ఈసారి ఢిల్లీ అసెంబ్లీకి ఆరుగురు మహిళా నేతలు ఎన్నికయ్యారు. అందరూ ఆప్ వారే.
ఈసారి ఢిల్లీ అసెంబ్లీకి ఆరుగురు మహిళా నేతలు ఎన్నికయ్యారు. అందరూ ఆప్ వారే. అన్ని పార్టీల నుంచి మొత్తం 66 మంది బరిలో దిగగా రాఖీ బిర్లా, బందన, సరితాసింగ్, అల్కా లాంబా, ప్రమీల, భావనా గౌర్ గెలిచారు. 2013 ఎన్నికల్లోనూ ఎన్నికైన ముగ్గురు మహిళలు ఆప్ వాళ్లే. ఎన్నికల ప్రచారంలో మహిళా భద్రతకు పెద్దపీట వేసిన పార్టీలు వారికి తగినన్ని టికెట్లు ఇవ్వడంపై మాత్రం శ్రద్ధ చూపలేదు.
ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి మొత్తం 19 స్థానాల్లోనే మహిళలకు అవకాశమివ్వడం గమనార్హం. ఇక నలుగురు ముస్లిం అభ్యర్థులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరంతా కూడా ఆప్ అభ్యర్థులే. 68 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో నిలవగా అమానతుల్లా ఖాన్, హజీ ఇష్రాఖ్, అసిమ్ అహ్మద్‌ఖాన్, ఇమ్రాన్ హుస్సేన్ గెలుపొందారు.