
ప్రియాంక లావో...కాంగ్రెస్ బచావో..
130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే...
న్యూఢిల్లీ : 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తమ సహజ ధోరణిలో నినాదాలు చేశారు. ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినదించారు.
'ప్రియాంక లావో..కాంగ్రెస్ బచావో అంటూ పార్టీ కార్యాలయం వద్ద నినాదాలు చేయటం కనిపించింది. ప్రియాంకను క్రియశీల రాజకీయాల్లోకి తీసుకు రావాలంటూ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూడా పలువురు పార్టీ నేతలతోపాటు, కార్యకర్తలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా గతంలో ఎన్నడూ చూడని ఫలితాలతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ డైలామాలో పడింది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రతిష్టను కాపాడుకున్నా.. ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితులను చవిచూసింది. దాంతొ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు.