‘ఏడాది పాటు పదవి తీసుకోను’ | For one year I will not take up any post in the party, says Ajay Maken | Sakshi
Sakshi News home page

‘ఏడాది పాటు పదవి తీసుకోను’

Published Wed, Apr 26 2017 12:22 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

‘ఏడాది పాటు పదవి తీసుకోను’

‘ఏడాది పాటు పదవి తీసుకోను’

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ ప్రకటించారు. ఏడాది పాటు పార్టీలో ఎటువంటి పదవి తీసుకోబోనని ఆయన చెప్పారు. కార్యకర్తగానే పార్టీలో కొనసాగుతానని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అనుకున్నదాని కంటే బాగానే పుంజుకున్నామని, ఇంకా మంచి ఫలితాలు ఆశించామని వెల్లడించారు. ఈవీఎం పనితీరుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంపై తమకు నమ్మకం ఉందని, ఈవీఎంల పనితీరుపై విశ్వాసం లేదని మాకెన్‌ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు దక్కించుకోగా, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది ఫలితాలు వెలువడాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement