
కిరణ్ బేడీతో సీతారామన్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీతో సమావేశమయ్యారు. కిరణ్ బేడీ నివాసానికి వెళ్లి ఆమెతో చర్చలు జరిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రోజే వీరి భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో బీజేపీ నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు.