
జంప్ జిలానీలకు షాక్
న్యూఢిల్లీ: వేర్వేరు కారణాలతో పార్టీలు మారిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో అత్యధికం ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్, ఆప్‌ను వదలి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ, అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎంఎస్ ధీర్, జేడీయూ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ తదితరులు ఉన్నారు.
తీరథ్ పటేల్ నగర్‌లో ఆప్ అభ్యర్థి హజారీలాల్ చౌహాన్ చేతిలో 34,638 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బిన్నీని మనీశ్ సిసోడియా(ఆప్) 28,761 ఓట్ల ఆధిక్యంతో, ధీర్‌ను ప్రవీణ్ కుమార్(ఆప్) 20,450 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన ఆల్కా లాంబా, బీఎస్పీ నుంచి ఆప్‌లోకి వచ్చి షాహీరాంలు గెలిచారు.