Delhi Congress President
-
ఢిల్లీలో ఒంటరి పోరే..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలనే నిశ్చయానికి వచ్చింది. బీజేపీతో ప్రత్యక్షపోరు కొనసాగిస్తున్న మాదిరే ఆప్‌తోనూ అదే వైఖరిని అవలించాలని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నేతలకు సూచనలు చేసింది. ఢిల్లీలో షీలాదీక్షిత్ హయాంలో వరుసగా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గడిచిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేదు. మొన్నటి లోక్‌సభలో ఆప్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా రెండు పార్టీలు ఒక్క సీటును గెలువలేకపోయాయి. అనంతరం జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల పొత్తు ఉంటుందని భావించినా, సీట్ల పంపకాలలో విభేదాలతో పొత్తు కుదరలేదు. దీంతో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాయి. 6 నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ఆప్ ప్రత్యక్ష కారణమైంది. హరియాణా ఓటమి నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవాల న్నా, ఓట్ల చీలికను ఆపాలన్నా రెండు పార్టీలు కలిసి పోటీ చేయడమే ఉత్తమమనే భావనను కొంతమంది నేతలు వ్యక్తం చేశారు. అయితే ఆప్ పార్టీలోని సోమ్నా«థ్ భారతి వంటి కీలక నేతలు పొత్తును వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుతో ఆప్‌కు ఒనగూరే ప్రయోజనం ఏమీలేదని, పైగా బీజేపీకి విమర్శల దాడిని అ్రస్తాన్ని అందించినట్లు అవుతుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గే లు హాజరయ్యారు. కార్యక్రమంలో కేజ్రీవాల్, రాహుల్, ఖర్గేలు చాలాసేపు ముచ్చటించుకోవడం సైతం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఆప్‌తో పొత్తు ఖాయమైందని చా లా మంది భావించారు. శుక్రవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స మావేశం సందర్భంగా పొత్తు అంశంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తు ఉంటుందని ఎక్కువ మంది భావిస్తున్న వేళ కాంగ్రెస్ అనూహ్య నిర్ణ యం తీసుకుంది. ఎలాంటి పొత్తులు ఉండవ ని ఒంటరి పోరుకు సిద్ధం కావాలని అధిష్టాన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ శనివారం ఒక ప్రకటన చేశారు. ‘ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ పరిపాలనలో వృద్ధులకు పింఛన్లు అందడం లేదు. పేదలకు రేషన్‌కార్డు అందడం లేదు. రోడ్లు పాడైపోయాయి. కాలుష్యం అదు పు తప్పింది. యువత నిరుద్యోగులయ్యారు. ద్రవ్యోల్బణంతో మహిళలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కేవలం ప్రదర్శన కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ మొహల్లా క్లినిక్‌లను తెరిచింది. ఇదీ కేజ్రీవాల్ మోడల్’అంటూ విమర్శలు గుప్పించారు. అటు బీజేపీ, ఇటు ఆప్ రెండూ ఢిల్లీ సర్వనాశనం చేశాయన్నారు. రెండు పార్టీలను ఒంటరిగా ఎదుర్కొంటామని, ముఖ్యమంత్రి ఎవరనేది ఫలితాల అనంతరం నిర్ణయిస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టామని తెలిపారు. -
సిద్ధూకి కీలక బాధ్యతలు!
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూకి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఆయనను ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు సమాచారం. సిద్ధూ ఇటీవల పంజాబ్ మంత్రివర్గం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో విభేదాలు, మంత్రివర్గంలో కీలక శాఖల నుంచి తప్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో సిద్ధూ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధూకి ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లైంది. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకులు కూడా ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో సిద్ధూకు ఢిల్లీ పగ్గాలు అప్పగించి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సిద్ధూకి గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో కూడా సిద్ధూకి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూని డీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి లాభం చేకూరుతుందని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అనంతరం సిద్ధూ డీపీసీసీ బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయాన్ని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీసీ చాకో కొట్టిపాడేశారు. డీపీసీసీ అధ్యక్షుడిపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ‘ డీపీసీసీ అధ్యక్షుడి పగ్గాలు సిద్దూ చేపట్టబోతున్నారనేది అవాస్తవం. ఈ విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదు. అవన్నీ పుకార్లు మాత్రమే’ అని చాకో పేర్కొన్నారు. -
‘ఏడాది పాటు పదవి తీసుకోను’
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ప్రకటించారు. ఏడాది పాటు పార్టీలో ఎటువంటి పదవి తీసుకోబోనని ఆయన చెప్పారు. కార్యకర్తగానే పార్టీలో కొనసాగుతానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నదాని కంటే బాగానే పుంజుకున్నామని, ఇంకా మంచి ఫలితాలు ఆశించామని వెల్లడించారు. ఈవీఎం పనితీరుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంపై తమకు నమ్మకం ఉందని, ఈవీఎంల పనితీరుపై విశ్వాసం లేదని మాకెన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు దక్కించుకోగా, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది ఫలితాలు వెలువడాల్సివుంది.