ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు.. ఆప్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే! | AAP Dismisses Delhi Exit Polls, Predicts Arvind Kejriwal Fourth Term | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు.. ఆప్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే!

Published Wed, Feb 5 2025 8:51 PM | Last Updated on Wed, Feb 5 2025 8:56 PM

AAP Dismisses Delhi Exit Polls, Predicts Arvind Kejriwal Fourth Term

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో సర్వే సంస్థలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. ఫలితంగా 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేయనుందంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్ని విడుదల చేశాయి. అయితే ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ను అధికార ఆమ్‌ ఆద్మీ కొట్టి పారేసింది. శనివారం విడుదల కానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం తమదేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.ఎగ్జిట్‌ పోల్స్‌అంచనాలను తలకిందులు చేస్తూ తమ పార్టీ మరోసారి అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది సేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై అప్‌ జాతీయ అధికార ప్రతినిధి రీనా గుప్తా జాతీయ మీడియాతో మాట్లాడారు. 2015, 2020 ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడయ్యాయి. అప్పడు మేం అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అంతే ఎగ్జిట్‌ పోల్స్‌తో సంబంధం లేకుండా మరోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 

మరో నేత సుశీల్ గుప్తా మాట్లాడుతూ.. ‘ఇది మా నాలుగో ఎన్నిక. ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ మాకు వ్యతిరేకంగా వచ్చాయి. కానీ మేం ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల్ని తలకిందులు చేశాం. విజయం సాధిస్తూ వచ్చాం. ఈ సారి కూడా అంతే.  మాజీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పనిచేశారు. మా పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయి. తిరిగి మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’ అని అన్నారు.   

 

ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో 
ఈ ఎన్నికల్లో  బీజేపీదే పైచేయి అని  మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినప్పటికీ ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ‌ కూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఒక్క పీపుల్‌ పల్స్‌-కొడిమో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మాత్రం బీజేపీకి ఏకంగా 51-60 సీట్లు వస్తాయని చెప్పగా మిగిలిన సర్వేలన్నీ బీజేపీ,ఆప్‌ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనాలు వెల్లడించాయి.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్‌,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే జరిగింది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడవనున్నాయి.

పీపుల్స్‌పల్స్‌-కొడిమో

బీజేపీ-51-60
ఆప్‌-  10-19
కాంగ్రెస్‌-0
ఇతరులు-0

ఏబీపీ-మ్యాట్రిజ్‌

బీజేపీ- 35-40
ఆప్‌ - 32-37
కాంగ్రెస్‌- 0-1

టైమ్స్‌ నౌ

బీజేపీ-39-45
ఆప్‌-29-31
కాంగ్రెస్‌-0-2

చాణక్య స్ట్రాటజీస్‌

బీజేపీ-39-44
ఆప్‌-25-28

రిపబ్లికన్‌ పీ మార్క్‌ 

బీజేపీ 39-41
ఆప్‌  21-31

ఆ‍త్మసాక్షి

బీజేపీ 38-47
ఆప్‌  27-30
కాంగ్రెస్‌ 0-3

పీపుల్‌ ఇన్‌సైట్‌ 

బీజేపీ-40-44
ఆప్‌- 25-29
కాంగ్రెస్‌- 0-1

జేవీసీ

బీజేపీ 39-45
ఆప్‌  22-31
కాంగ్రెస్‌ 0-2

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement