ఎన్నికల రాజకీయాల్లో ఓడిపోయా:కిరణ్‌ బేడీ | I failed the test of electoral politics: Kiran Bedi | Sakshi
Sakshi News home page

ఎన్నికల రాజకీయాల్లో ఓడిపోయా:కిరణ్‌ బేడీ

Published Mon, Feb 16 2015 10:01 PM | Last Updated on Tue, Aug 14 2018 5:15 PM

కిరణ్‌బేడీ - Sakshi

కిరణ్‌బేడీ

 న్యూఢిల్లీ: ఎన్నికల రాజకీయాల్లో తాను ఓడిపోయానని బీజేపీ నేత, ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్‌బేడీ తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత ఈ మాజీ ఐపీఎస్ అధికారి సోమవారం దానిపై  వివరణ ఇచ్చారు. శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ ఎన్నికల రాజకీయ పరీక్షలో గెలవలేకపోయానని ఆమె తన బ్లాగు ద్వారా విడుదల చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే, తాను మానసికంగా మాత్రం ఓడిపోలేదని ఆమె అన్నారు. తన అనుభవాన్ని పణంగా పెట్టి పోరాడినా అది సరిపోలేదని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రజలు ఆప్ ఇచ్చిన ఉచిత నీరు, విద్యుత్తు చార్జీల తగ్గింపు వంటి వాటివైపు మొగ్గు చూపారన్నారు. కానీ, వీటి వల్ల దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందన్నారు. కృష్ణానగర్ నియోజకవర్గంలో తన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని ఆమె అన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఓటమికి కారణం తాను కాదని, బీజేపీయేనని వ్యాఖ్యానించి కలకలం సష్టించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement