ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడడంతో నేతలంతా శుక్రవారం విశ్రాంతి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడడంతో నేతలంతా శుక్రవారం విశ్రాంతి తీసుకున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ, ఆప్ అభ్యర్థి కేజ్రీవాల్‌లు తమతమ నియోజకవర్గాల్లో గుళ్లకు వెళ్లి, పూజలు చేశారు. బేడీ ఉదయమే గురుద్వారాకు వెళ్లారు. భక్తుల కోసం చపాతీలు చేశారు. తాను అన్ని మతాలను నమ్ముతానని చెప్పారు. సాయంత్రం పటేల్ చౌక్ స్టేషన్ నుంచి నిర్మణ్ విహార్‌కు మెట్రో రైలులో ప్రయాణించారు. తాను సీఎం అయ్యాక మెట్రోల్లో భద్రతపై ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. ఇక కేజ్రీవాల్ పొద్దున లేవగానే యోగా చేసి హెయిర్ కటింగ్ చేయించుకున్నారు. గురుద్వారా, బిర్లా టెంపుల్‌కు వెళ్లారు. సత్యం, సామాన్యుడు గెలవాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ పోలింగ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు.