
'ఆ ఫలితాలు తప్పని రుజువు చేస్తాం'
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని రుజువు చేస్తామని బీజేపీ పేర్కొంది.
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని రుజువు చేస్తామని బీజేపీ పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు గెలుస్తామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బీజేపీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. దేశరాజధానిలో తాజా రాజకీయ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
ఏడింటికి గానూ ఐదు ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని అంచనా వేశాయి. దీంతో బీజేపీ నాయకులకు గుబులు పట్టుకుంది.