ఆప్కు ఐటీ శాఖ నోటీసులు
న్యూఢిల్లీ: నకిలీ కంపెనీల నుంచి భారీగా విరాళాలు తీసుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటు న్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. అలాగే కాంగ్రె స్, మరో 48 సంస్థలకూ శ్రీముఖాలు జారీ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందురోజైన సోమవారమే ఇవి జారీ అయ్యాయి.
విరాళాలు అందించిన సంస్థలు, వ్యక్తుల వివరాలను కోరుతూ పలు రాజకీయ పార్టీలు, సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సందర్భంగా పార్టీలకు విరాళాలరూపంలో భారీగా నల్లధనం వచ్చినట్లు సీబీడీటీ అనుమానిస్తోంది. ఢిల్లీలోని నకిలీ కంపెనీల నుంచి ఆప్‌కు నిరుడురూ. 2 కోట్లకు నాలుగు చెక్కులు అందాయని, అదంతా నల్లధనమేనని ఆ పార్టీ నుంచి విడిపోయిన అనుబంధ సంస్థ అవామ్ వెల్లడించిన విషయం సంగతి తెలిసిందే.
ఓట్లను కొనేవారికే టికెట్లు ఇచ్చారు
ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓట్లను కొనేవారికే టికె ట్లు ఇచ్చారని, నల్లధనాన్ని విరాళాలుగా స్వీకరించారని ఆప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శాంతి భూషణ్ ఆరోపించారు. కేజ్రీవాల్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని బుధవారం శాంతిభూషణ్ బ్లాగులో రాశారు.