
కాంగ్రెస్ కు 'సున్న'మేశారు
కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డకౌట్ అయింది. 2014లో జరిగిన ..
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డకౌట్ అయింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చావుదెబ్బ తిన్న విషయం తెలిసిందే. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన ఆ పార్టీ ...తాజాగా హస్తినలోనూ అదే బాటలో పయనించింది. 2013 ఎన్నికల్లో హస్తినలో బోల్తా పడ్డ కాంగ్రెస్ ఈసారి బోణీ కూడా తెరవలేకపోయింది. ఏపీ విషయానికొస్తే రాష్ట్రాన్ని విభజించిందని కాంగ్రెస్ ఖాతా తెరవలేదని చెప్పవచ్చు. మరి ఢిల్లీలో కూడా అదే పరిస్థితి నెలకొనటం విశేషం.