సాక్షి,న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పూర్తయింది. పోలింగ్ పూర్తయిన వెంటనే సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంది..వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారన్న దానిపై పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) కూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఒక్క పీపుల్ పల్స్-కొడిమో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం బీజేపీకి ఏకంగా 51-60 సీట్లు వస్తాయని చెప్పగా మిగిలిన సర్వేలన్నీ బీజేపీ,ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనాలు వెల్లడించాయి.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే జరిగింది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడవనున్నాయి.
పీపుల్స్‌పల్స్-కొడిమో
బీజేపీ-51-60
ఆప్- 10-19
కాంగ్రెస్-0
ఇతరులు-0
ఏబీపీ-మ్యాట్రిజ్
బీజేపీ- 35-40
ఆప్ - 32-37
కాంగ్రెస్- 0-1
టైమ్స్ నౌ
బీజేపీ-39-45
ఆప్-29-31
కాంగ్రెస్-0-2
చాణక్య స్ట్రాటజీస్
బీజేపీ-39-44
ఆప్-25-28
రిపబ్లికన్ పీ మార్క్
బీజేపీ 39-41
ఆప్ 21-31
ఆత్మసాక్షి
బీజేపీ 38-47
ఆప్ 27-30
కాంగ్రెస్ 0-3
పీపుల్ ఇన్‌సైట్
బీజేపీ-40-44
ఆప్- 25-29
కాంగ్రెస్- 0-1
జేవీసీ
బీజేపీ 39-45
ఆప్ 22-31
కాంగ్రెస్ 0-2
తుది ఫలితాల్లో మాదే విజయం: ఆప్ ధీమా
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఆమ్‌ఆద్మీపార్టీ స్పందించింది. తమకు ఎగ్జిట్ పోల్స్‌లో ఎప్పుడూ వ్యతిరేక ఫలితాలే వస్తాయని, చివరకు విజయం సాధించేది తామేనని ఆప్ నేత రీనా గుప్తా అన్నారు.2013,2015,2020 ఎన్నికల్లో ఇదే జరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
VIDEO | Delhi Elections 2025: On exit poll predictions, AAP leader Reena Gupta (@Reena_Guptaa) says: "You look at any exit poll historically, AAP is always given a smaller number of seats, whether its 2013, 2015 or 2020. But whatever is shown, AAP gets a lot a greater number of… pic.twitter.com/KZmGNzg6XK
— Press Trust of India (@PTI_News) February 5, 2025
Comments
Please login to add a commentAdd a comment