న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ తన సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీలతో పాటు నేడు (గురువారం) పార్లమెంటుకు చేరుకోనున్నారు. ఈరోజు ఆమె లోక్‌సభ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. రాహుల్ గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాలలో విజయం సాధించారు. తరువాత ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాకా గాంధీ పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా సంతానం రాహుల్, ప్రియాంక ఇప్పుడు లోక్‌సభకు చేరుకున్నారు. అంటే పార్లమెంటు ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కుమారుడు, కుమార్తె కూర్చోనున్నారు.
ఇదేవిధంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా లోక్ సభ సభ్యులు. అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి గెలుపొందగా, ఆయన భార్య ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి స్థానం నుంచి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ బంధువు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి గెలుపొందగా, మరో బంధువు ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ కుటుంబానికి చెందిన నలుగులు ఎంపీలుగా ఉన్నారు.
బీహర్ నేత పప్పు యాదవ్ పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన భార్య రంజిత్ రంజన్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు. 2014 నుంచి ఆయన సభకు ఎన్నికవుతూవస్తున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment