మొదట ఓటు.. తర్వాత పెళ్లి అంటూ అక్షయ్ అనే ఢిల్లీ వాలా బాధ్యతాయుతమైన పౌరుడనపించుకున్నాడు.
న్యూఢిల్లీ: మొదట ఓటు.. తర్వాత పెళ్లి అంటూ అక్షయ్ అనే ఢిల్లీ వాలా బాధ్యతాయుతమైన పౌరుడనపించుకున్నాడు. శనివారం అక్షయ్ పెళ్లి. ఉదయం అతణ్ని పెళ్లికుమారుడిగా అలంకరించారు. అక్షయ్ బంగారు ఎంబ్రాయిడరీ షెర్వానీ ధరించి తలపాగా పెట్టుకుని సిద్ధం అయ్యాడు. కాసేపట్లో పెళ్లి జరగాల్సివుండగా అక్షయ్ మాత్రం తొలుత ఓటు వేసేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు. అక్షయ్ వెడ్డింగ్ డ్రెస్లోనే కుటుంబ సభ్యులతో కలసి చత్తార్పూర్ పోలింగ్ బూత్కు వెళ్లాడు. ఓటు వేసిన అనంతరం వివాహ వేదిక వద్దకు వెళ్లి పెళ్లాడాడు. ఈ రోజు వివాహాలకు మంచి రోజు కావడంతో చాలా వివాహాలు జరిగాయి.