'ఆ యాభై వేల మంది దేశానికి తెలియాలి'
ఢిల్లీ: నల్లధనం అంశానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ మండిపడింది. మంగళవారం బీజేపీ వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. అసలు అధికారంలో ఉన్న బీజేపీ సరైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇదే విషయాన్ని సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ చాలా చెప్పారని ఈ సందర్భంగా మాకెన్ గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు.
దాదాపు 50 వేల మంది నల్లధనాన్ని ఇతర దేశాలకు తరలించారని మోదీ తెలిపారన్నారు. ఆ యాభై వేల మంది ఎవరో దేశానికి తెలియాలని మాకెన్ డిమాండ్ చేశారు.