మర్యాదపూర్వక భేటీయే... | Arvind Kejriwal meets Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

మర్యాదపూర్వక భేటీయే...

Published Wed, Feb 11 2015 10:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

మర్యాదపూర్వక భేటీయే...

మర్యాదపూర్వక భేటీయే...

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా ఢిల్లీలో అనధికార కాలనీల సమస్యలపై చర్చ జరిపినట్లు సమాచారం. సుమారు 60 లక్షల మంది అనధికారిక నివాసాల్లో ఉంటున్నారని, ఆ ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని వెంకయ్యను కోరినట్లు తెలుస్తోంది.

కేజ్రీవాల్తో మనీష్ సిసోడియా కూడా వెంకయ్యను కలిసినవారిలో ఉన్నారు. మరోవైపు వెంకయ్యతో కేజ్రీవాల్ మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ఆప్ తెలిపింది. కాగా కేజ్రీవాల్ ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా భేటీ కానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement