
కేజ్రీవాల్‌కే పూర్తి మార్కులు: బేడీ
న్యూఢిల్లీ: ‘కేజ్రీవాల్‌కు పూర్తి మార్కులు. ఆయనకు నా అభినందనలు. కేజ్రీవాల్ ఆయన పార్టీ ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమల్లోకి తెస్తారని ఆశిస్తున్నా..’ అని బేడీ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు ‘ధర్నా’లతో ఎలాంటి లాభం ఉండదు. ఘర్షణాత్మక వైఖరిని విడనాడాలి. బలమైన సహకార ధోరణిని అవలంబించాలి..’’ అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినందుకు బేడీ విచారం తెలిపారు. ‘మీ అంచనాలకు అందుకోలేకపోయినందుకు మన్నించా’లని కార్యకర్తలను కోరారు. అయితే ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యత స్వీకరించడానికి నిరాకరించారు. ఎన్నికల్లో తాను ఓడిపోలేదని పార్టీ ఓడియిందని.. ఓటమిపై పార్టీలో అంతర్మథనం జరపాలని ఆమె వ్యాఖ్యానించారు.