బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఆధిక్యంలో ఉన్నారు. కృష్ణనగర్ నుంచి బరిలోకి దిగిన ఆమె తన ప్రత్యర్థిపై
న్యూఢిల్లీ : బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఆధిక్యంలో ఉన్నారు. కృష్ణనగర్ నుంచి బరిలోకి దిగిన ఆమె తన ప్రత్యర్థిపై ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగాని, ఆందోళన కానీ లేదని ఆమె నిన్న ఇక్కడ అన్నారు. గత 17 రోజులుగా సాధ్యమైనంత వరకు కృషి చేశానని, తన చేతుల్లో లేని ఫలితాల గురించి ఆదుర్దా పడబోనని కర్మ సిద్ధాంతాన్ని కిరణ్ బేడీ గుర్తు చేయటం విశేషం.