ఢిల్లీ మొత్తం ఏరియాతో తాను సంబంధాలు కలిగి ఉన్నానని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి, కృష్ణా నగర్ నుంచి పోటీకి దిగిన కిరణ్ బేడీ అన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మొత్తం ఏరియాతో తాను సంబంధాలు కలిగి ఉన్నానని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి, కృష్ణా నగర్ నుంచి పోటీకి దిగిన కిరణ్ బేడీ అన్నారు. కృష్ణా నగర్‌కు తాను పరాయినని ప్రచారం చేస్తున్న వారిని ఆమె తప్పుబట్టారు. కిరణ్ బేడీ శనివారం ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
బీజేపీని గెలిపించడం కోసం తాను ఎన్నికల బరిలోకి దిగానని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. కృష్ణా నగర్‌లో పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీకే దత్ కాలనీలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మద్యం, డబ్బు పంపిణీ చేసే పార్టీలకు ఓటు వేయవద్దని ఆయన ఈ సందర్భంగా ఢిల్లీ ఓటర్లుకు పిలుపునిచ్చారు.