న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Elections) ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్), కాంగ్రెస్(Congress) పార్టీల మధ్య శాశ్వతంగా దూరం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అవసరమైతే ఆప్(AAP)నకు మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నకు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ పార్టీతో కాంగ్రెస్‌కు భవిష్యత్తులో ఎటువంటి పొత్తు అక్కర్లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని మాకెన్ చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,ఆప్ విడివిడిగానే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్,బీజేపీ(BJP) మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఇండియా కూటమిలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలో ఆప్ సహా ఒక్కొక్కటిగా ఇటీవల కాంగ్రెస్‌కు దూరమవుతుండడం గమనార్హం.
ఈ వ్యవహారంపై ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ(ఎస్‌సీపీ) పార్టీ అధినేత శరద్‌పవార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పొత్తు లోక్‌సభ ఎన్నికలవరకేనని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొత్తు ఉండాలని ఏమీ లేదన్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాదీ(ఎస్పీ) కూడా ఇటీవల కాంగగ్రెస్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్‌కు కాకుండా ఆమ్‌ఆద్మీపార్టీకి మద్దతిస్తుండడం గమనార్హం. ఎస్పీ బాటలోనే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆప్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించింది.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అదే నెల 8వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ భావిస్తుండగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ఆప్‌కు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందు కోసం రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఈ ఎన్నికల కోసం తన తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించింది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఆ మేనిఫెస్టో తమదేనని, బీజేపీ కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment