
జనలోక్‌పాల్ పోరాటం మర వొద్దు: హజారే
కేజ్రీవాల్‌ను అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే అభినందించారు.
రాలెగావ్‌సిద్ధి: కేజ్రీవాల్‌ను అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే అభినందించారు. ‘మోదీ ప్రభుత్వం ఎనిమిది నెలల కిందట కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక వేత్తలకు మాత్రమే మంచిరోజులు వచ్చాయి.
అందుకే ఎన్నికల ఫలితాలు ఆప్‌కు అనుకూలంగా వచ్చాయి’ అని రాలెగావ్‌సిద్ధిలో విలేకర్లతో అన్నారు. జనలోక్‌పాల్ బిల్లు కోసం ఇదివరకు చేసిన పోరాటాన్ని మరవకూడదని ఆయన ఒకప్పటిన తన సహచరుడైన ఆప్ అధినేతకు సూచించారు.