
'హస్తిన వాసుల హృదయాలు గెలవాలి'
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సాధించిన విజయం చరిత్రాత్మకం అని యోగా గురువు బాబా రాందేవ్ పేర్కొన్నారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేజ్రీవాల్ అమలు చేస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
'ఢిల్లీ ఎన్నికల్లో చరిత్రాక మహావిజయం సాధించినందుకు కేజ్రీవాల్ కు అభినందనలు. మంచి పనితీరు కనబరిచి ఢిల్లీ వాసులు విశ్వాసాన్ని, హృదయాలను ఆయన గెల్చుకుంటారని ఆశిస్తున్నా' అని రాందేవ్ వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీని రాందేవ్ బహిరంగంగా ప్రశంసించిన విషయం విదితమే.