ఢిల్లీ: ఢిల్లీ పీఠం ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్),భాజపాల మధ్య హోరాహోరీగా సాగిన శాసనసభ ఎన్నికల పోరులో ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో నేడు సృష్టంకానుంది. 14 కేంద్రాల్లో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకోసం ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని , మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తి ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో 67.14 శాతం ఓటింగ్ శాతం నమోదైన ఈ ఎన్నికల్లో మొత్తం 673 మంది అభ్యర్థులు తమ భవితవ్యం కోసం వేచి చూస్తున్నారు.
మరికొన్ని గంటల్లో ఢిల్లీ ఓట్ల లెక్కింపు
Published Tue, Feb 10 2015 6:55 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement