
'నో ఐడియా.. మాకేం తెలియదు'
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు భిన్న రకాలు స్పందించారు. ఆయన అతిత్వరలోనే తిరిగొస్తారని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం తమకేం తెలియదని చెబుతున్నారు. మరోవైపు రాహుల్ బుధవారం ఢిల్లీకి తిరిగొస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి.
దీని గురించి అడిగినప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ తనకేమీ తెలియదని సమాధానమిచ్చారు. 'నో ఐడియా. రాహుల్ పునరాగమనం నుంచి మాకేమీ తెలియదు. మీరు చెబితే తెలుసుకుంటాం' అని మాకెన్ అన్నారు. 55 రోజుల సెలవు ముగించుకుని రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీకి రానున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.