100కి 95 మార్కులేశారు..
న్యూఢిల్లీ: తలచుకుంటే ఏదైనా సాధ్యం చేస్తానని సామాన్యుడు మరోసారి నిరూపించాడు. సామాన్యుడి పేరుతో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సునామీ సృష్టించింది. ఏ వేవ్ లేని చోట ఓట్ల వేవ్ సృష్టించింది. భారీ మెజార్టీతో దేశాన్ని ఏలుతున్న కమలనాథుల్ని కంగు తినిపించింది. సింగిల్ డిజిట్‌కే బీజేపీని పరిమితం చేశాడు సామాన్యుడు. ఇంత భారీ మెజార్టీ సాధిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఊహించి ఉండదు. ఢిల్లీలో ఓట్లేసిన 89 లక్షల మందిలో సగం కంటే ఎక్కువ మంది ఆమ్ ఆద్మీ పార్టీకే ఓట్లేశారు.
ఇంత తీవ్రమైన వ్యతిరేకత తమపై ఉందని బీజేపీ కూడా ఊహించి ఉండదు. ఆప్ సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు ఫుల్ మార్కులు వేశారు. పాసవుదామని కలలు కన్న ఆమ్ ఆద్మీని డిస్టింక్షన్‌లో పాస్ చేయించారు. వందకు 95 మార్కులు వేశారు. 15 ఏళ్లు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్‌కు ఈసారి అసెంబ్లీలో ప్రాతినిధ్యమే ఉండని పరిస్థితి.