
ఒక్కోటి రూ.200!
ఆప్ సునామీతో మంగళవారం ఢిల్లీలో ‘చీపురు కట్ట’ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పార్టీ గుర్తు అయిన ‘జాడూ’ చేతిలో పట్టుకొని సంబరాల్లో పాల్గొందామని ఆప్ శ్రేణులు వాటిని కొనడానికి ఎగబడ్డారు. దుకాణదారులు ఈ గిరాకీని ఊహించి తగినన్ని చీపురుకట్టలు స్టాక్ పెట్టినా... అన్నీ అయిపోయాయి.
సాధారణంగా రూ.30 నుంచి రూ.50 పలికే చీపురు కట్ట ఏకంగా రూ. 200 పలికిందట. ఇంత ధర పెట్టడానికి సిద్ధమైనా దొరకకపోవడంతో కొన్నిచోట్ల ఆప్ అభిమానులు ఉసూరుమన్నారు.