వతంత్ర భారత చరిత్రలోనే ఘనమైనది గా నమోదు చేసుకోగలిగింది. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో నేడు ప్రతిపక్షం లేదు. ఉన్నా కంటితుడుపు బలమే. ఈ ఫలితాలు భారతదేశ రాజకీయాలలో సరికొత్త పరిణామాలకు దారితీస్తాయని ఇప్పుడే అంచనాలు మొదలైనాయి. వేగవంతమైన సమీకరణలకు కారణమవుతాయని కూడా అంతా నమ్ముతున్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ అహంకారంతో అనుసరిస్తున్న ధోరణే ప్రజానీకాన్ని ఆప్ వైపు చూడక తప్పని పరిస్థితిని కల్పించింది. అధికార పార్టీ అహంకారం విభజించి పాలించే బీజేపీ తత్వం కూడా కొద్దిమాసాల కాలంలోనే ఆ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచింది. ప్రజల అసంతృప్తే, దాని నుంచి వచ్చిన అసహ నమే ఆప్ విజయావకాశాలను రెట్టింపునకు పెంచి ఉండవచ్చు. నిర్దిష్టమైన సామాజిక దృక్కోణం, అదికూడా లౌకిక వ్యవస్థను సుసంపన్నం, సుస్థిరం చేసేందుకు దోహదపడే తాత్వికత బీజేపీలో కొరవడ్డాయి. ప్రజాబాహుళ్యానికి జీవనాధారం కాగలిగిన ఆర్థిక ప్రణాళిక, వైదేశిక నీతి కూడా బీజేపీకి లేవు. ఇవే దేశాన్ని విపరిణామాల వైపు తీసుకుపోతున్నాయి. ప్రతిపక్షాల ప్రతీకలను, పథకాలను, ఎన్నికల చిహ్నాలను కూడా తస్కరించే స్థితికి అధికార పార్టీ దిగజారిందని చెప్పుకోవాలి. ఉదాహరణకి ఆప్ పార్టీ చిహ్నం - చీపురు. ఆ చిహ్నాన్ని కాజేసి ‘స్వచ్ఛభారత్’ పేరుతో వీధులను ఊడ్చే వస్తువుకు ప్రతీకగా చిత్రించి చూపేందుకు బీజేపీ ప్రయత్నించింది. గాంధీజీ కళ్లజోడుతో జాతి కళ్లు కప్పే యత్నం ప్రధాని మోదీ తలపెట్టిన స్వచ్ఛభారత్ ప్రకటనలలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ మహాత్మా గాంధీ కళ్లజోడును ‘సింబల్’గా ఉపయోగించుకుంటోంది. కళ్లజోడైతే గాంధీజీదేగానీ, జాతిపిత దూరదృష్టి ఆ పార్టీ సిద్ధాంతకర్తలకు అబ్బలేదు. గాంధీజీని నాథూరామ్ గాడ్సే తుపాకీ గుళ్లకు బలిచేయడాన్ని బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌షా ఇంతవరకు ఖండించిన దాఖలా లేదు. దీనికి తోడు అన్యమతస్తుల, వారి ప్రార్థనామందిరాల మీద దాడులు మరొక పరిణామం. వీటిని కూడా ఆయన ఖండించడం లేదు. స్విస్ బ్యాంకులలో మూలుగుతున్న భారత మోతుబరుల లక్షల కోట్ల రూపాయల నల్ల (గుప్త) ధనరాశులను రప్పిస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీ గాలికి ఎగిరిపోయింది. వీటన్నిటి కారణంగానే దేశ రాజధానిని ఆప్ కైవసం చేసుకోగలిగింది. కేంద్ర పాలిత అధీన ప్రాంత రాష్ట్రమైన ఢిల్లీకి ఆప్ అధినేత పాలకుడు కావడం చీపురుకట్టకు పట్టుకుచ్చు చుట్టినట్టయింది. అవినీతిని సహించని తత్వం కేజ్రీవాల్ మీద ఢిల్లీ ప్రజల తిరుగులేని విశ్వాసానికి మరో ముఖ్యకారణం - అవినీతి వ్యతిరేకోద్యమంతో ముందునుంచీ ఆయన మమేకమై ఉండడమే. అన్నాతో కలసి ఆరంభించిన ఆ ఉద్యమాన్ని ఆయన నేటికీ కొనసాగిస్తు న్నారు. లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటు కోసం హజారేతో కలసి పోరుతూనే ఉన్నా రు. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ మారకుండా, కనీసం ఆ చట్టం పరిధిలో అయినా సంస్కరణలు చోటు చేసుకుంటే తప్ప కేజ్రీవాల్ ఆ విషయంలో చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. అలాగే వామపక్షాల అనైక్యత వల్ల తృతీ య ఫ్రంట్ ఏర్పాటు రూపుదాల్చకుండా వాయిదా పడుతున్న ఈ సంధి దశలో ప్రజలు ‘ఆప్’ను ఒక తాత్కాలిక దశగా భావించి ఉండవచ్చు కూడా. పలు రాష్ట్రాలలో ఆప్ కార్యకలాపాలను సాగిస్తుండడం వల్ల భవిష్యత్‌లో గుణాత్మకమైన మార్పునకు దోహదం చేయవచ్చు. ఈలోగానే, దేశంలో మూడో బలమైన ప్రత్యామ్నాయ సమైక్య రాజకీయ సంఘటన నాయకత్వం లో వేదిక ఏర్పాటు కావడానికి ఆప్ ఉద్యమం దోహదకారి కావచ్చు కూడా. ఇటీవల కాలంలో యువతను విశేషంగా ఆకర్షించిన రాజకీయ పక్షం ఆప్. ఇది ఊదర ద్వారా వచ్చిన వాపు కూడా కాదు. పార్టీ నిర్మాణంలో భాగంగా ఒక తటస్థ శక్తితో పార్టీ నిర్వహణ తీరుతెన్నులను నిష్కర్షగా విమర్శించి, సలహాలు ఇవ్వగల అంబుడ్స్‌మన్‌ను నియమించాలని అనుకోవడం కేజ్రీవాల్ ప్రజాస్వామిక దృష్టికి నిదర్శనమే. ప్రజా ప్రయోజనాలకు సమాచార హక్కు చట్టాన్ని చక్కగా వినియోగించుకున్న వ్యక్తి కేజ్రీవాల్. లోపాలూ గుర్తించాల్సిందే ఈ విజయాలూ, ఈ సిద్ధాంతాలు చూసినంత మాత్రానే ఆప్ వామపక్ష జాతీయ ప్రజాతంత్ర ఐక్య సంఘటనకు శాశ్వత ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడగలదని భావించలేం. కానీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కశ్మీర్లో రాజకీయ సమీకరణలను కూడా ప్రభావితం చేసే అవకాశమే ఉంది. 370 అధికరణను రద్దు చే సి, ఆ రాష్ర్ట ప్రత్యేక ప్రతిపత్తిని నీరుగార్చాలని బీజేపీ ఆశ. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గినట్టే కనిపిస్తూ అక్కడ సాధించిన కొద్దిపాటి సీట్లతో రాజకీయాలను ప్రభావితం చేయాలని బీజేపీ యోచన. పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్‌తో (పీడీఎఫ్) కలసి కశ్మీర్లో అధికారం పంచుకుందామని కలలు కంటున్న బీజేపీకి ఢిల్లీ ఫలితాలు ఒకింత నిరాశ మిగిల్చినా ఆశ్చర్యం లేదు. ఢిల్లీ ప్రజల తిరస్కారంతో పీడీఎఫ్బీజేపీతో అధికారం పంచుకొనే ప్రయత్నాన్ని విరమించుకోవచ్చు. పంజాబ్, ఈశాన్య భారతం, మధ్య భారత రాష్ట్రాలలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ క్రమంగా దక్షిణ భారతావనిని కూడా కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో ఉంది. కానీ ఢిల్లీలో చీపురు తెచ్చిన ప్రభావంతో ఆయా రాష్ట్రాలలో కూడా సమీకరణలు మారే అవకాశమే ఎక్కువ. నిజానికి హజారే, కేజ్రీవాల్‌ల తొలి రాజకీయ మొగ్గు బీజేపీ వైపే ఉన్నా, గతంలో చేసిన తప్పులను పునరావృతం కానివ్వబోనని ఆయన ప్రకటించారు. ఇది హర్షణీయం. భారత రాజకీయాలలో విప్లవకర మార్పుల కు ఎదురు చూడవచ్చునంటూ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపు ఒక ఆశగానే మిగిలిపోరాదు. ఎందుకంటే ఇంత ఆధిక్యంతో వచ్చే దూకుడును అదుపు చేసుకోవడం కూడా ఆప్‌కు పెనుసవాలే. (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
‘ఆప్’ సునామీ!
జానపద గాథల్లో, కలల ప్రపంచంలో మాత్రమే సాధ్యమయ్యే అద్భుత విజయాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సొంతం చేసుకుంది. మంగళవారం వెలువడిన ఫలితాలు కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు నేతృత్వం వహిస్తున్న బీజేపీని దిగ్భ్రమపరచడమే కాదు...విజేత ఆప్‌ను కూడా సంభ్రమాశ్చ ర్యాల్లో ముంచెత్తాయి. ఆప్ విజయాన్ని ఊహించిన సర్వేలు సైతం జనం ఇచ్చిన తీర్పు ముందు వెలవెలబోయాయి. అవన్నీ ఆప్‌కు పాలించడానికి చాలినన్ని స్థానాలను మాత్రమే ఇస్తే...ఢిల్లీ ప్రజానీకం ఆ పార్టీని అత్యున్నత శిఖరాగ్రాన కూర్చోబెట్టారు. 70 స్థానాలుండే అసెంబ్లీలో ఆప్‌కు 67 స్థానాలు లభించడ మంటే... మొత్తం స్థానాల్లో 95.7 శాతం ఆ పార్టీవే కావడమంటే... పోలైన ఓట్లలో 54.30 శాతం సొంతం కావడమంటే మాటలు కాదు. బహుశా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయం బీజేపీ తలకెక్కి ఉండకపోతే...దాని ప్రభావంతో అది వరస తప్పుటడుగులు వేయకపోతే ఆప్‌కు ఈ స్థాయి గెలుపు సాధ్యమయ్యేది కాదేమో! పుట్టి రెండేళ్లయినా కాని ఆప్ ఏడాదిన్నర వ్యవధిలో దిగ్గజాలనదగ్గ రెండు ప్రధాన పార్టీలను మట్టి కరిపించడం అసాధారణం. అపూర్వం! సరిగ్గా నెలక్రితం- ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడానికి మూడు రోజుల ముందు జరిగిన తొలి ఎన్నికల ప్రచార సభలోనే ప్రధాని నరేంద్ర మోదీ కేజ్రీవాల్‌పై నిప్పులు చెరిగారు. ఆయన్ను నక్సలైటన్నారు...అరాచకవాదన్నారు. ఇలాంటి వ్యక్తి ఉండాల్సింది అడవుల్లోనేనన్నారు. పాలనకు కాదు...ధర్నాలకు మాత్రమే పనికొస్తాడన్నారు. ఆ రోజునుంచీ బీజేపీ నేతలందరికీ కేజ్రీవాల్ లక్ష్యమ య్యారు. తమకు సీఎం అభ్యర్థంటూ ఎవరూ లేరని చెప్పుకొచ్చిన పార్టీ హఠాత్తుగా కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవడంతో ఆగక ఆమెకు సీఎం అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది. ఇది చాలదన్నట్టు పెద్దయెత్తున పార్టీ ఎంపీలనూ, ఎమ్మెల్యేలనూ అక్కడ దించారు. కేంద్ర మంత్రులు ప్రతి రోజూ ఆప్‌కు అయిదేసి ప్రశ్నలు చొప్పున సంధిం చారు. బీజేపీ నేతల ప్రసంగాల తీరు ఆ పార్టీ వ్యతిరేకులందరినీ ఒక్కచోటుకు చేర్చింది. ఆప్ నెగ్గడంకంటే కూడా బీజేపీ ఓడిపోవడమే ఏకైక ధ్యేయమన్నట్టు అన్ని వర్గాలూ పనిచేశాయి. అభివృద్ధి ఎజెండాగా లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన సంగతిని విస్మరించి అందుకు విరుద్ధమైన ఘర్‌వాపసీ, హిందూ జనాభా పెంపు వంటి అంశా లను కొందరు బీజేపీ నేతలు చర్చకు తీసుకురావడం చాలామందికి రుచించలేదు. దేశానికి ఢిల్లీ రాజధాని నగరమే కావొచ్చుగానీ అది ఒక చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. అదే సమయంలో 70 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్న రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో ఎన్నికలను వాటి మానాన వాటిని జరగనిచ్చి ఉన్నా ఇప్పటిలా అధికారం సాధ్యమయ్యేది కాదేమోగానీ...మూడు స్థానాలు మాత్రమే లభించే దుర్గతి మాత్రం ఖచ్చితంగా తప్పేది. చేజేతులా ఈ ఎన్నికలను మహా సంగ్రామంగా...అరవింద్ కేజ్రీవాల్‌ను మహా ప్రత్యర్థిగా మార్చుకున్న ఘనత బీజేపీదే! ఒక్కసారి వెనక్కివెళ్లి చూస్తే... 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 31 స్థానాలు గెల్చుకున్న బీజేపీకి మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి ఏడు పార్లమెంటు స్థానాలూ సొంతమయ్యాయి. వీటిని అసెంబ్లీ స్థానాలకు వర్తింపజేసి లెక్కేస్తే ఆ పార్టీకి 60 లభించినట్టయింది. ఇలా ఏడాది వ్యవధిలోనే అక్కడ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోగలిగిన పార్టీ అంతకన్నా వేగంతో పతనమైం దంటే సాధారణమైన విషయం కాదు. యుద్ధంలో దిగే పక్షానికి తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో తెలియాలి. వారి వ్యూహం ఎలాంటిదో అంచనాలుండాలి. అందుకను గుణంగా తన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఢిల్లీలో ప్రధాన ప్రత్యర్థిని సరిగానే పోల్చుకున్నా వారి వ్యూహాన్ని, పోకడలను ఆకళింపు చేసుకునే క్రమంలో బీజేపీ ఘోర తప్పిదాలకు పాల్పడింది. ఇది కేజ్రీవాల్‌కూ, మోదీకీ మధ్య జరిగే సంగ్రామమని ఆప్ చెప్పగానే...దాన్నుంచి తప్పించుకోవడానికి అచ్చం కేజ్రీవాల్ తరహాలోనే అవినీతి వ్యతిరేకోద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకుని ఆమెకు సీఎం అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అవలీలగా ఎదుర్కోగలిగిన సమర్ధ నేతలు పార్టీలో ఉండగా బయ టినుంచి బేడీని తీసుకురావడం శ్రేణులకు మింగుడుపడలేదు. ఈ అసంతృప్తి వారిలో నానాటికీ పెరిగిపోగా...ఆమెను తీసుకురావడానికి గల మూల కారణాన్నే బీజేపీ నేతలు మరిచారు. ఢిల్లీని సురక్షిత నగరంగా మార్చడానికి మాజీ పోలీసు అధికారిణిగా ఆమె మాత్రమే సరైనవారన్న భావనతో సీఎం అభ్యర్థిగా తీసుకొచ్చా మని చెప్పుకున్నారు. సహజంగానే పోలీసు అధికారిణిగా తీస్‌హజారి కోర్టు న్యాయ వాదులపై లాఠీచార్జి చేయించడం మొదలుకొని ఆమె తీసుకున్న కఠిన చర్యలన్నీ చర్చకొచ్చాయి. అటు కేజ్రీవాల్ ‘పొరుగింటి మనిషి’గా కనిపిస్తూ, గతంలో తమవైపు నుంచి జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పారు. తాము ఎలాంటి ఢిల్లీని రూపొందించదల్చుకున్నామో ఓటర్లకు వివరించారు. వారు నిత్యం ఎదుర్కొనే మంచినీరు, విద్యుత్తు వంటి అంశాల గురించి మాట్లాడారు. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి లభిస్తే ఎన్ని సమస్యలు పరిష్కారం కాగలవో అవగాహన కల్పించారు. అదే సమ యంలో క్రితం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘రాష్ట్ర ప్రతిపత్తి’ అంశాన్ని బీజేపీ ఈసారి విస్మరించడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఆప్ కార్యకర్తలు గడపగడపకూ పార్టీ సందేశాన్ని చేరిస్తే...అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న బీజేపీ శ్రేణులు తమ నాయకగణం చేసిన తప్పులతో నైతిక సై్థర్యం కోల్పోయి జనాన్ని ఒప్పించలేకపోయాయి. ఇక వరస వైఫల్యాలతో చేవ చచ్చిన కాంగ్రెస్... అచ్చం ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఢిల్లీలో కూడా సున్నా చుట్టింది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే అయినా బీజేపీ పొందిన ఓటమి అసాధారణమైనది. ఇది ఆ పార్టీకి మాత్రమే కాదు...విజయగర్వంతో తప్పిదాలకు పాల్పడుతున్న పాలక పార్టీలన్నిటికీ పెద్ద గుణపాఠం. -
కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి మోదీ!
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికార ప్రతినిధి ఆశిష్ కైతాన్ తెలిపారు. ఈనెల 14న ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వాకారం చేయనున్నారు. లోక్ పాల్ అంశంపై సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున సీఎం పదవికి కేజ్రీవాల్రాజీనామా చేశారు. రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. 70 సీట్లున్న ఢిల్లీ శాసనసభలో 67 స్థానాల్లో విజయం సాధించి ఆప్ చరిత్ర సృష్టించింది. బీజేపీ కేవలం 3 సీట్లు గెలవగా, కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. -
వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నకిరణ్ బేడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో నిలిచిన కిరణ్ బేడీ వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆమె అంతకుముందు క్షమాపణ చెప్పారు. బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమెకు వై-ప్లస్ సెక్యురిటీ కల్పించారు. తనకిక వై-ప్లస్ సెక్యురిటీ అవసరం లేదని, రేపటి నుంచి భద్రతాధికారులు రావాల్సిన అవసరం లేదని సెక్యురిటీ సిబ్బందితో కిరణ్ బేడీ అన్నారు. తనకు భద్రత కల్పించిన సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
'హస్తిన వాసుల హృదయాలు గెలవాలి'
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సాధించిన విజయం చరిత్రాత్మకం అని యోగా గురువు బాబా రాందేవ్ పేర్కొన్నారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేజ్రీవాల్ అమలు చేస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'ఢిల్లీ ఎన్నికల్లో చరిత్రాక మహావిజయం సాధించినందుకు కేజ్రీవాల్ కు అభినందనలు. మంచి పనితీరు కనబరిచి ఢిల్లీ వాసులు విశ్వాసాన్ని, హృదయాలను ఆయన గెల్చుకుంటారని ఆశిస్తున్నా' అని రాందేవ్ వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీని రాందేవ్ బహిరంగంగా ప్రశంసించిన విషయం విదితమే. -
'నా భార్యకు బీజేపీ కేడర్ సహకరించలేదు'
చండీగఢ్: బీజేపీ కేడర్ సహకరించకపోవడం వల్లే పార్టీ పరాజయం పాలైందని ఆ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ భర్త బ్రిజ్ బేడీ అన్నారు. గత ఎన్నికల్లో క్రిష్ణానగర్ నియోజక వర్గం నుంచి హర్షవర్థన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ అదే నియోజక వర్గం నుంచి బరిలో నిలిచిన కిరణ్ బేడీ 2200 ఓట్ల తేడాతో ఓటమి చెందింది..అంటే బీజేపీ కేడర్ సహకరించలేదనే విషయం స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి 17 రోజుల ముందు కిరణ్ బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఆప్ శాసనసభా పక్ష నేతగా కేజ్రీవాల్
-
ఆప్ శాసనసభా పక్ష నేతగా కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. శాసనసభలో తమ నాయకుడిగా కేజ్రీవాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ నెల 14న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. 70 సీట్లున్న శాసనసభలో ఆప్ 67 స్థానాల్లో జయభేరీ మోగించింది. బీజేపీ కేవలం 3 సీట్లు గెలవగా, కాంగ్రెస్ బోణీ కొట్టలేకపోయింది. -
కాంగ్రెస్‌లో కలవరం!
-
మధ్యతరగతి బ్రహ్మరథం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని బీద బిక్కీ, బడుగువర్గాలు, కార్మికులు, కర్షకులతోపాటు దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ వెంటే నడుస్తారని, ఆ పార్టీకే ఓటు వేస్తారని సామాజిక విశ్లేషకులు ముందుగానే భావించారు. ఇక మధ్యతరగతి ప్రజలు, సంపన్న వర్గాలు సంప్రదాయంగా భారతీయ జనతా పార్టీకే మద్దతిస్తాయని సామాజిక విశ్లేషకులతోపాటు రాజకీయ వర్గాలు భావించాయి. ఫలితాల సరళిని విశ్లేషిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బడుగువర్గాలతోపాటు మధ్యతరగతి ప్రజలు కూడా ఆమ్ఆద్మీ పార్టీకే బ్రహ్మరథం పట్టాయి. సంపన్న వర్గాల్లో మాత్రమే కొద్దిగా బీజేపీ పైచేయి కనబర్చింది. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దర్యా గంజ్, జనక్‌పురి, కరోల్ బాగ్, చాందినీ చౌక్, పజర్గంజ్, మోతీనగర్ ప్రాంతాలు ఆప్‌కు బ్రహ్మరథం పట్టాయి. ఈ ప్రాంతాల్లో ఆప్ అభ్యర్థులకు 60 శాతంపైగా ఓట్లు పడ్డట్టు విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లోనే బీజేపీకి ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈసారి కూడా ప్రధాని మోదీ సుస్థిర పాలన నినాదాన్ని నమ్మి తమకే ఓటు వేస్తారని బీజెపీ వర్గాలు భావించి భంగపడ్డాయి. ఈసారి ఎన్నికల ఫలితాల్లో మరో ఆశ్చర్య కోణం బయటపడింది. సంప్రదాయబద్ఢంగా బీజెపీ మద్దతుదారులైన వ్యాపార వర్గం కూడా ఆప్ వెంటే నడిచింది. దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దిల్షాద్ కాలనీ, బీఆర్ బెద్కర్ నగర్ కాలనీ, గోవింద్ పురి లాంటి ప్రాంతాల్లో ఓటర్లు ఊహించినదానికన్నా ఎక్కువే ఆప్‌కు మద్దతిచ్చారు. ఇక సంపన్న వర్గాలు నివసించే ఫ్రెండ్స్ కాలనీ, వసంత్ విహార్, గోల్ఫ్ లింక్స్, డిఫెన్స్ కాలనీ, గ్రేటర్ కైలాష్, హౌజ్‌ఖాస్, వసంత్ కుంజ్, లజ్‌పత్ నగర్, పంజాబీబాగ్ ప్రాంతాల్లో బీజెపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఢిల్లీలో పార్టీల వారీగా మొత్తం ఓటింగ్ శాతం ఆప్: 54.3 శాతం.. 67 సీట్లు బీజేపీ: 32.2 శాతం.. 3 సీట్లు కాంగ్రెస్: 9.7 శాతం బీఎస్పీ: 1.3 శాతం ఐఎన్ఎల్డీ: 0.6 శాతం ఐఎన్డీ: 0.5 శాతం ఎస్ఏడీ: 0.5 శాతం నోటా: 0.4 శాతం -
''మహిళల భద్రతే మొదటి ప్రాధాన్యం''
-
అయ్యో పాపం...అమిత్ షా!
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుతం ఇక్కడ తన కుమారుడు జాయ్ షా పెళ్లి వేడుకల్లో తలమున్కలై ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ ఫిబ్రవరి ఏడవ తేదీన ముగిసిన వెంటనే ఆయన హుటిహుటిన పెళ్లి పనులను చక్చబెట్టుకోవడం కోసం పెట్టాబేడా పట్టుకొని వచ్చేశారు. పెళ్లికి తరలిరానున్న పార్టీ అథిరథ , మహారథుల కోసం నగరంలోని స్టార్ హోటళ్లలో వందలాది గదులను బుక్‌చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని, రెండు వేడుకలకు ఒకే వేదిక నుంచి ఘనంగా జరుపుకోవచ్చని మురిసిపోయారు. అయితే ఊహించని ఫలితాలు వెలువడడంతో పాపం ఆయన ముఖంకాస్త ముడుచుకుపోయే ఉంటుంది. ఎందుకంటే మంగళవారం ఉదయం వరకు కూడా పార్టీ నుంచి అథితులెవరూ నగరానికి చేరుకోలేదు. పార్టీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ పారీకర్ తదితరులు రావాల్సి ఉంది. ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కనిపించని వీరు పెళ్లికి బయల్దేరారా లేదా అన్న విషయం తెలియడంలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెళ్లికి వస్తారని స్థానిక బీజేపీ నాయకులు ఆశించారు. నగరానికి మోదీ రాక ఆయన షెడ్యూల్లో ఉందో, లేదో తెలియదుగానీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఇక ఆయన రారని అందరూ భావిస్తున్నారు. భద్రతా దళాలు మాత్రం పెళ్లి వేదిక వద్ద డాగ్ స్కాడ్లను దించి హడావిడి చేస్తున్నాయి. ఢిల్లీ ఫలితాలు వెలువడే రోజే తన కుమారుడు జాయ్ షా పెళ్లిని అమిత్ షా ఉద్దేశపూర్వకంగా పెట్టుకోలేదు. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక చాలా ముందే...అంటే గతేడాది జూలై నెలలోనే కుమారుడి పెళ్లి ఖాయం చేసుకున్నారు. జాయ్ షా తన క్లాస్మేట్ రుషితా పటేల్‌ను ఈ రోజు రాత్రికి పెళ్లి చేసుకుంటున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పెళ్లి వేడుకలను నిరాడంబరంగానే ముగించి ఈనెల 15వ తేదీన ఢిల్లీలో జరుగనున్న రిసెప్షన్‌ను మాత్రం ఘనంగా నిర్వహించాలని అమిత్ షా భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. -
28-4-67.. ఇదీ ఆప్ ప్రస్థానం
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్.. కోట్లాది అభిమానులున్న సినీ హీరో కాదు. రాజకీయ వారసుడు అంతకన్నా కాదు. అతనో సామాన్యుడు. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి అవినీతికి వ్యతిరేకంగా పోరుబాటపట్టారు. అన్నా బృందంతో పనిచేసి ఆనక రాజకీయాల్లోకి వచ్చారు. సామాన్యుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి రాజకీయ నాయకుడిగా మారారు. ప్రజాభిమానంతో నేడు అసమాన్యుడిగా, ప్రజాదరణ గల నేతగా ఈ ఢిల్లీ వాలా ఎదిగారు. కేజ్రీవాల్ 2012 నవంబర్ 26న ఆప్‌ను స్థాపించారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సంచలనం సృష్టించింది. 70 సీట్లున్న ఢిల్లీలో అసెంబ్లీలో 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతులో 2013 డిసెంబర్ 28న కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే కేవలం 49 రోజులే ముఖ్యమంత్రిగా పనిచేశారు. జన లోక్‌పాల్ బిల్లు విషయంలో కాంగ్రెస్‌తో విభేదించి కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేశారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆప్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే 434 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆప్ పంజాబ్ లో 4 చోట్ల విజయం సాధించింది. ఆ తర్వాత కేజ్రీవాల్‌పై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆయన నియంతృత్వ పోకడలు అవలంభిస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. సహచరులు కూడా కొందరు పార్టీని వీడారు. కేజ్రీవాల్ ఛరిస్మా తగ్గిందని భావించారు. అయినా కేజ్రీవాల్ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ముందుండి పార్టీని నడిపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. బీజేపీ తరపున కేంద్రమంత్రులు, 120 మంది ఎంపీలు ప్రచారం చేశారు. ఆప్ తరపున మాత్రం కేజ్రీవాల్ అన్నీతానై నడిపించారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌ను, కేజ్రీవాల్‌ను విశ్వసించారు. ఎవరూ ఊహించని ఘనవిజయం అందించారు. గతంలో 28 సీట్లు గెల్చుకున్న ఆప్ తాజా ఎన్నికల్లో 67 స్థానాల్లో విజయం సాధించింది. తాజా విజయంతో భారత రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. -
అరవింద్ కేజ్రీవాల్ కు జెడ్ కేటగిరి భద్రత
న్యూఢిల్లీ: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భద్రత మరింత పెంచనున్నారు. కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరి భద్రతను ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. ఆయన రక్షణ కోసం కనీసం 30 కమెండోలను కేటాయించనున్నటు ఓ పోలీస్ అధికారి చెప్పారు. ఆప్ శాసనసభ పక్ష నేతగా కేజ్రీవాల్ ఎన్నికైన వెంటనే జెడ్ కేటగిరి భద్రత కల్పించనున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరి భద్రత ఏర్పాటు చేస్తారు. గజియాబాద్‌లో నివాసం ఉంటున్న కేజ్రీవాల్‌కు ప్రస్తుతం 12 మంది పోలీసులు భద్రతగా ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సంచలన విజయం సాధించింది. 70 సీట్లున్న అసెంబ్లీలో ఆప్ 67 స్థానాల్లో జయభేరి మోగించింది. -
'ఆప్' విజయోత్సవాలు
-
సర్వేలకు అందని అ'సామాన్య' విజయం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు తొలుత హోరాహోరీ తలపించింది. ఆమ్ ఆద్మీ పార్టీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఆ తర్వాత ఆప్‌ది కాదు బీజేపీదే విజయమని మరికొన్ని సర్వేలు తేల్చాయి. ఎన్నికల ముగిసిన అనంతరం అన్ని సర్వేలు ఆప్కే పట్టం కట్టాయి. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తుందని ముక్తకంఠంతో చెప్పాయి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలు పేర్కొన్నాయి. అయితే ఆప్ ఇంతటి ఘనవిజయం సాధిస్తుందని సర్వేలు, రాజకీయ పండితులు సైతం ఊహించలేకపోయారు. బీజేపీకి ప్రతిపక్ష స్థానం కూడా రాదని అంచనా వేయలేకపోయారు. ఆప్‌ది సర్వేలకు సైతం అందని అసమాన్య విజయం. కేజ్రీవాల్ ఛరిస్మా ముందు మోదీ హవా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం, కిరణ్ బేడీ నేపథ్యం.. ఏవీ పనిచేయలేకపోయాయి. ఢిల్లీ ఎన్నికల చరిత్రలోనే ఆప్ సంచలన విజయం సాధించింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 67 చోట్ల విజయం సాధించింది. బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ బోణీ కూడా కొట్టలేకపోయింది. ఆప్ విజయం.. అరవింద్ కేజ్రీవాల్, సామాన్యుడి విజయం. ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇండియా టుడే-సిసిరో సర్వే: ఆప్ 35-43; బీజేపీ 23-29; కాంగ్రెస్ 3-5 టైమ్స్ నౌ- సీఓటర్ సర్వే: ఆప్ 31-39; బీజేపీ 27-35; కాంగ్రెస్ 2-4 ఎన్డీటీవీ సర్వే: ఆప్ -38; బీజేపీ 28; కాంగ్రెస్ 4 ఏబీపీ నీల్సన్ సర్వే: ఆప్ 39; బీజేపీ 28; కాంగ్రెస్ 3 న్యూస్ నేషన్ సర్వే: ఆప్ 39-43; బీజేపీ 25-29; కాంగ్రెస్ 1-3 -
ఢిల్లీలో ఆప్ క్లీన్ స్వీప్.. 67 స్థానాల్లో విజయం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. ఆప్ సృష్టించిన సునామీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోయాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం మూడు సీట్లు గెల్చుకుని ప్రతిపక్ష హోదా కూడా సాధించకపోగా, కాంగ్రెస్ పార్టీ అయితే బోణీ కూడా కొట్టలేకపోయింది. సోమవారం ఉదయం మొదలైన కౌంటింగ్ మధ్యాహ్నానికి పూర్తయ్యింది. మొత్తం 70 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. కేజ్రీవాల్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నుపుర్ శర్మపై 31,583 ఓట్ల తేడాతో గెలిచారు. కాగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు. బీజేపీకి కంచుకోటలాంటి కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె ఆప్ అభ్యర్తి ఎస్కే బగ్గా చేతిలో 2277 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయ శర్మిష్ఠ ఘోరపరాయం పాలయ్యారు. ఆమెకు కేవలం 6 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఆప్ కార్యకర్తుల సంబరాల్లో మునిగిపోగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దగ్గర నిర్మానుష వాతావరణం కనిపించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. -
ఫలితాలు మార్పును సూచిస్తున్నాయి: జెపి
-
అన్ని పార్టీలు ఏకమైయాయి: టిఎస్ బిజెపి
-
ఇప్పటివరకూ ఢిల్లీ సుల్తానులు
న్యూఢిల్లీ: ఢిల్లీ విస్తీర్ణం ఒక వేయి 484 చదరపు కిలో మీటర్లు. ఢిల్లీ రాజకీయ చరిత్రను ఓసారి చూస్తే.. ఇప్పటి వరకు ఏడుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు. ఢిల్లీకి తొలి సీఎం చౌదరి బ్రహ్మ ప్రకాశ్. 1952లో ఐఎన్సి తరఫున ఆయన సీఎంగా ఎన్నికయ్యారు. హస్తినను పాలించిన సీఎంలలో పిన్న వయస్కులు బ్రహ్మ ప్రకాశ్. ఢిల్లీ సీఎం పగ్గాలు చేపట్టేనాటికి బ్రహ్మ ప్రకాశ్ వయస్సు 34 సంవత్సరాలు. 1956లో ఓసారి.. 2014లో ఓసారి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. దాదాపు 37 ఏళ్లు పాటు ఢిల్లీకి సీఎం లేరు. 1956 నుంచి 1993 వరకు సీఎం లేకుండానే ఢిల్లీలో పాలన సాగింది. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంతవరకు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన వారు.. 1.చౌధునీ బ్రహ్మ ప్రకాశ్ 1952-55 2.గురుముఖ్ నీహాల్ సింగ్ 1955-56 3.మదన్ లాల్ ఖురానా 1993-96 4.సాహిబ్ సింగ్ వర్మ 1996-98 5. సుష్మా స్వరాజ్ 1998-98 (52 రోజులు) 6.షీలా దీక్షిత్ 1998-2013 7.అరవింద్ కేజ్రీవాల్ 2013-2014 (49 రోజులు) 8.అరవింద్ కేజ్రీవాల్ 2015 నుంచి ఎవరెన్ని రోజులు ? కేవలం 49 రోజులే కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగారు. ఆయన తర్వాత స్థానం సుష్మా స్వరాజ్‌ది. ఆమె 52రోజులు ఢిల్లీ సీఎంగా ఉన్నారు. పార్టీ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వాన్ని స్థాపించిన పొలిటికల్ పార్టీగా ఆమ్ ఆద్మీ రికార్డు స్థాపించింది. 2012 నవంబర్‌లో ఆప్ ఆవిర్భవించగా.. 2013 డిసెంబర్లో ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టింది. -
కిర్రాకు పుట్టించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ కిర్రాకు పుట్టించారు. ఢిల్లీని కైవసం చేసుకుని తాను ఎవరికీ కొరుకుడుపడనని చెప్పేశారు. మీడియాను కాదు.. ప్రజలను నమ్ముకోవాలని పరోక్షంగా కేజ్రీవాల్ విజయం గొప్ప సందేశాన్ని రాజకీయ పార్టీలకు పంపారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండేవాళ్లనే ఓటర్లు నమ్ముతారని ఆప్ విజయం చెబుతోంది. చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం...ఉన్న 49 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి.. పడిన తాపత్రయాన్ని ఢిల్లీ గుర్తించే ఇంతటి భారీ విజయాన్ని చూకూర్చి పెట్టారని విశ్లేషకులు అంటున్నారు. ఎన్ని రోజులు పాలించం కాదు..ఎలా పాలించామనేది ఢిల్లీ ఓటర్లు పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేసినట్లు కనిపిస్తోంది...14 వేల ఓట్ల తేడాతో కిరణ్ బేడీ కృష్ణా నియోజకవర్గంలో వెనకబడింది. -
100కి 95 మార్కులేశారు..
న్యూఢిల్లీ: తలచుకుంటే ఏదైనా సాధ్యం చేస్తానని సామాన్యుడు మరోసారి నిరూపించాడు. సామాన్యుడి పేరుతో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సునామీ సృష్టించింది. ఏ వేవ్ లేని చోట ఓట్ల వేవ్ సృష్టించింది. భారీ మెజార్టీతో దేశాన్ని ఏలుతున్న కమలనాథుల్ని కంగు తినిపించింది. సింగిల్ డిజిట్‌కే బీజేపీని పరిమితం చేశాడు సామాన్యుడు. ఇంత భారీ మెజార్టీ సాధిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఊహించి ఉండదు. ఢిల్లీలో ఓట్లేసిన 89 లక్షల మందిలో సగం కంటే ఎక్కువ మంది ఆమ్ ఆద్మీ పార్టీకే ఓట్లేశారు. ఇంత తీవ్రమైన వ్యతిరేకత తమపై ఉందని బీజేపీ కూడా ఊహించి ఉండదు. ఆప్ సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు ఫుల్ మార్కులు వేశారు. పాసవుదామని కలలు కన్న ఆమ్ ఆద్మీని డిస్టింక్షన్లో పాస్ చేయించారు. వందకు 95 మార్కులు వేశారు. 15 ఏళ్లు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్‌కు ఈసారి అసెంబ్లీలో ప్రాతినిధ్యమే ఉండని పరిస్థితి. -
అప్పుడు షీలా....ఇప్పుడు బేడీ
న్యూఢిల్లీ : ఢిల్లీ పీఠానికి పోటీపడిన బీజేపీ అభ్యర్థి కిరణ్ బేడీని.. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ 'చీపురు'తో ఊడ్చేశారు. 2013 ఎన్నికల్లో అప్పటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్.. అరవింద్ కేజ్రీవాల్‌తో పోటీపడి డీలా పడితే.. తాజా ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఉన్న కిరణ్ బేడీ బోల్తా పడ్డారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కిరణ్ బేడీ ఆప్ అభ్యర్థి బగ్గా చేతిలో 2277 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా 2013 ఎన్నికల్లో షీలా దీక్షిత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. మూడు సార్లు సీఎంగా గెలిచిన షీలా ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ దెబ్బకు ఓటమిని మూటకట్టుకున్నారు. కనీసం ఆమె పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. -
మోదీ 'ఆప్'లేకపోయారు..
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాలి వీస్తున్నా ఢిల్లీ వాసులు మాత్రం అందుకు భిన్నంగా తీర్పునిచ్చారు. ఎంతో మంది బీజేపీ ప్రముఖులు ప్రచారం చేసినా ఫలితం మాత్రం 'ఆప్' వైపే వచ్చింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహించినా అరవింద్ కేజ్రీవాల్‌ను 'ఆప్'లేకపోయారు. ద్విముఖ పోరు అనుకున్నారు కానీ ఏకపక్షంగా సాగిందనే చెప్పాలి. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీకి తొలి ఎదురుదెబ్బ. సాధారణ ఎన్నికల తర్వాత బీజేపీ ముఖ్యంగా మోదీ జైత్రయాత్ర నిన్నటిదాకా కొనసాగింది. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌లలో బీజేపీ అఖండ విజయం సాధించగా, కశ్మీర్లో పీడీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా మంత్రం పనిచేసింది. అయితే ఢిల్లీలో ఇది వికటించింది. అంతేగాక బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. -
బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి
-
తేదీ అదే.. 'ఫలితం' మాత్రం వేరు!
న్యూఢిల్లీ: కొన్ని సందర్భాల్లో సంఖ్యలు ఎంతటి ప్రభావం చూపిస్తాయో అనే దానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ఎపిసోడ్ ను ఒకసారి తిరగేస్తే సరిపోతుందేమో. 2013 డిసెంబర్ 28వ తేదీన కేజ్రీవాల్ సీఎంగా హస్తిన గద్దెను అధిరోహించినా.. అది మూన్నాళ్ల ముచ్చటిగానే మిగిలిపోయింది. కేవలం 49 రోజులు మాత్రమే సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ఆ పదవికి రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆ తరువాత ప్రధాన పార్టీలు ఢిల్లీ గద్దెనెక్కడానికి యత్నించినా అక్కడ రాష్ట్రపతి పాలనే అనివార్యమైంది. అయితే 2015 ఫిబ్రవరి 7వ తేదీన ఢిల్లీకి మరోసారి జరిగిన ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఫిబ్రవరి 10వ తేదీన విడుదలైన ఫలితాల్లో ఆప్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పదవి చేపట్టిన కేజ్రీవాల్ 2014 ఫిబ్రవరి 14వ తేదీన ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే మరోసారి ఢిల్లీకి జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కేజ్రీవాల్ అదే తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితుల్లో వేరైనా తేదీలు మాత్రం ఒకటే. ఇది యాధృచ్చికంగా జరిగిందని భావించినా.. ఆ తేదీ కేజ్రీవాల్ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందనే వాస్తవాన్ని మాత్రం అంగీకరించాలి. -
కేజ్రీవాల్ పాంచ్ సాల్...
*'చలో మోడీకే సాథ్'.. ఢిల్లీలో ఎక్కడ చూసినా ఇవే పోస్టర్లు. *'కేజ్రీవాల్ పాంచ్ సాల్'.... వాడవాడలా మార్మోగిన పాట ఈ రెండింటి మధ్య పోరులో విజయం ఎవరిదనే ఉత్కంఠతకు తెరపడింది. మోడీ వెంట నడవటానికి ఢిల్లీ ప్రజలు ఇష్టపడలేదు. ఎపుడెలా వ్యవహరిస్తారో అంతు చిక్కని సాంప్రదాయ రాజకీయ వ్యూహాలకు భిన్నంగా ఎత్తుగడలు వేసే మాజీ ఐఆర్ఎస్ అధికారి వెనకే ఢిల్లీ ఓటర్లు కలిసికట్టుగా నడిచారు. ఎగ్జిట్ పోల్స్ కాదు.. ఎగ్జాక్ట్ రిజల్ట్ కోసం వేచి చూడండని గంభీరాలు పలికిన వెంకయ్యనాయుడు లాంటి రాజకీయ ఉద్ధండుల అంచనాలని తలకిందులు చేశారు. దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇంతటి ఏకపక్ష ఫలితాలను ఊహించి ఉండదు. ఒక సునామీ లాగా ఆప్.. బీజేపీని, కాంగ్రెస్ ని తుడిచిపెట్టేసింది. బీజేపీకి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కలేదంటే 'ఆప్'ను ఓటర్లు ఎంతగా విశ్వసించారో అర్థమవుతోంది. కనీసం ఒక్క స్థానం కూడా దక్కించుకోని దుస్థితి కాంగ్రెస్ పార్టీది. "నరేంద్రమోదీని కేజ్రీవాల్ నిలువరించారు. అది మాకు సంతోషం" అని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించడం 129 ఏళ్ల జాతీయ పార్టీ భావ దారిద్ర్యానికి అద్దం పడుతుంది. ఆత్మ విమర్శ చేసుకోవడానికి కూడా ఆ పార్టీకి ఏమీ మిగలలేదు. అటు ఫలితాలు వెలువడుతుండగానే కాంగ్రెస్ శ్రేణులు "ప్రియాంక కో లావో.. కాంగ్రెస్ బచావో' పల్లవిని ఎత్తుకున్నాయి. వరుస దెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి ఇది చావు దెబ్బ. " ఏ ఫైనల్ నెయిల్ ఇన్ ది కాఫిన్" అనుకోవచ్చు. తప్పంతా కిరణ్ బేడీదేనా? కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసి బీజేపీ తప్పు చేసిందా ? ఏ రాజకీయ వ్యవస్థపై ఉద్యోగంలో ఉన్నపుడు, పదవీ విరమణ చేసిన తరువాత కిరణ్ బేడి పోరాటం చేశారో.. ఆ రాజకీయ వ్యవస్థలో అదీ ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీలో చేరడం.. అందరు రాజకీయ నాయకులలాగే ఉపన్యాసాలు ఇవ్వడం ఢిల్లీ ఓటర్లు జీర్ణించుకున్నట్టులేదు. కిరణ్ బేడీ బీజేపీలోకి అన్న ఈ ప్రశ్న యువకుల్లో, మధ్య తరగతి ప్రజానీకంలో తలెత్తడం బీజేపీకి ప్రతికూలంగా పరిణమించింది. దానికి తోడు బీజేపీలో కిరణ్‌బేడికి సహాయ నిరాకరణ, అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని దారుణంగా దెబ్బతీసాయి. మనోజ్ తివారీ లాంటి నాయకులు పార్టీ నాయకత్వంపై మొదట్లోనే బహిరంగంగా విమర్శలు చేశారు. ఇలాంటి గొంతుకలను పార్టీ అధినాయికత్వం అణిచివేసినప్పటికీ ఓటర్ల నిర్ణయాన్ని మార్చలేకపోయింది. వెరసి 2014 మే నుండి అప్రతిహతంగా సాగుతున్న మోదీ జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. ఏం జరిగింది? ఎందుకిలా అయింది? పొరపాట్లు ఎక్కడ జరిగాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయం సాధించిన పార్టీ తొమ్మిది నెలల్లోనే ఎందుకిలా చావుదెబ్బ తింది. ఇవన్నీ అమిత్ షా ముందున్న ప్రశ్నలు. అమిత్ షా చాణుక్యం ఏమైంది? సామాన్య మానవుడి సంకల్పం ముందు ఎందుకు తలవంచాల్సి వచ్చింది. తప్పు ఒక్క కిరణ్ బేడీదా? లేక ప్రజల నాడిని పూర్తిగా పట్టుకోలేకపోయిన కాషాయ దళపతులదా? కొద్ది రోజుల పాటు కాషాయ పతాకధారుల గొంతుల్లో కషాయంలాగ మిలిగిపోయే ప్రశ్నలే... ఇంత భారీ విజయం టీం కేజ్రీవాల్‌కు ఆనందాన్ని కలిగించేదే? సందేహం లేదు. ఇది సామాన్యుడి విజయమే. అయితే ఈ భారీ విజయం పజలపై కేజ్రీవాల్‌పై ప్రజలకున్న భారీ అంచనాలను కూడా తేటతెల్లం చేసింది. పక్కా ఇళ్ల నుండి అవినీతి రహిత పాలన వరకు ప్రజల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ప్రతి క్షణం ప్రతి కదలికను ప్రతి అడుగును ప్రజలు గమనిస్తూనే .. ఈ అడుగులు మార్పు దిశగా ఉండాలని కోరుకుంటారు. కేజ్రీవాల్‌తో పాటు ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, అధికారులు పరుగులు తీయాలని తమ సమస్యలు తీర్చాలని ఆశపడతారు. ఎనభైయవ దశకంలో అస్సాం గణ పరిషత్ ఇలాంటి విజయాన్నే నడుచుకోవడంలో పూర్తిగా విజయం పొందలేదు. కేవలం 48 రోజుల పాలన అనంతరం 2013లో కొన్ని కారణాలు చూపించి కేజ్రీవాల్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఢిల్లీ ఓటర్లు ఆ తప్పును పూర్తిగా క్షమించి ఏకపక్ష విజయాన్ని కేజ్రీవాల్‌కు అందించారు. ఈసారి తప్పించుకోవడానికి, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళడానికి వీలులేకుండా అన్నిదారులు మూసేసి "కేజ్రీవాల్ పాంచ్ సాల్'' అన్నారు. ఈ అయిదు సంవత్సరాలు ప్రజల ఆకాంక్షల్ని తీర్చగలిగితే భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నవ శకానికి నాంది పలికిన వ్యక్తి అవుతారు కేజ్రీవాల్...లేకపోతే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీల పుట్టుకే ప్రశ్నార్థకమవుతుంది. -ఎస్. గోపినాథ్ రెడ్డి -
అ 'సామాన్యుడు'
న్యూఢిల్లీ: రాజకీయల్లోకి రాకముందు కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)లో ఆఫీసర్‌గా పనిచేశారు. పేదల పక్షాన నిలబడి వారి సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారు. సమాచార హక్కు చట్టాన్ని సామాన్య మానవుల ఆయుధంగా ఉపయోగపడేందుకు కృషి చేయడం ద్వారా 2006లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. హర్యానాలోని హిస్సార్‌లో 1968, ఆగస్టు 16న జన్మించిన కేజ్రివాల్ ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా చేరారు. మూడేళ్ల అనంతరం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 1992లో యూపీఎస్సీ పరీక్షలు రాసి రెవెన్యూ సర్వీస్‌లో చేరారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కూడా రాజకీమా చేసి ‘పీపుల్ కాజ్ ఫౌండేషన్’ పేరిట ఓ ఎన్జీవో ను ఎర్పాటు చేశారు. నాటి నుంచి పూర్తిస్థాయి సామిజిక కార్యకర్తగా మారిపోయిన కేజ్రివాల్ మృదు స్వభావి. శాకాహారి. ఎక్కడవున్న వెంట తెచ్చుకున్న ఇంటి భోజనమే తింటారు. తనతోపాటు ఐఆర్ఎస్లో చేరిన సునితను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కూతురు హర్ష, కుమారుడు పునిత్. అన్నా తో మరో పోరాటం దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి జాఢ్యాన్ని నిర్మూలిస్తేగానీ దేశం బాగుపడదని భావించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే పిలుపుకు స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ అన్నాకు అండగా నిలబడ్డారు. అవినీతిపరుల భరతం పట్టేందుకు పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం హజారోతో గొంతు కలిపారు. ఆయనతో కలిసి ధర్నాలు, దీక్షలు, వరుస ఆందోళనలు నిర్వహించారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం పటిష్టమైన లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే హజారే డిమాండ్‌ను ఆమోదించినప్పటికీ దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని అనతికాలంలోనే గ్రహించిన అన్నా అనుచరుడు అరవింద్ కేజ్రీవాల్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తేనేగానీ వ్యవస్థ ప్రక్షాళన కుదరదని భావించారు. ‘రాజకీయాలు ఓ బురద గుంట. అందులోకి దిగితే బయటకు రాలేం. సామాజిక కార్యకర్తలుగానే మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం’ అంటూ తన గురువు అన్నా హజారే చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా కేజ్రీవాల్ రాజకీయ కదన రంగంలోకి దిగారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా చీపురు పట్టారు. గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన తాను చేస్తున్న ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేశారు. ఢిల్లీ అపెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లను సాధించారు. ఊహించిన విధంగా సంపూర్ణ మెజారిటీ సాధించలేక పోయారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎంతోకాలం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేక పోయారు. 49 రోజుల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు. బీజేపీకి కంచుకోటలాంటి కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె ఆప్ అభ్యర్తి ఎస్కే బగ్గా చేతిలో పరాజయం పొందారు. కిరణ్ బేడీ 1150 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఓటమికి తానే బాధ్యత వహిస్తానని ఆమె పేర్కొన్న విషయం విషయం తెలిసిందే. కాగా అసలు బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం ఆ పార్టీ చేసిన తప్పుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వచ్చే వరకూ బీజేపీ పరిస్థితి బాగానే కనిపించనప్పటికీ.. కిరణ్ బేడీ ఎంపికతోనే పార్టీ డీలా పడిందనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఆ పార్టీ చేసింది చిన్నపాటి తప్పుగానే కొందరు చెబుతున్నప్పటికీ.. వెనక్కి తీసుకోలేనంత తప్పుగా మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ లాంటి చిన్న ఎన్నికను బీజేపీ భారీగా ఎంచుకోవడం ఆ వ్యూహాలు బెడిసి కొట్టాయనే ప్రధానంగా వినిపిస్తోంది. -
నిజాయితీకే పట్టం కట్టారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ : వాస్తవాలు, నిజాయితీకి దక్కిన విజయమని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన తొలిసారి మాట్లాడారు. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారుల సమక్షంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ నిజాన్ని నమ్ముకుని నడిస్తే ప్రపంచమే తమ వెంట వస్తుందన్నారు. నిజాయితీతో నడిస్తే ప్రపంచమే సహకరిస్తుందన్నారు. ఎన్నికల్లో ఆప్ విజయం ప్రజలదిగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇంత పెద్ద విజయాన్ని తాను ఊహించలేదన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలను మళ్లీ చేయనని, నిష్పక్షపాతంగా పాలన అందిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో అవినీతిని ఏరిపారేద్దామని...అవినీతిపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అహంకారం వల్లే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటమి పాలయ్యాయని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.