
2013 కన్నా ఆప్ ఓట్లు రెట్టింపు
2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓట్ల శాతం రెట్టింపవగా.. బీజేపీ ఓట్ల శాతం కేవలం ఒక్క శాతమే తగ్గటం విశేషం. నాటి ఎన్నికల్లో ఆప్‌కు 29.5 శాతం ఓట్లు పోలవగా.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏకంగా 54.3 శాతం ఓట్లు పోలయ్యాయి.
బీజేపీకి నాడు 32.2 శాతం ఓట్లు లభించగా.. ఇప్పుడు అది 31 శాతానికి తగ్గింది. అయితే.. 2013లో 24.55 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి కేవలం 9.7 శాతం ఓట్లకు పడిపోయింది. ప్రధానంగా నాటి కాంగ్రెస్ ఓట్లే ఇప్పుడు ఆప్‌కు మళ్లాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.