గత (2013) ఎన్నికల్లో అప్పటి ఢిల్లీ సీఎం ఓడిన సంగతి తెలిసిందే. మూడు సార్లు సీఎంగా గెలిచిన షీలా కేజ్రీవాల్ దెబ్బకు డీలా పడ్డారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ పీఠానికి పోటీపడిన బీజేపీ అభ్యర్థి కిరణ్ బేడీని.. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ 'చీపురు'తో ఊడ్చేశారు. 2013 ఎన్నికల్లో అప్పటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్.. అరవింద్ కేజ్రీవాల్తో పోటీపడి డీలా పడితే.. తాజా ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఉన్న కిరణ్ బేడీ బోల్తా పడ్డారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కిరణ్ బేడీ ఆప్ అభ్యర్థి బగ్గా చేతిలో 2277 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కాగా 2013 ఎన్నికల్లో షీలా దీక్షిత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. మూడు సార్లు సీఎంగా గెలిచిన షీలా ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ దెబ్బకు ఓటమిని మూటకట్టుకున్నారు. కనీసం ఆమె పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు.