ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం | Aravind Kejriwal sworn-in as delhi's chief minister | Sakshi
Sakshi News home page

Feb 14 2015 12:50 PM | Updated on Mar 21 2024 8:41 PM

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. రామ్లీలా మైదానంలో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ శనివారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా ఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రెండోసారి ప్రమాణం చేశారు. కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా, సందీప్ కుమార్, అసీం అహ్మద్ ఖాన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, జితేంద్రసింగ్ తోమర్ ...మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా హస్తినలో కనీవినీ ఎరుగని రీతిలో ఆమ్‌ఆద్మీ పార్టీ 96 శాతం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న విషయం విదితమే. 70 స్థానాలకు గానూ 67 స్థానాలను ఆప్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement