Ajay Maken
-
‘ఆప్’తో పొత్తు..కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Elections) ఆమ్ఆద్మీపార్టీ(ఆప్), కాంగ్రెస్(Congress) పార్టీల మధ్య శాశ్వతంగా దూరం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అవసరమైతే ఆప్(AAP)నకు మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నకు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ పార్టీతో కాంగ్రెస్‌కు భవిష్యత్తులో ఎటువంటి పొత్తు అక్కర్లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని మాకెన్ చెప్పారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,ఆప్ విడివిడిగానే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్,బీజేపీ(BJP) మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఇండియా కూటమిలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలో ఆప్ సహా ఒక్కొక్కటిగా ఇటీవల కాంగ్రెస్‌కు దూరమవుతుండడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ(ఎస్సీపీ) పార్టీ అధినేత శరద్‌పవార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పొత్తు లోక్‌సభ ఎన్నికలవరకేనని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొత్తు ఉండాలని ఏమీ లేదన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాదీ(ఎస్పీ) కూడా ఇటీవల కాంగగ్రెస్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్‌కు కాకుండా ఆమ్ఆద్మీపార్టీకి మద్దతిస్తుండడం గమనార్హం. ఎస్పీ బాటలోనే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆప్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించింది.కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అదే నెల 8వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ భావిస్తుండగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ఆప్‌కు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందు కోసం రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఈ ఎన్నికల కోసం తన తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించింది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఆ మేనిఫెస్టో తమదేనని, బీజేపీ కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. -
రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమన్న కాంగ్రెస్
ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ అన్నారు. ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ మార్వా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బుధవారం అజయ్ మాకెన్ తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాహుల్ భద్రతకు ముప్పు ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆ ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ తండ్రి (రాజీవ్ గాంధీ), నానమ్మ( ఇందిరా గాంధీ) ఈ దేశానికి వారి ప్రాణాలను త్యాగం చేశారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని.. ‘జాగ్రత్తగా ఉండండి.. మాట్లాడకండి.. లేకపోతే మీ నానమ్మకు పట్టిన అదే గతి పడుతుంది’ అని నీచమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయాలు ఇప్పటివరకు ఈ స్థాయిలో ఎప్పుడూ దిగజారలేదు. తమ నేత చేసిన ఇటువంటి నీచమైన వ్యాఖ్యలపై బీజేపీ నోరుమెదపలేదు.. ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. రాహుల్ గాంధీ.. మైనార్టీలు, దళితులు, వెనుకబడిన తరగతులు, కార్మికులు, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. అందుకే మీకు (బీజేప) ఆయన వ్యాఖ్యలు నచ్చడం లేదు. చంపేస్తామనే బెదిరింపులకు మేము భయపడబోము. వివాదాస్పద వ్యాఖ్యల చేసివారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అదేవిధంగా శివసేన ఎమ్మెల్యే (సంజయ్ గైక్వాడ్), కేంద్ర మంత్రి, రాజస్థాన్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ (రవనీత్ సింగ్ బిట్టు), భారతదేశంలోని నంబర్ వన్ టెర్రరిస్టు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరాం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం’ అని అన్నారు.Delhi: Congress leader Ajay Maken (@ajaymaken) says, "...You are making these kinds of remarks 'Aap sambhal jao aap bolo mat nahin toh aapka bhi wahi haal hoga jo aapki dadi ka huya hai'...against a person whose father and grandmother sacrificed their lives for the nation.… pic.twitter.com/Vwsx7p5JZR— Lok Poll (@LokPoll) September 18, 2024కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉగ్రవాది అని వ్యాఖ్యలు చేసిన పలువురు కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.యూత్ కాంగ్రెస్ కార్యాలయం ముందు అధ్యక్షుడు శ్రీనివాస్ నేతృత్వంలో భారీ ధర్నా చేపట్టారు.వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.#WATCH | Delhi: Police detains Congress workers who were protesting against Union Minister Ravneet Singh Bittu and other BJP leaders over their statement on Lok Sabha LoP & Congress MP Rahul Gandhi.Congress Delhi chief Devender Yadav says, "We are fighting to protect the… pic.twitter.com/sklINzJEzp— ANI (@ANI) September 18, 2024 బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘రాహుల్ గాంధీ బాటలోనే రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నాం. బీజేపీకి భయపడేది లేదు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తున్నారు’ అని కాంగ్రెస్ ఢిల్లీ చీఫ్ దేవేందర్ యాదవ్ అన్నారు.#WATCH | Delhi: Congress workers hold protest against Union Minister Ravneet Singh Bittu and other BJP leaders over their statement on Lok Sabha LoP & Congress MP Rahul Gandhi. pic.twitter.com/8vuvRb6GPX— ANI (@ANI) September 18, 2024 చదవండి: రాహుల్ గాంధీ భారతీయుడు కాదు: కేంద్ర మంత్రి -
విపక్షాల ఐక్యత చెడగొట్టడమే అతని పని
న్యూఢిల్లీ: జూన్ 23న బీహార్ వేదికగా జరిగిన విపక్షాల ఐక్య సమావేశం తరవాత నుండి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ రెండు పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మార్కెట్ అంతా విద్వేషాలుంటే అందులో రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం తెరిచారని ఎద్దేవా చేస్తే.. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విపక్షాల ఐక్యతను దెబ్బ తీయడమే అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యమని అన్నారు. ఢిల్లీ ఆర్దనెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మద్దతును కూడా కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ఆ పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. ఈ సందర్బంగా ఆప్ నేత ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తరచుగా ప్రేమ గురించి మాట్లాడుతూ బీజేపీ ద్వేషాన్ని రెచ్చగొడుతోందని అంటున్నారు. మరి మొహబ్బత్ కి దుకాన్ పేరిట ప్రేమ దుకాణాన్ని తెరచిన ఆయన ఎవరు ఏమి కోరినా ప్రేమతో అంగీకరించాలి కదా? ఇప్పుడు అయన అధికారంలో లేరు కాబట్టి ఆయనలో ఇగో లేదు. రేపు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో వస్తే ఏమిటి పరిస్థితి? ఆయన సంయమనంతో వ్యవహరించి ప్రేమతత్వాన్ని చాటుకోవాలని అన్నారు. #WATCH | "I always see that Rahul Gandhi talks about love and says that BJP spreads hate. So if Rahul Gandhi is running 'Mohabbat ki Dukan' then whosoever will come to him can buy that love. When he said that his party spread love then he has to show this also. Right now he… pic.twitter.com/XTDmQtTsOP — ANI (@ANI) June 25, 2023 ఇక కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాత్రం ఆప్ నేతలపైనా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒకపక్క ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మా మద్దతు కోరతారు.. మరోపక్క మాపైనే విచక్షణారహితంగా విమర్శలు చేస్తారు. ఢిల్లీ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంతం నెగ్గించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు తప్పనిసరి. మరి అలాంటప్పుడు కాళ్లబేరానికి వెళ్ళకుండా కయ్యానికి కాలు దువ్వుతుండడం ఆశ్చర్యకరమే మరి. ఈ రెండు నాలుకల ధోరణి వలన ఎవరికి ప్రయోజనం? నాకైతే ఒక్కటే ప్రయోజనం కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ పక్కలో చేరారు. విపక్షాలు ఐక్యత చెడగొట్టడమే ప్రస్తుతం కేజ్రీవాల్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షాలు.. కరెంటు షాక్ కొట్టడంతో యువతి మృతి -
'అవినీతిపై పోరాటం చేసిన ఆప్.. ఇప్పుడు అదే అవినీతికి పాల్పడుతోంది'
న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా అరెస్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై పోరాటం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీనే ఇప్పుడు కరప్షన్‌కు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బును ఆప్ గోవా ఎన్నికల కోసం ఖర్చు చేసిందని ఆరోపించారు. అవినీతిలో వచ్చిన డబ్బును ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తోందని మండిపడ్డారు. డిల్లీ లిక్కర్ స్కాం కేసులో రాజకీయ ప్రతీకారం లేదని, అది సుస్పష్టమైన అవినీతి కేసు అని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీకి ఎలాంటి మార్పులు చేయాలని సిసోడియా 2020 సెప్టెంబర్ 4న కమిటీని ఏర్పాటు చేశారని, కానీ అవినీతి కోసం ఆ కమిటీ నివేదికను అమలు చేయలేదని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసింది. అనంతరం సోమవారం ప్రత్యేక కోర్టులో హజరుపరిచింది. ఈ కేసు విచారణకు ఐదు రోజులు కస్టడీ కోరగా న్యాయస్థానం అనుతించింది. అయితే తనను అక్రమంగా అరెస్టు చేశారని మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియాకు చుక్కెదురైంది. ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అనంతరం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీటిని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. చదవండి: మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా -
అజయ్ మాకన్ (కాంగ్రెస్) రాయని డైరీ
ఖర్గే పిలిపిస్తే వెళ్లాను. అక్బర్ రోడ్డులోని ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యాలయానికి ఆయన నన్ను పిలిపించలేదు. సఫ్దర్‌జంగ్ రోడ్డులోని తన నివాస గృహానికి పిలిపించారు! నేను వెళ్లేసరికి నా రాజీనామా లేఖ ఆయన కూర్చొని ఉన్న సోఫా ముందరి టీపాయ్ మీద చిన్నపాటి బరువుతో.. తండ్రి గుప్పెటలో బిగిసి ఉన్న తన చూపుడు వేలును విడిపించుకుని ముందుకు నడిచేందుకు ప్రయత్నిస్తున్న పిల్లవాడిలా ఉంది. ‘‘ఏమిటిది అజయ్?’’ అన్నారు ఖర్గే... ఒక తండ్రిలాగే! ఎందుకు రాజీనామా చేశావు అని అడగలేదు ఆయన! ‘‘ఎలాంటి సమయంలో నువ్వు రాజీనామా చేశావో తెలుసా?’’ అన్నారు! ‘‘జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశిస్తున్న సమయంలో.. రాజస్థాన్‌లో ఒక ఉప ఎన్నిక కూడా జరగబోతున్న సమయంలో.. పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు ఇన్చార్జి అయిన ఒక ప్రధాన కార్యదర్శి రాజీనామా చేశారంటే కాంగ్రెస్ ప్రతిష్ఠ ఏమౌతుందో ఆలోచించావా అజయ్!’’ అన్నారు. ‘‘పార్టీ ప్రతిష్ఠకు ఏమీ కాకుండా ఉండేందుకే రాజీనామా చేశాను ఖర్గేజీ..’’ అన్నాను. అప్పుడు కూడా ఆయన.. ‘‘రాజీనామా చేసి ఎక్కడికెళతావ్?’’ అన్నారే గానీ.. పార్టీ ప్రతిష్ఠకు వచ్చిన ముప్పు ఏమిటని గానీ, ఎందుకు రాజీనామా చేశావు అని గానీ అడగలేదు! ‘‘రాజీనామా చేసి ఎక్కడికీ వెళ్లబోవడం లేదు ఖర్గేజీ! ఢిల్లీలోనే ఉంటాను. కార్మిక సంఘాలను సంఘటితం చేస్తాను. ఎన్జీవోలతో మమేకం అవుతాను. ఢిల్లీ వాయు కాలుష్యంపై గళమెత్తుతాను. వీధి వర్తకుల సంక్షేమం కోసం కృషి చేస్తాను. మురికివాడల పురోభివృద్ధికి పాటు పడతాను..’’ అన్నాను. ఒక్కసారిగా భళ్లున నవ్వారు ఖర్గే! కోపంతో ఇల్లొదిలి వెళ్తున్న కొడుకుని ఆపి, ‘బయటికెళ్లి ఎలా బతుకుతావ్రా..’ అని అతి సంపన్నుడైన తండ్రి ప్రశ్నిస్తే.. ‘ఎలాగైనా బతుకుతాను. మూటలు మోస్తాను, ముష్టెత్తుకుంటాను. ఆటో నడుపుతాను. హోటళ్లలో ప్లేట్లు కడుగుతాను. ఇంటికైతే రాను..’ అని కొడుకు అన్నప్పుడు ఆ తండ్రి నవ్విన నవ్వులా ఉంది ఖర్గే నవ్వడం. నవ్వీ నవ్వీ.. హఠాత్తుగా గంభీరంగా మారి, ‘‘పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం అన్నది పార్టీ అప్పగించిన బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్లిపోయినంత సులభం కాదు అజయ్..’’ అన్నారు ఖర్గే! ‘‘గెహ్లోత్ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడం కూడా సులభం కాదా ఖర్గేజీ?!’’ అన్నాను. అందుకు ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘రాజస్థాన్ సీఎంగా ఉండిపోవడానికి గెహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతను కూడా తప్పించుకున్నారు. కానీ అతడిపై చర్యలేదు! సోనియాజీ మిమ్మల్నీ, నన్ను రాజస్థాన్‌కు పంపి పెట్టించిన సీఎల్పీ మీటింగ్‌కి తన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా రాకుండా వారితో గెహ్లోత్ తిరుగుబాటు చేయించారు. కానీ అతడిపై చర్యలేదు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలలో ముగ్గురితో కలసి నన్ను భారత్ జోడో యాత్రకు వెళ్లమంటున్నారు. అందుకే రాజీనామా చేస్తున్నాను. నా ప్రతిష్ఠ కోసం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ కోసం..’’ అన్నాను. ఖర్గే నా వైపు ప్రయాసగా చూశారు. ‘‘గెహ్లోత్ తన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించారు. నువ్వు నీ రాజీనామాతో తిరుగుబాటు చేస్తున్నావు. అంతే కదా? పార్టీ అధ్యక్షుడికి అతి కష్టమైన పనేంటో తెలుసా అజయ్? క్రమశిక్షణ చర్య తీసుకోవడం! పార్టీలోని నాయకులకు అతి సులువైన పనేంటో తెలుసా అజయ్? క్రమశిక్షణ చర్యకు అధ్యక్షుడిపై ఒత్తిడి తేకుండా ఉండటం! సులభమైన పనినే పార్టీ నాయకులు చేయలేక పోతున్నప్పుడు.. కష్టమైన పనిని పార్టీ అధ్యక్షుడు ఎలా చెయ్యగలడో చెప్పు’’ అన్నారు!! -
కాంగ్రెస్‌కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. రాజస్థాన్ ఇన్ఛార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సరిగ్గా రెండు వారాల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అజయ్ మాకెన్ రాజీనామాతో పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడినట్లయింది. అయితే మాకెన్ రాజీనామాకు బలమైన కారణమే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. సెప్టెంబర్‌లో సీఎం అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన నేతలు కొందరు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న గహ్లోత్‌ను సీఎం పదవి నుంచి తప్పిస్తే అంగీకరించే ప్రసక్తే లేదని వారు తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని స్పీకర్ దగ్గరకు వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది. వీరి కారణంగానే అశోక్ గహ్లోత్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలు చేసిన పనికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు వ్యవహారంలో ముఖ్యంగా ముగ్గురు నేతలు శాంతి ధరివాల్, మహేశ్ జోషి, ధర్మేంద్ర రాఠోడ్ కీలకంగా వ్యవహరించారు. వీరే సెప్టెంబర్ 25న కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి డుమ్మాకొట్టి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపైనే కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురికి నోటీసులు కూడా పంపింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అజయ్ మాకెన్ కూడా పార్టీ అధిష్ఠానికి ఇప్పటికే స్పష్టం చేశారు. చర్యలు లేకపోవడంతో.. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా.. ఆ ముగ్గురు నేతలపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అజయ్‌మాకెన్ కలత చెందారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇక ఇన్‌ఛార్జ్‌గా ఉండి ఏం ప్రయోజనం అని భావించి రాజీనామా చేసినట్లు చెప్పారు. నవంబర్ 8నే రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారని వెల్లడించారు. అయితే ఖర్గే ఆయన రాజీనామాను అమోదించలేదని, పదవిలో కొనసాగాలని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం అజయ్ మాకెన్ వారం రోజులు వేచిచూసినప్పటికీ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సచిన్ పైలట్ కూడా రెండు వారాల క్రితమే రాజస్థాన్ కాంగ్రెస్‌లో అనిశ్చితికి తెరదించాలని డిమాండ్ చేశారు. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అధిష్ఠానం నుంచి ఆ దిశగా ఎలాంటి అడుగు పడకపోవడంతోనే అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ కారణంగానే ఆయన రాహుల్ భారత్ జోడో యాత్రకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: గుజరాత్లో ట్విస్ట్.. నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్.. ఆ తర్వాత.. -
గెహ్లాట్ తప్పేం లేదు.. ఆ ముగ్గురే అంతా చేశారు
ఢిల్లీ: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం వెనుక సీఎం అశ్లోక్ గెహ్లాట్ తప్పేం లేదని కాంగ్రెస్ అధిష్టానానికి అందిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్.. సోనియా గాంధీకి అందించిన నివేదికలో గెహ్లాట్‌కు క్లీన్ చిట్ దక్కినట్లు సమాచారం. ఆదివారం నాటి రాజస్థాన్ పరిణామాలను దగ్గరుండి అజయ్ మాకెన్ గమనించారు. ఒకవైపు సీఎల్పీ సమావేశం జరుగుతుంటే.. ఎమ్మెల్యేలంతా ఆ సమావేశానికి గైర్హాజరు కావడం, అదే సమయంలో మరో నేత ఇంట్లో ప్రత్యేకంగా సమావేశం కావడం, ఆపై 82 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామా సమర్పించి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించడం లాంటి పరిణామాలు తెలిసినవే. అయితే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా వెనుక తొలుత గెహ్లాట్ ఉండి ఉంటారని, తన ఇష్ట ప్రకారం తర్వాతి వారసుడిని ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనందునే(సచిన్ పైలట్ పేరు సీఎం రేసులో నిలవడంపై వ్యతిరేకత) ఆయన ఇలా చేసి ఉంటారని కాంగ్రెస్ సీనియర్లలో జోరుగా చర్చ జరిగింది. దీంతో గెహ్లాట్(71) తీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి ఆయన తప్పుకుంటారనే చర్చ సైతం తెరపైకి వచ్చింది. అయితే.. సోనియాగాంధీకి అజయ్ మాకెన్ సమర్పించిన నివేదికలో.. ముగ్గురు ఎమ్మెల్యేల వల్లే తిరుగుబాటు పరిణామాలు సంభవించినట్లు పేర్కొన్నారు. అశోక్ గెహ్లాట్ ప్రమేయం లేకుండానే ఈ పార్టీ వ్యతిరేక చర్య నడిచిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పార్టీ చీఫ్ విప్ మహేష్ జోషి, ఆర్టీడీసీ చైర్మన్ ధర్మేంద్ర పాథక్, ఎమ్మెల్యేలను తన ఇంట్లో సమావేశపర్చిన మంత్రి శాంతి ధారివాల్ పేర్లు ఆ నివేదికలో ఉన్నాయి. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని సోనియాను మాకెన్ కోరినట్లు సమాచారం. ఆదివారం విడిగా జరిగిన ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశంలో 2020 నాటి సచిన్ పైలట్ తిరుగుబాటు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్లు, ఆ సమయంలో ప్రభుత్వాన్ని స్థిరపరిచిన వ్యక్తుల్లో ఒకరినే గెహ్లాట్ వారసుడిగా, రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవాలంటూ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలంతా తీర్మానం చేశారు. కాదని పైలట్‌ను గనుక ముఖ్యమంత్రిని చేస్తే.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని బెదిరించారు కూడా. అంతేకాదు.. అధినేత్రి సోనియా ఆదేశాలను పక్కనపెట్టడంతో పాటు కేంద్రంలోని కీలక నేతలకు కలిసేందుకు, డిమాండ్లు వినిపించేందుకు సైతం ఆ ఎమ్మెల్యేలంతా విముఖత వ్యక్తం చేసినట్లు తేలింది. ఇక ఈ నివేదికను సమర్పించే ముందు ఎమ్మెల్యేలంతా క్రమశిక్షణతో లేరంటూ మాకెన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
Rajasthan political crisis: గెహ్లాట్ వర్గం ధిక్కారం!
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ ప్రతిష్టంభన ముదురుపాకాన పడింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోసం కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టి సంక్షోభంగా మారింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక వేళ తలనొప్పులను మరింతగా పెంచుతోంది. అధ్యక్ష బరిలో దింపాలని భావించిన సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ రాజస్తాన్ సీఎం పీఠం వదులుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో పార్టీ పెద్దలకు ఎటూ పాలుపోవడం లేదు. సీఎంగా కొనసాగుతూనే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని గెహ్లాట్ భీష్మించుకున్నారు. ఒకరికి ఒకే పదవి నిబంధన ఈ విషయంలో వర్తించదని ఆయన వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చేదాకా గెహ్లాట్‌నే సీఎంగా కొనసాగించాలన్న డిమాండ్‌పై వెనక్కు తగ్గేందుకు ఆయన వర్గం ఎమ్మెల్యేలు కూడా ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో వారంతా అధిష్టానాన్నే ధిక్కరించేలా వ్యవహరించి గట్టి షాకిచ్చారు! గెహ్లాట్ స్థానంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను సీఎం చేయాలన్న అధిష్టానం యోచనను వ్యతిరేకిస్తూ 108 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 82 మంది ఆదివారం స్పీకర్‌కు రాజీనామా సమర్పించడం తెలిసిందే. పరిస్థితిని చక్కదిద్దేందుకు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌లను ఆదివారం రాత్రి హుటాహుటిన రాజస్తాన్‌కు పరిశీలకులగా పంపిన అధిష్టానానికి మింగుడు పడని రీతిలో మరిన్ని షాకులు తగిలాయి. ఎమ్మెల్యేలు కనీవినీ ఎరగని స్థాయిలో ధిక్కార స్వరం విన్పించారు. దీనిపై బీజేపీ కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరింది. పార్టీ నుంచి నేతల నిష్క్రమణ, వరుసగా ఓటములు తదితరాలతో ఇప్పటికే కుదేలైన కాంగ్రెస్ అధిష్టానం ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలతో గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలోకి దిగడం అనుమానంగా మారింది. అధిష్టానానికి విశ్వాసపాత్రులైన మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్, సుశీల్‌కుమార్ షిండే, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు విన్పిస్తున్నాయి. తాను పోటీ చేయబోనని దిగ్విజయ్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కమల్‌నాథ్ కూడా సోమవారం అదే మాట చెప్పారు. పరిశీలకులకు గెహ్లాట్ వర్గం షాకులు సీఎం గెహ్లాట్ నివాసంలో ఖర్గే, మాకెన్ ఆదివారం రాత్రి అత్యవసరంగా సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలంతా దాన్ని బహిష్కరించడంతో వారు దిమ్మెరపోయారు! చాలాసేపు ఎదురు చూసినా ఎమ్మెల్యేలు రాకపోవడంతో భేటీని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. చివరికి ఒక్కొక్కరిగా వచ్చి తమతో సమావేశం కావాల్సిందిగా ఆదేశించినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. పైగా అదే సమయంలో వారంతా కలిసి ఓ మంత్రి ఇంట్లో విడిగా సమావేశమయ్యారు! ‘‘గెహ్లాట్‌ను తప్పిస్తే ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా చిక్కుల్లో పడుతుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని తాలూకు వీడియో కూడా మీడియాకు లీకైంది! అనంతరం నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉందంటూ ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారు! అనంతరం ఎమ్మెల్యేల తరఫున మంత్రులు శాంతి ధరీవాల్, మహేశ్ జోషి, ప్రతాప్‌సింగ్ పరిశీలకులతో భేటీ అయ్యారు. ‘‘సీఎం ఎవరనే దానిపై అక్టోబర్ 19 తర్వాత కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడే నిర్ణయం తీసుకోవాలి. రెండేళ్ల క్రితం పైలట్ తిరుగుబాటు సమయంలో ప్రభుత్వానికి విధేయులుగా నిలిచిన ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎన్నుకోవాలి. ఒక్కో ఎమ్మెల్యేలతో విడిగా కాకుండా అందరితో కలిసే మీరు భేటీ అవాలి’’ అంటూ షరతుల చిట్టాను వారి ముందుంచారు. ముందుగా ఎమ్మెల్యేల అనుమానాలను అధిష్టానం నివృత్తి చేయాలని చీఫ్ విప్ మహేశ్ జోషి కూడా డిమాండ్ చేశారు. ఎవరిని సీఎం చేసినా అభ్యంతరం లేదంటూనే, అది తమకు అంగీకారయోగ్యంగా ఉండాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు. దాంతో విస్తుపోవడం ఖర్గే, మాకెన్ వంతయింది. ఈ వరుస భంగపాట్ల నేపథ్యంలో వారిద్దరూ సోమవారం ఉదయమే హస్తినకు తిరుగుముఖం పట్టారు. అధినేత్రి సోనియాగాంధీ నివాసానికి వెళ్లి జరిగిందంతా వివరించారు. దాంతో ఆగ్రహించిన సోనియా మొత్తం ఉదంతంపై లిఖితపూర్వక మంగళవారానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గెహ్లాట్‌తో సన్నిహిత సంబంధాలున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. ఆయన సోనియాతో గంటపాటు భేటీ అయ్యారు. గెహ్లాట్‌ను రాజీకి రప్పించేందుకు కమల్‌నాథ్‌ను నియోగించవచ్చంటున్నారు. తీర్మానంలో షరతులా: మాకెన్ గెహ్లాట్ వారసున్ని నిర్ణయించే అధికారాన్ని పార్టీ చీఫ్‌కు కట్టబెడుతూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం ఆమోదింపజేయాలని ఖర్గే, మాకెన్ తలపోయగా, అధ్యక్షునిగా ఎన్నికయ్యేదాకా గెహ్లాట్ సీఎంగా కొనసాగుతారంటూ అందులో చేర్చాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఇది క్రమశిక్షణ రాహిత్యమేనంటూ మాకెన్ మండిపడ్డారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తీర్మానమంటే కేవలం ఏకవాక్యంతో ఉంటుంది. అంతే తప్ప షరతులతో కూడిన తీర్మానాలు కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేవు. సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టి విడిగా సమావేశం కావడం క్షమించరాని విషయం’’ అంటూ ఆగ్రహించారు. ‘‘సీఎంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సింది గెహ్లాటే. తర్వాత అధ్యక్ష పదవికి పోటీ పడేదీ ఆయనే. గెలిస్తే తను సీఎంగా కొనసాగాలో లేదో నిర్ణయించేదీ ఆయనే. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవదా?’’ అంటూ మండిపడ్డారు. -
సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్
కొచ్చి/జబల్పూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తన తర్వాత రాజస్తాన్ సీఎం ఎవరన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ నిర్ణయిస్తారన్నారు. పార్టీలో ఇటీవల తెరపైకి వచ్చిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అంశంపై చర్చ అనవసరమన్నారు. గెహ్లాట్ శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని రాహుల్ గాంధీ తనతో చెప్పారన్నారు. నామినేషన్ ఎప్పుడు దాఖలు చేయాలన్నది రాజస్తాన్ వెళ్లాక నిర్ణయించుకుంటానన్నారు. ఎన్నికలో పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని, నూతన ప్రారంభానికి శ్రీకారం చుడతామని వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత కలిసి నడవాల్సిందే.. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా అధ్యక్ష పోస్టుకి పోటీ పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, గెహ్లాట్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ మిత్రులు ఎవరైనా అధ్యక్ష పదవిని కోరుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఫలితాల తర్వాత అందరూ కలిసి నడవాల్సిందే. బ్లాక్, గ్రామం, జిల్లా స్థాయిల్లో పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఐక్యమత్యంగా పనిచేయాలి. కాంగ్రెస్‌ను బలమైన ప్రతిపక్షంగా మార్చుకోవాలి’’ అని ఉద్ఘాటించారు. దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బలమైన ప్రతిపక్షం తప్పనిసరిగా అవసరమని గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడబోనని రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా తాజాగా తెలిపారు. ఇదీ చదవండి: అతి త్వరలో సీఎంగా సచిన్ పైలట్.. హింట్ ఇచ్చిన మంత్రి -
పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడటం దురదృష్టకరం, బాధాకరం అని కాంగ్రెస్ తెలిపింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ పోరాడుతున్న సమయంలో ఆయన రాజీనామా చేయడంపై విచారం వ్యక్తం చేసింది. ఆజాద్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, జైరాం రమేశ్ మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయంపై స్పందించారు. ఆజాద్ రాజీనామా లేఖలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని జైరాం రమేశ్ అన్నారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఆజాద్‌పై విమర్శలు గుప్పించారు జైరాం రమేశ్. గులాం నబీ ఆజాద్ డీఎన్ఏ 'మోడీ-ఫై' అయిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఎంతో గౌరవించిందని అన్నారు. కానీ అతను మాత్రం ద్రోహం చేశారని మండిపడ్డారు. రాజీనామా లేఖలో ఆజాద్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన అసలు రంగుకు నిదర్శనమన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఐదు పేజీల లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. 2013లో రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నాశనమైందని ఆరోపించారు. సీనియర్లకు సముచిత స్థానం కల్పించడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు రాహుల్ త్వరలో చేపట్టబోయే 'భారత్ జోడో యాత్ర'పైనా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు ముందు 'కాంగ్రెస్ జోడో యాత్ర' చేపట్టాల్సిందని సైటెర్లు వేశారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని లేఖ రాసిన జీ-23 నేతలను అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. గౌరవం ఉండదు.. మరోవైపు ఆజాజ్‌కు ఇకపై గౌరవం దక్కకపోవచ్చని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఆయనపై గతంలో ఎంతో ప్రేమ చూపించామన్నారు. కాంగ్రెస్‌కు గతంలోనూ ఇలా జరిగిందని, ఆ తర్వాత మళ్లీ పుంజుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో బలమైన ప్రతిపక్షం అవసరమని పేర్కొన్నారు. బీజేపీ ఆహ్వానం.. కాంగ్రెస్ తనను తానే నాశనం చేసుకుంటోందని ఆజాద్ అన్నదాంట్లో తప్పేంలేదని బీజేపీ నేత కుల్దీప్ బిష్ణోయ్ అన్నారు. ఆయనను కమలం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఆదేశిస్తే తానే ఆజాద్‌తో సంప్రదింపులు జరిపి తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్ -
జహంగీర్‌పురి కూల్చివేతలు.. సారీ చెప్పిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి కూల్చివేతల అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ కూల్చివేతలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నాయి. విపక్షాల నిరసన కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నివాసం వద్ద యువజన కాంగ్రెస్ గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, ఎంపీ శక్తి సింగ్ గోహిల్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి, ఉపాధ్యక్షుడు అభిషేక్ దత్తో సహా 15 మందితో కూడిన బృందం జహంగీర్‌పురి బాధితులను కలిసింది. ‘మేము బాధితులను కలిసేందుకు జహంగీర్‌పురికి వచ్చాము. పోలీసులు సహకరించారు. దీన్ని మతం కోణంలో చూడకూడదని ప్రజలకు చెప్పేందుకు ఇక్కడికి వచ్చామ’ని మీడియాతో అజయ్ మాకెన్ చెప్పారు. కూల్చివేతల సమయంలో అక్కడ లేనందుకు క్షమాపణ చెబుతూ మాకెన్ ట్వీట్ చేశారు. (క్లిక్: ఇంత జరుగుతున్నా కేజ్రీవాల్ ఎక్కడ..) విభజన రాజకీయాలు చేయం: మమత ఇక ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘మేము బుల్డోజ్ చేయకూడదనుకుంటున్నాము. ప్రజలను విభజించాలని కోరుకోవడం లేదు. ప్రజలను ఏకం చేయాలనుకుంటున్నాం. ఐకమత్యమే మా ప్రధాన బలం. ఐక్యంగా ఉంటేనే సాంస్కృతికంగా ఎంతో దృఢంగా ఉంటా’మని ఏఎన్ఐతో అన్నారు. మతం ఆధారంగా బుల్డోజర్లు: తేజశ్వి యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... ‘సుప్రీంకోర్టు జోక్యం తర్వాత కూడా జహంగీర్‌పురిలో కూల్చివేతలు కొనసాగాయి. మనదేశంలోకి చైనా చొచ్చుకుని వస్తున్నా చర్యలు శూన్యం. అయితే మతం ఆధారంగా బుల్డోజర్లు నడుపుతున్నార’ని ఆయన వ్యాఖ్యానించారు. (క్లిక్: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్ట్) ఆ ఆరోపణలు సరికాదు: తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందనే ఆరోపణ సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లు జమియత్ ఉలమా-ఐ-హింద్ దాఖలు చేసిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఉత్తర ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జహంగీర్‌పురిలో కూల్చివేతలు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
కేజ్రీవాల్ మౌనం వెనుక అర్థం ఏంటి..?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్పూరిలో బుధవారం అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన విషయం తెలిసిందే. నిర్మాణాల కూల్చివేతల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు బాధితులను పరామర్శించేందుకు అక్కడకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇంత జరుగుతున్నా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా వున్నారని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం చట్ట విరుద్ధమని మాకెన్ మండిపడ్డారు. కాగా, జాహంగీర్‌పూరిలో బాధిత కుటుంబాలను అజయ్ మాకెన్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం పరామర్శించింది. మాకెన్ బృందలో 16 మంది నేతలు ఉన్నారు. ఇక, కూల్చివేతల వ్యవహారాన్ని మతపరమైన కోణంలో చూడవద్దని అన్నారు. మరోవైపు జహంగీర్‌పూరి ఘటనపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్ అంటేనే ఏకపక్ష కూల్చివేతలంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది చదవండి: మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సీఎం కీలక నిర్ణయం -
Rajasthan: కేబినెట్ నుంచి మంత్రులు వైదొలిగే అవకాశం
జైపూర్: రాజస్తాన్ కేబినెట్ నుంచి కొందరు మంత్రులు వైదొలిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. హై కమాండ్ ఆదేశాలకు లోబడి నడుచుకుంటామని వారంతా చెప్పారన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మరిన్ని కీలక పదవులు ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ వర్గీయుల డిమాండ్ మేరకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇందులో భాగంగానే ఆయన, రాష్ట్రంలోని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో విడివిడిగా సమావేశమై, అభిప్రా యాలు తెలుసుకున్నారు. ఈ మేరకు రూపొం దించిన నివేదికను అజయ్ మాకెన్ పార్టీ హై కమాండ్‌కు అందజేయనున్నారు. -
రాజస్తాన్ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అసమ్మతి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. తమకు గతంలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని, ప్రభుత్వ పదవులు దక్కడం లేదని మండిపడుతోంది. అధికారంలో తమ వంతు వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తమ దారి తాము చూసుకుంటున్నామన్న సంకేతాలను పైలట్ వర్గం ఇస్తోంది. పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి ఏఐసీసీ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ కూడా ఈ వ్యవహారంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వర్గం మధ్య సయోధ్య కుదుర్చేందుకు గట్టిగా ప్రయత్నించడం లేదు. తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ స్పందించారు. కేబినెట్లో కొన్ని పదవులతోపాటు నామినేటెడ్, కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలో భర్తీ చేస్తారని, ఎవరూ నిరాశపడొద్దని అసమ్మతి నేతలను కోరారు. సచిన్ పైలట్‌తో తాను తరచుగా మాట్లాడుతూనే ఉన్నానని, ఆయనలో ఎలాంటి అసంతృప్తి లేదని వివరించారు. మరోవైపు తమలో సహనం నశించిపోతోందని పైలట్ వర్గం చెబుతోంది. పైలట్ వర్గం నుంచి బయటకు రావాలని సీఎం గహ్లోత్ తమపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపిస్తోంది. పార్టీ పరిధులను అతిక్రమించకుండా హక్కుల కోసం పోరాడుతామని తేల్చిచెబుతోంది. పైలట్ వెంట ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు గత ఏడాది తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. దీంతో ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తామంటూ అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం పైలట్ అనుచరులకు హామీ ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పైలట్ వర్గ ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్ సోలంకి ఆరోపించారు. దీనిపై రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా స్పందిస్తూ... గహ్లోత్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను భయపెడుతోందన్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ! సచిన్ పైలట్ వర్గం అసంతృప్తి పెరుగుతుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి అజయ్ మాకెన్ వైరివర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైలట్ రెండురోజులగా ఢిల్లీలోనే మకాం వేశారు. కేబినెట్లో ఖాళీగా ఉన్న 9 స్థానాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో విలీనమైన బీఎస్పీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం, మహిళలు, మైనారిటీల ప్రాతినిధ్యాన్ని పెంచడం.. సామాజికవర్గ సమీకరణాలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. -
మాకెన్‌కు రాజస్తాన్ బాధ్యతలు
న్యూఢిల్లీ: రాజస్తాన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా అజయ్ మాకెన్ ఆదివారం నియమితులయ్యారు. అవినాష్ పాండే స్థానంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాకెన్‌కు రాజస్తాన్ బాధ్యతలు అప్పగించారు. సచిన్ పైలెట్ వర్గం తిరుగుబాటు చేసిన సమయంలో మాకెన్ పరిశీలకుడిగా రాజస్తాన్‌కు వెళ్లి కీలకపాత్ర పోషించారు. రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం పైలెట్ వర్గం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడంతో రాజస్తాన్ అసెంబ్లీలో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని నెగ్గిన విషయం తెలిసిందే. పైలెట్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించే నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించిన త్రిసభ్య కమిటీలోనూ మాకెన్ సభ్యుడిగా ఉన్నారు. అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ మిగతా ఇద్దరు సభ్యులు. -
కొత్తగా తెరపైకి సంజయ్ జైన్..
జైపూర్: రాజస్తాన్ లో ఈ వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక భేటీ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శనివారం దాదాపు ముప్పావు గంట పాటు సమావేశమైన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరపాలా? వద్దా? బలనిరూపణకు వెళ్లాలనుకుంటే.. ఎప్పుడు వెళ్లాలి? తదితర విషయాల్లో తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆదివారం వ్యాఖ్యానించారు. (తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా ) యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే, పార్టీ విప్‌ను ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పైలట్ సహా 19 ఆయన వర్గం ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులను కూడా స్పీకర్ జారీ చేశారు. ఆ నోటీసులపై పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు(సోమవారం) డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. దాంతో హైకోర్టు ఇవ్వనున్న ఆదేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107. ఇందులోపైలట్ సహా ఆయన వర్గం 19 మంది ఎమ్మెల్యేలు. ఈ పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ల సహకారం లేకుండా, గహ్లోత్ విశ్వాస పరీక్షలో ఎలా నెగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రభుత్వ కూల్చివేత కుట్రకు సంబంధించి బయటపడిన ఆడియో టేప్‌లు నిజమైనవేనని సీఎం గహ్లోత్ తేల్చి చెప్పారు. బీజేపీ చెబుతున్నట్లు ఆ ఆడియో టేప్‌లు నకిలీవైతే.. రాజకీయాల నుంచి వైదొలగుతానన్నారు. షెకావత్ రాజీనామా చేయాలి: రాజస్తాన్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదివారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయమై వెలుగు చూసిన ఆడియో టేప్‌ల్లో షెకావత్ సంభాషణలు బయటపడడాన్ని ప్రస్తావిస్తూ.. నైతిక బాధ్యత వహిస్తూ షెకావత్ రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. మరో వైపు, పైలట్‌ను తిరిగి కుటుం బం(పార్టీ)లోకి రావాలని కాంగ్రెస్ అధికా ర ప్రతినిధి సూర్జేవాలా మరో సారి కోరారు. బీజేపీ వల నుంచి ఇకనైనా బయటపడాలని సూచించారు. విశ్వాస పరీక్షతో బలం తేలుతుంది అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవడం ద్వారానే మెజారిటీ తేలుతుందని బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్పష్టం చేశారు. ‘గవర్నర్‌తో భేటీలో సీఎం ఏం చెప్పారనేది ఎవరికీ తెలియదు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితా ఇచ్చి ఉండవచ్చు, లేదా ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించి ఉండవచ్చు. కానీ అంతిమంగా అసెంబ్లీలో బలపరీక్ష ద్వారానే మెజారిటీ ఉందా? లేదా? అనేది స్పష్టమవుతుంది’ అన్నారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్..! సచిన్ పైలట్ తిరుగుబాటుతో హుటాహుటిన జైపూర్‌కు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు గహ్లోత్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేలిన తరువాత కూడా జైపూర్‌లోనే ఉంటూ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడడమొక్కటే కాదు..ముఖ్యంగా బీజేపీకి, సచిన్ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు సరైన గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్నామని చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలలోని కొందరితో టచ్‌లో ఉంటూ, పైలట్ వర్గం భవిష్యత్ వ్యూహాలను తెలుసుకుంటోంది. కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే.. శనివారం సీఎం గహ్లోత్ అకస్మాత్తుగా గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసి, బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను చూపారు. కాంగ్రెస్(88), బీటీపీ(2), సీపీఎం(2), ఆర్ఎల్డీ(1), స్వతంత్రులు(10).. మొత్తం 103 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ భావిస్తున్నారు. దాంతో, ఈ వారం విశ్వాస పరీక్షకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అకస్మాత్తుగా విశ్వాస పరీక్షకు వెళ్లాలన్న ఆలోచన వెనుక, పైలట్ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు లాగే వ్యూహముందని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగానే వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అనర్హత విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలు తమకున్నారని ధీమాగా ఉంది. అనర్హత వేటు వేసేందుకు వీలు కలగనట్లైతే.. మెజారిటీ మార్క్‌కి మించి, 103 మంది సభ్యులు మద్దతిస్తున్నారని చెబుతోంది. ‘అనర్హత వేటు వేసేందుకు వీలు కలిగితే.. 107 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 19 మంది అనర్హులుగా తేలుతారు. దాంతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. అప్పుడు మెజారిటీ మార్క్ 91 అవుతుంది. ఆ మార్క్‌ను గహ్లోత్ సునాయాసంగా చేరుకుంటారు’ అని విశ్వసిస్తోంది. సంజయ్ జైన్ ఎవరు? రాజస్తాన్ సంక్షోభంలో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు సంజయ్ జైన్. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియోటేప్ల్లో ఉన్నది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, సంజయ్జైన్ల స్వరాలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, ఆ గొంతులు తమవి కావని వారు స్పష్టం చేశారు. జైన్ బీజేపీ వ్యక్తి అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. తమ పార్టీకి అతడితో ఏ సంబంధం లేదని బీజేపీ చెబుతోంది. అయితే, జైన్ ఫేస్బుక్ ప్రొఫైల్‌లో ఆయన బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం వసుంధర రాజెతో దిగిన ఫొటో ఉంది. అలాగే, రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా జైన్ పాల్గొన్నట్లుగా ఫొటోలు ఉన్నాయి. కాంగ్రెస్ ఫిర్యాదుపై షెకావత్, శర్మలతో పాటు జైన్‌పై కూడా రాజస్తాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. మాజీ సీఎం వసుంధర రాజెను ఒకసారి కలవమని, బీజేపీలో చేరమని తనను సంజయ్ జైన్ 8 నెలల క్రితమే కోరారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుహ తాజాగా వెల్లడించారు. -
మోదీని ఎదుర్కోగలిగే నేత రాహులే: మాకెన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు స్వీకరించాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే రాహుల్ గాంధీ పార్టీకి నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీని ధైర్యంగా ఎదుర్కొగలిగే శక్తి ఒక రాహుల్‌కే ఉందని తెలిపారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ చాలా అనుభవం గల రాజకీయ నాయకురాలని, రాహుల్‌కు బాధ్యతలు అప్పగించి సలహాలిచ్చే బాధ్యతను సోనియా తీసుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. దీనికి అనుగుణంగానే పార్టీ రాజ్యాంగాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉందని అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. దేశానికి మంచి చేసే నాయకుడి అవసరం ఉందని అన్నారు. రాహుల్ గాంధీ గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా అన్ని ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కొనియాడారు. సామాజిక, జాతీయ, ఆర్థిక అంశాలపై కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పార్టీ నాయకులు అందరు పాటించాలని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. చదవండి: మోదీ తాజ్‌మహల్‌ను కూడా అమ్మేస్తారు: రాహుల్ -
కేజ్రీపై ప్రశంసలతో కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన కాంగ్రెస్ నేత మిలింద్ దియోరాపై ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ మండిపడ్డారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రాబడులను రూ 60,000 కోట్లకు రెట్టింపు చేసిందని, గత ఐదేళ్లలో రెవెన్యూ మిగులును కొనసాగిస్తోందని దియోరా కేజ్రీ సర్కార్‌పై ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. అయితే దియోరా కాంగ్రెస్ పార్టీని వీడాలని, ఆ తర్వాత అర్థ సత్యాలను ప్రచారం చేసుకోవాలని మాకెన్ హితవు పలికారు. ముందుగా మీరు వాస్తవాలను తెలుసుకుని ఆపై ట్వీట్ చేయాలంటూ చురకలు అంటించారు. కాంగ్రెస్ హయాంలో 2015-16లో ఢిల్లీ రాబడి 14.87 శాతం పెరిగి రూ 41,129 కోట్లకు చేరుకున్న విషయం దియోరా గుర్తెరగాలని సూచించారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ఘనవిజయం సాధించగా బీజేపీ ఎనిమిది స్ధానాలకు పరిమితమవగా కాంగ్రెస్ ఖాతా తెరవని సంగతి తెలిసిందే. చదవండి : మఫ్లర్‌మాన్ సందడి క్రేజీ -
కాంగ్రెస్ గెలిస్తే నిరుద్యోగ భృతి ఎంతో తెలుసా..!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చోప్రా, కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్‌లు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను, 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి నెలా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, 20 వేల లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇవ్వగా... దానికి ప్రతిగా కాంగ్రెస్ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని మాటిచ్చింది. ఆటోలు, ఈ-రిక్షాలపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆహార భద్రత చట్టం కింద ప్రస్తుతం ఇస్తోన్న బియ్యం, గోధుమలను రెట్టింపు చేస్తామని తెలిపింది.ఇందులో నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్‌కు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గ్రాడ్యుయేట్లకు రూ.5,000, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రూ.7.500 చొప్పున ప్రతి నెలా నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఈ మేనిఫెస్టోలో భరోసా ఇచ్చింది. 'అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న రూపంలో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను అమలు చేసేది లేదు' అని పేర్కొంది. సుప్రీంకోర్టులో సీఏఏను సవాలు చేస్తామని తెలిపింది. గతంలో షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడు సార్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. కాగా, ఈనెల 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 11న ఓట్లు లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. -
రేపే ఆరోదశ.. పోటీలో కీలక నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం పలు రాష్ట్రాల్లో 59 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 10, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7, జార్ఘండ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ చేతిలో తీవ్ర పరాభావానికి గురైన కాంగ్రెస్ ఈసారి కనీసం గౌరప్రదమైన స్థానాలను గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా షీలా విజయంపై పార్టీ గంపెడు ఆశాలను పెట్టుకుంది. ఆమెతో బీజేపీ సీనియర్ నేత మనోజ్ తివారి బరిలో ఉన్నారు. దేశ రాజధానికి మూడు సార్లు ఏకంగా సీఎంగా వ్యవహించడం, సీనియర్ నేత కావడంతో విజయావకాశాలు ఎక్కువగా తమకే ఉన్నాయని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మరో సీనియర్ నేత అజయ్ మాకెన్ బరిలో ఉన్నారు. 2004, 09 ఎన్నికల్లో విజయం సాధించిన మాకెన్ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మీనాక్షిలేఖిపై పరాజయం పాలైయ్యారు. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుంటున్నారు. కాగా ఈస్థానంలో ఎవరు గెలిస్తే ఆపార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే సాంప్రదాయం కూడా ఇక్కడుంది. గత రెండు దశాబ్ధాలుగా అదే జరుగుతూ వస్తోంది. ఈస్ట్ ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి. ఎన్నికల బరిలో నిలవడంతో వివాదాలు గంభీర్‌ను చుట్టుముట్టుతున్నాయి. ఆప్ అభ్యర్థి ఆతిషి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంభీర్‌కు నోటీసులు కూడా పంపారు. మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి మధ్య ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాధిత్య సింధియా పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈయనకు కీలక పదవి దక్కింది. ఇప్పటి వరకు గుణలో నాలుగు సార్లు విజయం సాధించిన సింథియా ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ ఆయన తరఫున గెలుపు బాధ్యతలను ఆయన భార్య ప్రియదర్శినీ రాజే మోస్తున్నారు. గెలపు తథ్యమనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన తండ్రి ములాయం సింగ్ విజయం సాధించారు. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలో నిలిచారు. ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి. రాజకీయాలకు కొత్తయినా ప్రచారం దూసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ నుంచి బీజేపీ తరపున వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన తల్లి కేంద్రమంత్రి మేనకా గాంధీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో వరుణ్ సుల్తాన్ పూర్ నుంచి విజయం సాధించారు. ఈసారి వారిద్దరూ స్థానాలు మార్చుకున్నారు. భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి మధ్య ప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీపడుతున్నారు. ఈస్థానంలో బీజేపీ అభ్యర్థిగా సాద్వీ ప్రజ్ఞాసింగ్ పోటీలో ఉన్నారు. -
ఆ స్థానం ఎవరు గెలిస్తే.. కేంద్రంలో వారిదే అధికారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్థానంలో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి రావడం గత రెండు దశాబ్ధాలుగా సాగుతోంది. 1992లో జరిగిన ఉప ఎన్నికల నుంచి ఈ స్థానంలో ఎవరు గెలిస్తే కేంద్రంలో కూడా అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగగా.. దానిలో 13సార్లు ఇదే సీన్ రిపీటైంది. దీంతో ఈ స్థానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌తో సహా ఆప్ కూడా ప్రతీష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశంలో కీలకమై కేంద్ర వ్యవస్థలన్నీ ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటం విశేషం. భారత అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంట్, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాజ్యాంగ బద్దమైన సంస్థలు, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల నివాసాలు ఇదే నియోజకవర్గంలో ఉన్నాయి. అంతేకాదు దేశ రక్షణ వ్యవస్థకు చెందిన అనేక సంస్థలు కూడా ఈ స్థానం పరిధిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖీ విజయం సాధించారు. అనుకున్నట్లుగానే కేంద్రంలో అత్యధిక మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకుముందు జరిగిన 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్రంలో కొలువుదీరింది. 1998, 1999లో ఎన్నికల్లో కేంద్రంలో వాజ్‌పేయీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు ఎన్నికల్లోనూ అనుహ్యంగా బీజేపీ అభ్యర్థి జగ్మోహన్ విజయం సాధించారు. ఆయన కొద్ది కాలంపాటు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్కే దావన్‌పై ఆయన గెలుపొందారు. అయితే అంతకుముందు 1996లో వాజ్‌పేయీ ప్రభుత్వం లోక్‌సభలో మెజార్టీ లేక కేవలం 13 రోజులకే పడిపోయిన విషయం తెలిసిందే. అప్పడు కూడా జగ్మోహన్ విజయం సాధించడం విశేషం. అద్వానీ గెలుపు.. ఉప ఎన్నికల్లో ఓటమి 1991లో దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఘన విజయం సాధించారు. అయితే అదే సమయంలో ఆయన గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి కూడా గెలుపొందడంతో న్యూఢిల్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హాపై కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ కన్నా గెలుపొందారు. ఆ సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1992కు ముందు ఈ సాంప్రదాయంలో కొంత మార్పు వచ్చింది. 1951 నుంచి 89 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఆరుసార్లు మాత్రమే న్యూఢిల్లీ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటే కేంద్రంలో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. స్వాతంత్ర భారతంలో మొదటి సారి 1951లో జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానాన్ని కిసాన్ మాజ్దుర్ ప్రజా పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ నుంచి ఇక్కడ పోటీచేసిన సుచేతా కృపాలాని ఘన విజయం సాధించారు. ఆతరువాత ఎన్నికల్లో కూడా (1957) కూడా కృపాలానినే రెండోసారి విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత యూపీ అసెంబ్లీకి పోటీచేసి దేశ చరిత్రలో తొలి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. అప్పటి నుంచే ఈ సాంప్రదాయం మొదలైంది. ఇక 1962, 1971, 84 ఎన్నికల్లో న్యూఢిల్లీతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక అత్యయిక పరిస్థితి అనంతరం జరగిన తొలి ఎన్నికల్లో (1977) బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు అటల్ బిహారి వాజ్‌పేయీ.. భారతీయ లోక్‌దళ్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రంలో మోరార్జీ దేశాయ్ నేతృత్వంలో తొలి కాంగ్రెసేతేర ప్రభుత్వాన్ని (జనతా) ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి అద్వానీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందగా.. వీపీ సింగ్ సారథ్యంలో నేషనల్ ఫ్రెంట్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 1967, 80 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం ఇతరులు కైవసం చేసుకున్నారు. ఈసారి విజయం ఎవరిదో.. ఇలా వినూత్న సాంప్రదాయానికి వేదికైన న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో విజయం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ మీనాక్షీ లేఖి మరోసారి బరిలో నిలవగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అజయ్ మాకెన్ మరోసారిపోటీలో నిలిచారు. ఆప్ నుంచి బ్రిజేష్ గోయల్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాలకు బీజేపీయే సొంతం చేసుకుంది. మరోసారి అదే ధీమాతో బరిలో నిలిచింది. దీనిలో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో కూడా మొదటినుంచి వ్యూహాత్మకంగా అడుగులువేసింది. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను ఇక్కడి నుంచి బరిలో నిలపాలని బీజేపీ భావించినా.. చివరి నిమిషంగా లేఖీ అభ్యర్థిగా ప్రకటించింది. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు.. (10) కరోల్‌బాగ్, పటేల్ నగర్, మోతీ నగర్, ఢిల్లీ కాంట్, రాజేంద్ర నగర్, న్యూఢిల్లీ, కస్తూరిబా నగర్, మాలవియ నగర్, ఆర్కే పురం, గ్రేటర్ కైలాష్. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఆప్ విజయం సాధించడం విశేషం. -
ఢిల్లీ కాంగ్రెస్‌లో కుదుపు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌లో శుక్రవారం పెద్ద కుదుపు వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ మాకెన్ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలను ఉటంకిస్తూ ఆయన రాజీనామా సమర్పించారని అంటున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి పీసీ చాకో, అజయ్‌మాకెన్ గురువారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని, రాహుల్ గాంధీ ఆయన రాజీనామాను అంగీకరించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం తరువాత 54 సంవత్సరాల అజయ్ మాకెన్ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. సహకారం అందించినందుకు కృతజ్ఞతలు: మాకెన్ తన రాజీనామా విషయాన్ని అజయ్ మాకెన్ ట్వీట్ చేసి తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా çతనకు అందించించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల తరువాత తనకు పార్టీ కార్యకర్తల నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కవర్ చేసే మీడియా నుంచి, రాహుల్ గాంధీ నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించాయని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ కఠిన పరిస్థితులలో నాయకత్వం సులభం కాదని, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. సెప్టెంబర్‌లోనే వార్తలు... మాకెన్ డీపీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేసినట్లు సెప్టెంబర్‌లో కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఆరోగ్య కారణాల వల్లనే ఆయన రాజీనామా చేసినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఆయన రాజీనామా వార్తను ఖండించింది. ఈసారి కూడా రాజీనామాకు కారణాన్ని మాకెన్ వెల్లడించలేదు. కానీ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ çపార్టీ పొత్తు కుదుర్చుకుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆయన రాజీనామాపై అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్‌ల మధ్య పొత్తును మాకెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మాకెన్‌ను మళ్లీ అఖిల బారత కాంగ్రెస్ కమిటీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. రేసులో షీలాదీక్షిత్.. మాకెన్ డీపీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆ పదవిని ఆక్రమిస్తారని కూడా పార్టీలో కొందరు అంటున్నారు. పార్టీ అధిష్టానం కోరితే తిరిగి ఢిల్లీ రాజకీయాలలో పాత్ర పోషించేందుకు తాను సిద్ధమని, అధిష్టానం కుదుర్చుకునే పొత్తులు తనకు ఆమోదయోగ్యమని ఆమె ఇదివరకే ప్రకటించారు. పొత్తు ఊహాగానాలను కాంగ్రెస్, ఆప్ కూడా ఖండించడం లేదు. కాంగ్రెస్ నేతలు యోగానందశాస్త్రి, రాజ్‌కుమార్ చౌహాన్, హరూన్ యూసఫ్, చతర్ సింగ్‌ల పేర్లను కూడా పార్టీ డీపీసీసీ అధ్యక్షపదవికి పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు మూడు రోజులు అమే«థీ పర్యటనకు వెళ్తున్నందువల్ల డీపీసీసీ అధ్యక్షపదవిపై నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటారని వారు చెప్పారు. -
అజయ్ మాకెన్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ తప్పుకున్నారు. అనారోగ్య కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేసినట్టు మాకెన్ చెప్పుకొచ్చారు. కానీ, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మాకెన్.. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలువనున్నట్టు తెలిసింది. కాగా, మాకెన్ రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించినట్టుగా సమాచారం. కాగా, గత రాత్రి తన రాజీనామాను సమర్పించక ముందు మాకెన్, రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ సందేశాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాను. ఈ నాలుగేళ్లలో నాకు రాహుల్ నుంచి, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి, మీడియా నుంచి అపారమైన ప్రేమ, మద్దతు లభించాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది తేలికైన విషయం కాదు. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాన’ని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ్యత వహిస్తూ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహా మేరకు మాకెన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. -
మమతా బెనర్జీ, సీపీఎం కలిసి పోటీ చేస్తారా..?
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీరు, కేజ్రీవాల్‌కు మద్దతు తదితర అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సోమవారం విలేకరులతో మాట్లాడిన మాకెన్... బెంగాల్లో మమతా బెనర్జీ, సీపీఎం కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించిన నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావిస్తూ.. ‘ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉండే అధికారాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. బహుశా అది ఆ నలుగురికి(మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామి, చంద్రబాబు నాయుడు) తెలియదేమో’ అంటూ మాకెన్ వ్యాఖ్యానించారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే... కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాలు తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయంటూ మాకెన్ విమర్శించారు. ‘అయినా ప్రభుత్వ అధికారులు(ఐఏఎస్‌లను ఉద్దేశించి) తమ కర్తవ్యాలను నిర్వర్తించడానికి వెనకడుగు వేయరు. కానీ ప్రభుత్వం వారిచేత అక్రమ పనులు చేయించాలనుకున్నపుడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకవేళ వారు సరిగా పనిచేయడం లేదంటే దాని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా రాజకీయం చేయడం ఏమాత్రం బాగాలేదు. అధికారులు ఏ పార్టీకి చెందిన వారు కారన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందంటూ’ వ్యాఖ్యానించారు. కాగా, ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌కు పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలో.. అజయ్ మాకెన్ వ్యాఖ్యలను బట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే దానిపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. -
కేజ్రీవాల్‌ను దేశద్రోహిగా నిరూపిస్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 10–15 రోజుల్లో దేశద్రోహిగా నిరూపిస్తానని ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ అన్నారు. రాజ్యాంగేతర శక్తిగా అవతరిస్తున్నారని విమర్శించారు. శనివారం ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్‌కు నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి పార్టీపై దృష్టి పెడుతున్నారని.. ఫలితంగా పరిపాలన కుంటుపడుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఢిల్లీలో చెత్త సమస్యను పరిష్కరించలేకపోయారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వంలో నకిలీ సంపీడన సహజ వాయువు (సీఎన్జీ) కిట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. సీఎన్జీ కిట్లు చైనాలో తయారై వస్తాయని, కానీ వాటిని కెనడాలో తయారైనవిగా పేర్కొంటారని ఆయన చెప్పారు. -
‘ఏడాది పాటు పదవి తీసుకోను’
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ప్రకటించారు. ఏడాది పాటు పార్టీలో ఎటువంటి పదవి తీసుకోబోనని ఆయన చెప్పారు. కార్యకర్తగానే పార్టీలో కొనసాగుతానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నదాని కంటే బాగానే పుంజుకున్నామని, ఇంకా మంచి ఫలితాలు ఆశించామని వెల్లడించారు. ఈవీఎం పనితీరుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంపై తమకు నమ్మకం ఉందని, ఈవీఎంల పనితీరుపై విశ్వాసం లేదని మాకెన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు దక్కించుకోగా, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది ఫలితాలు వెలువడాల్సివుంది. -
బీజేపీలో చేరనున్న బర్ఖా సింగ్
బీజేపీలో చేరనున్న బర్ఖా సింగ్ న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన బర్ఖా శుక్లా సింగ్ కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఇవాళ ఆమె భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఢిల్లీ బీజేపీ ఇన్ఛార్జ్ శ్యామ్ జహును బర్ఖా శుక్లా సింగ్ ఈరోజు మధ్యాహ్నం కలవనున్నట్లు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ బర్ఖాను ఆరేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. అంతకు ముందు రోజు ఆమె ఢిల్లీ మహిళా కాంగ్రెస్ మోర్చా అధ్యక్షపదవికి రాజీనామా చేస్తూ డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీకి పార్టీ నడిపే సామర్థ్యం లేదని ఆయన పనితీరును విమర్శించారు. దీంతో ఆమెపై బహిష్కరణ వేటు పడింది. -
బర్ఖా సింగ్‌పై కాంగ్రెస్ పార్టీ వేటు
న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్‌పై ఆ పార్టీ వేటు వేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా బర్ఖా సింగ్ నిన్న (గురువారం) ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే తాను పదవికి రాజీనామా చేసినా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని బర్ఖా సింగ్ పేర్కొన్న విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదని, స్వతంత్ర అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు వీలున్న పార్టీ అని తాను పార్టీ వదలనని ఆమె చెప్పారు. కాగా రాహుల్ గాంధీకి పార్టీ నడపడం చేతకాదని, ఆయన పార్టీ అధ్యక్షపదవికి పనికిరారని విమర్శలు చేయడంతో క్రమశిక్షణా రాహిత్యం కింద బర్ఖా సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మరోవైపు బర్ఖా సింగ్ వ్యక్తిగత కక్షతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ, పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. -
రాహుల్ గాంధీ ఎందుకు దాక్కుంటున్నారు?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ కార్యకర్తల నుంచి ఎందుకు దాక్కుంటున్నారు? ఈ ప్రశ్న అడిగింది ఎవరో ప్రతిపక్ష నాయకులు కాదు.. ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్. కేంద్ర మాజీమంత్రి అజయ్ మాకెన్ తదితరులపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులను అజయ్ మాకెన్ తిడుతున్నారని, బెదిరిస్తున్నారని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రశ్నలు అడుగుతారన్న భయంతో ఆయన భయపడి దాక్కుంటున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడానికి రాహుల్ గాంధీ 'అన్ ఫిట్' అని చాలామంది అత్యంత సీనియర్ నాయకులు భావిస్తున్నారని చెప్పారు. అయితే వాళ్ల పేర్లు మాత్రం ఆమె బయటపెట్టలేదు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ, యూత్ కాంగ్రెస్ మాజీ నాయకుడు అమిత్ మాలిక్ ఇప్పటికే పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోగా.. ఇప్పుడు బర్ఖా శుక్లా సింగ్ వంతు అయింది. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇలా వరుసపెట్టి పెద్ద నాయకులంతా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతుండటంతో ఇక కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మార్చి 28న నవరాత్రుల సందర్భంగా తాను, పలువురు మహిళా కార్యకర్తలు ఉపవాసంతో ఉండి రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించామని, కానీ ఆయన నవరాత్రులను పట్టించుకోరంటూ తమను ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా అక్కడివాళ్లు చెప్పారని బర్ఖా శుక్లా సింగ్ చెప్పారు. పార్టీ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ తన పట్ల, ఇతర మహిళా నాయకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, అదే విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లినా తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని ఆమె వాపోయారు. ప్రియాంకా గాంధీ గురించి వినయ్ కతియార్ ఏమైనా అంటే వెంటనే దాన్ని తాము ఖండించాలని రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చేవని, కానీ తాము అజయ్ మాకెన్ తమను తిడుతున్నారని చెప్పినా ఆ విషయాన్ని మాకెన్తోనే తేల్చుకోవాలని చెప్పేవాళ్లని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసమే మహిళా సాధికారతను వాడుకున్నారని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌లో దుమారం: మహిళా నేత తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో దుమారం చెలరేగింది. ఢిల్లీ మహిళ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలు రచన సచ్‌దేవా పార్టీ సీనియర్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా, నెట్టా డిసౌజాలు తనను మానసికంగా వేధించి, బెదిరించారని రచన బాంబు పేల్చారు. త్వరలో జరిగే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు (ఎంసీడీ) టికెట్ల పంపణీలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు కాంగ్రెస్ నేతలను తనను బెదిరిస్తున్నారని వెల్లడించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్లో ఆమె ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎంసీడీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత ఏకే వాలియా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ల పంపిణీలో పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, అక్రమాలు జరిగాయంటూ అజయ్ మాకెన్‌కు ఆయన లేఖ రాశారు. టికెట్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ అమృష్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ నెల 23న ఎంసీడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు తిరుగుబాటు చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. -
అందరికీ 40 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి
ఏడో వేతన సంఘం సిఫార్సులపై కాంగ్రెస్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 40 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సులపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారమిక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సిఫార్సుల వల్ల ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. గరిష్ట, కనిష్ట వేతనాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను సంఘం పూర్తిగా విస్మరించిందని మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఫార్సులు ఉద్యోగులుకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆయన వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో అవి విఫలమయ్యాయన్నారు. 52 రకాల అలవెన్సులను ఆపివేయడం, వడ్డీ లేకుండా ఇచ్చే అడ్వాన్సులు రద్దు చేయడంపై అభ్యంతరం తెలిపారు. -
'అందుకే అవార్డులు తిరిగిచ్చేస్తున్నారు'
న్యూఢిల్లీ: అవార్డు వాపసీపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మత అసహనం పెరిగిపోతుండడంతో రచయితలు, మేధావులు తదితరులు అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్నారని పేర్కొంది. ఊహించని పరిస్థితులు తలెత్తడంతో పురస్కారాలు తిరిగిచ్చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ అధికా ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు. 'ప్రముఖులు అవార్డులు ఎందుకు వెనక్కు ఇచ్చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు వారినెంతో బాధించాయి. వీటిని సరిదిద్దాలన్న ఉద్దేశంతోనే పురస్కారాలు ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తున్నారు' అని మాకెన్ అన్నారు. వార్డులను వాపస్ ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ.. అసమ్మతిని చర్చలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తం చేయాలని అన్నారు. -
ప్రచారం కోసమే రూ. 526 కోట్లా?
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమాచార, ప్రచారం కోసం రూ. 526 కోట్లు కేటాయించటాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. సమాచారం, ప్రచారం కోసం గత ఏడాది కేవలం రూ. 24 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు ఏకంగా రూ. 526 కోట్లు కేటాయించటం ఏమిటని ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అజయ్‌మాకెన్ బీజేపీ నేత విజేందర్‌గుప్తా, ప్రశ్నించారు. -
ఆ బడ్జెట్ మీడియాను కొనేయడానికేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ప్రచార బడ్జెట్ పై కాంగ్రెస్ మండిపడింది. గతంలో కేవలం రూ.24 కోట్ల మేర ఉన్న రాష్ట్ర ప్రచార బడ్జెట్ అమాంతం రూ.526.19 కోట్లకు పెంచడంపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ రాష్ట్రం ధనిక రాష్ట్రం కాదని తెలిసినా ప్రచారాల కోసం ఇంతమేర బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అంతపెద్ద మొత్తంలో ప్రచార ప్రకటనల కోసం ఖర్చుపెట్టడం సరికాదని మాకెన్ అన్నారు. ఏకంగా మీడియానే కొనుగోలు చేయడానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టినట్లుందని మాకెన్ ఎద్దేవా చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి తగిన నిధులు లేవు కానీ.. ప్రచార ఆర్భాటాలకు మాత్రం వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కాగా, ప్రభుత్వ అధికార ప్రతినిధి నాగేంద్ర శర్మ మాత్రం మాకెన్ వ్యాఖ్యలను ఖండించారు. తొలిసారి సమాచార ప్రచార శాఖను ఏర్పాటు చేయడంతోనే అంతమొత్తంలో నిధులు కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అయితే దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందా? అని మాకెన్ సవాల్ విసిరారు. -
అబద్ధపు హామీలతో పక్కదారి పట్టించారు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అబద్ధపు హామీలతో ప్రజలను పక్కదారి పట్టించారని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిం చింది. అంతే కాకుండా ఐదేళ్ల కాలంలో 40 నుంచి 50 శాతం వరకు ఎన్నికల హామీలను నెరవేర్చగలమని అధికారులతో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారని డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ చెప్పారు. ఇది పూర్తిగా ఎలక్షన్ వాచ్డాగ్స్ మేనిఫెస్టో మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ఈసీని కలసి బుధవారం ఫిర్యాదు చేశారు. ‘పౌర సేవల దినోత్సవం’ సందర్భంగా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారని ఈసీకి తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇష్టం వచ్చినట్లు హామీల వర్షం కురిపించారని ఆరోపించారు. తద్వారా ప్రజలను పక్కదారి పట్టించారని విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పక్కదారి పట్టించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ఆర్టికల్ 324 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మేనిఫెస్టో మార్గదర్శకాల ప్రకారం అవాస్తవ ఎన్నికల వాగ్దానాలతో ప్రజలపై ప్రభావం చూపేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తే వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపారు. కాగా, పౌర సేవల దినోత్సవం సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై అనేక అంచనాలను పెట్టుకున్నారని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుంటే ప్రస్తుతం మనల్ని ఎవరైతే పొగుడుతున్నారో వారే ఐదేళ్లలో విసిరివేసే అవకాశం ఉందన్నారు. కానీ ఐదేళ్లలో 100 శాతం హామీలను నెరవేర్చలేకున్నా కనీసం 40 నుంచి 50 శాతం మాత్రం నెరవేర్చగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీటి ఆధారంగా అజయ్ మాకెన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. -
డిస్కంల డిమాండ్‌కు తలొగ్గద్దు
ప్రభుత్వానికి డీపీసీసీ అధ్యక్షుడు మాకెన్ లేఖ న్యూఢిల్లీ: విద్యుత్ సుంకం 20 శాతం పెంచాలని డిస్కంలు కోరడం సమంజసం కాదని, వారి డిమాండ్‌కు లొంగవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. డిస్కంల కోరిక అసమంజసం మాత్రమే కాదని, వారి ఇష్టానుసారం ప్రభుత్వం నడుచుకుంటే అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులపై పెను భారం పడుతుందని చెప్పింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాసినట్లు డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ తెలిపారు. ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునేలా ఢిల్లీ ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్సీ)కు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 90 శాతం మంది ఢిల్లీ ప్రజలు విద్యుత్ సబ్సిడీ పొందుతున్నారని చెప్పడం ద్వారా ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతుందని విమర్శించారు. ప్రొఫైలింగ్ వినియోగదారులెవరూ లేకుండా ఆ విధంగా ఎలా చెప్పగలుతారని ప్రశ్నించింది. ప్రజా సొమ్మును విద్యుత్ సంస్థలు దుర్వినియోగపరుస్తున్నాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా కుటుంబానికి ఓ విద్యుత్ మీటర్‌ను అందించాలని ఏప్రిల్ 17న డీఈఆర్సీ కార్యదర్శి ముందు కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విధంగా చేయడం వల్ల 50 శాతం సబ్సిడీపై నెలకు 400 యూనిట్ల వరకు వినియోగించుకునే విద్యుత్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని ఆ పిటిషన్లో పేర్కొంది. -
'నో ఐడియా.. మాకేం తెలియదు'
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు భిన్న రకాలు స్పందించారు. ఆయన అతిత్వరలోనే తిరిగొస్తారని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం తమకేం తెలియదని చెబుతున్నారు. మరోవైపు రాహుల్ బుధవారం ఢిల్లీకి తిరిగొస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీని గురించి అడిగినప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ తనకేమీ తెలియదని సమాధానమిచ్చారు. 'నో ఐడియా. రాహుల్ పునరాగమనం నుంచి మాకేమీ తెలియదు. మీరు చెబితే తెలుసుకుంటాం' అని మాకెన్ అన్నారు. 55 రోజుల సెలవు ముగించుకుని రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీకి రానున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
రైతుల విషయంలో ఆప్ మొసలి కన్నీరు కారుస్తోంది
♦ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ♦ అకాల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం లేదా? ♦ ఆప్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు న్యూఢిల్లీ : అకాల వర్షాలతో రైతులు నష్టపోతే పట్టించుకోకుండా భూ సేకరణ బిల్లు విషయంలో చేపట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీ రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తోందని అజయ్ మాకెన్ విమర్శించారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఐదు కిలో మీటర్ల దూరంలోని రైతులను కలిసి సమస్యలు తెలుసుకోలేకపోయిన వారు, ఇప్పుడు ఆకస్మాత్తుగా మేల్కొని రైతుల తరఫున కేంద్రంతో పోరాడతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు తీవ్రంగా నష్టపోయారని మాకెన్ చెప్పారు. అయినా కూడా ఆప్ నుంచి ఒక్కరు కూడా రైతులను కలవడానికి గ్రామాలకు వెళ్లలేదని ఆరోపించారు. ఇప్పుడు రైతుల సంక్షేమమంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. పొరుగున ఉన్న హరియానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ సీఎంలు తమ రాష్ట్రాల్లోని బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ రాష్ట్రాల సీఎంలు కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని డిమాండ్ చేసినా కూడా సెక్రటేరియట్ నుంచి ఆప్ నేతలు ఒక్కరు కూడా బయటకు రాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా తమ నేతలంతా గ్రామల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశామని తెలపారు. అంతే కాకుండా రైతులకు ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశామని చెప్పారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోని ఆప్, ఇప్పుడు ర్యాలీ చేపట్టడం వింతగా ఉందన్నారు. ఆ పార్టీకి చెందిన వారు తమ ర్యాలీకి మద్దతు కోరేందుకు గ్రామాలకు వెళ్లాలనుకుంటే నిర్లక్ష్యం చేసినందుకు రైతులు రానివ్వరని చెప్పారు. రైతులకు ఆప్ గురించి పూర్తిగా అర్థమైందని, వారి తియ్యటి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ భూసేకరణ బిల్లుకి వ్యతిరేకంగా ఏప్రిల్ 22న జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్‌కు ర్యాలీ చేపట్టింది. -
కార్పొరేషన్ల ఆర్థిక స్థితి దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీ కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అయినా నిధుల కేటాయింపుల్లో భారీ కోత పెట్టిందని ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. నిధుల సమస్య గురించి మేయర్లు సీఎం కేజ్రీవాల్‌కు విన్నవించినా ఆయన పట్టించుకోవడంలేదని ఆరోపించింది. కాంగ్రెస్ హయాంలో అవసరమైన మేరకు నిధులు కేటాయించామని, ఏ అంశానికి కోత పెట్టలేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిధులు కేటాయించకుండా ఆయా అంశాలపై రాజకీయం చేస్నున్నారని దుయ్యబట్టారు. ముగ్గురు మేయర్లతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్‌కు రూ. 302 కోట్ల నిధులు ఇవ్వాలని సంబంధింత మేయర్ యోగేంద్ర చందోలియా విన్నవించినా సీఎం తోసిపుచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు రుణం ఇవ్వాలని కోరినా తిరస్కరించారని అజయ్ మాకెన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి సహాయం తీసుకుందామని యోగేంద్రతోపాటు ఇతరులు కూడా సీఎంకు విన్నవించారన్నారు. తూర్పు, ఉత్తర కార్పొరేషన్లు తమ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతభత్యాలు చె ల్లించలేదని మాకెన్ గుర్తు చేశారు. అన్ని కార్పొరేషన్లు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ర్టంలోని ఆప్ ప్రభుత్వాలు ఒకరినొకరు నిందించుకుంటూ సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు. తమ హయంలో కార్పొరేషన్లను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేశామన్నారు. విద్య, పారిశుద్ధ్యం, వైద్యం, అనధికార కాలనీల అభివృద్ధి వంటి ముఖ్యమైన అంశాలకు విరివిగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. మురికివాడల్లో సౌకర్యాల కల్పనకు కూడా భారీగా నిధులిచ్చామన్నారు. -
స్వైన్‌ఫ్లూపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు
న్యూఢిల్లీ: ఇటీవల వేగంగా వ్యాపిస్తోన్న స్వైన్‌ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి మూడు రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్విహ ంచనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు అజయ్‌మాకెన్ సోమవారం వెల్లడించారు. ‘స్వైన్‌ఫ్లూ నుంచి బయట పడటానికి ప్రభుత్వం సాగిస్తున్న కార్యక్రమాలకు మేం సాయం చేస్తాం. అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన మార్కెట్లు, విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తులు 10-15 బృందాలుగా విడిపోయి అన్ని ప్రాంతాలకు తిరుగుతారు. ప్లకార్డులను పట్టుకొని, కరపత్రాలను ప్రజలకు పంచుతారు. ఈ ప్రయత్నం ద్వారా నగరంలో స్వైన్‌ఫ్లూ తగ్గుతుందని మాకెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
వచ్చే వారం రంగంలోకి రాహుల్
నాగపూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే వారం మొదట్లో తిరిగి కార్యరంగంలోకి వస్తారని కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్ చెప్పారు. కమలేశ్వర్ వద్ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తదుపరి ఐదు రోజుల్లో రాహుల్ తిరిగి విధులకు హాజరవుతారని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో.. రాహుల్ ఆకస్మికంగా సెలవు పెట్టారు. కాగా, పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఏఐసీసీ సమాచార విభాగం ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న అజయ్ మాకెన్ ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. -
సోనియా గాంధీ అసహనం!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో అలజడి తలెత్తడంతో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్-కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ల మధ్య చోటు చేసుకున్న అంశం కాస్తా తారాస్థాయికి చేరడంతో సోనియా జోక్యం చేసుకున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జి పీసీ చాకో పార్టీ ఓటమిపై నివేదిక సమర్పించిన సమయంలో సోనియా గాంధీ ఆ విషయాలను అడిగి తెలుసుకున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం పార్టీకి మంచి కాదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆ జగడాన్ని ఆపాలని ఆమె గట్టిగా హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రధసారథి అజయ్ మాకెన్ బాధ్యతలను షీలా తప్పుబట్టడంతో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. మాకెన్ సరైన దిశలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపించడమే కాకుండా అతన్ని చూసి తాను జాలిపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో చాకో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె నోరు మూసుకుని ఉండటం మంచిదంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. దీంతో నేతల మధ్య చోటు చేసుకున్న విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయని గ్రహించిన సోనియా గాంధీ ఆ వార్ కు ఇక్కడతో పుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. -
ఓటమిపై కాంగ్రెస్‌లో ‘వార్’ షురూ
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంతో కాంగ్రెస్ పార్టీలో మాటల యుద్ధం మొదలైంది. ఓటమిపై ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అజయ్ మాకెన్ నాయకత్వంపై మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గురువారం విమర్శల వర్షం కురిపించగా, ఆమె నోరు మూసుకుని ఉండటం మంచిదంటూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పీసీ చాకో ఎదురుదాడి చేశారు. కాగా, షీలా మాట్లాడుతూ, మాకెన్ సరైన దిశలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అంతా తానే చేయగలననే భావనలో మాకెన్ ఉండిపోయి నాయకులను విస్మరించారని, అలాగే కార్యకర్తలను ఉత్తేజితులను చేయడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అతన్ని చూసి తాను జాలిపడుతున్నట్లు పేర్కొన్నారు. అతని ప్రవర్తన కాంగ్రెస్‌కు కొంచెం కూడా తోడ్పడలేదని విమర్శించారు. చివరి నిమిషంలో మాకెన్‌ను సీఎం అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చి తప్పుచేశారని చెప్పారు. గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధించిన విజయాలను ప్రచారం చేయడంలో అతను ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అవి తన విజయాలు కాదని, కాంగ్రెస్ విజయాలు మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తన పేరును ఉపయోగించినట్లయితే పార్టీకి మంచి తోడ్పాటునందించి ఉండేదని చెప్పారు. ఢిల్లీలో పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. దుర్భర పరిస్థితిలో ఉన్న పార్టీకి పునరుత్తేజం కల్పించడంపై త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలసి మాట్లాడతానని తెలిపారు. అధినాయకత్వం ఆదేశిస్తే పార్టీ పునరుత్తేజ బాధ్యతలు తీసుకుంటానని తెలిపారు. ఇదిలా ఉండగా షీలా వ్యాఖ్యలపై పీసీ చాకో ఎదురుదాడి చేశారు. షీలా అభిప్రాయాలను పార్టీ ఆమోదించబోదని, ఆమె నోరు మూసుకుని ఉండటం ఉత్తమమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాకెన్ మద్దతుదారుడైన డీపీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ కూడా షీలా వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత సలహాలు ఇవ్వడం వల్ల ప్రయోజనమేమీ ఉండబోదన్నారు. దీక్షిత్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు-చాకో షీలా దీక్షిత్ ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పీసీ చాకో అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దని ఆయన కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీక్షిత్ ఆ విధంగా వ్యాఖ్యానించడం బాగోలేదు. పార్టీ విజ్ఞిప్తి మేరకు మాకెన్ ప్రచార నాయకత్వం స్వీకరించారు. అలాగే పార్టీ కోరితేనే ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పారు. తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి పార్టీ గెలుపు కోసం మాకెన్ శ్రమించారన్నారు. మాకెన్, లవ్లీతో కలిసి బుధవారం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు. ఆ సమావేశంలో పార్టీ ఓటమిపై రాహుల్‌తో చర్చించామన్నారు. అలాగే లవ్లీ మాట్లాడుతూ, ‘ఆమె సలహాలు ఇవ్వాలనుకుంటే ఎన్నికల ముందే ఇచ్చి ఉండాల్సింది. ఆమె మాకంటే సీనియర్ నాయకురాలు. మేము ఆమెను చాలా గౌరవిస్తాం. ఆమె మాకు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చు, లేకుంటే పార్టీ అధినాయకత్వానికి అయినా తెలియజేయవచ్చు’ అని లవ్లీ వ్యాఖ్యానించారు. కాగా, బ్లాక్ స్థాయి నుంచి జిల్లా కమిటీలను ఎన్నికల ముందు నియమించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని దీక్షిత్ చేసిన వ్యాఖ్యలపై లవ్లీ స్పందించారు. ‘మేము ఆ కమిటీలను తిరగి నియమిస్తాం. వాటిని తప్పనిసరిగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మాకు కింది స్థాయి నుంచి బలమైన సంబంధాలు ఉన్నాయి’ అని తెలిపారు. కాగా, దీక్షిత్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 24 శాతం ఓట్లు సాధించామని, కానీ ఈసారి తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయ మద్దతును ఉపయోగించుకుని కింది స్థాయి నుంచి పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. -
'ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు చావు దెబ్బలా ఉన్నాయి'
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బలా ఉన్నాయని ఆ పార్టీ ఎన్నికల ప్రచార సారథి అజయ్ మాకెన్ అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్)కి అధికారం ఇవ్వాలని ఓటర్లు భావించినట్లు ఉన్నారని ఆయన అన్నారు. ఎవరు గెలిచినా ప్రజాస్వామ్య దేశంలో ఆ తీర్పును గౌరవించాల్సిందేనని మాకెన్ తెలిపారు. ఆదివారం కూడా ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తెలిసిందే. ఎన్నికల ఫలితాలను కొట్టిపారేయలేమన్నారు. ఒకవేళ అవి మాత్రం నిజమైతే అది తమకు అత్యంత ఆందోళనకరమైన విషయమేనని అన్నారు. అయినా అన్నిసార్లు సర్వేలు నిజమవుతాయనడం ఎంతమాత్రం సరికాదని మాకెన్ తెలిపారు. -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేయలేం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి అజయ్ మాకెన్ న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అంత తేలికగా కొట్టిపారేయలేమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి అజయ్ మాకెన్ పేర్కొన్నారు. తమ పార్టీ సాధించే ఫలితాలు ఒకవేళ సర్వేలో వచ్చినవిధంగా ఉన్నట్టయితే అది ఆందోళన చెందాల్సిన విషయమేనన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్నికల ఫలితాలను కొట్టిపారేయలేం. ఒకవేళ అవి మాత్రం నిజమైతే అది మాకు అత్యంత ఆందోళనకరమైన విషయమే’ అని అన్నారు. కాగా తమకు 12 నుంచి 15 స్థానాలు వస్తాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మరో నాయకుడు ఇదే విషయమై మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనుబట్టి పార్టీ పరిస్థితి ఎంతమాత్రం ఆశావహంగా లేదనే విషయం ఇట్టే అర్ధమవుతోందన్నారు. -
'ఇప్పటికీ ఢిల్లీలో మాకు పట్టుంది'
న్యూఢిల్లీ : ఇప్పటికీ ఢిల్లీలో తమకు పట్టుందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రచార కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ తెలిపారు. సాధారణంగా అందరికి ఉండే చివరి క్షణం టెన్షన్ తనకేమి లేదని ఆయన అన్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు తనకు కొత్త కాదని.. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఎన్నికలు ఎదుర్కొన్నామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తనకు చాలా సంతృప్తినిచ్చిందని మాకెన్ తెలిపారు. ప్రజల స్పందన చాలా బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. పరిపాలన పరంగా ఢిల్లీలో అనేక జటిలమైన సమస్యలున్నాయని... తమకు అధికారం ఇస్తే వాటినన్నింటిన పరిష్కారిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఢిల్లీ ఓటర్లకు తెలిపింది. -
కేజ్రీవాల్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్, బీజేపీల నుంచి డబ్బులు తీసుకుని తమ పార్టీకి ఓటు వేయాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు బాధ్యతారహితమే కాకుండా రాజ్యాంగ విరుద్దమన్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. వచ్చేనెల 7న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
కేజ్రీవాల్, బేడీ అవకాశవాదులు
* హజారేను అడ్డుపెట్టుకుని రాజకీయాలు * ఆప్, బీజేపీలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వారిద్దరూ అవకాశవాదులని ఆరోపించింది. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన పార్టీలకు ఎన్నికల వేళ మెరుగులద్దే పని పెట్టుకున్నారని, అవకాశవాదులకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జి అజయ్ మాకెన్ శనివారం పేర్కొన్నారు. కేజ్రీవాల్, బేడీ ఇద్దరూ అవినీతి వ్యతిరేక పోరాటం, అన్నా హజారేను అడ్డుపెట్టుకుని రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. వారిద్దరి మధ్య ఎలాంటి భేదం లేదని, వారు ఒకే నాణేనికి రెండు ముఖాల వంటి వారని విమర్శించారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేజ్రీవాల్ ఇచ్చిన అఫిడవిట్‌ను ఈ సందర్భంగా మాకెన్ విడుదల చేశారు. ఎర్ర బుగ్గలను వాడబోనని, పెద్ద భవంతుల్లో ఉండబోనని, అనవసర భద్రత వద్దని పలు మాటలు చెప్పిన కేజ్రీవాల్.. అధికారం చేతికి రాగానే ఆ మాటలన్నీ తప్పారని మండిపడ్డారు. తన 49 రోజుల పాలనలో కేజ్రీవాల్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఫలితంగా ఢిల్లీ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలతో సోమవారం ఓ పుస్తకాన్ని తేనున్నట్లు అజయ్ మాకెన్ వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం సాధ్యంకాకే ఆయన అధికారాన్ని వదిలి పారిపోయారని ధ్వజమెత్తారు. ఇక బేడీ, షాజియా వంటి బయటివారిని పార్టీలో చేర్చుకుంటూ బీజేపీ తన బలహీనతను చాటుకుంటోందన్నారు. మరోవైపు బీజేపీలో కిరణ్ బేడీ చేరికపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అసంతృప్తిగా ఉన్నారని వస్తున్న కథనాలను సంఘ్ పరివార్ తోసిపుచ్చింది. అవన్నీ అవాస్తవమని పేర్కొంది. దీన్ని బీజేపీ, సంఘ్ పరివార్ మధ్య చీలిక తెచ్చేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణించింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రధాని నరేంద్ర మోదీ పరువు పోకుండా ఉండేందుకే కిరణ్ బేడీని బీజేపీలో చేర్చుకున్నారని ఆప్ ధ్వజమెత్తింది. ఢిల్లీకి రాష్ర్ట హోదా ఇచ్చే అంశంపై ఆ పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేసింది. -
ఢిల్లీ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మాకెన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ ఎంపీ అజయ్ మాకెన్ నేతృత్వంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలోకి దిగనుంది. మాకెన్‌ను ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులుగా నియమించినట్లు ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జ్ చాకో మంగళవారం ప్రకటించారు. 101 మందితో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార కమిటీకి మాకెన్ నేతృత్వం వహిస్తారు. తనకు పార్టీ అప్పగించిన ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని ఢిల్లీలో మాకెన్ మీడియాతో అన్నారు.ఎన్నికల తర్వాతే కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని స్పష్టంచేశారు. 21 మందితో బీజేపీ ఎన్నికల కమిటీ 21 మంది సభ్యులతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కమిటీని బీజేపీ మంగళవారం ప్రకటించింది. ఎన్నికల ప్రచార వ్యూహాలను రూపొందించే ఈ కమిటీకి బీజేపీ, ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ నేతృత్వం వహిస్తారు. కమిటీలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ సహా ఢిల్లీలోని ఏడుగురు పార్టీ ఎంపీలు, విజయ్ గోయల్, వీకే మల్హోత్రా, జగదీశ్ ముఖి తదితర నేతలు సభ్యులుగా ఉన్నారు. -
సుజనా బకాయిలు రూ.316 కోట్లు!
ఆయన్ను రక్షించటానికే కేంద్రమంత్రిని చేశారా?: కాంగ్రెస్ సెంట్రల్ బ్యాంకు ఇచ్చిన అప్పును సుజనా చౌదరి తీర్చలేదు కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన కేంద్ర మంత్రి సుజనా సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన ప్రధాన నరేంద్ర మోదీ పలువురు కళంకితులను కేబినెట్లో చేర్చుకోవడంపై సమాధానమివ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంటులో నేరస్తులు లేకుండా చూస్తానని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన మోదీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ధ్వజమెత్తారు. 66 మంది సభ్యులున్న కేంద్ర మంత్రివర్గంలో 15 నుంచి 16 మంది కళంకిత మంత్రులున్నారని ఆరోపించారు. తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చేరిన టీడీపీ నేత వై.సుజనా చౌదరి సెంట్రల్ బ్యాంకుకు రూ.వందల కోట్ల బకాయి పడినట్లు వెల్లడించారు. బ్యాంకు అప్పును తీర్చని ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘నిన్న మంత్రివర్గంలో చేరిన వైఎస్ చౌదరి(సుజనా) వెబ్‌సైట్‌ను మేం పరిశీలించాం. అందులో ఒకవైపు సుజనా మరొక వైపు ప్రధాని నరేంద్రమోదీ చిరునవ్వులు చిందిస్తున్నారు. దాని పక్కనే చౌదరి సంస్థ సుజనా టవర్స్ గురించి ఉంది. సుజనా టవర్స్ అధినేత అయిన సుజనా చౌదరి సెంట్రల్ బ్యాంకుకు రూ. 316 కోట్లు బకాయి పడ్డారు. ఆ బ్యాంకు జాబితాలో ఇవి నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఇచ్చిన అప్పులు నిరర్థక ఆస్తులుగా మారటానికి కారకుడైనందుకేనా మీరు సుజనా చౌదరికి మంత్రి పదవి ఇచ్చారు? సెంట్రల్ బ్యాంకుకు బకాయి పడ్డ టాప్ 20 మంది జాబితాలో ఆయన 8వ స్థానంలో ఉన్నారు. సుజనాను రక్షించేందుకే మీరు మంత్రిని చేశారా? పదవి ఇచ్చే ముందు మోదీ ఈ వివరాలు తెలుసుకున్నారా? ప్రజలు నిజాలను తెలుసుకోవాలనుకుంటున్నారు..’ అని పేర్కొన్నారు. అంతే కాకుండా ‘మంత్రి రామ్‌శంకర్ కతారియాపై 23 క్రిమినల్ కేసులున్నాయి. మరో మంత్రి గిరిరాజ్‌సింగ్ ఇంట్లో దొంగతనానికి గురైన సొమ్ములో నుంచి రూ. 1.25 కోట్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఆయన అవినీతిపరుడు కాదంటారా?’ అని మాకెన్ ప్రశ్నించారు. ‘ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అదనంగా సమాచార ప్రసార శాఖ ఇచ్చారు. ఆర్థిక శాఖకు, సమాచార శాఖకుసంబంధం ఏమిటి? కొందరు వ్యాపారవేత్తలు మీడియా సంస్థలను కొనుగోలు చేయడం తప్ప ఆ రెండింటి మధ్య మరో సంబంధం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఆరోగ్యశాఖ నుంచి హర్షవర్ధన్‌ను, రైల్వే శాఖ నుంచి సదానంద గౌడను తప్పించడానికి కారణం చెప్పాలని మాకెన్ డిమాండ్ చేశారు. ‘అవినీతిపరులనా? లేక అసమర్ధులనా? వారిని ఎందుకు మార్చారో మోదీ చెప్పాలన్నారు. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు: సుజనా తనపై వచ్చిన ఆరోపణలను ఆదివారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుజనా చౌదరి ఖండించారు. బ్యాంకులను తాను రుణాలను కట్టకుండా ఎగవేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించటాన్ని తోసిపుచ్చారు. ఇందులో నిజం లేదని, ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొన్నారు. -
'ఆ యాభై వేల మంది దేశానికి తెలియాలి'
ఢిల్లీ: నల్లధనం అంశానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ మండిపడింది. మంగళవారం బీజేపీ వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. అసలు అధికారంలో ఉన్న బీజేపీ సరైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇదే విషయాన్ని సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ చాలా చెప్పారని ఈ సందర్భంగా మాకెన్ గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. దాదాపు 50 వేల మంది నల్లధనాన్ని ఇతర దేశాలకు తరలించారని మోదీ తెలిపారన్నారు. ఆ యాభై వేల మంది ఎవరో దేశానికి తెలియాలని మాకెన్ డిమాండ్ చేశారు. -
నల్ల కుబేరుల్లో యూపీఏ మంత్రి!
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలు అన్ని వివరాలు కోర్టుకు సమర్పిస్తామని వెల్లడి న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచిన వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ వారికే ఇబ్బందంటూ మంగళవారం వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. విదేశీ బ్యాంకుల్లో భారీ ఎత్తున బ్లాక్‌మనీ దాచిన నల్ల కుబేరుల జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి పేరు ఉందంటూ బుధవారం సంకేతాలిచ్చి సంచలనం సృష్టించారు. సరైన సమయంలో ఆ వివరాలు బహిర్గతమవుతాయంటూ పలు జాతీ య చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వంలోని ఒక మంత్రి ఆ జాబితాలో ఉన్నారన్న వార్తను మీరు ఖండిస్తారా? అన్న ప్రశ్నకు జైట్లీ జవాబిస్తూ.. ‘నేనా వార్తను ఖండించను. వాస్తవమని చెప్పను. నేను నవ్వుతున్నానంతే’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దగ్గరున్న నల్ల కుబేరుల వివరాలను ఇప్పుడు వెల్లడించలేనని, అలా వెల్లడిస్తే.. అది ఆయా దేశాలతో కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందాల ఉల్లంఘన కిందకు వస్తుందని వివరించారు. విదేశీ ప్రభుత్వాలు తమకు అందించిన బ్లాక్‌మనీ అకౌంట్‌దారుల వివరాలున్న సమాచారాన్ని సుప్రీంకోర్టుకు అందజేస్తామని, అనంతరం ఆ వివరాలు సహజంగానే బహిర్గతమవుతాయని తెలిపారు. ‘ప్రభుత్వం దగ్గరున్న నల్ల కుబేరుల జాబితాలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పలుకుబడి కలిగిన నేత పేరుందా?’ అన్న ప్రశ్నకు ‘ఎవరిపైన అయినా సరే.. అభియోగాలను రుజువు చేయగలిగే సమాచారం మా వద్ద ఉంటే ఆ సమాచారాన్ని కోర్టుకు అందజేస్తామని’ అన్నారు. వైరుధ్యాలకు అతీతంగా పార్టీలు సహకరించుకునే పద్ధతిలో భాగంగా.. కాంగ్రెస్ వారి పేర్లను వెల్లడించడం లేదా? అన్న ప్రశ్నకు.. ‘అది తప్పు. నా ప్రత్యర్థి పేరు అందు లో ఉంటే.. దాన్ని వెల్లడించేందుకు మరింత ఉత్సాహపడతా’ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీ హర్యానాలో జరిపిన భూ లావాదేవీల వివాదంలోఆ రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై సోనియాగాంధీ, రాహుల్‌లు చాలా ప్రశ్నలకు జవాబివ్వాల్సి ఉందన్నారు. ‘బెదిరింపులు మానండి’ నల్లధనం వివరాల వెల్లడి విషయంలో లీకేజీలతో బ్లాక్‌మెయిలింగ్ చేయడం మానేసి ధైర్యముంటే పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలని మోదీ సర్కారుకు కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది. విదేశీ ఖాతాదారుల వివరాలు వెల్లడిస్తే కాంగ్రెస్ ఇరుకునపడటం ఖాయమన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. లీకేజీలు, అసమగ్ర వివరాలతో బెదిరింపులకు పాల్పడటాన్ని ప్రభుత్వం మానుకోవాలని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి అజయ్ మాకెన్ హితవు పలికారు. ‘మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు. ఆ ప్రయత్నం చేయకండి. నల్లధనం కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి’ అని మాకెన్ వ్యాఖ్యానించారు. నల్లధనం వ్యవహారం నుంచి దూరంగా పారిపోవడానికి జైట్లీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని మాట ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకెప్పుడు ఆ పని పూర్తి చేస్తారన్నారు. నల్లధనం అంశంపై మోదీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. పవర్లో ఉన్న పదేళ్లు ఏం చేశారు?: బీజేపీ నల్లధనం వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ సమాధానమిచ్చింది. ఈ విషయంలో బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, అధికారంలో ఉన్న గత పదేళ్ల కాలంలో విదేశాల నుంచి నల్ల ధనాన్ని తిరిగి తెప్పించేందుకు ఆ పార్టీ ఏం చేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ సూటిగా ప్రశ్నించారు. -
అది మతిలేని వాదన
ముంబై: శివసేనతో 25 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేసింది. అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ,‘‘భవిష్యత్తులో మరో కూటమి ఎందుకుండాలి? మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎన్నికల తరువాత వారు (కాంగ్రెస్, ఎన్సీపీ) రాష్ట్రంలో కనుమరుగవుతారు’’ అని అన్నారు. ఎన్నికల అనంతరం ఎన్సీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్న వాదన మతిలేని తర్కం అని, బాధ్యతారహితమైన వాదన అని అన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుత గందరగోళ పరిస్థితికి కాంగ్రెస్, ఎన్సీపీలు రెండూ కారణమేనని చెప్పారు. అక్టోబర్ 3వ తేదీ అనంతరం ప్రధాని మోదీ ప్రచారానికి వస్తారని తెలిపారు. శివసేనతో పొత్తు విచ్ఛిన్నం కావడంపై రూడీ మాట్లాడుతూ, అది తమకు ఎంతో వేదనను కలిగించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్సీపీ వైదొలగిన నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను కోరుతారా అన్న ప్రశ్నకు, ఆ విషయాన్ని నిర్ణయించడానికి తాను తగిన వ్యక్తిని కాదని చెప్పారు. అయితే ప్రభుత్వం తన మెజారిటీని కోల్పోయినా, ముఖ్యమంత్రి రాజీనామా చేసిన రాష్ట్రపతి పాలన అనేది సహజమైన పరిణామమని రూడీ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఎన్సీపీతో తమకు ఎటువంటి అవగాహన లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నాగపూర్‌లోని నైరుతి స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సుధాకర్ దేశ్‌ముఖ్, కృష్ణా ఖోప్డే, వికాస్ కుంభార్కర్లుకూడా తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. -
బీజేపీతో కలిసేందుకే...
న్యూఢిల్లీ: బీజేపీకి చేరువయ్యేందుకే ఎన్సీపీ తమ నుంచి విడిపోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ పరిణామం తమకు ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొంది. గత ఒకటిన్నర, రెండు నెలలుగా బీజేపీకి చేరువయ్యేందుకు ఎన్సీపీ ప్రయత్నాలు చేస్తోందని ఏఐసీసీ మీడియా విభాగం చైర్మన్ అజయ్ మాకెన్ చెప్పారు. ఈ పరిణామానికి తాము ముందునుంచే సిద్ధంగా ఉన్నామని, అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని అన్నారు. దీర్ఘకాలంలో ఇది తమకు ఉపయోగపడగలదని కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆశతో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగల నాయకత్వాన్ని ఇవ్వగలదని, అన్ని ప్రాంతాల్లో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉందని, పాలనలో అనుభవం గల నాయకులున్నారని చెప్పారు. ఈ మూడు లక్షణాలు ఏ పార్టీలోనూ లేవని అన్నారు. ప్రజల సంక్షేమం కన్నా వ్యక్తిగత ప్రయోజనాలను ప్రధానమని ఎంచుకోవడం వల్లనే ఎన్సీపీ ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. -
వివాదం పక్కన పెట్టి పనితీరు చూడండి: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: విద్యార్హతలపై కొనసాగుతున్న వివాదంపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పెదవి విప్పారు. తన విద్యార్హతలను లక్ష్యం చేసుకుని కాంగ్రెస్ సృష్టించిన వివాదం విధులపై దృష్టి పెట్టకుండా చేసిందని.. అయితే తన పనితీరును ప్రజలు తీర్పు ఇవ్వాలని స్మృతి విజ్క్షప్తి చేశారు. డిగ్రీ పట్టాలేని వ్యక్తికి కీలక శాఖను అప్పగించడంపై కాంగ్రెస్ సృష్టించిన వివాదంపై స్పందిస్తూ విద్యార్హతలను పక్కన పెట్టి పనితీరు చూడాలని ఆమె కోరారు. 2004, 2014 లోకసభ ఎన్నికల్లో విద్యార్హతలుగా వివిధ రకాలుగా అఫిడవిట్ లో దాఖలు చేయడంతో మధు కుష్వర్ అనే ఓ సామాజిక కార్యకర్త ..12వ తరగతి పాస్ కాని వ్యక్తికి మానవ వనరుల శాఖ ఇవ్వడమా అంటూ ప్రశ్నించారు. ఆతర్వాత కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ రంగు పులుముకుంది. -
మిస్సింగ్ ఎంపీ..! మాకెన్‌పై మీనాక్షి వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్‌పై ఆయన ప్రత్యర్థి, బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. మాకెన్ ‘మిస్సింగ్ ఎంపీ’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత పదేళ్ల నుంచి నియోజకవర్గంలో ఆయన కనిపించడం లేదని, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఖర్చు చేసిందేమీ లేదని ఆరోపించారు. పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా కొనసాగినా ఆయన నియోజకవర్గంలో ఇంకా అనేక సమస్యలు తాండవిస్తూనే ఉన్నాయన్నారు. ఇక నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ గెలవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రజలు తన ను తప్పుకుండా గెలిపిస్తారని ఓ వార్తాసంస్థకు ఇచ్చి న ఇంటర్వ్యూలో చెప్పారు. నరేంద్ర మోడీ చుట్టూ పార్టీ కేంద్రీకృతమైందని, ఆయన బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు ఆమె ఖండించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరొందిన అమన్ లేఖీని వివాహమాడారు. పార్టీలో పెద్ద పెద్ద నాయకులుండగా మీకే పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చింద ంటూ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... ‘నిజమే... సుబ్రమణ్యన్ స్వామి, నిర్మలా సీతారామన్ వంటి సీనియర్లు పార్టీలో ఉన్నా అధిష్టానం నాకే టికెట్ ఇవ్వడంపై ప్రత్యర్థులు రకరకాల ప్రచారాలు చేశారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించిన పార్టీ ప్రత్యర్థి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని, వారిని ఓడించాలంటే నేనే సరైన వ్యక్తినని నమ్మి టికెట్ ఇచ్చింద’న్నారు. -
నాయకులం కాము..
సాక్షి, న్యూఢిల్లీ: అజయ్ మాకెన్, మహాబల్ మిశ్రా, ప్రవేశ్ వర్మ.. వీళ్లంతా నిత్యం రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తుంటారు. అయితే ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో తమను తాము వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ అఫిడవిట్లలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో పలువురు తమ నామినేషన్లతోపాటు సమర్పించిన అఫిడవిట్లలో తమను తాము రాజకీయ నాయకులుగా పేర్కొనలేదు. ఢిల్లీ రాజకీయా ల్లో తలపండిన జైప్రకాశ్ అగర్వాల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన వృత్తిని ‘సామాజిక సేవకుడు’గా పేర్కొన్నారు. 1984లో ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ఆయన నార్త్ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్నారు. అగర్వాల్ మాత్రమే కాదు ఈస్ట్ ఢిల్లీ నుంచి రెండుసార్లు గెలిచి మూడోసారి పోటీకి సిద్ధపడిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కూడా తనను తాను ‘సామాజిక సంస్కరణవాది’ ‘డెయిరీ రైతు’గా పేర్కొన్నారు. న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, వెస్ట్ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రా తనను వ్యాపారవేత్తగా పేర్కొన్నారు. ఆప్ అభ్యర్థులు రాజ్‌మోహన్ గాంధీ, జర్నైల్ సింగ్ తమను రచయితలుగా పేర్కొన్నారు. చాందినీచౌక్ నుంచి పోటీ చేస్తోన్న కపిల్ సిబల్ తన వృత్తిని కేం ద్రమంత్రిని పేర్కొనగా, ఆయన ప్రత్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ తాను వైద్యుడు, ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు. మీనాక్షి లేఖి తనను న్యాయవాదిగా పేర్కొనగా, ప్రవేశ్‌వర్మ వ్యాపారవేత్తనని తెలిపారు. చాం దినీచౌక్ నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి ఆశుతోష్, న్యూఢిల్లీ నుంచి పోటీచేస్తోన్న ఆశిష్ ఖేతాన్ మాత్ర మే తమను రాజకీయ నేతలుగా పేర్కొన్నారు. -
తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం : కాంగ్రెస్
-
బహిష్కరణ వేటును సమర్థించుకున్న కాంగ్రెస్
యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై బహిష్కరణ వేటు విధించడాన్ని ఆపార్టీ సమర్ధించుకుంది. కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించిన వారిపై చర్య తీసుకున్నామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు. పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే వారిపై, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన వారెవరైనా సరే వేటు తప్పదని మాకెన్ అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా.. వ్యతిరేకించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం అని మాకెన్ తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న ఆరుగురు ఎంపీలపై మంగళవారం కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
అంకెల గారడీలో అందరూ అందరే!
ప్రణాళికా సంఘం పేదరిక రేఖను తక్కువగా నిర్ణయించిందంటూ యూపీఏను తప్పు పట్టిన బీజేపీ గుజరాత్లో దాన్ని అంతకంటే తక్కువగా నిర్ణయించడంపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. పేదల ఓట్ల కోసం రెండు ప్రధాన జాతీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. ‘పేదరికం అత్యంత క్రూర హింసా రూపం’. దుర్భర దారి ద్య్రం చాలదన్నట్టు పేదరికాన్ని పుట్‌బాల్ బంతిలా ఎదుటి పక్షం గోల్ పోస్టులోకి తన్నాలని కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న అంకెల క్రీడను చూడగలిగితే... పేదరికాన్ని మించిన క్రూర హింస ఉంటుందని గాంధీ సైతం అంగీకరించక తప్పదు. అధికారానికి కావలసింది అంకెలే... అంకెలుగా లెక్కకొచ్చే ఓటర్లే. నిర్ణయాత్మకమైన అంకె పేదలదేనని అందరికంటే ఎక్కువ కాంగ్రెస్, బీజేపీలకే తెలుసు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాలనలో గుజరాత్లో పేదరికం తగ్గిపోయిందని చూపడానికి పేదరిక రేఖను తక్కువగా చూపారంటూ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కత్తులు దూశారు. గుజరాత్ ఆహార, పౌర సరఫరాల శాఖ పట్టణ ప్రాంతాల్లో రోజుకు తలసరి వ్యయం రూ.16.70 కంటే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10.80 కంటే తక్కువగా ఉన్నవారు పేదలని నిర్వచించింది. 2012లో కేంద్ర ప్రణాళికా సంఘం పేదరిక రేఖను రూ.32, రూ.27గా చూపినప్పుడు నానా రభస చేసిన బీజేపీ అంతకంటే తక్కువగా పేదరిక రేఖను ఎలా నిర్ణయించిందని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఆ నిర్వచనంతోనే యూపీఏ పేదరికం 22 శాతానికి (2011-12) తగ్గిపోయిందని చెప్పుకున్నారు. వృద్ధి వాపుతో పాటే యూపీఏ ప్రతిష్ట కూడా దిగజారుతుండగా నాడు కాంగ్రెస్ ఇదే గారడీని ప్రదర్శించింది. మోడీ అంటే అభివృద్ధని, గుజరాత్ ఆదర్శ రాష్ట్రమని అదే పనిగా సాగుతున్న ప్రచారానికి ప్రభావితమవుతున్న మధ్య తరగతి విద్యావంతులకు పేదల సంఖ్య కూడా పడుతుంది. మోడీ మార్కు వట్టణ వృద్ధితో వేగంగా వృద్ధి చెందిన మూడువేల గుజ రాత్ మురికివాడలు దేశంలోనే అధ్వానమైనవిగా పేరు మోశాయి. ఇది ఎవరికైనా కనిపించే వాస్తవం. కాబట్టే మోడీ మార్కు వృద్ధిని సర్వరోగ నివారిణిగా చూపాలంటే అంకెల ఇంద్రజాలం ప్రదర్శించడం అవసరం. మాకెన్‌లు భూతద్దాలతో వేచిచూస్తున్న సమయంలో మోడీ వీర భక్తులెవరో ఈ అంకెల గారడీకి సాహసించి ఉండాలి. బీజేపీ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. మోడీకి వచ్చే నష్టం లేదు. పేదలకు ఒరిగేది అంతకంటే ఏమీ లేదు. అసలు ఈ చర్చే అర్థరహితమైనది. గుజరాత్ పౌర సరఫరాల శాఖ తన సర్క్యులర్ అమలు పరచడానికి ఉద్దేశించినది కాదని సెలవిచ్చింది. నిన్న మన్మోహన్ సైతం ప్రణాళికా సంఘం గీసిన గీతకు ఆహార భద్రతకు, ఉపాధి హామీకి లంకె లేదని చెప్పారు. మరి ఎందుకు గీస్తున్నట్లు? నేడు సాగుతున్న పేదరికంపై చర్చ గత ఏడాది ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు అమర్త్యసేన్, జగదీశ్ భగవతిల మధ్య సాగిం ది. అప్పట్లో అది కాంగ్రెస్, బీజేపీల ఆర్థిక విధానపరమైన మౌలిక చర్చగా ప్రచారంలోకి వచ్చింది. పేదరిక నిర్మూలనకు, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చురుగ్గా యత్నించడం ద్వారానే సుస్థిర వృద్ధి సాధ్యమని సేన్ వాదన. అందుకే ఆయన యూపీఏ ప్రభుత్వ గ్రామీణ ఉపాధి, ఆహార భద్రత పథకాలను సమర్థించారు. కాగా ప్రభుత్వ సంక్షేమ వ్యయాలు, సబ్సిడీలలో కోతలు విధించి, ప్రభుత్వం పాత్రను తగ్గించి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం ద్వారానే వృద్ధి సాధ్యమని భగవతి తర్కం. సమాజం పైపొరలకు అందే వృద్ధి ఫలాలు క్రమంగా వాటికవే అడుగు, అట్టడుగు పొరలకు చేరి పేదరికం, నిరుద్యోగం వాటికవే మటుమామవుతాయని ఆయన వాదన. ఆ వాదనలను సమర్థించడానికి బీజేపీ జంకింది. భగవతి చెప్పినదాన్ని ఆయన చెప్పకముందే మోడీ అమలులోకి తెచ్చారు. అందుకే ఆయన ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి పథకాల పట్ల బహిరంగంగానే వ్యతిరేకతను ప్రకటించారు. ప్రజాస్వామ్యం అంటూ ఒకటి ఉన్నాక పేదల ఓట్ల కోసం పాట్లు తప్పవు. ఇప్పుడు గీస్తున్న గీతలు ఎన్నికల తర్వాత అమల్లోకి రానున్న పేదరిక రేఖలని అంతరార్థం. మోడీ ప్రధాని పీఠమెక్కితే రూ.16 పేదరిక రేఖతో పేదరికం ఏ పదిహేను శాతానికో పడిపోతుందని అనుకోవాలి. ఈ పేదరికం మ్యాచ్ ఫిక్సింగ్‌ను పక్కన పెట్టి కనీస వేతనాల స్థాయిని బట్టి ప్రపంచంలో మనం ఎక్కడున్నామో చూస్తే పేదరికం నిజస్వరూపం అవగతమవుతుంది. ఆస్ట్రేలియాలో అత్యధికంగా గంటకు 16.88 డాలరు ్లగా ఉన్న కనీస వేతనాలు అమెరికాలో 7.25 డాలర్లు. ఇది వివిధ దేశాల కొనుగోలుశక్తిని సరిపోల్చి కొలిచిన వేతనాల కొలబద్ధ. కారుచౌక శ్రమ దోపిడీకి మారు పేరుగా పిలిచే చైనాలో కనీస వేతనాలు గంటకు 0.80 డాలర్లు. కాగా, మన దేశం స్థాయి 0.28 డాలర్లు. అఫ్ఘానిస్థాన్ మనకంటే నయం 0.57 డాలర్లు. ఇంతకూ కనీస వేతనాలు అంటే బతకడానికి సరిపడే జీవన వేతనాలు కావు. మన దేశంలో బతకడానికి కావాల్సిన జీవన వేతనంలో మన కనీస వేతనం 26 శాతం. ఆ కనీస వేతనం కంటే తక్కువ కూలికి పని చేసే దరిద్రనారాయణులకు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు గెలి చినా ‘స్వర్గం’ చూపించడం ఖాయం. - పి. గౌతమ్ -
రాయ్‌బరేలీ, అమేథీలకే ప్రియాంక పరిమితం
క్రియాశీల పాత్ర పోషిస్తారన్న ఊహాగానాలకు కాంగ్రెస్ తెర న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా క్రియాశీలక పాత్ర పోషించనున్నారని పెద్ద ఎత్తున వచ్చిన ఊహాగానాలకు కాంగ్రెస్ తెరదించింది. తల్లి, సోదరుడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజక వర్గాల్లో మాత్రమే ప్రియాంక ప్రచారం చేస్తారని స్పష్టం చేసింది. దీంతోపాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా జరిపే పర్యటనల షెడ్యూల్ ఖరారులో ఆమె సమన్వయకర్తగా ఉంటారని పేర్కొంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి చైర్మన్ అజయ్ మాకెన్ సోమవారమిక్కడ మీడియా మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.