'ఇప్పటికీ ఢిల్లీలో మాకు పట్టుంది'
న్యూఢిల్లీ : ఇప్పటికీ ఢిల్లీలో తమకు పట్టుందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రచార కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ తెలిపారు. సాధారణంగా అందరికి ఉండే చివరి క్షణం టెన్షన్ తనకేమి లేదని ఆయన అన్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు తనకు కొత్త కాదని.. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఎన్నికలు ఎదుర్కొన్నామని చెప్పారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తనకు చాలా సంతృప్తినిచ్చిందని మాకెన్ తెలిపారు. ప్రజల స్పందన చాలా బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. పరిపాలన పరంగా ఢిల్లీలో అనేక జటిలమైన సమస్యలున్నాయని... తమకు అధికారం ఇస్తే వాటినన్నింటిన పరిష్కారిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఢిల్లీ ఓటర్లకు తెలిపింది.