కులగణన.. మహిళలకు 33% రిజర్వేషన్‌  | Congress Party Releases Manifesto For Delhi Assembly Elections 2025, Check Key Points Inside | Sakshi
Sakshi News home page

Delhi Polls Congress Manifesto: కులగణన.. మహిళలకు 33% రిజర్వేషన్‌ 

Jan 30 2025 5:49 AM | Updated on Jan 30 2025 11:06 AM

Congress Party releases manifesto for Delhi Assembly polls 2025

300 యూనిట్ల ఉచిత్‌ విద్యుత్‌.. రూ.500లకే ఎల్‌పీజీ 

ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లు 

ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే కులగణన చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవేందర్‌ యాదవ్, కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జి జైరాం రమేష్, జాతీయ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరాలు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. 

ప్రజలకు సామాజిక, ఆర్థిక అంశాల్లో తోడ్పాటును అందించేలా వివిధ సంక్షేమ పథకాలపై కాంగ్రెస్‌ హామీలు గుప్పించింది. పూర్వాంచల్‌ వాసుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం సహా చదువుకున్న నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు నెలకు రూ.8,500 ఆర్థిక సహాయం వంటి వాగ్ధానాలను ప్రకటించింది.  

యమునా కాలుష్య పాపం రెండు పార్టీలదే: జైరాం రమేశ్‌ 
మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన జైరాం రమేశ్, యమునా నదీ కాలుష్య పాపం పూర్తిగా, ఆప్, బీజేపీలదేనని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వల్లే కాలుష్యం ఢిల్లీ ప్రజలకు పెనుశాపంగా మారిందని ధ్వజమెత్తారు. షీలాదీక్షిత్‌ హాయంలో యమునా కాలుష్యాన్ని నియంత్రించేందుకు జపాన్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేశామని, కాలుష్యాన్ని అరికట్టేలా 7 వేలకు పైగా సీఎన్‌జీ, మెట్రో సరీ్వసులను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేసిన మాదిరే ఢిల్లీలోనే పథకాల అమలు జరుగుతుందని హామీ ఇచ్చారు.  

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు
→ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు. 
→ పింఛను రూ.2,500 నుంచి రూ.5,000కు పెంపు. 
→ వితంతువుల కూతుళ్ల పెళ్లికి రూ.1.1 లక్షల సాయం 
→ ఢిల్లీ వ్యాప్తంగా 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు. ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం  
→ పూర్వాంచల్‌కు కొత్త మంత్రిత్వ శాఖ. 
→ ప్రతి వార్డులో 24 గంటల డిస్పెన్సరీ, 10 మలీ్టస్పెషాలిటీ ఆసుపత్రులు 
→ రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ 
→ విద్యార్థుల కోసం 700 పబ్లిక్‌ లైబ్రరీల ఏర్పాటు. 
→ మురుగునీటి మౌలిక సదుపాయాల పునరుద్ధరణ ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే యమునా నదిలో విడుదల చేసేలా ప్రణాళిక 
→ పునరావాస కాలనీలు, అనధికార కాలనీలలో నివసించే ప్రజలకు యాజమాన్య హక్కులు 
→ 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు  
→ సీనియర్‌ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.5,000 పెన్షన్‌  
→ 15,000 మంది సివిల్‌ డిఫెన్స్‌ వాలంటీర్ల పునరి్నయామకం. 
→ జైన్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు 
→ ‘ప్యారీ దీదీ యోజన’కింద మహిళలకు నెలకు రూ.2,500 
→ నిరుద్యోగ యువతకు నెలవారీ రూ.8,500 సాయం 
→ రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్‌ 
→ కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ 
→ ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement