ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మనదేశంలో రాజకీయ విప్లవం మొదలైందంటూ ట్విట్టర్లో ట్విట్ చేశారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మనదేశంలో రాజకీయ విప్లవం మొదలైందంటూ ట్విట్టర్లో ట్విట్ చేశారు. ఢిల్లీలో వీఐపీ కల్చర్కు చరమగీతం పాడతామని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. త్వరలో భారత్లో సమూల మార్పులు చూస్తారని ఆయన అన్నారు. ఢిల్లీ పీఠం ఆప్కు దక్కుతుందో లేదోనని తాను ఎప్పుడూ ఉద్వేగానికి లోనుకాలేదన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని తనకు ముందునుంచి పూర్తి విశ్వాసం ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ హవా కొనసాగుతోంది. ఆప్ 60 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. కాషాయ నినాదం వద్దు.. సామాన్యుడి నినాదమే ముద్దు అని ఢిల్లీ వాసులు ఈవీఎంల్లో ఓట్లు నొక్కి మరీ చెప్పారు.