రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా క్రియాశీలక పాత్ర పోషించనున్నారని పెద్ద ఎత్తున వచ్చిన ఊహాగానాలకు కాంగ్రెస్ తెరదించింది.
క్రియాశీల పాత్ర పోషిస్తారన్న ఊహాగానాలకు కాంగ్రెస్ తెర
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా క్రియాశీలక పాత్ర పోషించనున్నారని పెద్ద ఎత్తున వచ్చిన ఊహాగానాలకు కాంగ్రెస్ తెరదించింది. తల్లి, సోదరుడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజక వర్గాల్లో మాత్రమే ప్రియాంక ప్రచారం చేస్తారని స్పష్టం చేసింది.
దీంతోపాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా జరిపే పర్యటనల షెడ్యూల్ ఖరారులో ఆమె సమన్వయకర్తగా ఉంటారని పేర్కొంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి చైర్మన్ అజయ్ మాకెన్ సోమవారమిక్కడ మీడియా మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.