చీపుర్లతో ఫోజులిచ్చే నేతను కాదని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
న్యూఢిల్లీ : చీపుర్లతో ఫోజులిచ్చే నేతను కాదని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ హవా కొనసాగుతోంది. ఆప్ 58 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. కాషాయ నినాదం వద్దు.. సామాన్యుడి నినాదమే ముద్దు అని ఢిల్లీ వాసులు ఈవీఎంల్లో ఓట్లు నొక్కి మరీ చెప్పారు.
2013లో 28 స్థానాలు గెల్చుకున్న ఆప్ ఇప్పుడు అంతకు మించి స్థానాలు గెల్చకునే దిశగా దూసుకెళ్తుంది. 2103 ఎన్నికల్లో 31 సీట్లు గెల్చుకున్న కమలనాధులు ఇప్పుడు ఆ స్థానాలను గెల్చుకునే పరిస్థితి కనిపించడంలేదు..లోక్‌సభ ఎన్నికల్లో 40శాతంపైగా ఓట్లు కొల్లగొట్టిన కమలనాధులు..ఇప్పుడు దాదాపుగా 30 శాతం దగ్గరే ఆగేపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఢిల్లీ అశోక్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయం బోసిపోయింది.
మరోవైపు పటేల్ నగర్‌లోని ఆప్ కార్యాలయం దగ్గర సందడి నెలకొంది. 49 రోజుల్లో రాజీనామా చేసినందుకు కేజ్రీవాల్ రాజీనామా చేసినందుకు క్షమాపణ చెప్పడం కూడా ఢిల్లీ వాసులను ఆలోచింపచేసింది. అందుకే..ఆప్ గుర్తు చీపురుపై ఓట్లు వాన కురిపించారని విశ్లేషకులు అంటున్నారు.