
ప్రజల తీర్పును గౌరవిస్తాం: వెంకయ్య
ఢిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర పాలనపై ఇది ప్రజాభిప్రాయం కాదని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వానికి సహకారం అందిస్తామన్నారు. ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెంకయ్య నాయుడు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఆప్ నెరవేర్చాలని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.