Manifesto Guarantees
-
నాడు 87 శాతం హామీలు.. వంద రోజుల్లోనే అమలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే 87 శాతం హామీలను అమలుచేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే మిగిల్చి దిగిపోయిన చంద్రబాబు సర్కారు... అప్పులు కూడా పుట్టకుండా తరువాత ప్రభుత్వం చేయాల్సిన అప్పులను కూడా చేసేసింది. అయినా సరే.. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి తొలి కేబినెట్ సమావేశంలోనే పలు హామీల అమలుకు నిర్ణయాలు తీసుకుని అమలుచేయడం ప్రారంభించారు. ఖజానా ఖాళీగా ఉందనే సాకులతో హామీల అమలును ఏనాడూ వాయిదా వేయకుండా సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మేనిఫెస్టోను ఎదురుగా పెట్టుకుని వాటి అమలుకు నిరంతరం తపనపడ్డారు. తొలి కేబినెట్ భేటీలోనే అనేక హామీలకు ఆమోదంనిజానికి.. 2019 జూన్ 10న జరిగిన తొలి కేబినెట్ భేటీలోనే పలు హామీలు అమలుకు ఆమోదముద్ర వేశారు. నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి వైఎస్ జగన్ హామీల అమలులో ఎక్కడా వెనకడుగు వేయలేదు. వంద రోజుల పాలనలోనే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు సామాజికన్యాయం, మహిళా సాధికారత, పాలనలో పారదర్శకతకు పలు చారిత్రక చట్టాలను చేశారు. ఇందులో సాహసోపేతమైన చర్యలు కూడా ఉన్నాయి. ఇలా హామీల అమలు ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తొలి వంద రోజుల పాలనలోనే ప్రజల మన్ననలు పొందారు. ఇదీ హామీలపట్ల వైఎస్ జగన్ చిత్తశుద్ధి. అలాగే, ప్రజల వద్దకే పాలన, పథకాలు నేరుగా లబ్ధిదారులకే తీసుకెళ్లడం ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం తొలి వంద రోజుల్లోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి 2019 అక్టోబరు 2న ప్రారంభించారు. ఈ సచివాలయాల్లో విధుల నిర్వహణకు ఏకంగా కొత్తగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను సృష్టించి పారదర్శకంగా భర్తీచేశారు. గ్రామాల్లో ప్రతీ 50 ఇళ్లకు, పట్టణాల్లో 75 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రజల సేవకు వలంటీర్లను నియమించారు.తొలి వంద రోజుల్లో జగన్ అమలు చేసిన హామీలివే..⇒ వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు పెన్షన్లను రూ.2,250కి పెంచారు. వికలాంగులకు రూ.3 వేలకు.. డయాలసిస్ పేషెంట్లకు రూ.10వేలకు పెన్షన్‌ను పెంచారు. ఇలా పెంచిన మొత్తాన్ని జూన్ 2019కి సంబంధించిన పింఛన్‌ను ఆ తర్వాత నెల జూలై 1న పంపిణీ చేశారు.⇒ ఉద్యోగులకు జూలై నుంచి 27 శాతం మధ్యంతర భృతి.⇒ అక్టోబరులో వైఎస్సార్ రైతుభరోసా అమలు.. 56 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం.⇒ అక్టోబరు 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం..⇒ అన్ని శాఖల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.18 వేలకు పెంపు.⇒ అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తల వేతనాలూ పెంపు.⇒ డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్స్‌కు రూ.10 వేలు గౌరవ వేతనం⇒ మహిళల పేరు మీద ఉగాది రోజున రిజిస్ట్రేషన్.⇒ వచ్చే నాలుగేళ్లలో వైఎస్సార్ పేరుతో 25 లక్షల ఇళ్లు నిర్మాణం.⇒ జనవరి 26 నుంచి తెల్లకార్డు ఉన్న ప్రతీ తల్లికి అమ్మఒడి కింద రూ.15 వేలు.⇒ సెప్టెంబరు 1 నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతీ గడపకు నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సరుకులతో రేషన్ పంపిణీ.⇒ రాష్ట్రంలో 40 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్పు.. అన్ని సౌకర్యాల కల్పన.⇒ నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణకు విద్యా సంస్కరణల కమిటీ ఏర్పాటు.⇒ ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు అమలు. ⇒ జూలై 8న వైఎస్సార్ పుట్టిన రోజు రైతు దినోత్సవంగా నిర్వహణ.⇒ రూ.3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి.⇒ రైతులకు ఉచితంగా బోర్లు.. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లోకి 200 రిగ్‌ల కొనుగోలు.⇒ సున్నా వడ్డీ అమలుకు శ్రీకారం.⇒ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.⇒ అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు.⇒ ఈ ఏడాది ఇళ్ల జాగాలు లేని ఆడపడుచులందరికీ ఇళ్ల స్థలాలు.⇒ ఆస్పత్రుల అభివృద్ధికి ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు.⇒ 108, 104 వాహనాల ఆధునికీకరణ⇒ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత.⇒ టెండర్లలో అవినీతి అరికట్టేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు.⇒ ప్రైవేట్ విద్యా సంస్థల నియంత్రణకు వేగంగా అడుగులు.⇒ భూముల రీసర్వే–శాశ్వత హక్కుల కల్పనకు చట్టం.⇒ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు చట్టం.⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ల చట్టం.⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ల చట్టం.⇒ ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల చట్టం.⇒ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే చట్టం. -
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరిట దేశ ప్రజలకు 10 హామీలు ఇచ్చారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే ఈ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. మోదీ కీ గ్యారంటీ కావాలో, కేజ్రీవాల్ కీ గ్యారంటీ కావాలో దేశ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. కేజ్రీవాల్ కీ గ్యారంటీ అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఇచి్చన హమీలన్నీ దేశాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవేనని తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఈ పది హామీల అమలును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. తాను ఇస్తున్న పది హామీలపై ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్యపక్షాలతో చర్చించలేదని అన్నారు. ఈ హామీలను నెరవేర్చేలా కూటమిలోని పారీ్టలను ఒప్పిస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు తాను గ్యారంటీలన్నీ అమలు చేశానని, మోదీ కీ గ్యారంటీ మాత్రం అమలు కాలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానంటూ మోదీ ఇచి్చన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. హామీలు ఇవే...1. పేదలకు ఉచిత విద్యుత్ దేశవ్యాప్తంగా నిత్యం 24 గంటలపాటు కరెంటు సరఫరా చేస్తాం. ఎక్కడా కరెంటు కోతలు ఉండవు. దేశంలోని పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. 2. నాణ్యమైన విద్య ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య ఉచితంగా విద్య అందిస్తాం. 3. ఉచితంగా చికిత్స ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్ నిర్మిస్తాం. ప్రతి జిల్లాలో అద్భుతమైన ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తాం. దేశంలోని ప్రతి వ్యక్తికీ మెరుగైన చికిత్స ఉచిత అందిస్తాం.4. చైనా ఆక్రమించిన భూమి స్వా«దీనం డ్రాగన్ దేశం చైనా ఆక్రమించిన మన దేశ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఈ విషయంలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. 5. అగి్నవీర్ యోజన నిలిపివేత అగి్నవీర్ పథకాన్ని నిలిపివేస్తాం. అన్నిరకాల సైనిక నియామకాలు పూర్వ విధానంలోనే జరుగుతాయి. ఇప్పటివరకు అగ్నివీర్ పథకంలో రిక్రూట్ అయిన అగి్నవీరులందరినీ పర్మినెంట్ చేస్తాం. 6. పంటలకు కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఖరారు చేస్తాం. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తాం. 7. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తాం. 8. యువతకు ఉద్యోగాలు నిరుద్యోగాన్ని క్రమపద్ధతిలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం. యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కలి్పస్తాం.9. అవినీతి నుంచి విముక్తి నిజాయితీపరులను జైలుకు పంపించి, అవినీతిపరులను రక్షించే బలమైన వ్యవస్థను బీజేపీ సృష్టించింది. ఈ వ్యవస్థను రద్దు చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బీజేపీ వాషింగ్ మెషీన్‌ను ప్రజల సక్షమంలోనే బద్ధలు కొడతాం. 10. స్వేచ్ఛా వాణిజ్యం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను సరళతరం చేస్తాం. వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. బీజేపీ కుట్ర విఫలం తాను అరెస్టయిన తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ కుట్ర విఫలమైందని చెప్పారు. తన అరెస్టు తర్వాత ఆప్ మరింత ఐక్యంగా మారిందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై వారితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ‘ఆప్’ను గెలిపిస్తే నేను జైలుకెళ్లను కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్లబోనని తెలిపారు. చీపురు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజల బాగు కోసం పనిచేసినందుకే తనను జైలుకు పంపించారని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం బీజేపీకి నచ్చలేదన్నారు. తాను మళ్లీ జైలుకు వెళితే ఢిల్లీలో అభివృద్ధి నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే భగవంతుడు తనను జైలు నుంచి బయటకు రప్పించాడని ప్రజలు చెబుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యనించారు. -
ఆదర్శనీయం... ఆచరణీయం
‘అనుచిత ఉచితాలకు నేడో రేపో భారీ మూల్యం చెల్లించడం ఖాయం’ అంటారు అమెరికన్ రచయిత విల్లీమన్. ఎన్నికల సమయంలో ఆ యా రాజకీయ పార్టీలు ఉచితాలతో కూడిన హామీలిస్తున్నాయి. అయితే పేదవారి కనీస అవసరాలు తీర్చే సముచిత ఉచితాలు కొంతకాలం అవస రమే. కానీ కేవలం అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే అనుచిత ఉచితాల పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఆర్థిక సంక్షోభ సునామీలో కొట్టుకు పోవడం ఖాయం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సముచిత ఉచితాలతో గరిష్ఠ స్థాయిలో సంక్షేమ పథకాల రూపంలో ఏటా సుమారు రూ. 80 వేల కోట్లు వ్యయం చేసినప్పటికీ... కొందరు కోరుకున్నట్లుగా రాష్ట్రం శ్రీలంక కాలేదు.అధికార దాహార్తితో అల్లాడుతున్న చంద్రబాబు వచ్చే ఎన్ని కల్లో ఎలాగైనా గెలవాలనే కోరికతో అనేక అనుచిత ఉచితాలు ప్రకటించారు. జగన్ ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ చంద్రబాబు ఇచ్చిన అనుచిత ఉచితాలను అమలు చేయడానికి యేటా మరో రూ.70 వేల కోట్ల ఖర్చవుతుంది. అంటే వీటివల్ల రాష్ట్ర ఖజానాపై సుమారు రూ. లక్షా 50 వేల కోట్ల భారం పడుతుంది. నిజానికి రాష్ట్రానికి పన్ను, పన్నేతర ఆదాయాలు, కేంద్ర గ్రాంట్లు అన్నీ కలిపితే ఏడాదికి వస్తోంది సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు. దీనిలో ఉచితాలకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు పోతే మిగిలేది రూ. 50 వేల కోట్లు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు ఏడాదికి సుమారు రూ.70 వేల కోట్లు అవసరమవుతాయి. ఇవి కాక వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, వైద్యం లాంటి 21 శాఖలకు సుమారు లక్షా 30 వేల కోట్లు కేటా యించాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ ఎకౌంట్లో సుమారు 56 వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటు చూపించారు. చంద్రబాబు అనుచిత పథకాలను కూడా అమలు చేయాల్సి వస్తే ఈ లోటు లక్షా 26 వేల కోట్లకు పెరుగుతుంది. ఇదే జరిగితే ఈ లోటు రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ఖాయం.మేనిఫోస్టోలకు మాతృక 1848లో లండన్‌లో కార్ల్‌మార్క్స్– ఫ్రెడెరిక్ ఏంగెల్స్ ప్రచురించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అట్టడుగు శ్రామిక , పేద వర్గాలకు సంపద పంచడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం ఈ మేనిఫెస్టోలోని అంశాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ చేసింది ఇదే. ముందు వారి ఆర్థిక అవస రాలు తీర్చడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అందజేశారు. దీనిలో సుమారు రూ. 2.70 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా అందజేశారు. మోదీ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఈ పద్ధతి ద్వారా దేశ వ్యాప్తంగా సుమారు రూ. 22 లక్షల కోట్లు బదిలీ చేయగా దానిలో పదో వంతు పైనే ఏపీలో పంపిణీ జరగడం విశేషం. ఇలా ఇవ్వడం వల్ల ఈ నాలుగు లక్షల కోట్ల రూపాయలు నేరుగా స్థాని కంగా ఖర్చు చేయడంతో వస్తు, సేవలకు గిరాకీ ఏర్పడింది. ఫలితంగా ఉత్పత్తి, ఉపాధి పెరిగింది. ప్రతి లావాదేవీలోనూ కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపంలో రాబడి పెరిగింది. ఇదే మొత్తం బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల చేతికి వెళితే దానిలో అత్యధికం నల్లధనంగా మారేది. పేదలను ఆర్థికంగా ఆదుకున్న జగన్ తర్వాత వారి సంపదను పెంచారు. సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు, లక్షన్నర గృహాలు ఉచితంగా అందజేశారు. పేదలకు ఇచ్చిన ఒక్కో ఇళ్ళ స్థలం విలువ కనీసం మూడు లక్షలు, ఇంటి విలువ పది లక్షల రూపాయల చొప్పున లెక్కిస్తే వాటి మొత్తం విలువ సుమారు పది లక్షల కోట్ల రూపాయలు. అంటే రాష్ట్ర బడ్జెట్ కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. దేశంలో మరే రాష్ట్రం పేదల కోసం ఇటువంటి ఆలోచన చేయలేదు, ఇంత సంపద సమకూర్చలేదు.రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదంటూ విపక్షాలు, వారి అనుకూల మీడియా విషప్రచారం చేశాయి. 2023–24లో దేశ జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం కాగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 16.5 శాతం. దేశంలో ఎక్కువగా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. 2018–19లో స్థూల జాతీయోత్పత్తి విలువ రూ. 8.73 లక్షల కోట్లు కాగా అది 2023–24 నాటికి రూ. 16 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ. 1,54,031 నుంచి రూ. 2. 60 లక్షలకు పెరిగింది. ఈ ఐదేళ్ళలో 122 భారీ పరిశ్రమలు, 5 లక్షల చిన్న తరహా పరి శ్రమలు వచ్చాయి. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లుగా సుమారు రూ. 75 లక్షల కోట్ల రూపాయల మౌలిక వసతుల పనులు జరుగుతుంటే వాటిలో ఏపీలోనే సుమారు రూ. 6 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి. దేశ ఎగుమతుల్లో 10.42 శాతం ఏపీ నౌకాశ్రయాల నుంచే జరుగుతున్నాయి. సామాజిక రంగ వ్యయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోక్, పొగాకు, మత్స్య ఉత్పత్తులు, పండ్ల తోటల విస్తీర్ణం, పౌల్ట్రీ , ప్రభుత్వ ఆస్పత్రుల సంఖ్య , సినిమా హాళ్ళు, ఇంజనీరింగ్ టాలెంట్ తదితర రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశంలో అతి తక్కువ నిరుద్యోగం (4.2 శాతం) ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. కాని రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవంటూ ప్రచారం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. దానికి ఉదాహరణ రాష్ట్రంలో పెరిగిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలే. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2019లో రాష్ట్రంలో 44,85,974 పీఎఫ్ ఖాతాలుంటే అవి 2024 నాటికి 60,73,000కు పెరిగాయి. రాష్ట్రంలో గత మూడేళ్ళుగా కొత్తగా 18 లక్షల ఆదాయ పన్ను చెల్లింపుదారులు చేరారు. ఇదో జాతీయ రికార్డు.దేశంలో అత్యధిక సంఖ్యలో ఏడు వందలకు పైగా పౌర సేవలందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 12 కోట్ల పౌర సేవా అర్జీలను పరిష్కరించి జాతీయ రికార్డు నెలకొల్పింది. నిజానికి ఈ ఐదేళ్ళలో అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. జగన్ ప్రభుత్వం మేనిఫోస్టోను పవిత్ర గ్రంథంగా భావించి త్రికరణ శుద్ధిగా అమలు చేసిందనడంలో సందేహం లేదు. గతంలో పసుపు– కుంకుమ వంటి తాయిలాలను తిరస్కరించిన రాష్ట్ర ఓటర్లు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం– జనసేన కూటమి అనుచిత ఉచితాల వలకు చిక్కే అవకాశం కనిపించడం లేదు.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్మొబైల్: 89859 41411 -
విశ్వసనీయతే విజయానికి మెట్టు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రభుత్వానికి లేదా పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకుడికి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతే ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తుంది. ఇది రాజకీయ విశ్లేషకులో.. సర్వే సంస్థలో చెబుతున్న మాటకాదు. చరిత్ర చెబుతున్న వాస్తవం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసిన సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. గొంతులేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు మరింతగా ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా గత ఎన్నికల మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాలను మరింతగా పెంచి వచ్చే ఐదేళ్లూ కొనసాగిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలను కొనసాగిస్తూ.. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని అందులో ఆయన స్పష్టంచేశారు. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి 650కి పైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ఏ ఒక్క హామీని అమలుచేయకుండా ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టిన చంద్రబాబు.. కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోయిన హామీలకే ‘సూపర్ సిక్స్’ అని ముసుగేసి.. తల్లికి వందనం పథకం కింద ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు.. నలుగురు.. ఐదుగురు.. ఇలా ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఆ తల్లి ఖాతాలో డబ్బులు వేస్తామంటూ రోజూ హామీల పాట పాడుతున్నారు. చంద్రబాబు మోసం చేస్తాడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో పది నెలలుగా ఆయన ఊదరగొడుతున్న ఈ హామీలను ఎవరూ పట్టించుకోవడంలేదు. అదే సమయంలో.. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో 2024 ఎన్నికల్లో ఈ నమ్మకమే వైఎస్సార్సీపీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు 2009 ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తుచేస్తున్నారు. వైఎస్ విశ్వసనీయతకే పెద్దపీట.. 2004 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాట మేరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించడం, వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీచేస్తూ సీఎంగా తొలి సంతకం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, అర్హులందరికీ ఇళ్లు వంటి ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడంతోపాటు.. ఆరోగ్యశ్రీ వంటి ఇవ్వని హామీలను కూడా అమలుచేసి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. 2009 ఎన్నికల్లో.. 2004 నాటి హామీల అమలును కొనసాగిస్తూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 7 నుంచి 9 గంటలకు పెంచుతామని.. ప్రతినెలా ఒకరికి నాలుగు కేజీల చొప్పున ఇస్తున్న రేషన్ బియ్యాన్ని ఆరు కేజీలకు పెంచి ఇస్తామంటూ కొత్తగా రెండే హామీలిచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఓడినా గెలిచినా తనదే బాధ్యత అంటూ ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగా దిగారు. వైఎస్‌కు ఉన్న ప్రజాబలం చూసి 2009 ఎన్నికల్లో చంద్రబాబు.. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో మహాకూటమిగా ఏర్పడి పోటీకి దిగారు. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ అడ్డగోలుగా హామీలిచ్చి పారేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో కుటుంబం ఖాతాలో ప్రతినెలా రూ.2 వేల చొప్పున నగదు బదిలీ (డీబీటీ) కింద జమచేస్తామన్నారు. కానీ, 1995–2004 వరకూ బాబు మోసాలు, అరాచకాలను గుర్తుంచుకున్న ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డికే పట్టంకట్టారు. చరిత్ర పునరావృతం ఖాయం.. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కూటమి కట్టిన చంద్రబాబు.. రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీచేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగభృతిగా రూ.2 వేలు ఇస్తానంటూ 650కి పైగా హామీలను ఎడాపెడా గుప్పించారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయంచేశారు. అందులోని ఒక్కదాన్నీ అమలుచేయకుండా వంచించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు చావుదెబ్బ కొట్టారు. ఆ ఎన్నికల్లో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక 99 శాతం హామీలను అమలుచేశారు. నవరత్నాలు పథకాలు కింద డీబీటీ రూపంలో 58 నెలల్లో రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమచేశారు. ఫలితంగా రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గింది. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలైన విద్యాకానుక, గోరుముద్ద, వసతిదీవెన వంటి హామీలను అమలుచేసిన సీఎం జగన్ ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు మరింతగా ఆర్థిక సాధికారత సాధించేందుకు వచ్చే ఐదేళ్లూ నవరత్నాల పథకాలను విస్తరించి, కొనసాగిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అమ్మఒడిని రూ.15 వేలను రూ.17 వేలకు.. రైతుభరోసాను రూ.13,500లను రూ.16 వేలకు.. పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.3,500లకు పెంచుతామని హామీనిస్తూ మళ్లీ రెండే పేజీలతో 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనేందుకు భయపడిన చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో మళ్లీ జట్టుకట్టి సూపర్ సిక్స్ అంటూ మేనిఫెస్టో పాట పాడుతున్నారు. కానీ, ఇందులో చంద్రబాబు పేర్కొన్న హామీలన్నీ కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోవడాన్ని ప్రజలు తెలుసుకున్నారు. దీంతో అడ్డగోలు హామీలిచ్చేస్తున్నారు. అయినా.. వివేకవంతులైన రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మాటపై నిలబడే సీఎం వైఎస్ జగన్‌కే మరోసారి పట్టం కట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. 2009 నాటి చరిత్ర పునరావృతం కావడం ఖాయమంటున్నారు. -
మేనిఫెస్టో.. ఓ పవిత్ర గ్రంథం 'ఈసారీ జనరంజకమే'
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను ‘సిద్ధం’ సభలతో సన్నద్ధం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మేనిఫెస్టో రూపకల్పనపై చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 4 లోక్‌సభ స్థానాల పరిధిలో ఇప్పటికే సిద్ధం సభలు నిర్వహించిన నేపథ్యంలో మిగతా 21 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రజలతో మమేకమవుతూ పార్టీ శ్రేణులను, అభిమానులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు ఈనెల 27న ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్ మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చెప్పారు. చెప్పిన వాటితోపాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేయడంతో జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగింది. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలతో ఇది ప్రస్ఫుటితమైంది. బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా మేనిఫెస్టోను ప్రకటించనుండటంతో జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అన్న నమ్మకం ప్రజల హృదయాల్లో నాటుకుపోయింది. పాలనకు దిక్సూచిగా.. ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి హామీలు గుప్పిస్తూ మేనిఫెస్టో విడుదల చేయడం.. గద్దెనెక్కాక ఐదేళ్ల పాటు సాగదీసి దిగిపోయే వేళ మళ్లీ ఓటర్లను ఆకట్టుకోవడానికి అరకొరగా హామీలు అమలు చేయడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి కూడా మాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో రెండే రెండు పేజీలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే సీఎం కార్యాలయంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మేనిఫెస్టో బోర్డులు ఏర్పాటు చేసి దానికి పవిత్రతను ఆపాదించారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలు చేశారు. ఐదేళ్లలో మొత్తమ్మీద 99 శాతం హామీలను నెరవేర్చారు. ఏపీ లో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. నాన్‌డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపితే నవరత్నాలు ద్వారా రూ.4.49 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని పేదలకు గత 58 నెలల్లో సీఎం జగన్ చేకూర్చారు. దీన్ని సద్వినియోగం చేసుకుని పేదరికం నుంచి గట్టెక్కుతున్నారు. ఏపీలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. విప్లవాత్మక మార్పులు.. వికేంద్రీకరణతో సుపరిపాలన అందిస్తూనే విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేసి ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. విద్యాకానుక కింద పాఠశాలలు ప్రారంభమైన రోజే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్‌లు, బ్యాగ్, యూనిఫామ్‌లు, బూట్లు విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు మధ్యాహ్నం పౌష్టికాహారాన్ని అందిస్తూ చిక్కీని కూడా అందచేస్తున్నారు. విద్యాదీవెన పథకం ద్వారా ఎంత ఫీజు ఉంటే అంతా రీయింబర్స్ చేస్తుండగా వసతి దీవెన కింద వసతి ఖర్చులు చెల్లిస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ శిక్షణ ఇచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉన్నతోద్యోగాలు పొందేలా దోహదం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉండగా గత 58 నెలల్లో ఏకంగా 2.13 లక్షల ఉద్యోగాలను సీఎం జగన్ భర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స పరిధిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు నాడు–నేడు కింద ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి చేర్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలను చేరువ చేశారు. తీర ప్రాంతాల్లో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్నారు. సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవ స్థీకరణ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. సీఎం జగన్ సుపరిపాలన, సంస్కరణలతో సాకారమైన మార్పులు ప్రతి చోటా కళ్లకు కట్టినట్లు కన్పిస్తుంది. ఆ మార్పులు కొనసాగుతూ ఏపీ ప్రగతిపథంలో దూసుకెళ్లేలా పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేలా మేనిఫెస్టోను సీఎం జగన్ రూపొందిస్తారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ‘సూపర్ సిక్స్’ను పట్టించుకోని ప్రజలు.. జనసేన, బీజేపీ పొత్తు కుదరక ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో గతేడాది మే 28న ప్రకటించిన మిని మేనిఫెస్టోను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జనసేన, బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు పదే పదే చెబుతున్నా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. చెప్పిన మాటపై చంద్రబాబు నిలబడడు.. మోసం చేస్తాడనే భావన ప్రజల్లో బలీయంగా నాటుకుపోవడమే అందుకు కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో రైతు రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని, అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీలు ఇస్తూ తన ఫోటోతోపాటు పవన్, ప్రధాని మోదీ ఫోటోలు ముద్రించిన లేఖపై చంద్రబాబు సంతకం చేసి టీడీపీ కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటికీ పంపారు. వాటితో కలిపి 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అందులో 10 శాతం కూడా అమలు చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి జట్టు కట్టగా సూపర్ సిక్స్ అంటూ మిని మేనిఫెస్టోపై చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ విశ్వసించడం లేదు. -
ఛూ మంతర్.. ఒక చంద్రబాబు.. వెయ్యి అబద్దాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 'హామీల అనుభవాలు' ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిచితమే. చంద్రబాబు మాట నీటి మూట. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నానుడి బాగా ఫేమస్. చంద్రబాబు మాటలనే కాదు.. ఆయనను కూడా ప్రజలు నమ్మడం లేదు. 'జయహో బీసీ' పేరుతో టీడీపీ - జనసేన సంయుక్తంగా సభ నిర్వహించాయి. 2014లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు 600లకు పైగా హామీలిచ్చారు. ఒక్క హామీనైనా 100 శాతం అమలు చేశారా..? అమలు చేస్తే చంద్రబాబు మేనిఫెస్టో దాచి పెట్టే పరిస్థితి, టీడీపీ అధికార వెబ్ సైట్ నుంచి తొలగించి పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పగలరా..? . "చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాది పూచి" అన్న పవన్ కల్యాణ్ ఏనాడైనా చంద్రబాబును ప్రశ్నించారా...? ఈ రోజున ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్నవే. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్‌లు సమాధానం చెప్పి బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తే బాగుండేది. "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు.. వారి తెలివి ఉండదని" కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు బడుగులకు న్యాయం చేస్తానని సభ నిర్వహిస్తే ప్రజలు నమ్ముతారా...? తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు వస్తే "మీ తోకలు కత్తిరిస్తా" అని వేలు చూపిస్తూ బెదిరించింది చంద్రబాబు కాదా..? "సార్ మేం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి" అని మత్స్యకారులంటే "ఏయ్.. నోరు మూసుకో తోలు తీస్తా" అని బెదిరించింది చంద్రబాబు కాదా...?. బీసీల పిల్లలు పెద్ద చదువులు చదవడానికి తోడ్పాటు ఇవ్వకుండా ఇస్త్రీ పెట్టెలు, మోకులు, కత్తెరులు ఇచ్చింది చంద్రబాబు కాదా..? ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకునే, తన అనుకూల మీడియాలో చెప్పించుకునే చంద్రబాబు ఇస్త్రీ పెట్టెలు, కత్తిరెలు ఇవ్వడం ఏంటనీ సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదివి, విమానాల్లో వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని బీసీ మేధావులు గుర్తు చేస్తున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో పరిస్థితి చూస్తే.. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడిని ఏనాడైనా నారా లోకేష్ గౌరవించాడా...?. టీడీపీ కీలక నిర్ణయాల్లో అచ్చెన్నాయుడి భాగస్వామ్యం ఉందా...? టీడీపీ వ్యూహాత్మక భేటీల్లో బీసీ నేత అయిన అచ్చెన్నాయుడి ఆలోచనలు పరిగణనలోకి తీసుకుంటున్నారా..? గుండె మీద చేయి వేసుకుని ఆత్మ సాక్షిగా అచ్చెన్నాయుడే ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలరా..? బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందని బాబు అంటున్నారు. బీసీల డీఎన్ఏలో టీడీపీ ఉంటే 23 సీట్లు ఇచ్చి మూలన ఎందుకు కూర్చోబెడతారు..? కుప్పం నియోజకవర్గంలో 30 వేలకే మీ మెజార్టీ ఎందుకు తగ్గిపోయింది..? బీసీల సీటు మంగళగిరిలో నారా లోకేష్ ఘోరంగా ఎందుకు ఓడిపోయారు..? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా..? అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4 వేలు చేస్తానని బాబు చెబుతున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో 40 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేవారు. బాబు హయాంలో నెలవారీ పింఛన్ బడ్జెట్ కేవలం రూ.400 కోట్లు. వైఎస్ జగన్ పాలనలో 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఈ జనవరి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్ రూ.3 వేలకు పెంచారు. సీఎం జగన్ పాలనలో నెలవారీ పింఛన్ బడ్జెట్ రూ.2 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. చంద్రబాబు రూ.4 వేల పింఛన్ కాదు రూ.5 వేలు ఇస్తానన్నా ఆయనను నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు హయాంలో పింఛన్ తీసుకోవాలంటే నడుచుకుంటూ వెళ్లాలి.. గంటలు కొద్దీ వెయిట్ చేయాలి..లైన్లో నుంచోలేక పండుటాకులు ప్రాణాలు వదిలిన సందర్భాలు అనేకం. కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫస్ట్ తేదీ వచ్చిందంటే చాలు వలంటీర్ వచ్చి చేతిలో పింఛన్ డబ్బులు పెట్టి వెళ్తున్నారు. ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారు. కళ్లతో చూస్తున్నారు. విచిత్రం ఏమంటే.. కర్ణాటక, తెలంగాణ మేనిఫెస్టోలు కాపీ కొట్టడమే కాదు.. చివరికు వైఎస్ఆర్ సీపీ నినాదాలు కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నారు. "బీసీలు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాసెస్" అని మొదట నినదించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చివరకు ఈ నినాదాన్ని కూడా బాబు బ్యాచ్ కాపీ కొట్టడంపై జనాలు నవ్వుకుంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీ ఏలూరులో బీసీ గర్జన సభ నిర్వహించింది. ఈ సభలో ఇచ్చిన హామీల కంటే 58 నెలల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగానే చేశారు. డీబీటీ - నాన్ డీబీటీ కింద వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రూ.1.71 లక్షల కోట్లు బీసీలకు లబ్ధి చేకూర్చింది. సంక్షేమ పథకాల్లో సింహభాగం బీసీ లబ్ధిదారులే. 2014లో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున ఏడాదికి రూ.50 వేల కోట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఐదేళ్లలో వాస్తవానికి ఆయన ఇచ్చింది కేవలం రూ.19 వేల కోట్లు. 2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోటయ్య కమిటీ వేసి కోతలు, వాతలు పెట్టారు. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు రూ.15 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేసి అన్నదాతలకు ఇచ్చిన మాట తప్పారు. అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు.. ఈ రుణాలు కూడా మాఫీ చేయకపోవడంతో ఆ రుణాలు వడ్డీలతో కలుపుకుని రూ.25 వేల కోట్లు అయ్యాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ ఆసరా పేరుతో చంద్రబాబు ఎగ్గొట్టిన డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నారు. డ్వాక్రా రుణాల చెల్లింపు సాధ్యం కాదని ఆనాటి మంత్రి పరిటాల సునీత ద్వారా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారు. అంటే.. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాటను అసెంబ్లీ సాక్షిగా తప్పారు చంద్రబాబు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా బీసీలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు విశ్వసనీయతలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ తేడానే 2024 ఎన్నికల్లో నిజమైన ఫలితాన్ని ప్రజల ముందుంచనుంది. - YV రెడ్డి -
వాగ్దానాల అమలే పాలనకు గీటురాయి
ఎన్నికల మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల సందర్భంగా ఇచ్చే అహేతుకమైన హామీల పత్రం కాదు. అలవికాని హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడానికి కొన్ని పార్టీలు తమ శక్తియుక్తులను ఉపయోగించడం కనిపిస్తుంది. అయితే ప్రజలు ఇటువంటి పార్టీలను గమనిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా బుద్ధి చెబుతారు. ఇందుకు మంచి ఉదాహరణ 2014లో తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన విధానాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టడమే. దీన్ని సద్వినియోగం చేసుకొని వైసీపీ 99 శాతం హామీలను నెరవేర్చి మరో విజయం వైపు దూసుకుపోతోంది. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు తాము ఏం చేస్తామో చెబుతూ ఒక రాజకీయ పార్టీ తన సిద్ధాంతాలు, ఉద్దేశాలు, విధానాలను ప్రతిబింబిస్తూ ఇచ్చే హామీ పత్రమే ఎన్నికల మేనిఫెస్టో. దీని ఆధారంగా, తమ అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, ఏ పార్టీ మేనిఫెస్టో ఉందో ప్రజలు నిర్ణయించుకొని ఓటువేయడానికి వీలవుతుంది. అందువల్ల, రాజకీయ పార్టీ హామీలు స్పష్టంగా ఉండాలి. అమలులో ఎలాంటి అస్పష్టతకు ఆస్కారం ఇవ్వకూడదు. భారత ఎన్నికల సంఘం 2013 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, రాజకీయ పార్టీలకు ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ కింద మార్గదర్శకాలను రూపొందించడానికీ, వారు చేసిన వాగ్దానాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన విషయాలపై చర్చించడానికీ, రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ వాటిపై స్పష్టత రాలేదని చెప్పాలి. చట్ట ప్రకారం, ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు అవినీతి అక్రమాల కిందకు రావని అందరికి తెలిసిన విషయమే. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పార్టీల మధ్య సమాన పోటీ స్థాయిని నిర్ధారించ డానికీ, ఎన్నికల స్వచ్ఛతనూ, ప్రజలకు చేసిన వాగ్దానాలనూ కాపా డటం కోసం మాత్రమేనని నిర్ధారించడమైనది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం సర్వసాధారణం. అమెరికాలో, ఇది ఆర్థిక, విదేశీ విధానాలు, ఆరోగ్య సంరక్షణ, పాలనా సంస్కరణలు, పర్యావరణ సమస్యలు, వలసలు వంటివాటిపై వారు చేయబోయే పనులను తెలియచేస్తుంది. అనేక పశ్చిమ ఐరోపా దేశాలలో, మేనిఫెస్టోలు మరింత నిర్దిష్ట విధాన ఎంపికలు, బడ్జెట్ చిక్కులను ప్రస్తావిస్తాయి. 2022లో ఆర్జేడీ ఎంపీ మనోజ్ కె. ఝా రాజ్యసభలో మాట్లా డుతూ, ఎన్నికల మేనిఫెస్టోకు చట్టబద్ధత కల్పించాలని, ఎన్నికల తర్వాత, రాజకీయ పార్టీలు తాము చేసిన వాగ్దానాలను మరచిపోయి ఆడంబరమైన వాదనలు చేయకుండా చట్టం ఉండాలని చెప్పిన విష యాలను గుర్తు చేసుకోవడం సముచితం. మేనిఫెస్టో ఔచిత్యం తగ్గు తోందని వారు ఆవేదన పడుతూ, 1952, 1957, 1962 ఎన్నికలప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోలను ఉటంకించారు. పార్టీలు చేయదగిన అంశాలను మాత్రమే ఆ యా మేనిఫెస్టోల్లో చేర్చేవారని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోను, ‘దశ–దిశ చూపించే ఒక పవిత్ర పత్రం’గా అభివర్ణించారు ఆ పార్టీవారు. దీనిలో ‘కష్టాలలో ఉన్న రైతులను రుణ మాఫీతో ఆదుకొంటాం’ అని చెప్పారు. రుణమాఫీ గురించి ఇంతకు మించి వివరణ మేనిఫెస్టోలో కనపడదు. అనగా ఏ తారీఖు వరకున్న రుణాలు, ఎంత మేరకు మాఫీ చేస్తారనే విషయం ఎక్కడా లేదు. ఈ విషయమై ఆ పార్టీ అధ్యక్షులు బహిరంగ సభలలో చెప్పిన వాగ్దానాలు మేనిఫెస్టోలో లేవు. గెలిచిన తర్వాత ఈ వాగ్దానం అమలును ‘మమ’ అనిపించడానికి పార్టీ పెద్దలు చాలా శ్రమించారు. ప్రొఫెసర్ కె.వి. రమణారెడ్డి, ఇదే పత్రికలోనూ, డెక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రికలోనూ తెలుగుదేశం పార్టీ ఈ విషయమై రైతులను ఏవిధంగా మభ్య పెట్టిందో తన పరిశోధన ద్వారా విశదంగా వివరించారు. ‘వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రూ 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతువారి ఇన్సూరెన్స్’ వంటి హామీలనూ ఇదే మేనిఫెస్టోలో పెట్టారు. కానీ గెలిచాక, వీటి ఊసే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ‘రైతుభరోసా కేంద్రా’లను ఏర్పాటు చేసి, రైతుకు కావలసినవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంచడంతో బాటు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం, ధరల స్థిరీకరణ నిధి ద్వారా గిట్టుబాటు ధర అందించడం, పంటనష్ట నివారణకు ఇన్సూరెన్స్ అమలుచేసి రైతుకు అండగా నిలవడం వంటి నిర్మాణాత్మక పనులు చేసింది. తెలుగుదేశంవారు ‘మహిళా సాధికారత కోసం డ్వాక్రా రుణాల రద్దుతో బాటు, వారి అభివృద్ధికి, భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణ యించారు.’ కాని, వాస్తవానికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలలో ఏమి జరిగిందో మహిళలకు తెలుసు. ౖవైసీపీ ప్రభుత్వం వచ్చినాక, డ్వాక్రా రుణాలను వడ్డీతో బాటు మాఫీ గావించారు. ఇలా ఎన్నికల వాగ్దానాలను పార్టీలు మరచిపోతే, ప్రజలు మరచిపోతారు లేదా క్షమిస్తారనుకోవడం పెద్ద పొరబాటు. తెలుగు దేశం తన పార్టీ మేనిఫెస్టోలో, ‘రానున్న అయిదేళ్ళలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం/ ఉపాధి అవకాశం కల్పిస్తా’మని మాటిచ్చింది. కానీ దాని గురించి ఏమీ పట్టనట్లు ఐదేళ్లు గడిపేసింది. యువత 2019లో జరిగిన ఎన్నికల్లో, ఎలా గుణపాఠం చెప్పారో అందరికీ తెలిసిందే. ‘గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి గ్రామానికీ తారు రోడ్డు, ప్రతి వీధికి సిమెంటు రోడ్డు, ప్రతి ఇంటికి ఉచితంగా మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చుట’ వంటి హామీలూ తెలుగుదేశం ఇచ్చింది. అయిదేళ్లు ప్రభు త్వంలో ఉండి, ఎన్ని ఇండ్లు కట్టించారో, మిగతా హామీలు ఏమిచేశారో తెలిసిన విషయమే. ఈ విషయమై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులు, కట్టిస్తున్న కాలనీల గురించి, పచ్చ పత్రికలకు కనబడక పోయినా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉంది. అలాగే పేద పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామనీ, హెల్త్ కార్డ్ ద్వారా అన్నిరకాల వ్యాధులకు కార్పొరేట్, ప్రభుత్వ ఆసు పత్రులలో ఉచిత వైద్యం అందిస్తామనీ మాటిచ్చి గెలిచాక టీడీపీ అమలు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం పదహారు ప్రభుత్వ ఆసు పత్రులను నిర్మించడంతో బాటు డాక్టర్ల నియామకాలు గావించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్రం సైతం కొనియాడింది. ఈ మధ్యకాలంలో ప్రారంభించిన ఇంటింటికి వెళ్లి వైద్యపరీక్ష చేయడంతో పాటు ఇతర సేవలందించడం వంటి కార్య క్రమం ఇండియాలోనే ఆరోగ్యరంగంలో ఒక విప్లవం లాంటిది. పేద లకు చదువే ఒక స్థిరమైన ఆస్తిగా గుర్తించి ‘నాడు–నేడు’ ద్వారా చదు వులో తీసుకొచ్చిన సంస్క రణలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. తెలుగుదేశం 2012లో ప్రకటించిన బీసి డిక్లరేషన్ ప్రకారం 100 శాసనసభ స్థానాలు వారికి కేటాయించడం, వారికి ప్రత్యేక బడ్జెట్, బీసీ సబ్–ప్లాన్ పెట్టి అమలు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రక టించారు. గెలిచాక ఇవన్నీ మూలబడ్డాయి. బీసీలకు ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న అనేక సేవలు గుర్తుకు వస్తే, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్నదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగుదేశం తన మేనిఫెస్టోలో, ‘ప్రతి ఒక్క హామీనీ, పథకాన్నీ, చిత్తశుద్ధితో అమలు చేస్తాం, ఆచరణలో ఆదర్శంగా నిలుస్తాం’ అని చెప్పింది. కానీ ఏ ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేక పోయింది. కానీ వైసీపీ నాయకత్వం 2019లో ప్రకటించిన మేని ఫెస్టోను ప్రజలకిచ్చిన ‘బాండు పేపరు’గా పరిగణించి నూటికి 99 శాతం అమలుచేసి... చిక్కుముడులు విప్పి, ఆ ఒక్కశాతం కూడా అమ లుకు ప్రయత్నిస్తామని ప్రజలకు చెబుతోంది. సహజంగా అటువంటి నాయకులను ప్రజలు ఆదరిస్తారు, చిరకాలం గుర్తుపెట్టుకొంటారు. ఎన్నికైన ప్రభుత్వానికి వారిచ్చిన మేనిఫెస్టో కీలకంగా ఉండాలి. వాస్తవిక ఎన్నికల మేనిఫెస్టో కోసం, రాజకీయాలను మరింత జవాబు దారీగా, పారదర్శకంగా చేయడానికి ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ అఫ్ కండక్ట్‌కు పదును పెట్టి ప్రజలికిచ్చిన హామీలను కనీసం మూడు వంతులైనా పాటించేట్లుగా నిబంధనలు పెట్టాలి. లేని పక్షంలో, ప్రజల కిచ్చిన మాట తప్పినట్లుగా పరిగణించి తగిన శిక్ష విధించాలి. అలా కానిచో పార్టీల మధ్య సమాన పోటీ స్థాయి ఉండదు. ఓటర్ల నమ్మ కాన్ని వమ్ము చేసినట్లవుతుంది. డా‘‘ పి. పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త హైదరాబాద్‌లోని ‘సెస్’(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సీనియర్ పరిశోధకుడు ‘ prudhvikar@cess.ac.in -
TS: ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు చూశారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేశాయి. పోటాపోటీ అంకెలతో.. అంతకు మించి అన్నివర్గాలను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో హామీలను ప్రకటించాయవి. ప్రధాన మూడు పార్టీల మేనిఫెస్టోలను విడుదల వారీగా చూస్తే.. తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థుల ప్రకటనలోనే కాదు.. మేనిఫెస్టోను కూడా ముందుగానే ప్రకటించింది. రైతు బంధు, పెన్షన్ పెంపులను దశలవారీగా అందించడం ప్రధానంగా.. అలాగే మిగతా హామీలను స్వయంగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు.. రైతుబీమా తరహాలో పేదలకు కేసీఆర్ బీమా పథకం తెల్లరేషన్‌కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం అందిస్తాం పెన్షన్లను ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంచుతాం దివ్యాంగుల పెన్షన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు పెంపు రాష్ట్రంలో మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి అర్హులైనవారికి రూ.400కే గ్యాస్ సిలిండర్లు అర్హులైన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంపు రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఎత్తివేస్తాం అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తాం కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15 లక్షల బీమా పథకం జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు. అక్టోబర్ 15వ తేదీనాడు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. ‘గత మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం. సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశాం’’ 👉: బీఆర్ఎస్ మేనిఫెస్టో పూర్తి కాపీ కాంగ్రెస్ మేనిఫెస్టో.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ఆరు గ్యారెంటీల అమలును ప్రకటించింది. ఆపై అధికారిక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా నవంబర్ 17వ తేదీన గాంధీభవన్‌లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తెలంగాణ ఎన్నికల కోసం అభయ హస్తం పేరిట మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీల హామీలను రంగరించి.. 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి.. మొత్తం 42 పేజీలతో అభయ హస్తం తెచ్చింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇవే.. 1. మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సాయం రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ మహిళలకు రాష్ట్ర మంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయ్రాణం 2. రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం. రైతుకూలీలకు, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం. వరి పంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు రూ 500 బోనస్ అందజేత 3. గృహ జ్యోతి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా 4. ఇందిరమ్మ ఇళ్లు ఇల్లు లేని ప్రతి కుటుంబానికీ ఇంటిస్థలం. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం అందజేత. 5. యువవికాసం విద్యార్థులకు విద్య భరోసా కార్డు అందజేత. రూ.5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీ రహిత ఆర్థిక సహాయక కార్డు అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు, స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయ కల్పన. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. 6. చేయూత ప్రతి నెలా రూ.4 వేల చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు అభయ హస్తం రిలీజ్ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ‘‘తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్.. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారు... పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారు వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుపాను రాబోతోంది మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి’’ . 👉: కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తి కాపీ ----------- బీజేపీ మేనిఫెస్టో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత మంత్రి అమిత్ షా నవంబర్ 18న సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్ కత్రియా టవర్స్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 10 అంశాలు కలిగిన... సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు... 1. ప్రజలందరికీ సుపరిపాలన - సమర్థవంతమైన పాలన - అవినీతిని ఉక్కుపాదంతో అణచివేయడం - ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో సుపరిపాలన - బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించి పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపు - ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థను తీసుకు వస్తాం - కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు - తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు 2. వెనుకబడిన వర్గాల సాధికారత - అందరికీ సమానంగా చట్టం వర్తింపు 3. కూడు, గుడు - ఆహార భద్రత, నివాసం 4. రైతే రాజు - అన్నదాతలకు అందలం. విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్పుట్ అసిస్టెన్స్ 5. నారీ శక్తి - మహిళల నేతృత్వంలో అభివృద్ధి. మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పోరేషన్. మహిళలకు 10 లక్షల వరకు ఉద్యోగాలు 6. యువ శక్తి - యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1, గ్రూప్ 2 నిర్వహణ. ఈడబ్ల్యుఎస్ కోటాతో సహా అన్ని నియామకాలు ఆరు నెలల్లో పూర్తి. 7. విద్యాశ్రీ - నాణ్యమైన విద్య. మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు అన్ని ప్రయివేటు స్కూళ్ళలో ఫీజుల విధానంపై పర్యవేక్షణ. 8. వైద్యశ్రీ - నాణ్యమైన వైద్య సంరక్షణ. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రయివేటు ఆసుపత్రిల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం. జిల్లాస్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రోత్సాహం. 9. సమ్మిళిత అభివృద్ధి - పరిశ్రమలు, మౌలికవసతులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రీయింబర్సుమెంట్స్. 10. వారసత్వం - సంస్కృతి, చరిత్ర. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినం. జాతీయస్థాయిలో సమ్మక్క - సారక్క జాతర ఉత్సవాలు. వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర. ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు. బైరాన్ పల్లి, పరకాల ఊచకోతలను స్మరించుకుంటూ అగస్ట్ 27న రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేయడం ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం అమిత్ షా మాట్లాడుతూ.. సకల జనుల సౌభాగ్య పేరుతో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు బాగా అమలవుతాయన్నారు. గతంలో వాజ్‌పేయి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాలకు మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేటాయించామన్నారు. 👉: బీజేపీ మేనిఫెస్టో పూర్తి కాపీ -
నావంతు చేశా.. ఇక మీదే బాధ్యత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో పేదలతోపాటు అన్ని వర్గాలను కాపాడుకునేందుకు తన వంతు పనిచేశానని.. ఇప్పుడు ప్రజలే పోరాటం చేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. గత పదేళ్లలో చోటుచేసుకున్న మార్పును గుర్తించి, ఆలోచించాలని సూచించారు. ఎన్నికల కోసం బహురూపుల వేషాలతో వచ్చే వాళ్లను నమ్మి ఆగమైతే వైకుంఠపాళిలో పాములా మింగేస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కోతలు, వలసల బతుకులే మిగులుతాయని.. రైతులు గోసపడతారని పేర్కొన్నారు. తాము ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వబోమని, సాధ్యాసాధ్యాలపై ఆలోచించి క్రమపద్ధతిలో అమలు చేసేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. పూటకో పార్టీ మార్చుతూ, డబ్బు మదం, అహంకారంతో వచ్చేవారిని ఓడించాలని పిలుపునిచ్చారు. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని అచ్చంపేట, వనపర్తి, నల్లగొండ జిల్లా మునుగోడులలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘24 ఏళ్ల కింద తెలంగాణ కోసం బయలుదేరిన.. నాడు ఎవడూ లేడు. పక్షిలా ఒక్కడినే తిరిగా. అదే ఇప్పుడు లేసినోడు, లేవనోడు అంతా వచ్చి కేసీఆర్ నీకు దమ్ముందా? అంటున్నారు. కొడంగల్ వస్తవా, గాంధీ బొమ్మకాడికి వస్తవా అంటున్నరు. ఇదేనా రాజకీయం? ఎన్నికలు వస్తయ్, పోతాయ్. కానీ ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగుపడతాయి. తెలంగాణకు ముందు ఈ సన్నాసులు ఎక్కడున్నరో, ఎవరి బూట్లు తుడిచారో చెప్పాలి. పదేళ్ల కింద పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడెలా ఉందో ప్రజలే గమనించాలి. కేసీఆర్ దమ్మేంటో దేశమంతా చూసింది ఎన్నికలు వస్తున్నాయని అంతా వస్తరు. ఉపన్యాసాలు ఇస్తరు. దేశంలో ఏ సీఎం, పీఎం కూడా మన దాంట్లో పది శాతం కూడా లేరు. కేసీఆర్ దమ్మేంటో ఇండియా చూసింది. నవంబర్ 30న దుమ్ము రేగాలి. నల్లమలలోని అప్పర్ ప్లాటు అమ్రాబాద్‌కు నీళ్లిచ్చే బాధ్యత నాది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 192 కేసులు వేసి అడ్డంపడ్డది కాంగ్రెస్ వాళ్లే. 1969 ఉద్యమంలో 400 మందిని పిట్టల్లా కాల్చింది, లక్ష మందిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. 2004లో మన పొత్తుతో గెలిచి 2014 దాకా పదేళ్లు ఏడిపించారు. వాళ్లు ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదు. తప్పనిసరై ఇచ్చారు. వాళ్లకు కావాల్సింది తెలంగాణ బాగోగులు కాదు, ఇక్కడి ప్రజలపై పెత్తనం కావాలి. పైరవీకారుల పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పైరవీకారుల పార్టీ. వాళ్లకు పాత దళారీలు కావాలి. రైతు బంధుకు సంవత్సరానికి రూ.15 వేల కోట్లు ఇస్తుంటే వాళ్లకు కడుపు మంటగా ఉంది. అందులో రెండు వేల కోట్లయినా తినొద్దా అని ఆలోచిస్తున్నారు. ఆ దుర్మార్గులను రానిస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. రైతు బంధు రాంరాం అవుతుంది. దళితబంధు జైభీం అయిపోతది. కరెంటు కాట గలుస్తది. మళ్లీ మొదటికే వస్తది. కర్ణాటకలో 20 గంటలు కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. 5 గంటలు కూడా ఇవ్వలేకపోతోంది. రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ నుంచి రేవంత్‌రెడ్డి దాకా అందరూ ధరణిని తీసేస్తాం అంటున్నరు. దీన్ని తమాషాగా తీసుకోవద్దు. రైతుకు అధికారం ఇస్తామంటోంది బీఆర్ఎస్ పార్టీ అయితే.. లాక్కుంటామంటోంది కాంగ్రెస్ పార్టీ.. మీకు ఏ పార్టీ కావాలి? ఇప్పటిదాకా నావంతు పనిచేశా.. ఇప్పుడు మీదే బాధ్యత. నష్టపోయేది ప్రజలే.. దళితబంధుతో దళితుల బతుకులు బాగుపడుతున్నాయి. మమ్మల్ని గెలిపించకపోతే వ్యక్తిగతంగా పోయేదేం ఉండదు. రెస్ట్ తీసుకుంటాం. కానీ నష్టపోయేది ప్రజలే. తెలంగాణ తెచ్చినవాడిగా చెప్తున్నా. రాష్ట్రం బాగుండాలంటే ఎవరు ఉండాలో ఆలోచించాలి. మేం ఎన్నికల కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పడం లేదు. రూ.70, వంద అంటూ అర్థంపర్థం లేకుండా ఇచ్చిన పెన్షన్‌ను బీఆర్ఎస్ వచ్చాక రూ.వెయ్యికి, తర్వాత రూ.2 వేలకు పెంచుకున్నాం. మళ్లీ గెలవగానే రూ.మూడు వేలలకు పెంచి.. తర్వాత దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాం. రాష్ట్రంలోని 93 కోట్ల రేషన్‌కార్డు దారులకు రైతు బీమా తరహాలో బీమా సౌకర్యం కల్పిస్తాం. రేషన్‌పై సన్నబియ్యం ఇస్తాం. అన్నింటినీ బేరీజు వేసుకొని ఆలోచన చేయాలి’’అని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా.. అచ్చంపేట, వనపర్తి సభల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ , నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్.. మునుగోడు సభలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పల్లె రవికుమార్, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా.. నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం పరిధిలో జరిగిన అచ్చంపేట, వనపర్తి సభల్లో స్థానిక ఎంపీ పి.రాములు పాల్గొనలేదు. దీనితోపాటు వనపర్తి సభలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి కూడా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. 119 నియోజకవర్గాల అభ్యర్థులంతా కేసీఆర్లే.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ కేసీఆర్లే. లేచినోడు, లేవలేనోడూ నాపై పోటీ చేస్తామంటూ బీరాలు పలకటం ఏమిటి? మా పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి కేసీఆర్‌తో సమానులే. డబ్బు మదంతో వచ్చేవారిని ఓడించాలి ‘‘నల్లగొండ, మునుగోడు రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతాలు. మీ చైతన్యం మూగబోవద్దు. పైసలు పట్టుకొని వచ్చేవాళ్లను, పూటకోపార్టీ మార్చేవాళ్లను నమ్మొద్దు. వాళ్లకో నియమం లేదు. సిద్ధాంతం, నిబద్ధత లేవు. నిన్నొక పార్టీ, ఇవాళ ఒక పార్టీ, రేపు ఇంకో పార్టీ. డబ్బు మదం, అహంకారంతో ప్రజలను కొనగలుతాం అనుకుంటున్నారు. అలాంటి వారికి నల్లగొండ, మునుగోడు చైతన్యం చూపించి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. అప్పుడే రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90శాతం నెరవేర్చాం. చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం. 100 పడకల ఆస్పత్రి పనులు జరుగుతున్నాయి. మిగతా అభివృద్ధి పనులన్నీ పూర్తి కాబోతున్నాయి. అంతకుముందు కాంగ్రెస్ 50–60 ఏళ్లు పాలించినా ఫ్లోరైడ్‌తో ప్రజలు నడుములు వంగి, చనిపోయే వరకు చూశారే తప్ప నివారణ చేయలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే ఫ్లోరైడ్ గోస పోయింది. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే డిండి ప్రాజెక్టుకు, శివన్నగూడెంకు నీళ్లు వస్తాయి. ఆ బాధ్యత నాది. ఏడాదిన్నరలో మునుగోడు నియోజకవర్గంలోనే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. తొలి నుంచీ ఉద్యమాల్లో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మునుగోడులో గెలిపించాలి. -
‘కేసీఆర్ భరోసా’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 17 అంశాలతో ‘కేసీఆర్ భరోసా’పేరిట జనంలోకి వెళ్లనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తెలిపారు. కేసీఆర్ భరోసా పేరిట మేనిఫెస్టోను పార్టీ శ్రేణులు గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 11 పర్యాయాలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఆగం చేశారని, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గద్దల పాలు చేయొద్దని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో పురోగమిస్తున్న రాష్ట్రాన్ని దగుల్బాజీ, దొంగల పార్టీ అయిన కాంగ్రెస్ చేతిలో పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎప్పుడో ప్రజలకు దూరమైంది కాంగ్రెస్ పార్టీని ఎవరూ సొంతం చేసుకోరని, ఆ పార్టీ ఎప్పుడో ప్రజలకు దూరమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలను పదే పదే మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమని, ‘అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట’అనే రీతిలో కాంగ్రెస్ హామీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమయ్యిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో సాగు, తాగునీరు సమస్యలతో పాటు విద్యుత్ కష్టాలు తీరాయని చెప్పారు. తెలంగాణ పార్టీగా బీఆర్ఎస్ కులమతాలకు అతీతంగా ప్రతి మనిషి, ప్రతి ఇంటి పార్టీగా మారిందని అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ‘మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా’ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.16 వేలు, రైతు బీమా, దివ్యాంగులు, ఆసరా పింఛన్ పెంపు, అన్నపూర్ణ ద్వారా సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు రూ.3 వేలు జీవన భృతి, అసైన్డ్ భూములపై హక్కులు, జాబ్ క్యాలెండర్, రూ.400కే గ్యాస్ సిలిండర్ వంటి అంశాలను కేసీఆర్ భరోసా పేరిట ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ చెప్పారు. పదవులు కాదు.. గుర్తింపును ఇవ్వండి త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో గతంలో కేసీఆర్ వెంట నడిచామని, కొన్ని రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరినా అక్కడ ఇమడలేక పోయామని పెద్దపల్లి నేత సి.సత్యనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ చిత్తశుద్ధి చూసి మళ్లీ బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. తమకు పదవుల కంటే గుర్తింపు ముఖ్యమని అన్నారు. పెద్దపల్లి నేత గుర్రాల మల్లేశం, మహబూబ్‌నగర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్ సింగ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేసిన కేసీఆర్
Updates.. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల ► తెల్లరేషన్కార్డుదార్లుకు త్వరలో కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా ► రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా ► కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి ►జూన్ నుంచి కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తాం ►తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్‌కార్డుదారుడికి సన్న బియ్యం అందజేస్తాం ►ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఇచ్చే హామీలన్నింటిని అమలు పరుస్తాం ►తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ ►సామాజిక పెన్షన్లు రూ.5వేల వరుకూ పెంచుతాం ►దశవారిగా పెన్షన్లు పెంచుతాం ►పెన్షన్లు ఏడాదికి రూ.500 పెంచుతూ వెళతాం ►ఏపీ సీఎం జగన్ పాలనపై సీఎం కేసీఆర్ ప్రశంసలు ►ఏపీలో పెన్షన్ స్కీం చాలా విజయవంతంగా జరుగుతోంది ►వికలాంగుల పెన్షన్ రూ.6వేల వరుకూ పెంచుతాం ►వికలాంగుల పెన్షన్ మార్చి తర్వాత రూ.5 వేలు ►రైతు బంధు రూ.16 వేల వరుకూ పెంచుతాం ►అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ►సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి ►అర్హులైన లబ్ధిదారులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంచుతాం ►జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షల వరుకూ పెంచుతాం ►కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో హెల్త్ స్కీమ్ ►జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీమ్ ►హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ►అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం ►మహిళా స్వశక్తి గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు ►అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ ►ఓపీఎస్ డిమాండ్‌పై కమిటీ నియామకం.. కమిటీ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం ► మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం ► మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం ► రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం ► సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది ► తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది ► గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశాం: కేసీఆర్ ► అభ్యర్థులకు బీఫామ్ అందించిన సీఎం కేసీఆర్. మంత్రి ప్రశాంత్ రెడ్డి తరఫున బీఫామ్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత. ప్రశాంత్ రెడ్డి మాతృ వియోగం కారణంగా కార్యక్రమానికి గైహర్హారు. ► సీఎం కేసీఆర్ తరఫున బీఫామ్ అందుకున్న గంప గోవర్ధన్. కామారెడ్డి నుంచి అసెంబ్లీ బరిలో సీఎం కేసీఆర్. ►నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల అభ్యర్థులకు బీఫామ్స్ అందజేత. మిగిలిన వారికి రేపు బీఫామ్స్ అందించనున్నారు. ►తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడవద్దు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింది. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో అభ్యర్థి మార్పు జరిగింది. ప్రతీ కార్యకర్తలో నేతలు మాట్లాడాలి. ►మనల్ని గెలవలేక కుయుక్తులు పన్నుతున్నారు. సాంకేతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనబెట్టాలి. ప్రతీది తెలుసుకునే పయత్నం చేయాలి తప్ప.. మాకు తెలుసు అనుకోవద్దు. అంతా మాకే తెలుసు అనుకోవద్దు. ఎన్నికల ఘట్టంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ►అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్. భరత్ కుమార్‌కు అన్ని విషయాలు చెప్పాలి. ఎలాంటి సమస్యలున్నా ఆయనను సంప్రదించాలి. భరత్ కుమార్ ఎన్నికల కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో అభ్యర్థికి రెండు బీఫామ్స్ ఇస్తాం. ఈరోజు, రేపు అభ్యర్థులకు బీఫామ్ అందజేస్తాం. పొరపాట్లు జరగకుండా అభ్యర్థులు చూసుకోవాలి. నేడు 51 మందికి బీఫామ్ అందిస్తాం. అన్ని బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలేదు. మిగతా వారికి బీఫామ్స్ రెడీ అవుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులదే. ►కొంతమంది చిలిపి పనులు, చిల్లర పనుల వల్లే చాలా దెబ్బతిన్నారు. అలాంటి వ్యక్తులను చాలా మందిని చూశాను. ఎన్నికల సందర్బంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. వారితో మర్యాదపూర్వకంగా ఉండాలి. ముందుకు సాగాలి. జూపల్లి కృష్ణారావుకు కేసీఆర్ కౌంటర్. ►శ్రీనివాస్ గౌడ్ , గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి తోం పాటు కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారు. అందుకే జాగ్రత్తలు పాటించండి. చివరి రోజు వరకు సమయం ఉందని లైట్ తీసుకోవద్దు. చివరిరోజే అందరూ నామినేషన్ వేయాలని ఇబ్బంది పడకండి. ►ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్ ►తెలంగాణ భవన్లో 277 మంది కూర్చనే విధంగా ఏర్పాట్లు. ►పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ నేతలతో ఉమ్మడిగా సమావేశం కానున్న కేసీఆర్ ►పార్టీ మేనిఫెస్టోను సవవిరంగా వివరించనున్న కేసీఆర్ ►లంచ్ తర్వాత కూడా కొనసాగనున్న భేటీ. ►సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో సభకు కేసీఆర్ ►బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి. ►తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ ►తెలంగాణ తల్లికి నివాళులర్పించిన కేసీఆర్ ►అభ్యర్థులకు బీఫామ్స్ అందించునున్న కేసీఆర్ ►తెలంగాణ భవన్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్ ►కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, మహమూద్ అలీ. ►కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం. ►తెలంగాణ భవన్ చేరుకున్న మంత్రి కేటీఆర్. ►అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. తాజాగా నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ►నేడు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ తొలి ఎన్నికల సభ. ►హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్. ►సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న సభ. ►గతంలో హుస్నాబాద్ నుంచే బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం. ►రాజధానికి ఈశాన్యంగా ఉండటంతో సెంటిమెంట్ కలిసొచ్చిందని భావన. -
Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం
సాక్షి, అమరావతి: ఎన్నికల తీరం దాటగానే తెప్ప తగలేసినట్లుగా ఏకంగా మేనిఫెస్టోలనే మాయం చేసిన చరిత్ర కొందరిదైతే.. ప్రజాభీష్టాన్నే పరమావధిగా భావిస్తూ ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. అధికారం చేపట్టిన రెండేళ్లలోనే దాదాపుగా హామీలన్నీ అమలు చేయడంతోపాటు అదనంగా మరో 40 అంశాలను కూడా అమలు చేస్తూ ప్రోగ్రెస్ రిపోర్టుతో సవినయంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న ఖ్యాతి ఈ ప్రభుత్వానిదే. విశ్వసనీయతలో తేడా ఇదీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభ్వుతం రెండేళ్లలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం అమలు చేయడమే కాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ మరో 40 అంశాలను అదనంగా అమలు చేస్తూ మీరే మార్కులు వేయాలంటూ ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందుకు ధైర్యంగా పంపించింది. మేనిఫెస్టోను భగవద్గీతలా, బైబిల్లా, ఖురాన్‌లా భావిస్తూ అందులో చెప్పిన వాటితో పాటు చెప్పనివి కూడా రెండేళ్ల కాలంలో అమలు చేసింది. గత సర్కారుకు, ఈ ప్రభుత్వానికి మధ్య విశ్వసనీయతలో తేడా ఇదే. గతంలో టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన మేనిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి కనిపించకుండా మాయం చేసింది. ఇందుకు పూర్తి భిన్నంగా> వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పాం..? రెండేళ్ల పాలనలో ఏం చేశాం? చెప్పని అంశాలు ఏవి అమలు చేశాం? అనే వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను ప్రతి ఇంటికీ వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తోంది. వైఎస్సార్ మినహా... ఎన్నికల ముందు మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గతంలో ఏ ప్రభుత్వాలూ (వైఎస్సార్ మినహా) సక్రమంగా అమలు చేయలేదు. ముఖ్యమంత్రి జగన్ ప్రజల కష్టాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలో లేనప్పటికీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని పలు అంశాలను అమలు చేశారు. మేనిఫెస్టోలో లేదు కదా.. మనకెందుకులే అనే ధోరణితో కాకుండా ప్రజల అవసరాలు తీర్చడానికే ప్రాధాన్యం ఇచ్చారు. రైతులు, అవ్వా తాతలు, విద్యార్థులు, రోగులు, లెప్రసీ బాధితులు... ఇలా పలు వర్గాల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా చెప్పకపోయినా సరే అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. మేనిఫెస్టోలో లేకున్నా అమలు చేస్తున్న వాటిల్లో కొన్ని.. ► రైతు భరోసా డబ్బులను ఎనిమిది నెలలు ముందుగానే అది కూడా చెప్పిన దాని కన్నా మిన్నగా ముఖ్యమంత్రి జగన్ అందచేశారు. ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 బదులుగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అదనంగా అందుతోంది. నాలుగేళ్లలో 50 వేల రూపాయలకు బదులు ఐదేళ్లలో రూ.67,500 చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. ► ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు – 2019 ద్వారా దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం మొదలైంది. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వారి మర్యాదకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కేసులను నాన్చకుండా 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్షపడేలా దిశ బిల్లుకు రూపకల్పన చేశారు. జిల్లాల్లో దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళల భద్రతకు పెద్ద పీట వేశారు. ► ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్ధులందరికీ స్కూళ్లు తెరిచేనాటికి జగనన్న విద్యా కానుక కింద కిట్ అందుతోంది. ఇందులో మూడు జతల యూనిఫారాల క్లాత్, నోట్‌బుక్స్, షూ, బ్యాగు, డిక్షనరీ, మొదలైనవి ఉంటాయి. ఇందుకు రూ.648 కోట్ల వ్యయం చేస్తూ 47 లక్షల మందికి ప్రయోజనం కలిగిస్తున్నారు. ► రూ.2,497 కోట్లతో 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామాల్లోనే రైతన్నలకు అన్ని సేవలు అందచేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వీటిల్లో విక్రయిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోళ్లు కూడా చేపట్టారు. విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకు రైతులకు చేదోడుగా ఆర్బీకేలు నిలుస్తున్నాయి. ► పొలాల్లోనే పంటల కొనుగోళ్లు. ► వ్యవసాయ మిషన్ ఏర్పాటు. ► నియోజకవర్గ స్థాయిలో రూ.50 కోట్ల వ్యయంతో 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు. ► గతంలో గిట్టుబాటు ధర లేని మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస గిట్టుబాటు ధరలను ప్రకటించారు. ► పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు. ► శనగ రైతులను ఆదుకునేందుకు రూ.300 కోట్లు విడుదల ► ఆయిల్ పామ్ రైతులకు మద్దతు ధర కల్పనకు రూ.80 కోట్లు కేటాయింపు. దీని ద్వారా 1.10 లక్షల మందికి లబ్ధి చేకూర్చారు. ► రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రూ.110 కోట్లతో పొగాకు కొనుగోలు. ► రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాలు వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్పు. చిన్నారుల కోసం ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులు, వినూత్న విధానంలో విద్యా బోధన. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధన, వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు. ► 36.88 లక్షల మంది విద్యార్ధులకు బలవర్థకమైన, రుచికరమైన భోజనం కోసం జగనన్న గోరు ముద్ద కార్యక్రమానికి రూ.1,600 కోట్లు వ్యయం. ► ఆరోగ్యశ్రీ పరిధిలోకి క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు. కరోనా, బ్లాక్ ఫంగస్‌కు పథకం పరిధిలో ఉచితంగా చికిత్స. ► కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లల జీవనోపాధి, చదువుల కోసం రూ.10 లక్షలు చొప్పున డిపాజిట్. ప్రతి నెలా దానిపై వచ్చే వడ్డీతో కనీస ఆర్ధిక అవసరాలు తీర్చేలా తక్షణమే చర్యలు. ► లెప్రసీ బాధితులకు రూ.3,000 చొప్పున పింఛన్. డయాలసిస్, తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్, ఎనీమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10,000 చొప్పున పింఛన్. పక్షవాతం, తీవ్ర కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5,000 పెన్షన్. ► వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి రూ.112.85 కోట్లు వ్యయం. అవ్వాతాతలు, చిన్నారులకు ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు. ► ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పుడున్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా మరో 16 వైద్య కళాశాలలు కొత్తగా ఏర్పాటు. తద్వారా వైద్య రంగం బలోపేతం. ► 108, 104 అంబులెన్సులు కొత్తగా 1,180 కొనుగోలు. 108 (డైవర్) వేతనం రూ.13 వేల నుంచి రూ.28 వేలకు పెంపు. ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వేతనం రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంపు. 104 వాహన ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ల వేతనం రూ.17,500 నుంచి రూ.28 వేలకు పెంపు. డ్రైవర్ వేతనం రూ.15 వేల నుంచి రూ.26 వేలకు పెంపు. ► ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకంగా రూ.905 కోట్లు. ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రూ.188 కోట్లు మాఫీ. ► స్పందన – ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన సమస్య గురించైనా ఆర్జీ పంపవచ్చు. ► అమ్మ ఒడి ఇంటర్ వరకూ వర్తింపు. 9 – 12 తరగతుల విద్యార్ధులకు సొమ్ము లేదా ల్యాప్‌టాప్ తీసుకునే వెసులుబాటు. ► రేషన్, ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన.. ఇలా ప్రతి పథకానికి ఆదాయ పరిమితి భారీగా పెంపు. తద్వారా లక్షల మందికి ప్రయోజనం. ► బోధన ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంపు ► డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ ప్రారంభం. 14410 టోల్ ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే ఫోన్లోనే వైద్య సేవలు, ఇంటి వద్దకే మందులు. ► మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.12,000 నుంచి రూ.18,000కి పెంపు. ► అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు ► 9,260 వాహనాలతో ఇంటికే రేషన్ బియ్యం సరఫరా ► రిజిస్ట్రేషన్ వ్యవస్థలో అవినీతి నిర్మూలనలో భాగంగా విప్లవాత్మక మార్పులు. డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండా క్రయవిక్రయదారులే అన్లైన్లో డాక్యుమెంట్లు రూపకల్పన చేసుకునేలా వెసులుబాటు. ► ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో 500 రకాల మందులు అందుబాటులోకి. ► రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా సుమారు రూ.5,070.43 కోట్లు ఆదా. రూ.100 కోట్లు దాటిన ప్రతి పని జ్యుడీషియల్ ప్రివ్యూకు. ► నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. ► వైద్య సేవల బలోపేతంలో భాగంగా వైఎస్సార్ విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్స్. ► జీఎస్పీసీ (ఓఎన్జీసీ) తవ్వకాల కారణంగా జీవనోపాధి కోల్పోయిన 16,559 మంది మత్స్యకారులకు కేంద్రం నుంచి నిధులు రానప్పటికీ రూ.788.24 కోట్ల నష్ట పరిహారం చెల్లింపు. ► ప్రజా సమస్యలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ 1902 ► వ్యవసాయ అవసరాలపై టోల్ ఫ్రీ నంబర్ 1907 ► అనినీతి నిరోధించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 14400 -
‘రెండేళ్లు గడవక ముందే.. ఆ ఘనత ఆయనదే..’
సాక్షి, శ్రీకాకుళం: అధికారం చేపట్టి రెండేళ్లు కూడా గడవక ముందే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 92 శాతం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. (చదవండి: స్పీకర్ తమ్మినేనికి తప్పిన ప్రమాదం) ‘‘రూ.3,000 కోట్ల వ్యయంతో 8 ఫిషింగ్ హార్బర్లు, రూ. 225 కోట్ల వ్యయంతో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక ఆక్వా హబ్ నిర్మాణం, మొదటి విడతగా నాలుగు ఫిషింగ్ హార్బర్ లు, 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి కూడా వాటికి శంకుస్థాపన చేశారని’’ ఆయన చెప్పారు. (చదవండి: ‘సీఎం జగన్‌కు మత్స్యకారులు రుణపడి ఉంటారు’) శ్రీకాకుళం జిల్లాలో ఉన్న విశాలమైన 193 కిలోమీటర్ల సముద్ర తీరానికి కూడా అన్ని రకాలుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగానే భావనపాడు పోర్టు నిర్మాణం, మూడు మూడు చోట్ల జట్టీ ల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కృష్ణదాస్ తెలిపారు. -
గుండెల నిండా జనం అజెండా
సాక్షి, అమరావతి: ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను ఓ భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ అందులో చెప్పిన వాటితో పాటు ప్రజల అవసరాలను బట్టి చెప్పనివి కూడా ఏడాది కాలంలో చేసింది. ఏడాది పాలనలో నెరవేర్చిన, చేసిన అంశాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టుతో పాటు మేనిఫెస్టోను కూడా ధైర్యంగా ప్రజల వద్దకు పంపిస్తోంది. గత ప్రభుత్వ విశ్వసనీయతకు, ఇప్పటి ప్రభుత్వ విశ్వసనీయతకు మధ్య ఉన్న తేడా ఇదే. గత ప్రభుత్వం 2014 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన మేనిఫెస్టోను గత ఎన్నికల సమయంలో ఏకంగా పార్టీ వెబ్సైట్ నుంచి కనిపించకుండా మాయం చేసిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలో ఏమి చెప్పాం.. ఏడాది పాలనలో ఏమి చేశాం.. అనే వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తోంది. ఇప్పటికే 78,54,563 బుక్లెట్లను వలంటీర్లు ఇంటింటా పంపిణీ చేశారు. మిగతా బుక్లెట్ల పంపిణీని నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. మేనిఫెస్టోను ప్రజల దగ్గరకే పంపించి ఏడాది పాలనలో ఏమేం చేశాం.. ఏమి చేయలేదో ప్రజలనే చెప్పాల్సిందిగా కోరతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ మాట మేరకు ఏడాది పాలనలో ఏమి చేశారో చెప్పడంతో పాటు 2020–21 ఆర్థిక సంవత్సర సంక్షేమ క్యాలెండర్‌ను, మేనిఫెస్టోను ప్రజల దగ్గరకే పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘గుండెల నిండా జనం అజెండా’ శీర్షికతో కూడిన బుక్‌లెట్‌లో తొలియేడు – జగనన్న తోడు వివరాలను పేర్కొన్నారు. మొత్తం 129 హామీల్లో ఇప్పటికే 78 హామీలు అమలు చేయగా, మరో 35 హామీలు అమలుకు సిద్ధంగా ఉన్నాయి. 16 హామీలు అమలు కావాల్సి ఉంది. ఈ లెక్కన 90 శాతం హామీలు నెరవేర్చారు. ఇవి కాక అదనంగా చేసినవి 40 అంశాలు. ఏడాది పాలనలో నవరత్నాల ద్వారా 3.98 కోట్ల మందికి రూ.41,718 కోట్ల మేర సాయం అందించినట్లు బుక్‌లెట్‌లో స్పష్టం చేశారు. ఇంటింటికీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్‌లోని సంక్షేమ క్యాలెండర్ అదనంగా చేసిన 40 అంశాల్లో ముఖ్యమైనవి ఇలా.. – ముందు చెప్పిన దాని కన్నా మిన్నగా ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా సొమ్ము ఎనిమిది నెలలు ముందుగా.. ఏటా రూ.12,500 బదులుగా రూ.13,500 పెట్టుబడి సాయం. నాలుగేళ్లలో 50 వేలకు బదులు రూ.67,500 లబ్ధి. – ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు–2019 దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. మహిళల మర్యాదకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కేసులను నాన్చకుండా 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్షపడేలా బిల్లుకు రూపకల్పన. – ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్ధులందరికీ స్కూళ్లు తెరిచేనాటికి జగనన్న విద్యా కానుక కింద కిట్. ఇందులో మూడు జతల యూనిఫాం క్లాత్, నోట్‌బుక్స్, షూ, సాక్స్, బ్యాగు మొదలైనవి ఉంటాయి. ఇందుకు రూ.650 కోట్ల వ్యయం. 39.70 లక్షల మందికి లబ్ది. – రూ.2,497 కోట్లతో 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఈ కేంద్రాల్లో విక్రయించే దిశగా చర్యలు. – శనగ రైతులను ఆదుకునేందుకు రూ.300 కోట్లు విడుదల. అయిల్ పాం రైతులకు మద్దతు ధర కల్పనకు రూ.80 కోట్లు కేటాయింపు. దీని ద్వారా 1.10 లక్షల మందికి లబ్ధి. – పొలాల్లోనే పంట కొనుగోళ్లు. – రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2,200 కోట్లకు పైగా ఆదా.. రూ.100 కోట్లు దాటిన ప్రతి పని జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపి ఆమోదించిన తర్వాతే టెండర్లకు పిలుపు. తద్వారా టెండర్లలో పూర్తి పారదర్శకత. – నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. – ఇసుక ఇంటికే డోర్ డెలివరీ. ఈ మేరకు కొత్త ఇసుక పాలసీ ఖరారు. 1.52 కోట్ల టన్నుల ఇసుక ఉత్పత్తి. ఖజానాకు రూ.468 కోట్లు ఆదాయం. – రేషన్, ఆరోగ్య శ్రీ, విద్యా దీవెన ఇలా ప్రతి పథకానికి ఆదాయ పరిమితి భారీగా పెంపు. తద్వారా లక్షల మందికి ప్రయోజనం. ప్రతి సంక్షేమ పథకానికి ప్రత్యేక కార్డుల జారీ. – 36,34,861 మంది విద్యార్ధులకు మంచి రుచికరమైన భోజనం కోసం జగనన్న గోరుముద్ద కార్యక్రమానికి అదనంగా రూ.465 కోట్లు ఖర్చు. – వ్యవసాయ మిషన్ ఏర్పాటు. – నియోజకవర్గ స్థాయిలో రూ.53.30 కోట్ల వ్యయంతో 46 చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు. – గతంలో గిట్టుబాటు ధర లేని మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస గిట్టుబాటు ధరల ప్రకటన. – పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు. – ‘అమ్మ ఒడి’ పథకం ఇంటర్ వరకూ వర్తింపు. – వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి రూ.53.85 కోట్లు వ్యయం. – కొత్తగా 108, 104 అంబులెన్స్‌లు 1088 కొనుగోలు. – ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పుడున్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా మరో 16 కాలేజీల ఏర్పాటు. – పారిశుద్ధ్య కార్మికుల వేతనం ఆసుపత్రుల్లో రూ.16 వేలకు, మున్సిపాలిటీల్లో రూ.18 వేలకు పెంపు. – 108, 104 డ్రైవర్లు, టెక్నిషియన్ల వేతనాలు పెంపు. – ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టాండర్డ్స్‌తో 500 రకాల మందులు. – బోధకాలు, పక్షవాతం, ప్రమాదాల కారణంగా వీల్‌చైర్ లేదా మంచానికే పరిమితమైన వారికి ప్రతి నెలా రూ.5,000 ఆర్థిక సాయం. – క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి. లెప్రసీ రోగులకు ప్రతి నెలా రూ.3000 – డాక్టర్ వైఎస్సార్ టెలి మెడిసిన్ ప్రారంభం. 14410 టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్ట్ కాల్ ఇస్తే ఫోన్లోనే వైద్య సేవలు. ఇంటి వద్దకే మందులు. – ఎమ్ఎస్ఎంఈలకు ప్రోత్సాహకంగా రూ.963 కోట్లు.. ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు రూ.188 కోట్లు మాఫీ. పేదల ఆర్థిక స్థితిగతులు మార్చిన నవరత్నాలు – రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన అర్హులకు ఎటువంటి వివక్ష లేకుండా ప్రభుత్వం నవరత్నాల ఆర్థిక ఫలాలను అందించింది. ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్రంలోని 4.82 కోట్ల లబ్ధిదారులకు రూ.59,425 కోట్ల నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. – నవరత్నాల లబ్ధికి ఏకైక ప్రమాణికం అర్హతే. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడలేదు. దీంతో అన్ని కులాలకు చెందిన అఖరుకు అగ్ర వర్ణాల్లోని పేదలకు కూడా నవరత్నాల ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. – ఈ ప్రయోజనం కూడా పైసా లంచం లేకుండా, పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే చేరడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. – ఈ ఏడాది మార్చి నుంచి కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినప్పటికీ చెప్పిన మాట ప్రకారం నవరత్నాల ద్వారా ఆర్థిక ఫలాలను లబ్ధిదారులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. – ఈ పథకాలన్నీ పేద వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చి.. మెరుగైన జీవనానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. జగన్ పాలన నభూతో నభవిష్యత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు పట్టిన ఏడాదిలోనే వైఎస్ జగన్ ఎవరూ వూహించని రీతిలో ప్రజల ముంగిటకే సుపరిపాలన అందించిన ఘనత పొందారు. వైస్సార్సీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 129 హామీల్లో ఇప్పటికే 90.80 శాతం అమలు చేసి 3.98 కోట్ల మందికి లబ్ధి కలిగించడం అంటే మాటలు కాదు. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని సృష్టించింది. ఎన్నో విషయాల్లో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతోంది. కలయా నిజమా అనే చందంగా రాష్ట్రంలో అందుతున్న జన రంజక పాలన నభూతో నభవిష్యత్. – ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి, పూర్వ ఉప కులపతి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం. -
ప్రగతి పరుగులు.. సంక్షేమ ఫలాలు
మూడు రంగాలూ ప్రగతిపథంలో.. ఆంధ్రప్రదేశ్ 2019–20లో మూడు రంగాల్లోనూ ప్రగతిపథంలో సాగింది. వ్యవసాయ, పరిశ్రమలు, సేవా రంగాల్లో పురోభివృద్ధి సాధించింది. ఈ మూడు రంగాల్లో అంచనాలకు మించి సాధించిన జీఎస్డీపీ వివరాలు ఇలా... సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవశకానికి తెర లేచింది. అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమన పథంలో ఉరకలెత్తుతోంది. జాతీయ వృద్ధిరేటు కంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం విశేషం. అభివృద్ధి, సంక్షేమ ప్రమాణాల్లో దేశ సగటు కంటే రాష్ట్రం మెరుగ్గా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘2019–20 ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే’ నివేదిక ఈ వాస్తవాలను గణాంకాలతో సహా వెల్లడించింది. ప్రజలు తనపై నమ్మకం ఉంచి.. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమలుకు నవరత్నాల పథకాలతో శ్రీకారం చుట్టారు. దీంతో అటు పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలు.. ఇటు వినూత్న రీతిలో అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రగతి రథం జోరుగా పరుగెడుతోంది. 2019–20 ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 8.16% వృద్ధి ► రాష్ట్రం 8.16% వృద్ధి సాధించింది. జాతీయ వృద్ధి కంటే ఇది 3.16 శాతం అధికం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2019–20లో మన రాష్ట్రం ‘స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి’ (జీఎస్డీపీ) 8.16% సాధించింది. దేశ వృద్ధి రేటు 5 శాతం ఉంది. ► ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.9,72,782 కోట్ల స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) సాధించింది. 2018–19లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.8,62,957 కోట్లు మాత్రమే. ఈ లెక్కన రూ.1.10 లక్షల కోట్లు అధికంగా జీఎస్డీపీ సాధించడం విశేషం. పండగలా వ్యవసాయం ► రాష్ట్రంలో వ్యవసాయం పండగగా మారింది. సకాలంలో వర్షాలు పడటం, ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా చూడటంతో వ్యవసాయానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ► అందువల్ల వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 18.96 శాతం, ఉద్యాన రంగంలో 11.67 శాతం, పశు సంపద రంగంలో 4.53 శాతం వృద్ధి సాధ్యమైంది. ► రాష్ట్రంలో పరిశ్రమల రంగం 5.67 శాతం వృద్ధి సాధించింది. సేవా రంగం 9.11 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రజల చెంతకు ప్రగతి ఫలాలు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఫలాలు ప్రజలకు చేరుతున్నాయి. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటం విశేషం. ► 2019–20లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,69,519గా నమోదైంది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,432 మాత్రమే. 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,51,173 మాత్రమే. 2018–19తో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 12.14 శాతం పెరిగింది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నవరత్నాల పథకాలను అమలు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధిలో నవ శకానికి తెరలేచింది. వికసిస్తున్న విద్యా రంగం ► రాష్ట్రంలో 67.35 శాతం అక్షరాస్యత నమోదైంది. ఈ శాతాన్ని పెంచి భావి పౌరులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వం ఉద్యుక్తమైంది.‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద పిల్లలను చదివించే ప్రతి పేద తల్లి బ్యాంకు ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తోంది. 2019–20లో రాష్ట్రంలో 42.33 లక్షల మంది పేద అమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.6,336.45 కోట్లు జమ చేసింది. ► విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 35.99 లక్షల మంది విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తోంది. ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గాయి. ► ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని రాణించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ► ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద రాష్ట్రంలో 15,715 పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. ► ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇతరత్రా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13.26 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీ విద్యార్థుల కాలేజీ ఫీజుల కింద రూ.3,329.49 కోట్లు చెల్లించింది. ► ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద విద్యార్థుల హాస్టల్, వసతి ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. అందుకోసం రాష్ట్రంలో 8.08 లక్షల మంది అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీ విద్యార్థులకు రూ.2,087 కోట్లు చెల్లించింది. ► ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని అమలు చేస్తోంది. రూ.1,105 కోట్లు ఖర్చు చేసింది. 2019–20లో రూ.1,105 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో 36 లక్షల మందికి ప్రయోజనాన్ని కలిగించింది. సామాజిక పింఛన్లతో ఆర్థిక భద్రత ► అర్హులందరికీ సామాజిక పింఛన్లతో ప్రభుత్వం పేదలకు ఆర్థిక భద్రతనిస్తోంది. 2019–20లో వృద్ధాప్య, వితంతు, కల్లు గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్ఐవీ బాధితుల పింఛన్లను రూ.2,250కు పెంచారు. దివ్యాంగులకు రూ.3 వేలు, డయాలసిస్ చేయించుకునే కిడ్నీ బాధితులకు రూ.10 వేలిస్తున్నారు. ► పింఛన్ పొందేందుకు అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. 2020 జనవరిలో కొత్తగా 6.14 లక్షల పింఛన్లు ఇచ్చారు. ప్రతి నెలా రాష్ట్రంలో 54.68 లక్షల మంది పింఛన్‌దారులకు రూ.1,320.76 కోట్లు పింఛన్లుగా పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం 2019–20లో రూ.15,635 కోట్లు కేటాయించారు. 2020–21లో రూ.18 వేల కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఆరోగ్యానికి భరోసా ► రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వైద్య, ఆరోగ్య మౌలిక వసతులను అభివృద్ధి పరుస్తుండటంతోపాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ► చైల్డ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం కింద రాష్ట్రంలో 93 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేదలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా పొందుతున్నారు. ► రాష్ట్రంలో రూ.5లక్షలలోపు ఆదాయం ఉన్న 144 లక్షల కుటుంబాలు లబ్ధిదారులుగా ఉన్నారు. 2019–20లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2.70 లక్షల మంది ప్రయోజనం పొందారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద రాష్ట్రంలో 1,529 నెట్వర్క్ ఆసుపత్రుల్లో 1,259 రోగాలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్రం వెలుపల హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు కూడా విస్తరించారు. ఆ మూడు నగరాల్లోని 130 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 716 రకాల రోగాలను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. ► ఆపరేషన్ అనంతరం రోగి కోలుకునే వరకు కూడా ప్రభుత్వం ప్రత్యేక అలవెన్స్ ఇస్తోంది. రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది. 2019–20లో రాష్ట్రంలో 1.05 లక్షల మంది రోగులకు రూ.73 కోట్లు అలవెన్స్‌గా చెల్లించింది. ► రాష్ట్రంలో అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని 2019–20లో ప్రారంభించారు. దీని కింద 60,406 పాఠశాలలను కవర్ చేశారు. ఇప్పటికి 66 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 4.35 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు. 1.52 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. 46,287 మందికి తదుపరి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. దశలవారీగా మద్య నియంత్రణ దిశగా.. ► రాష్ట్రంలో దశల వారీగా మద్య నియంత్రణకు ప్రభుత్వం ఉద్యుక్తమైంది. ఇందులో భాగంగా 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించింది. 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. మద్యం విక్రయ సమయాన్ని తగ్గించి, ధరలను పెంచింది. పేద మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ ► పేద మహిళల సంక్షేమం కోసం ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 2020–21 నుంచి నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ.75 వేలు ఆర్థిక సహాయం చేయనుంది. వైఎస్సార్ ఆసరా ► 2019 ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణ బకాయిలను చెల్లించేందుకు నాలుగు దశల్లో ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020–21 నుంచి నాలుగేళ్లపాటు అమలు చేయనుంది. గ్రామ స్వరాజ్యం పరిపాలనను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నెలకొల్పింది. రాష్ట్రంలో 2,61, 216 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలను అందిస్తోంది. పౌరుల సమస్యల పరిష్కారానికి ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 72 గంటల్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తుండటం విశేషం. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట ► టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ‘జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్’ను ఏర్పాటు చేసింది. రూ.100 కోట్లు కంటే విలువైన కాంట్రాక్టుల బిడ్డింగ్ ప్రక్రియకు ముందుగా డాక్యుమెంట్లను ఈ కమిషన్ పరిశీలిస్తుంది. ► చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్ నవోదయం’ కార్యక్రమాన్ని చేపట్టింది. 2019 సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చింది. అందరికీ ఇళ్లు ► ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేయనుంది. ► ఒక్కో ఇంటికి రూ.7.50 లక్షల చొప్పున రాబోయే నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. 2020–21లో 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. పోర్టులు ► కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది. ఇక్కడి నుంచి విమాన సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తారు. ► మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్, రామాయపట్నంలలో కొత్తగా నాలుగు పోర్టులు నిర్మాణ ప్రక్రియను చేపట్టింది. ► రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తోంది. రూ.18,691.42 కోట్ల పెట్టుబడితో 215 ఐటీ కంపెనీలను తీసుకువచ్చేందుకు ఉద్యుక్తమైంది. తద్వారా రాష్ట్రంలో 1,10,343 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ► రూ.30,656.16 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 128 ఎలక్ట్రానిక్ పరిశ్రమలను నెలకొల్పనున్నారు. తద్వారా 1,07,864 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రాబోయే ఐదేళ్లలో ఈ పరిశ్రమలను నెలకొల్పనున్నారు. వడివడిగా జలయజ్ఞం ► రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం కార్యక్రమం కింద రాష్ట్రంలో 54 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో 14 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ► మరో రెండు ప్రాజెక్టుల రెండో దశను పూర్తి చేసింది. అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. రైతు సంక్షేమం ► రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 పెట్టుబడి సహాయం అందిస్తోంది. రాష్ట్రంలో నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రైతులు 46.69 లక్షల మంది ప్రయోజనం పొందారు. వారిలో 1.58 లక్షల మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 2019–20లో రైతుల ఖాతాల్లో రూ.6,534 కోట్లు జమ చేశారు. ► రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాకు గ్రామ సచివాలయాల్లో 10,614 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది. రైతుల ప్రయోజనం కోసం ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. 2019 ఖరీఫ్ సీజన్లో 21.53 లక్షల మంది రైతులు పంటల బీమా కింద పేర్లు నమోదు చేసుకున్నారు. వారి తరఫున ప్రభుత్వం రూ.12,70.01 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. ► రూ.లక్షలోపు వ్యవసాయ రుణం తీసుకుని చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాల పథకం అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు, మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తోంది. ► ఆయిల్‌పాం, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, మిర్చి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానం సాధించింది. మామిడి, బత్తాయి, పసుపు ఉత్పత్తిలో రెండో స్థానం దక్కించుకుంది. ► మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో చెల్లించే పరిహారాన్ని ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. అందుకోసం రూ.102.33 కోట్లు చెల్లించి రాష్ట్రంలో 1.02 లక్షల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలిగించింది. దశా దిశా మార్చే విధాన నిర్ణయాలు ► శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ► నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. ► నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించింది. 41 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ► మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ‘దిశా’ చట్టాన్ని చేసింది. ► ఏపీఎస్ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసింది. తద్వారా ఏపీఎస్ఆర్టీసీని పరిరక్షించడమే కాకుండా 51,488 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించింది. ► అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, హోంగార్డుల జీతాలను పెంచింది. అభివృద్ధి వికేంద్రీకరణ ► అభివృద్ధి ఫలాలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమానంగా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించేందుకు మూడు రాజధానుల ఏర్పాటును ప్రతిపాదించింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ శాసనసభలో బిల్లులను ప్రవేశ పెట్టింది. ► రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసింది. అందుకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పింది. ► సొంత ఆటో రిక్షాలు / ట్యాక్సీలు/ మ్యాక్సి క్యాబ్‌లు ఉన్న ఆటో కార్మికులకు ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది. తద్వారా రాష్ట్రంలో 2.62 లక్షల మందికి ప్రయోజనం కల్పించింది. ► పేద చేనేత కార్మికులకు సహాయం చేసేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. అర్హులైన లబ్ధిదారులకు ఏటా రూ.24 వేలు ఆర్థిక సహాయం చేస్తోంది. అందుకోసం రూ.196.27 కోట్లు పంపిణీ చేయడం ద్వారా 81,779 మందికి ప్రయోజనం కల్పించింది. -
పేదింటి అక్కలకు ‘చేయూత’
ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు పెన్షన్లు అంటే వెటకారం చేశారు. అందులో ఉన్న స్ఫూర్తిని అర్ధం చేసుకోలేక పోయారు. అయినా వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటూ ‘వైఎస్సార్ చేయూత’ తీసుకొస్తున్నాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కకు తోడుగా ఉంటాం. ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా చేస్తాం. ఏ కొందరికో అరకొరగా ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తెస్తాం. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కకు ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా రెండో సంవత్సరం నుంచి నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లిష్ట సమయంలోనూ మాట నిలబెట్టుకుంటూ మరో వాగ్దానాన్ని నెరవేర్చేందుకుసిద్ధమయ్యారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే పేదింటి అక్కలకు రెండో ఏడాది ఆరంభంలోనే ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందచేయనున్నారు. ‘వైఎస్సార్ చేయూత’ పథకం ద్వారా 45 – 60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు ఉచితంగా అందజేసే పథకం అమలుకు గురువారం మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24.19 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుందని అధికారులు అంచనా వేశారు. వచ్చే నాలుగేళ్లలో పథకం అమలుకు రూ.18,142.8 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు. బీసీ మహిళలు 15.26 లక్షల మంది..! వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందే మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందజేస్తారు. ఏడాదికి రూ.4,535.70 కోట్ల చొప్పున నాలుగేళ్లలో ఈ పథకం కోసం మొత్తం రూ.18,142.8 కోట్లు ఖర్చు చేయనున్నారు. – అధికారుల ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రంలో 45 – 60 ఏళ్ల మహిళల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 5.89 లక్షల మంది ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గంలో 1.63 లక్షల మంది మహిళలు, బీసీ సామాజిక వర్గంలో 15.26 లక్షల మంది మహిళలు, మైనార్టీ సామాజిక వర్గంలో 1.40 లక్షల మంది మహిళలు ఉన్నట్లు తేలింది. మహిళా సాధికారత దిశగా.. రాష్ట్రంలో మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత సాధించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వరుసగా వివిధ కార్యక్రమాలను చేపట్టి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. నిరుపేద పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు కరోనా విపత్కర పరిస్థితులలోనూ ఏప్రిల్ 24వతేదీన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలుకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా 43 లక్షల మంది తల్లులకు ‘అమ్మ ఒడి’ ద్వారా ప్రయోజనం చేకూర్చి పేదింటి పిల్లల చదువులకు భరోసా కల్పించారు. పెద్ద చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది పిల్లల తల్లులకు ‘వసతి దీవెన’ ద్వారా ఆర్థిక ఆసరా అందించారు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత చదువులు చదివే విద్యార్థుల ఫీజు రీయింబర్స్ డబ్బులను కూడా నేరుగా తల్లుల ఖాతాలకే జమ చేస్తామని ప్రకటించారు. నామినేషన్ పనులు, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ చట్టం తెచ్చారు. ఆడపిల్లలు చదువుకునేలా ప్రోత్సహించేందుకు మనబడి నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకంగా దిశ పోలీసు స్టేషన్లు, దిశ బిల్లు తెచ్చారు. ఇక వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8వతేదీన దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు వారి పేరుతోనే అందచేయనున్నారు. ఇలా పలు కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతలో దేశంలోనే ముందంజలో నిలిచింది. -
పాలకులం కాదు.. సేవకులం
అవినీతికి నో ఎవరు చెప్పినా సరే అవినీతి, దోపిడీకి నో చెప్పండి. ఇసుక మాఫియాకు, పేకాట క్లబ్బులకు నో చెప్పండి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేల వినతులపై సానుకూలంగా స్పందించండి వినతులపై రశీదులు... టైం బౌండ్ ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించండి. ప్రజలు ఇచ్చే వినతులకు రశీదులు ఇవ్వండి. వారి సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారో వాటిపై గడువు నిర్దేశించండి. ఓటేయని వారు వచ్చేసారి మనకు ఓటేయాలి ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ మనవారే. మనకు ఓటు వేయని వారిలో అర్హులకు కూడా ప్రభుత్వ పథకాలు అందించండి. మన ఎమ్మెల్యేలు చెప్పినా సరే వారికి పథకాలు నిరాకరించవద్దు. వారు కూడా మన పనితీరు నచ్చి వచ్చేసారి మన పార్టీకి ఓటేయాలి. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక నుంచే పర్యావరణ, నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన ‘ప్రజా వేదిక’లో ప్రభుత్వ యంత్రాంగం సమావేశాలు నిర్వహించడం ఏమిటి? చట్టాలను ప్రభుత్వమే బేఖాతరు చేస్తే ఎలా? అందుకే అక్రమ కట్టడాల కూల్చివేత ఈ ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభం కావాలి. కొత్తగా కట్టిన ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో పరికరాలు ఉన్నాయో లేవో చూడండి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లుగా ఎమ్మెల్యేలను నియమించండి. వర్షాకాలం వస్తోంది కాబట్టి జ్వరాలు వస్తాయి. వెంటనే చర్యలకు ఉపక్రమించండి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాలు రాకుండా చూసుకోండి. మన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములే. నేను పై స్థాయిలో పాలన మొదలు పెడితే కింది స్థాయిలో ప్రజలకు చేరవేసే బాధ్యత మీది. అందరం కలసికట్టుగా పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. నాకు ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే కలెక్టర్లు మరో కన్ను. ఇద్దరూ ఒక్కటైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు తీసుకువస్తారు. వాటిపై సానుకూలంగా స్పందించండి. ప్రజలకు హక్కుగా సేవలు అందించాలి. దాని కోసం ప్రజలు లంచాలు ఇవ్వకూడదు. ఆఫీసుల చెట్టూ చెప్పులు అరిగేలా తిరగకూడదు. మన పని తీరు చూసే ప్రజలు మనకు ఓటేస్తారు. మనం అంటే మీరు, నేనూ కలిపి. మన పనితీరు అంటే నా పనితీరు, మీ పనితీరు. ఇదే ప్రామాణికం కావాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. నవరత్నాల పథకాలు, మేనిఫెస్టోనే తమ ప్రభుత్వానికి జీవనాడి అని ఆయన స్పష్టం చేశారు. శాచ్యురేషన్ (సంతృప్తికర) విధానంలో అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అంది తీరాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో పార్టీలు, రాజకీయాలు చూడొద్దని, తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినాసరే వినొద్దని కలెక్టర్లకు తేల్చి చెప్పారు. అదే సమయంలో ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని పేదలు ఉండకూడదని లక్ష్యాన్ని నిర్దేశించారు. విద్య, వైద్య రంగాలు తనకు అత్యంత ప్రాధాన్యతాంశాలని, పిల్లలను బడికి పంపే తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ఆసుపత్రులలో వసతులను మెరుగుపరుస్తూ మాతా – శిశు మరణాలను అరికట్టాలని ఆదేశించారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం తీసుకువద్దామని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లతో సోమవారం రెండు రోజుల ప్రారంభ సదస్సులో వారినుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలను వారికి విశదీకరించారు. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో మెరుగైన పాలన కోసం చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికను ఇలా వివరించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం మన మేనిఫెస్టోను కేవలం రెండు పేజీల్లో క్లుప్తంగా ఇచ్చాం. నవరత్నాల పథకాలు, మేనిఫెస్టో కాపీలు ప్రతి కలెక్టర్, హెచ్‌వోడీ, సెక్రటరీ, మంత్రుల వద్ద ఉండాలి. మేనిఫెస్టోను అమలు చేస్తామని నమ్మి ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓటేశారు. అందరం కలసికట్టుగా పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా 175 మందిలో 151మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. 25కు గాను 22 మంది ఎంపీలను గెలిపించారు. 50 శాతానికిపైగా ప్రజలు మనకు ఓట్లేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత గొప్ప విజయం ఎప్పుడూ రాలేదు. ఈ మేనిఫెస్టోనే జీవనాడి. దీంట్లోని ప్రతి అంశాన్ని మనం పూర్తి చేయాలి. రేపటి ఎన్నికల్లో మళ్లీ మనం ఇదే మేనిఫెస్టో చూపించి అన్నీ చేశాం కాబట్టి మాకు ఓటేయండి.. అని చెప్పే పరిస్థితి ఉండాలి. అందుకు మీ సహకారం చాలా కీలకం. ఎమ్మెల్యేల వినతులపై స్పందించండి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని ప్రతి అధికారి గుర్తుంచుకోవాలి. 2 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఒకర్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. అదీ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనం. ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చినప్పుడు చిరునవ్వుతో స్వాగతించండి. ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడూ చిరునవ్వుతో పలకరించండి. ప్రజలకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు తీసుకువస్తారు. వాటిపై సానుకూలంగా స్పందించండి. అదే సమయంలో అక్రమాలుగానీ దోపిడీగానీ దోచుకోవడం గురించిగానీ ఎవరు చెప్పినా ఈ ప్రభుత్వం సమర్థించదు. ఎంతటి పెద్దవారైనా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఉండనీ ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. ఇవి కాకుండా మిగిలిన ఏ అంశంలో అయినా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకోండి. నాకు ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే మీరు మరో కన్ను. ఇద్దరూ ఒక్కటైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. పారదర్శకతలో దేశానికే ఆదర్శం కావాలి ప్రభుత్వ యంత్రాంగం నిజాయితీతో పని చేయాలి. గ్రామ స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడా అవినీతి ఉండకూడదు. చెడిపోయిన వ్యవస్థ మారాలి అని నేను ఎన్నికల్లో ప్రతి సభలో మాట్లాడాను. సీఎం నుంచి కలెక్టర్ వరకు, కలెక్టర్ నుంచి గ్రామ స్థాయి వరకు వ్యవస్థలో మార్పు రావాలి. దేశం మొత్తం మనవైపు చూసేలా మార్పు రావాలి. మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మనం నమూనాగా ఉండాలి. మన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులను సంతోషంగా ఉంచండి. లేకపోతే డెలివరీ నెట్వర్క్ సరిగా పని చేయదు. ప్రతి మూడో శుక్రవారం దిగువ స్థాయి ఉద్యోగులు, మనతో పని చేస్తున్న ఉద్యోగుల కోసం కేటాయించండి. కలెక్టర్లు సహా జిల్లాలోని ఐఏఎస్ అధికారులు వారంలో ఓ రోజు ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిద్రించండి. ఆకస్మిక పర్యటనలు చేయండి. అప్పుడే అక్కడ వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో తెలుస్తుంది. అక్కడ మరుగుదొడ్డి వాడుతున్నప్పుడు అవి సరిగా ఉన్నాయో లేదో మీకే తెలుస్తుంది. పిల్లలకు పుస్తకాలు సరిగా అందుతున్నాయో లేదో, ఉపాధ్యాయులు సరిగా బోధిస్తున్నారో లేదో తెలుస్తుంది. పొద్దున లేచాక అక్కడే స్నానం చేయండి. ఆ తర్వాత గ్రామ ప్రజలతో సమావేశం కండి. నవరత్నాలు ఎలా అమలవుతున్నాయో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. హాస్టళ్లు, ఆసుపత్రులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోండి. మీరు ఇప్పుడున్న పాఠశాలల ఫొటోలు తీయండి. రెండేళ్ల తరువాత వాటిని మారుస్తాం. అప్పుడు పాత ఫొటో, కొత్త ఫొటో రెండు ఫొటోగ్రాఫ్‌లు పోల్చి చూపించండి. విద్య, ఆరోగ్యం, రైతులు నా ప్రధాన అజెండా. మీరు ఆసుపత్రులు, హాస్టల్స్ విజిట్‌కు వెళ్లేటప్పుడు ప్రభుత్వంలోని ఇతర విభాగాల అధికారులను థర్డ్‌పార్టీగా కూడా తీసుకువెళ్లండి. దాంతో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. విశ్వసనీయత పెంచాలి కలెక్టర్ చెస్తామన్నారంటే కచ్చితంగా అది జరిగి తీరాలి. కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టొద్దు. విశ్వసనీయతకు ప్రాధాన్యమివ్వాలని పదే పదే చెబుతున్నా. ఒక పాలసీ తీసుకున్నాక తరతమ భేదం లేకుండా అందరికీ ఒకే విధానం ఉండాలి. నవరత్నాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలి. వాళ్లు మన పార్టీ అనో మరో పార్టీ అను చూడొద్దు. నాకు ఓటేశారో వేయలేదో అనేవి పట్టించుకోవద్దు. ప్రతి జిల్లాకు పోర్టల్‌ను తీసుకురండి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు పోర్టల్‌లో అన్ని వివరాలు ఉండాలి. జ్యుడిషియరీ, పోలీస్ ఎఫ్ఐఆర్.. ఇలా అన్నీ కూడా ఆ పోర్టల్‌లో పొందుపరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఆర్డర్ పోర్టల్‌లో ఉంటుంది. అలాగే జిల్లా పోర్టల్ కూడా ఉండాలి. ఇచ్చిన పని, దాని విలువ, కాంట్రాక్టర్, ప్రారంభించిన తేదీ, పూర్తి అయ్యే తేదీ.. ఇలా అన్ని వివరాలు పోర్టల్‌లో తెలియజేయాలి. అప్పుడే మనం పారదర్శకంగా ఉన్నామనే సందేశం కింది స్థాయికి వెళ్తుంది. ప్రభుత్వ భూములు ఆడిట్ చేయండి. దాంతో ఎంత భూమి అందుబాటులో ఉండేదీ, దాన్ని ఎలా వాడుకోవాలన్నది తెలుస్తుంది. గ్రామ వలంటీర్ల వ్యవస్థలో అవినీతికి నో ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు తీసుకు రావడానికి శాచ్యురేషన్ విధానాన్ని తెస్తున్నాం. ఇందు కోసం గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాలను తీసుకువస్తున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను తీసుకు వస్తున్నాం. ప్రతి 2 వేల మంది నివాసం ఉన్న చోట గ్రామ సెక్రటేరియట్ తెస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పథకాన్ని డోర్ డెలివరీ చేస్తాం. గ్రామ వలంటీర్ వ్యవస్థలో ఎక్కడా అవినీతి ఉండకూడదు. వివక్ష చూపకూడదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామ వలంటీర్ ప్రభుత్వ పథకాలు అందించాలి. అవినీతి చేయకూడదనే గ్రామ వలంటీర్‌కు రూ.5 వేలు జీతం ఇస్తున్నాం. గ్రామ వలంటీర్లు పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎవ్వరు చెప్పినా సరే చర్యలు ఆగవు. నేరుగా సీఎం కార్యాలయంలోనే కాల్ సెంటర్ పెట్టాం. పేదల ఆత్మగౌరవం పెంపొందించాలి కలెక్టర్లు కచ్చితంగా విస్మరించకూడని వర్గాలు పేద ప్రజలు. అట్టడుగున ఉన్న పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతుల స్థితిగతులు విస్మరించకూడదు. ఈ వర్గాల ఆత్మగౌరవం పెరగాలి. అణగారిన వర్గాలు ఆర్థికంగా నిలబడాలి. మనం వేసే ప్రతి అడుగూ వారికి దగ్గర కావాలి. ఇందుకోసమే మనం నవరత్నాల పథకాలు ప్రకటించాం. నవరత్నాలు అమలు చేసినప్పుడు మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు ఇవేవీ చూడొద్దని స్పష్టం చేస్తున్నా. ఉగాదికి ఇంటి స్థలం లేనివారు ఉండకూడదు వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేనివారు ఎవరూ ఉండకూడదు. ఇళ్ల స్థలాలు అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్ చేస్తాం. ప్రతి గ్రామంలో ఎంత మందికి ఇళ్ల స్థలాలు లేవు.. ఎంత మందికి ఇవ్వాలి.. అనేది గుర్తించండి. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయండి. నేను చాలా చోట్ల గమనించాను.. నాకు ఇక్కడ ఇచ్చారు అని చెబుతున్నారు కానీ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో తెలీదని చెబుతున్నారు. పట్టా ఉంటుంది కానీ ప్లాట్లు కనిపించవు. సీఆర్డీయే పరిధిలో రైతులకు పట్టాలు ఇచ్చారు కానీ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఉగాది రోజున రాష్ట్రంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పెద్ద పండుగలా జరగాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలి. ఎలుకలు కొరకడం, టార్చ్ లైట్లో ఆపరేషన్లు చేయడం వంటివి ఉండకూడదు. నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు వెంటనే తీర్చేయాలి. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.450 కోట్లు ఉన్నాయి. తొమ్మిది నెలలుగా ఇవ్వడం లేదు. ఆ బకాయిలు వెంటనే చెల్లించండి. మాతా – శిశు మరణాలు నివారించాలి. ఆసుపత్రుల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నా సరే వెంటనే భర్తీ చేయాలి. కలెక్టర్లు వెంటనే వాటిపై నివేదిక తయారు చేసి పంపాలి. కుష్టు వ్యాధి మళ్లీ కనిపిస్తోంది. నేను పాదయాత్రలో ఓ చోట చూశాను. కుష్టు వ్యాధి నివారణపై దృష్టిపెట్టాలి. మందులు, చికిత్స తదితర అంశాలపై సీరియస్‌గా దృష్టి పెట్టండి. అవసరమైతే వారికి పింఛన్ ఇవ్వండి. ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి నిత్యావసరాలను ప్రజలకు పౌర సరఫరాల శాఖ నుంచే ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్న బియ్యం నాణ్యత బాగో లేదు. అందుకే గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన బియ్యాన్ని తిరిగి డీలర్‌కే అమ్మేసిన పరిస్థితి చూశాం. తిరిగి అవే బియ్యం పాలిష్ చేసి మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితీ చూశాం. ప్రజలు వినియోగించేవాటినే మనం ఇవ్వాలి. ఒక వైపు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ మరోవైపు ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి కోట్లను ఎన్నికల స్కీంలకు మళ్లించింది. ఆ రూ.వెయ్యి కోట్లను రైతులకు చెల్లించాలి. ప్రభుత్వం అంటే గౌరవం పెంచాలి చంద్రగిరి ఎస్వీవీ నర్సింగ్ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయని నాకు ఒక లెటర్ వచ్చింది. నాలుగేళ్ల కోర్సుకు ఇద్దరే ఫ్యాకల్టీ ఉన్నారట. భవనాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలేనట. సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని ఎవరైనా చూశారా? అక్రమం ఏదైనా జరిగితే.. దాన్ని కూల్చేయండి. ప్రభుత్వం అంటే పారదర్శకతకు ప్రతిరూపమని చెప్పండి. చట్టం, న్యాయం, రాజ్యాంగాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 23 మంది ఎమ్మెల్యేలను తప్పు అని తెలిసినా కొన్నారు. అనర్హత వేటు వేయాలని చెప్పినా ఆ పని చేయలేదు. అందులో నలుగురిని మంత్రులను చేశారు. ఇదే ఐఏఎస్‌ల మీద అధికారం చలాయించాలని వారికి అధికారం ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇలాంటి మీరు ఎన్నికలను నిష్పక్షపాతంగా ఎలా నిర్వహిస్తారు? కౌన్సిలర్లను ఎత్తుకుపోతారు. కట్టడిచేయాల్సిన మీరు పైస్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలా ఉంటే ఎలా కట్టడి చేయగలరు? మనం కచ్చితంగా మారాలి. ప్రభుత్వం అంటే గౌరవం పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే అభిమానం పెరగాలి. మీదైన ముద్ర వేయండి లబ్ధిదారుల జాబితా పంచాయతీ స్థాయిలో తయారు కావాలి. దీని వల్ల పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది. వలంటీర్లు మీకు కళ్లు, చెవులుగా ఉంటారు. మనం మార్పు తీసుకురావాలి. దీనికి తపన ఉండాలి. మీదైన ముద్ర ఉండాలి. జిల్లా నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు ప్రజలు మీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. మేనిఫెస్టోపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. నాకు సన్నిహితులైన కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చించాను. ఇవి చేయగలిగితే మనం మార్పులు సాధించగలం అని సూచించారు. నా తండ్రి మాదిరిగా చనిపోయిన తర్వాత కూడా నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలని నేను తాపత్రయపడుతున్నా. అలాగే మీ గురించి ప్రజలు మాట్లాడుకోవాలి. నేను మీకు కొన్ని సలహాలు ఇస్తాను. మీరు మీకున్న పరిజ్ఞానంతో వాటికి మెరుగులు దిద్దొచ్చు. గ్రామ సచివాలయాలు అయ్యాక రచ్చబండ గ్రామ సచివాలయాలు వచ్చాక నేను కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాను. నేనూ నా స్థాయిలో కొన్ని రశీదులను ర్యాండమ్‌గా చెక్ చేస్తాను. మీ స్థాయిలో మీరూ కొన్ని రశీదులను ర్యాండమ్‌గా చెక్ చేయండి. నెలకోసారి కచ్చితంగా ర్యాండమ్ చెక్ చేయండి. దాంతో ఆ పని కచ్చితంగా చేయాలి అనే పరిస్థితి వస్తుంది. రశీదులు ఇచ్చి పట్టించుకోలేదనే పరిస్థితి రాకూడదు. అవినీతి అంతానికే ప్రక్షాళన నా 3,648 కి.మీ. పాదయాత్రలో గ్రామాల్లో ఏం జరుగుతోందో విన్నాను. నా కళ్లతో చూశాను. పింఛన్ కావాలంటే మొట్టమొదట అడిగే మాట.. మీరు ఏ పార్టీకి ఓటేశారని. నాకు ఎంత ఇస్తారని. డెత్ సర్టిఫికెట్‌కు, బర్త్ సర్టిఫికెట్‌కు, మట్టి, ఇసుక, చిన్న బీమాకు.. పెద్ద బీమాకు లంచం. చివరికి బాత్రూమ్స్ మంజూరు కావాలన్నా లంచాలు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు అంటేనే అవినీతి అనే పరిస్థితి తీసుకువచ్చారు. నీటిపారుదల శాఖ పనులు, రోడ్లు, సచివాలయ నిర్మాణం, ప్రతి చోటా అవినీతి. దీన్ని మార్చడానికి పైస్థాయి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టాం. అందుకోసం రివర్స్ టెండరింగ్ తెస్తున్నాం. అంటే రూ.100 పని రూ.80కే అవుతుందని అనుకుంటే రివర్స్ టెండరింగ్. తక్కువకు ఎవరు కోట్ చేస్తారో వారికే పనులు అప్పగిస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా చేస్తాం. రూ.100 పని రూ.75కే చేస్తారా.. అని అడుగుదాం. ఇందులో ఏ ఒక్క రూపాయి మిగిలినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేద్దాం. నాణ్యత, పారదర్శకత పాటిద్దాం. నా స్థాయిలో నేను, మీ స్థాయిలో మీరు నిర్ణయాలు తీసుకుంటే మార్పు వస్తుంది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని నేనే స్వయంగా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను అడిగాను. రూ.100 కోట్లు పైచిలుకు హైవాల్యూ కాంట్రాక్టు పనులు నేరుగా జ్యుడిషియల్ కమిషన్‌కు వెళతాయి. వారం రోజల పాటు పబ్లిక్ డొమైన్లో టెండర్ ప్రతిపాదనలను జడ్జిగారు పెడతారు. దీనిపై జడ్జి గారికి సలహాలను కూడా ఇవ్వొచ్చు. జడ్జి గారు ఈ సలహాలు తీసుకుని, సాంకేతిక కమిటీ సహాయంతో ప్రభుత్వానికి మార్పులను సూచిస్తారు. సాంకేతిక కమిటీకి అయ్యే ఖర్చును మనమే భరిస్తాం. ఆ తర్వాతే టెండర్లు పిలుస్తాం. పారదర్శకతను ఆ స్థాయికి తీసుకువెళ్తాం. ఇక్కడి నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇవాళ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో మనం చూడాలి. మనం ఇక్కడ ‘ప్రజావేదిక’లో సమావేశమయ్యాం. ఈ సమావేశం జరుగుతున్న ఈ హాల్లో ఇంత మంది కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్వోడీలు, మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారు. ఈ భవనం లీగల్‌గా, చట్టపరంగా సరైనదేనా? అంటే కాదు. నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా అవినీతితో కట్టిన భవనం ఇది. అలాంటి ఒక అక్రమ నిర్మాణంలో మనం సమావేశం పెట్టుకున్నాం. నది వరద మట్టం స్థాయి 24 మీటర్లు. కానీ ఈ బిల్డింగ్ ప్రస్తుతం ఉన్న స్థాయి 19 మీటర్లు. గ్రీవెన్స్ హాల్ ఇక్కడ కట్టొద్దని కృష్ణా సెంట్రల్ డివిజన్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గత ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. నదీ పరిరక్షణ చట్టం పట్టించుకోలేదు. లోకాయుక్త సిఫార్సులు కూడా పట్టించుకోలేదు. చివరికి దీని నిర్మాణంలో కూడా అవినీతే. భవనం నిర్మాణ వ్యయం అంచనాలు కూడా రూ.5 కోట్ల నుంచి రూ.8.90 కోట్లకు పెంచారు. ఇది చూపించడానికే, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని ఆత్మ పరిశీలన చేసుకోడానికే ఇక్కడ మీటింగ్ పెట్టండని చెప్పాను. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చొని పర్యావరణ చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, నదీ పరిరక్షణ చట్టాలు...అన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండీ బేఖాతర్ చేయాల్సిన పరిస్థితి. ఎవరైనా చిన్నవాళ్లు ఇదే పనిచేసి ఉంటే మనం ఏం చేసేవాళ్లం? ఎందుకు అక్రమ నిర్మాణం చేపట్టారని అడిగేవాళ్లం. అక్కడకు వెళ్లి ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తాం. కానీ మనమే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, రూల్స్‌ను నిబంధనలను ఉల్లంఘిస్తున్నాం. మనమే ఈ స్థాయిలో నియమాలను, నిబంధనలను ఉల్లంఘిస్తూ కింది స్థాయికి ఎటువంటి సందేశం పంపుతున్నట్లు? మనం సరైన మార్గంలో ఉన్నామా అని ప్రతి ఒక్కరూ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. ఇందుకోసమే నాతో సహా అందర్నీ ఇక్కడకు రమ్మన్నాను. ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నామో మనం చూడాలి. ఈ హాలు నుంచే మనం ఆదేశాలు ఇస్తున్నాం. ఈ హాలులో ఇదే చివరి మీటింగ్ అని చెబుతున్నా. రేపు జిల్లా ఎస్పీలతో సమావేశం తర్వాత రాష్ట్రంలో మొదటి అక్రమ కట్టడం కూల్చివేత ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. మనం ఆదర్శంగా నిలిచిపోవాలి. మీమీ జిల్లాలకు వెళ్లినప్పుడు పరిశీలించి ఇలానే చేయండి. తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మ ఒడి మన రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతం ఉంది. జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువ. అందుకే పిల్లలను చదివించేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం పెట్టాం. పిల్లలను ఏ పాఠశాలకు పంపినా తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. విద్యా రంగం నాకు అత్యంత ప్రాధాన్యమైన అంశాల్లో ఒకటి. పాఠశాలల ఇప్పుడున్న పరిస్థితిపై ఫొటోలు తీసి, వాటిని అభివృద్ధి చేస్తాం. ఫ్యాన్లు, ఫర్నీచర్, ప్రహరి, బాత్రూమ్స్ అన్నింటినీ బాగు చేస్తాం. ప్రతి పాఠశాలను ఇంగ్లిష్ మీడియం స్కూలుగా మారుస్తాం. తెలుగు తప్పనిసరి సబ్జెక్టు చేస్తాం. యూనిఫారాలు, పుస్తకాలు సకాలంలో ఇస్తాం. పిల్లలకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచిస్తున్నాం. గత ప్రభుత్వంలో మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాం జరగకూడదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతాం. ఇవన్నీ చేశాక ఏ పిల్లవాడికి కూడా ప్రైవేట్ స్కూల్‌కు పోవాలన్న ఆలోచన రాకూడదు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకువస్తాం. కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యా హక్కు చట్టాన్ని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తాం. ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో విద్య అనేది సేవే కానీ డబ్బు ఆర్జించే రంగం కాదు. ఎవరు విద్యా సంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు. ఇది సేవ మాత్రమే. జనవరి 26 నుంచి ‘అమ్మ ఒడి’ చెక్కులు పంపిణీ చేస్తాం. యూనిఫారం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తున్నాం. ప్రైవేట్ స్కూలుకు తప్పనిసరిగా గుర్తింపు ఉండాలి. కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో టీచర్లు కూడా ఉండాలి. నియమ నిబంధనలు రూపొందించి మినహాయింపులు ఏమైనా ఉంటే దానిపై కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలి. విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూల్స్ కచ్చితంగా అమలు చేయాలి. 72 గంటల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి గ్రామ సచివాలయంలో 10 మందిని కొత్తగా తీసుకోండి. వ్యవసాయ నేపథ్యం ఉన్న వారికి గ్రామ సచివాలయంలో అవకాశం ఇవ్వండి. వీరిని ప్రభుత్వ ఉద్యోగులతో అనుసంధానించండి. ప్రజలు పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డ్ కావాలన్నా, ఏది కావాలన్నా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేస్తారు. 72 గంటల్లో దాన్ని పరిష్కరించాలి. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించండి. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక ల్యాబ్‌ను పెట్టాలి. భూ పరీక్షలు, ఎరువులు, విత్తనాల పరీక్షలు.. ఇవన్నీ కూడా ఇందులో భాగం కావాలి. రైతులకు కావల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు గ్రామ సచివాలయం ద్వారా విక్రయిస్తాం. గ్రామ వలంటీర్ల డ్యూటీ డెలివరీతో నిలిపి వేయకూడదు. ఆ 50 కుటుంబాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నాసరే గ్రామ సచివాయలం దృష్టికి తీసుకురావాలి. ఆ సమస్యలను పరిష్కరించేలా చూడాలి. గ్రామ వలంటీర్లలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 50 శాతం మహిళలకు అవకాశం కల్పించాలి. -
మేనిఫెస్టో అమలు చేసేలా బడ్జెట్ రూపకల్పన
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేసే విధంగా బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరూ అభివృద్ధి చెందేలా బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. బుధవారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో తన చాంబర్లో బుగ్గన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న ప్రతీ రూపాయి వృథా కాకుండా చిత్తశుద్ధితో ఖర్చు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, దీన్ని తిరిగి గాడిలో పెట్డడం అతి ముఖ్యమైన పని అని తెలిపారు. ఆర్థిక అంశాలపై పట్టురావడానికి కారణమైన స్వర్గీయ సోమయాజులు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆర్థిక మంత్రి పదవి అప్పచెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, ఈ స్థాయికి రావడానికి కారణమైన డోన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, కార్యదర్శి ఎం.రవిచంద్ర తదితరులు మంత్రి బుగ్గనకు శుభాకాంక్షలు తెలిపారు. మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలి డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య శాఖ మంత్రి కె.నారాయణస్వామి నవరత్నాల్లో మహిళలకు కానుకగా ప్రకటించిన దశలవారీ మద్యపాన నిషేధం అమలుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య శాఖ మంత్రి కె.నారాయణస్వామి పిలుపునిచ్చారు. బుధవారం నాల్గవ బ్లాకులోని తన చాంబర్లో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. తక్షణం బెల్ట్‌షాపులను తొలగించాల్సిందిగా బ్రాందీ షాపుల యజమానులను ఆదేశించారు. అందరూ నిజాయతీగా ఉండాలని, ఎంఆర్పీ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన శాఖలోని ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. బీసీల అభ్యున్నతే మా లక్ష్యం బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతే తమ లక్ష్యమని, ఇందుకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ తెలిపారు. బుధవారం సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లోని తన చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నవరత్నాలతో పాటు ఏలూరు బీసీ గర్జనలో ప్రకటించిన డిక్లరేషన్‌ను తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. బీసీ సంక్షేమానికి సేవ చేసుకునే అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలోని 2.10 లక్షల మంది రజకులు, 80 వేల మంది నాయీబ్రాహ్మణులకు ఏటా రూ. 10,000 ఇచ్చే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. త్వరలో భూముల రీ సర్వే డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో భూములను రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. 1908 తర్వాత భూముల సర్వే జరగలేదని, ఇప్పుడు రీ సర్వే చేయడం ద్వారా కోర్టులు, వివాదాల్లో ఉన్న అనేక భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు 25 లక్షల గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనికి అనుగుణంగా భూ సేకరణ చేయడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి భూములను చాలా చోట్ల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా పీవోపీ కింద పెట్టారని, ఈ సమస్య పరిష్కరించడానికి త్వరలోనే ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. భూ సేకరణ సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఉన్న ధర ప్రకారం కాకుండా పరిహారం చెల్లించే రోజు ఉన్న మార్కెట్ ధరను వర్తించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తూ తొలి ఫైలుపై మంత్రి సంతకం చేశారు. ఒప్పందం సమయానికి చెల్లింపు సమయానికి ఉన్న ధరల వ్యత్యాసం వల్ల భూయజమానులు నష్టపోతున్నారని, దీనికి అడ్డుకట్టవేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ జిల్లాలో స్టడీ సర్కిళ్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్ ప్రకటించారు. బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్‌లోని తన చాంబర్లో విశ్వరూప్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఉన్నాయని, మరో రెండు సర్కిళ్ల ఏర్పాటుకు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. మిగిలిన 8 జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 1,000 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 850 కోట్లు మురిగిపోయాయని, సాంఘిక సంక్షేమానికి రూ. 4,500 కోట్లు కేటాయించి రూ. 2,600 కోట్లు వెనక్కి తీసుకుందన్నారు. తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేస్తుందని చెప్పారు. సీఎం ఆశయాల మేరకు గురుకులాలు, హాస్టళ్ల పనితీరును మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడికి సొంతిల్లుండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాన్ని నెరవేర్చడమే తన లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు పేర్కొన్నారు. ఇందు కోసం సుమారు 28 లక్షల గృహాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. బుధవారం సచివాలయం నాల్గవ బ్లాక్‌లో మంత్రి తన చాంబర్లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అత్తిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో వంద శాతం ఇందిరమ్మ గృహాలు నిర్మించామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో మంత్రిగా రాష్ట్రంలో అందరికీ ఇళ్లు కట్టించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆ శాఖ అధికారులు రంగనాథరాజుకు అభినందనలు తెలిపారు. పర్యాటక ఆదాయంపై దృష్టి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పించడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్‌ను నియమిస్తామన్నారు. పర్యాటక రంగంపై ప్రాథమికంగా సమీక్ష నిర్వహించిన అనంతరం బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధ్యాత్మికం, ప్రకృతి, బీచ్, మౌంటైన్ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆదాయం పెంచేలా కృషి చేస్తామని తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి హిందీ, ఇంగ్లీçషు భాషలపై పట్టు ఉన్న గైడ్లను నియమించుకోనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో కన్వెన్షన్ హాల్‌తో కూడిన శిల్పారామాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి ట్రాన్స్పోర్ట్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ట్రాన్సుపోర్టు, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల భోజన విరామ సమయంలో ఆయన నేరుగా మీడియా పాయింట్‌కు వచ్చి జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్నారు. తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి రాష్ట్రంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) వ్యవస్థాపక నాయకుడిగా పనిచేశారని, అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులతో తనకు సాన్నిహిత్యం ఉందని పేర్ని నాని పేర్కొన్నారు. జర్నలిస్టులతో తనకు ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత్యం ఉందని, వారి కష్టాలు తనకు తెలుసన్నారు. జర్నలిస్టులకు స్థలాలు, ఇళ్లు, చాలీచాలని జీతాలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని నాని హామీ ఇచ్చారు. తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి నియామకం తిరుపతి పట్టణ అభివృద్ధి అథారిటీ (తుడా) చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. 2004వ సంవత్సరంలో కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తుడా చైర్మన్‌గా చెవిరెడ్డిని నియమించారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆయనను అదే పదవిలో నియమించడం విశేషం. ప్రస్తుతం తుడా చైర్మన్‌గా ఉన్న జి.నరసింహ యాదవ్ రాజీనామా చేయగా దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. -
అందరికీ తీపి కబురు
ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గ తొలి సమావేశంలోనే ఆచరణలో చూపించారు. నవరత్నాల పథకాల అమలుకే అగ్రప్రాధాన్యమని మంత్రులకు తేల్చిచెప్పారు. మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిజానికి ఎన్నికల హామీల అమలుకు ఐదేళ్ల సమయం ఉన్నా.. ఆయన ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించకుండా కార్యాచరణ ప్రారంభించారు. మంత్రివర్గ తొలి సమావేశంలోనే తన ఉద్దేశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్థిక భారం అవుతుందేమోనన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. ప్రజలకు మేలు చేయడం కంటే ఏదీ ముఖ్యం కాదని విస్పష్టంగా ప్రకటించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యాలుగా తమ ప్రభుత్వ అజెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్దిరోజుల్లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులతో పాటు అన్ని వర్గాలకు తీపి కబురును అందించింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వందలాది హామీలను చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాటు అమలు చేయకుండా ప్రజలకు ద్రోహం చేసింది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాగ్దానాల అమలుకు తొలి సంతకంతో శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోను ఖురాన్‌గా, బైబిల్‌గా, భగవద్గీతలా పవిత్రంగా భావించి అమలు చేస్తామని ప్రకటించిన వైఎస్ జగన్.. తొలి కేబినెట్లోనే మేనిఫెస్టో హామీల్లో అత్యధికం అమలు ప్రారంభించారు. కేబినెట్ నిర్ణయాల పట్ల అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి రూ.12,500 రైతు కుటుంబానికి ఏటా పెట్టుబడి సాయం మేనిఫెస్టోలో ఏముంది ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఐదేళ్లలో రూ. 50 వేలు ఇస్తాం. మే నెలలోనే రూ.12500 ఇస్తాం. పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే చెల్లిస్తాం. రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలు. రైతులకు ఉచితంగా బోర్లు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. కేబినెట్ నిర్ణయం వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి పెట్టుబడి సాయం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పగా ఈ రబీ సీజన్ నుంచే అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ డబ్బును తమ అప్పునకు బ్యాంకులు జమ చేసుకోకుండా చర్యలు. గతంలో ఏముందంటే ? గతంలో రైతులకు ఇలాంటి పథకమే లేదు. ఎంత ప్రయోజనం: రైతు కుటుంబానికి ఏటా రూ. 12,500 అందుతుంది. ప్రస్తుతం వడ్డీలేని రుణాలు అమలు కావడంలేదు. అయితే రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. ఇప్పటి వరకూ రైతులకు ఉచితంగా బోర్లు వేసే విధానం లేదు. రైతులకు ఉచిత బోర్లు వేసేందుకు ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున రిగ్గులను అందుబాటులో ఉంచడం కోసం 200 రిగ్గులను కొనాలని కేబినెట్ నిర్ణయించింది. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత బోరు వేయనున్నారు. ప్రకృతి వైపరీత్యాల నిధి. రూ.2000 కోట్లు ఇప్పటి వరకూ ప్రీమియం చెల్లించి బీమా చేయించుకున్న రైతులకే పంటల బీమా వర్తిస్తోంది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రతి రైతు పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించనుంది. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం ఇప్పించే బాధ్యతను కూడా సర్కారు తీసుకోనుంది. ధరల స్థిరీకరణ నిధి రూ.3000 కోట్లు కనీస మద్దతు ధరకు వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయని పక్షంలో సర్కారే కొనుగోలు చేయనుంది. వ్యవసాయ ప్రగతి, రైతు సంక్షేమం లక్ష్యంగా ఇందుకు చర్యలు తీసుకోవడం కోసం సిఫార్సుల నిమిత్తం ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు. నాణ్యమైన బియ్యం పంపిణీ - మేనిఫెస్టో : మేనిఫెస్టోలో లేదు. ఎన్నికల సభల్లో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. - కేబినెట్ నిర్ణయం: సెప్టెంబర్ ఒకటి నుంచి నాణ్యమైన బియ్యం ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో తెల్లకార్డుదారులకు పంపిణీ. బియ్యంతో పాటు ఐదారు నిత్యావసర సరుకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ. - ప్రస్తుతం : డీలర్ల వద్దకు వెళ్లి కార్డుదారులు బియ్యం తెచ్చుకోవాలి. వేలిముద్రలు పడటంలేదంటూ కొందరికి ఇవ్వడంలేదు. ఇచ్చే బియ్యం కూడా నాసిరకమైనవి కావడంతో వండుకుని తినడానికి పనికిరావడంలేదు. దీంతో చాలామంది తక్కువ రేటుకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ ఎఫ్‌సీఐకి అమ్మే ప్రక్రియ సాగుతోంది. - ప్రయోజనం : నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే అందరూ వండుకుని తింటారు. బ్లాక్ మార్కెటింగ్ ఉండదు. ఐదారు నిత్యావసర సరుకులు కూడా సరసమైన ధరలకు ఇవ్వడంవల్ల 1.47 కోట్ల మంది తెల్లకార్డుదారులు ప్రయోజనం పొందనున్నారు. లబ్ధిదారులు 1.47 కోట్ల మంది పింఛను పెంపు - మేనిఫెస్టో : ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గిస్తాం. అవ్వాతాతల పింఛను రూ. 3వేల వరకూ పెంచుతూ పోతాం. - కేబినెట్ నిర్ణయం : ప్రస్తుతం పింఛను రూ. 2,000 నుంచి రూ. 2,250కి పెంపు. వచ్చే ఏడాది నుంచి ఏటా రూ. 250 పెంచుతూ రూ. 3000 వరకూ పెంపు. పింఛను పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు. - ప్రస్తుతం : రూ. వెయ్యి మాత్రమే ఉన్న పింఛనును ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చిన తర్వాత బాబు సర్కారు రూ. 2,000కు పెంచింది. అయితే పింఛను వయసును బాబు సర్కారు 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. దీనివల్ల లక్షలాది మంది పింఛనుకు అనర్హులుగా మారారు. - ప్రయోజనం : పింఛను వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించడంవల్ల అదనంగా 5 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు. పింఛను పెంపు లబ్ధి పొందేవారి సంఖ్య మొత్తం 59 లక్షలకు చేరనుంది. పింఛను పెంపు వల్ల లబ్ధిపొందేవారి సంఖ్య 59 లక్షలు అమ్మ ఒడి - మేనిఫెస్టో: పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికీ సంవత్సరానికి రూ. 15,000 ఇస్తాం. - కేబినెట్ నిర్ణయం: పిల్లలందరినీ చదివించి విజ్ఞానవంతులను చేయాలన్న లక్ష్యంతో పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 చెక్కు గ్రామ, వార్డు వాలంటీరు ద్వారా ఇంటి వద్దే అందించే ఏర్పాటు. దీనిని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయాలి. - ప్రస్తుతం: చాలామంది పిల్లలను బడికి పంపించే స్థోమత లేక కూలి పనులకు పంపిస్తున్నారు. - ప్రయోజనం: తెల్లరేషన్ కార్డులున్న 1.47 కోట్ల కుటుంబాలకు లబ్ధి. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా అందే మొత్తం రూ.15,000 అంగన్వాడీలకు.. - మేనిఫెస్టో: అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు తెలంగాణలో ఉన్న గౌరవ వేతనం కంటే రూ. వెయ్యి అధికంగా చెల్లింపు - కేబినెట్ నిర్ణయం: అంగన్ వాడీ టీచర్లు, కార్మికులకు రూ. వెయ్యి గౌరవ వేతనం పెంపు - గతంలో ఏముంది: అంగన్వాడీ టీచర్లకు రూ. 10500, కార్యకర్తలకు రూ. 6000 గౌరవ వేతనం ఉంది. - ప్రయోజనం: అంగన్వాడీ టీచర్లకు రూ. 11,500, కార్యకర్తలకు రూ. 7,000 గౌరవ వేతనం అమలు. డ్వాక్రా యానిమేటర్లకు.. - మేనిఫెస్టో: డ్వాక్రా యానిమేటర్లకు రూ.10 వేల గౌరవ వేతనం. - కేబినెట్ నిర్ణయం: డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్సు పర్సన్లకు రూ. 3,500 నుంచి రూ. 10 వేలకు గౌరవ వేతనం పెంపు. - ప్రస్తుతం: గతంలో వీరికి నయాపైసా కూడా గౌరవ వేతనం లేదు. చంద్రబాబు ఎన్నికల ముందు ఓట్ల కోసం వీరికి రూ. 3,500 గౌరవ వేతనం ఇస్తామంటూ జీవో ఇచ్చారు. - ఎంత ప్రయోజనం: డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్సు పర్సన్లకు గౌరవ వేతనం భారీగా పెరగనుంది. 104, 108 మెరుగుకు - హామీ 104, 108 అంబులెన్సు సేవల మెరుగునకు చర్యలు - కేబినెట్ నిర్ణయం: ప్రతి మండలంలో 104, 108 వాహనాలు ఒక్కోటి చొప్పున ఏర్పాటు. ఎక్కడ నుంచి ఫోను వచ్చినా 20 నిమిషాల్లో ఈ అంబులెన్సులు అక్కడకు చేరే విధంగా చర్యలు. 104 అంబులెన్సుల్లో సిబ్బంది ఏర్పాటు.. మందుల కల్పన. - ప్రస్తుతం: అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రికి చేరుకోవడానికి ఫోన్ చేసినా గంటల తరబడి అంబులెన్సులు రాని పరిస్థితి. - ప్రయోజనం: అత్యవసర వైద్యం కావాల్సివచ్చినప్పుడు ఆస్పత్రికి చేరుకోవడం కోసం రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఫోన్ చేసినా 20 నిమిషాల్లో అంబులెన్సు చేరుకుని క్షతగాత్రులు/ గర్భిణులు, వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి చేర్చే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల తక్షణ వైద్యం లభించి ప్రాణాలను కాపాడేందుకు వీలు. అర్హులందరికీ ఇళ్లు - మేనిఫెస్టో : ఇంటి స్థలం లేని అర్హులందరికీ ఇంటి స్థలాలు. మహిళల పేరునే రిజిస్ట్రేషన్. ఇళ్లు కూడా కట్టిస్తాం. - కేబినెట్ నిర్ణయం : ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి అయినా ఇంటి స్థలం లేని కుటుంబానికి మహిళ పేరుతో ఇంటి స్థలం ఇవ్వాలి. ఇంటి స్థల పట్టా ఇస్తే బ్యాంకు రుణం రాదు. అందువల్ల వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇళ్లు కూడా ప్రభుత్వమే కట్టించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో పేదలకు ఇళ్లు నిర్మించాలి. అగ్రిగోల్డ్ మేనిఫెస్టోలో ఏముంది.. రూ.1,150 కోట్లు కేటాయించి ప్రభుత్వ గణాంకాల ప్రకారం బాధితులకు (డిపాజిటర్లకు) చెల్లింపులు జరిపిస్తాం. - కేబినెట్ నిర్ణయం: రూ. 20 వేల లోపు డిపాజిట్‌దారులకు ఈ మొత్తం చెల్లించే ఏర్పాటు. అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన భూములను ప్లాట్లుగా మార్చి వేలం ద్వారా విక్రయించి బాధితులకు చెల్లించేందుకు కోర్టు ద్వారా అనుమతి తీసుకుని ప్రతీ డిపాజిట్‌దారుకు న్యాయం చేసే దిశగా చర్యలు. ప్రభుత్వం కేటాయించిన మొత్తం 1,150 కోట్లు - గతంలో ఏమి జరిగింది: బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడం ద్వారా ప్రయోజనం పొందాలని గత పాలకులు ప్రయత్నించారు. చివర్లో ఎన్నికల ముందు ఓట్ల కోసం రూ. 250 కోట్లు మంజూరు చేసినట్లు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు తప్ప నిధులు ఇవ్వలేదు. - ఎంత ప్రయోజనం : ప్రభుత్వం కేటాయించిన రూ. 1,150 కోట్లతో తక్షణం తొమ్మిది లక్షల మంది పేద డిపాజిట్‌దారులకు లబ్ధి చేకూరనుంది. కోర్టు అనుమతితో బహిరంగ వేలం ద్వారా అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించడం ద్వారా బాధితులందరికీ న్యాయం జరుగుతుంది. లబ్ది పొందే డిపాజిటర్లు 9 లక్షల మంది ఆశా కార్యకర్తలు - మేనిఫెస్టో: ఆశా వర్కర్లకు రూ. 10 వేల గౌరవ వేతనం. - కేబినెట్ నిర్ణయం: ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంపు. - ప్రస్తుతం: ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ. 3,000 - ప్రయోజనం: 42 వేల మంది ప్రయోజనం పొందనున్నారు. గ్రామ సచివాలయాలు - మేనిఫెస్టో: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన దిశగా పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటు. - కేబినెట్ నిర్ణయం: అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభం. పారదర్శకంగా నోటిఫికేషన్ల ద్వారా గ్రామ వాలంటీర్ల ఎంపిక. ఆగస్టు 15వ తేదీకల్లా నియామకాల ప్రక్రియ పూర్తి. - ప్రస్తుతం: ప్రస్తుతం సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందాలంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇవ్వాల్సిన దుస్థితి. టీడీపీ వారికే పథకాలు ఇచ్చే దుస్థితి. - ప్రయోజనం: ఏదైనా పథకం కింద, లేదా పత్రాల కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే పరిష్కారం. సర్కారులో ఆర్టీసీ విలీనం - మేనిఫెస్టో: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ. - కేబినెట్ నిర్ణయం: మానవీయ కోణంలో ఆలోచించి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ సూత్రప్రాయ నిర్ణయం. ఇందు కోసం ఆర్థిక, రవాణా శాఖల మంత్రులతో కమిటీ. సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి ఆర్టీసీ మెరుగుకు చర్యలు. డీజిల్ ధరల పెరుగుదలవల్ల కలిగే నష్టాల నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు. - ప్రస్తుతం: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రయోజనం: ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రయోజనం కలుగనుంది. వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. సర్కారు స్కూళ్ల రూపురేఖల మార్పు - మేనిఫెస్టో : ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాలు ప్రజలముందుంచి రెండేళ్ల తర్వాత అభివృద్ధి చేసి మళ్లీ వాటి పరిస్థితిని ప్రజల ముందు పెడతాం. విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తాం. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు తగ్గించడంతో పాటు ప్రమాణాలు పెంపు. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంపు. - కేబినెట్ నిర్ణయం: ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలన్నింటి ఫొటోలు తీసి స్కూళ్ల రూపురేఖలను మార్చాలి. పాఠశాలలను అభివృద్ధి చేసిన తర్వాత ఫొటోలను ప్రజల ముందు పెట్టి ప్రభుత్వం చేసింది చూపించాలి. విద్యాహక్కు చట్టం కింద ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. అయితే ఏళ్ల తరబడి దీని అమలుకు గత పాలకులు చర్యలు తీసుకోలేదు. ఇక నుంచి దీనిని అమలు చేయాలి. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి. రాష్ట్ర విద్యా పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణతో పాటు ప్రమాణాల మెరుగుకు చర్యలు. 25% ప్రతి ప్రయివేటు విద్యా సంస్థ పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లు - ప్రస్తుతం: ప్రభుత్వ స్కూళ్లు దయనీయంగా ఉన్నాయి. - ప్రయోజనం: ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగవడం. విద్యా ప్రమాణాలు పెంచడంవల్ల పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో చేరేవారి సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ప్రైవేటు విద్యాసంస్థలకు వేలల్లో ఫీజులు చెల్లించాల్సిన భారం పేదలకు తప్పనుంది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు అదుపులోకి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు - మేనిఫెస్టో : సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ. అధికారంలోకి రాగానే 27 శాతం మధ్యంతర భృతి అమలు. కాంట్రాక్టు ఉద్యోగుల అర్హత, సర్వీసు ఆధారంగా క్రమబద్ధీకరణ. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు. - కేబినెట్ నిర్ణయాలు: జూలై 1 నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి. సీపీఎస్ రద్దు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం. దీనిని ఎలా అమలు చేయాలన్న అంశంపై విధి విధానాల తయారీ. అవరోధాల తొలగింపు కోసం ఆర్థికమంత్రి అధ్యక్షతన కార్యదర్శులతో కమిటీ. అర్హత, అనుభవం ప్రాతిపదికన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. దీని అమలుకు ఆర్థిక, విద్యుత్తు, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, విద్య, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీ. - ప్రస్తుతం: సీపీఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ అమలు చేయాలని ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నా బాబు సర్కారు పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు పదో పీఆర్సీ సక్రమంగా అమలు చేయకుండా అన్యాయం చేసింది. ప్రయోజనం ఐఆర్ పెంపు 27% లబ్ధిపొందే ఉద్యోగులు 4.20 లక్షలు నెలవారీ లబ్ధి 815 కోట్లు -
సంక్షేమ జెండా.. ప్రగతి అజెండా..
సాక్షి, అమరావతి : నవరత్నాల పథకాలు చుక్కానిగా.. ఎన్నికల మేనిఫెస్టో మార్గనిర్దేశంగా సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వ విధానాన్ని ఆవిష్కరించారు. మానవీయత ఇరుసుగా సంక్షేమ, అభివృద్ధి పాలనను అందించడమే లక్ష్యమని స్పష్టంచేశారు. అందుకోసం రానున్న ఐదేళ్లలో తమ పరిపాలనకు దిక్సూచిగా నిలిచే స్పష్టమైన అజెండాను సోమవారం నిర్వహించిన మంత్రివర్గ తొలి సమావేశంలోనే నిర్దేశించారు. ‘ఎన్నికల మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీత మాదిరిగా పవిత్ర గ్రంథంగా భావిస్తాను. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ అమలుచేస్తాను’.. అని వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ ఆయన తన సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకంతోనే తాను సంక్షేమ ముఖ్యమంత్రినని నిరూపించుకున్న ఆయన.. తన తొలి కేబినెట్ సమావేశంలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించారు. ప్రజా సంక్షేమంపట్ల చిత్తశుద్ధిని, రాష్ట్ర ప్రగతిపట్ల దార్శనికతకు అద్దంపడుతూ వైఎస్ జగన్ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులు, అధికార యంత్రాంగానికి వివరించారు. నిబద్ధతతో నవరత్నాల పథకాలు, మేనిఫెస్టో అమలుచేయాలని నిర్దేశించారు. సుదీర్ఘంగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని అంశాలపై పూర్తి సాధికారతతో చర్చించారు. మంత్రులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం కల్పించి ప్రజాస్వామ్య స్ఫూర్తితో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాజన్న సంక్షేమ రాజ్యస్థాపనకు మానవీయత, దార్శనికతతో కూడిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. నిబద్ధతతో ‘నవరత్నాలు’ అమలు నవరత్నాల పథకాలు చుక్కానిగా తమ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన విధానాన్ని ఆవిష్కరించారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలకు హామీ ఇచ్చిన ‘నవరత్నాల’ పథకాలను పూర్తి నిబద్ధతతో అమలుచేయాలని ఆయన మంత్రులకు నిర్దేశించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలుపడ్డ కష్టాలు, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి మానవీయ కోణంలో విశ్లేషించి హేతుబద్ధంగా రూపొందించిన పార్టీ విధాన నిర్ణయమే నవరత్నాల పథకాలు అని ఆయన వివరించారు. ఆ పథకాలపట్ల విశ్వాసంతోపాటు ఇచ్చిన మాటకు కట్టుబడతారన్న నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్సీపీకి అఖండ మెజార్టీ కట్టబెట్టారని గుర్తుచేశారు. ప్రతీ హామీ అమలుచేయాల్సిందే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ప్రతి హామీ కచ్చితంగా అమలుచేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. ‘ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రజలు మనల్ని నమ్మి అధికారాన్ని ఇచ్చారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’.. అని మంత్రులకు చెప్పారు. ‘నా టేబుల్‌పై మేనిఫెస్టో కాపీ ఉంది. మీ టేబుల్ పైన కూడా ఉండాలి’ అని మంత్రులకు సూచించారు. దీనిపై మంత్రులు పూర్తి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. పూర్తి సాధికారతతో చర్చించిన సీఎం పరిపాలన పట్ల సీఎం వైఎస్ జగన్ ఎంతటి నిబద్ధత, చిత్తశుద్ధితో ఉన్నారన్నది తొలి మంత్రివర్గ సమావేశంలోనే మంత్రులకు అర్ధమైంది. మంత్రివర్గ అజెండాలోని అంశాలతోపాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ పూర్తి సాధికారతతో మాట్లాడటం వారిని ఆకట్టుకుంది. అన్ని అంశాలపై ఆయన ఎంతో కసరత్తు చేసి వివిధ కోణాల్లో విశ్లేషించి మరీ సమావేశానికి వచ్చారు. పింఛన్లు, వివిధ వర్గాలకు జీతాల పెంపుదలతో అదనపు ఆర్థిక భారం, కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం లోటుపాట్లు, రద్దుకు రూపొందించాల్సిన విధాన నిర్ణయం, రైతు భరోసా, అమ్మ ఒడి, రైతులకు వడ్డీలు లేని రుణాలు.. ఇలా ఏ అంశమైనా సరే ఎంతో అవగాహనతో సూటిగా.. స్పష్టంగా మాట్లాడారు. సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్తపడ్డారు. మంత్రివర్గ సమావేశాలకుగానీ పరిపాలనా వ్యవహారాల్లోగానీ మంత్రులు ఎంతగా కసరత్తు చేయాలి.. తమ శాఖలపై ఎంతగా పట్టు సాధించాలి.. విధాన నిర్ణయాల అమలులో ఎంతగా భాగస్వాములు కావాలో వైఎస్ జగన్ విపులీకరించారు. విధానాల్లో మానవీయ కోణం సీఎం జగన్ నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఆసాంతం మానవీయ కోణం వెల్లివిరిసింది. అజెండాలోనూ.. ప్రాధాన్యతల్లోనూ.. ఆయన మాటల్లోనూ.. వివిధ అంశాలపై చర్చలోనూ.. మంత్రివర్గ నిర్ణయాల్లోనూ అది ప్రధానాంశంగా నిలిచింది. తొలి మంత్రివర్గ సమావేశంలోనే సంక్షేమ పథకాలు, వివిధ వర్గాలకు జీతాల పెంపు వంటి దాదాపు 50 కీలక నిర్ణయాలు తీసుకోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉదాహరణకు.. - ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు, ఆయాలు.. ఇలా పలు వర్గాల జీతాలు పెంచారు. - అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణ సాయం కోసం రూ.1,150 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. - రైతు భరోసా, అమ్మ ఒడి తదితర పథకాల అమలుకు నిర్ణయించారు. - జీతాల పెంపు వంటి అంశాలపై చర్చలో కొందరు మంత్రులు లేవనెత్తిన అంశాలపై.. జగన్ మాటలు ఆయనలోని మానవీయతకు అద్దంపట్టాయి. - పారిశుద్ధ్య కార్మికులకు జీతాలను నెలకు రూ.18 వేలకు పెంచాలన్న ప్రతిపాదనపై కొందరు అంత జీతాలు పెంచడం ఆర్థిక భారం అవుతుందేమోనని సందేహం వ్యక్తంచేశారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. ‘అన్నా, పారిశుధ్య కార్మికులు చేస్తున్న పనికి ఎంత జీతం ఇచ్చినా సరిపోదు. అలాంటి వారికి న్యాయం చేయకుంటే దేవుడు మనల్ని క్షమించడు. వారికి జీతాలు రూ.18 వేలకు పెంచుదాం’.. అని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. - ఆర్థిక భారంతో పిల్లలు చదువు మానేసి బాలకార్మికులుగా మారకూడదని.. అందుకే అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించామని వైఎస్ జగన్ చెప్పారు. మరీ అంత సీరియస్సా.. - మంత్రిమండలి సమావేశం ప్రారంభంలో మంత్రులు కాస్త గంభీరంగా ఉండడాన్ని సీఎం జగన్ గుర్తించారు. ‘అందరూ మరీ అంత సీరియస్‌గా ఉన్నారేందన్నా.. కాస్త నవ్వండి.. నవ్వుతూ బాగా పనిచేద్దాం’.. అని వ్యాఖ్యానించి సమావేశంలో ఆహ్లాదకర వాతావరణాన్ని తెచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో.. సీఎం వైఎస్ జగన్ తన మంత్రివర్గ సమావేశాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించడంపైనా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సమావేశంలో మంత్రులకు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. తన ప్రభుత్వంలో మంత్రులు ఎవరూ డమ్మీలు కారని ఆయన అధికారులకు స్పష్టంచేశారు. పలు కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు వాటిల్లో ఎవరెవరిని నియమించాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు వీటిల్లో మంత్రులు అవసరంలేదని అధికారులు అనడంతో జగన్ పై విధంగా స్పందించారు. అంతేకాక, ‘వారికి అన్ని అంశాలపైనా అవగాహన ఉంది. పాలనా సంబంధ వ్యవహారాల్లో వారు కూడా క్రియాశీలంగా ఉంటారు. వారు చెప్పిన దానికి అనుగుణంగా పాలన జరగాలి. అధికారులు వారి మాట వినాలి’ అని జగన్ స్పష్టంగా నిర్దేశించినట్లు సమాచారం. సమావేశంలో చర్చించే అంశాలపై మంత్రులు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే నిస్సంకోచంగా చెప్పొచ్చని సమావేశం ప్రారంభంలోనే సీఎం చెప్పడంతో మంత్రులందరూ క్రియాశీలంగా వ్యవహరించారు. గ్రామ, పట్టణ వలంటీర్ల నియామకం ప్రస్తావనకు వచ్చినపుడు వారి విద్యార్హతలు నిర్ణయించేటపుడు అధికారులు డిగ్రీని కనీసార్హతగా ఉండాలని నిర్ణయించారు. ఓ ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని డిగ్రీ కనీసార్హత గల వారు గ్రామాల్లో దొరకరని, ఇంటర్‌కు తగ్గించాలని సూచించారు. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరకు గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్లకు ఇంటర్, పట్టణ ప్రాంతాల్లో అయితే డిగ్రీని కనీస విద్యార్హతగా నిర్ణయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆశావర్కర్ల వేతనాలు పెంచే విషయం చర్చకు వచ్చినపుడు.. గిరిజన ప్రాంతాల్లో ఉండే వైద్య వలంటీర్ల జీతాలను కూడా పెంచాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సూచించారని తెలిసింది. ఆ అంశం ఎజెండాలో లేకపోయినా జగన్ దానిని పరిగణనలోకి తీసుకుని వారికి ప్రస్తుతం జీతం ఎంతో తెలుసుకున్నారు. రూ.400 నుంచి రూ.4000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. -
‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
-
మేనిఫెస్టో హామీలు నెరవేర్చాలి
‘‘మా’ ఎన్నికల సందర్భంగా నరేష్ ప్యానెల్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని హామీలను వారికున్న రెండు సంవత్సరాల కాలంలో నెరవేర్చి, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. నూతనంగా ఎన్నికైన వారందరికీ అభినందనలు’’ అని నటులు కృష్ణ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్, ఇతర సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేశారు. నటి, దర్శకురాలు విజయ నిర్మల మాట్లాడుతూ– ‘‘మీ అందర్నీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లోనే ‘మా’ పుట్టింది. ఈ సంఘం అభివృద్ధి కోసం ఇదివరకు నేను ఇస్తున్న డబ్బుకంటే ఎక్కువే ఇచ్చి ఋణం తీర్చుకుంటాను’’ అన్నారు. నటులు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘చెన్నైలో ఉన్నప్పుడు కృష్ణగారు, మేము అంతా ‘మా’ అసోసియేషన్‌ని చాలా బాగా నడిపాం. అప్పుడు ఎలక్షన్స్ లేవు.. ఇప్పుడు వచ్చాయి. ప్యానెల్‌లోని అందరూ కలిసికట్టుగా పనిచేసి, ‘మా’ అసోసియేషన్ ప్రతిష్టని ఎంతో ఎత్తుకు చేర్చాలి’’ అన్నారు. ‘‘మా’ అంటేనే అమ్మ. ఈ కళకి కులం, మతం అంటూ భేదం లేదు.. అందరూ కలిసికట్టుగా పనిచేసి, ‘మా’ అభివృద్ధికి కృషి చేయాలి’’ అన్నారు గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ‘మా’ నూతన అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ– ‘‘ఈ కార్యక్రమానికి విచ్చేసిన కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, శ్యామల, కోటా శ్రీనివాసరావు, జయసుధ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ‘మా’ అసోసియేషన్‌కి నేను ఇచ్చే మొదటి బహుమతి ‘మా’ గీతం. రెండో బహుమతిగా లక్షా వెయ్యినూటపదహార్లు నా సోదరుల సంక్షేమం కోసం ఇస్తున్నాను. ‘మా’ సభ్యత్వం గతంలో లక్ష ఉండగా 10,000 తగ్గిస్తూ 90,000 చేస్తున్నాం.. ఇది నా మూడో గిఫ్ట్.. మా అమ్మ విజయనిర్మలగారు ‘మా’కి ప్రతినెలా 15,000 ఇస్తున్నారు. ‘మా’ లో 24 గంటల హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేసాం. సలహాల పెట్టెను ఏర్పాటు చేసి అందరి విన్నపాలు స్వీకరిస్తాం. మహిళల సాధికారత, సంక్షేమం కోసం జీవితగారి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ఈ సందర్భంగా ‘మా’ కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన గీతాన్ని కృష్ణ, విజయనిర్మల విడుదల చేశారు. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, రాజశేఖర్, జీవిత, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు. -
ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందంటూ తరచూ చెప్పే సీఎం కేసీఆర్ త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీన్ని ప్రతిబింబించాలని భావిస్తున్నారు. ఈసారి ప్రవేశపెట్టేది తాత్కాలిక బడ్జెటే అయినా ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపు, విధాన ప్రకటనలను ఇందులో పొందుపరచడం ద్వారా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లకుగాను 16 సీట్లను గెలుచుకోవాలనుకుంటున్నారు. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల లెక్కలను ఆర్థికశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. ఫిబ్రవరి 20 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే పరిస్థితుల నేపథ్యంలో ఐదారు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలను ముగించాలని సీఎం భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలివే.. ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. వికలాంగుల పెన్షన్లను రూ. 1,500 నుంచి రూ.3,016 వరకు పెంచుతామని పేర్కొంది. మిగిలిన అన్ని రకాల ఆసరా పెన్షన్లను రూ. 1,000 నుంచి రూ. 2,016 వరకు పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపింది. అలాగే బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని 2018 వరకు పొడిగింపుతోపాటు వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు అంశాలు టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఉన్నాయి. రైతుబంధు కింద ఏటా ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు. రూ. లక్ష వరకు పంట రుణాల మాఫీ, రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి. ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను అమలు చేయడం. రెడ్డి, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల కోసం కార్పొరేషన్ల ఏర్పాటు. వివిధ కులాల కేటగిరీ మార్పు విజ్ఞాపనల పరిశీలన. అగ్రవర్ణ కులాల్లోని పేదల అభ్యున్నతికి ప్రత్యేక పథకాల అమలు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రస్తుత పద్ధతిలో కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందజేయడం. అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పన. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలకు సత్వర పరిష్కారం. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు వర్తింపు. కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాల ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ తయారీ. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు చర్య లు. సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దే ప్రయత్నాలు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు. ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేసి, యూనిట్ల నిర్వ హణ బాధ్యత మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగింత. ఒక్కొక్కటిగా అన్నీ... ఎన్నికల హామీల అమలు విషయంలో సీఎం కేసీఆర్ అన్ని పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని వెంటనే అమలు చేసే హామీలు ఏమిటనే జాబితా రూపొందిస్తున్నారు. హామీల అమలు విషయంలో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని పేర్కొంది. ఈ హామీ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని, నిరుద్యోగలకు రూ. 3,016 భృతి చెల్లిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల విషయంలో బడ్జెట్లోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. -
తొలి సంతకాలకే దిక్కు లేదు
రైతు రుణాల మాఫీ చంద్రబాబు గద్దెనెక్కే నాటికి రాష్ట్రంలో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఈ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఆ తరువాత వివిధ రకాల కోతలు, షరతులతో రుణాలను రూ.24,500 కోట్లకు కుదించేశారు. ఇప్పటివరకు మూడు విడతల్లో మాఫీ చేసిన రుణాలు రూ. 14,497 కోట్లు మాత్రమే. ఇది వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోలేదు. దీంతో రైతుల రుణాలు, వడ్డీలు కలిపి 1,26,000 కోట్లకు చేరుకుని 35 లక్షల మంది డిఫాల్టర్లుగా మారారు. వారికి కొత్త రుణాలు ఇచ్చేదే లేదని బ్యాంకులు తేల్చిచెబుతున్నాయి. డ్వాక్రా రుణ మాఫీ చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 7.72 లక్షల డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల అప్పులు ఉన్నాయి. వీటన్నింటినీ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం చేశారు. కానీ, నాలుగున్నరేళ్లలో డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి పైసా కూడా ఇవ్వకుండా దగా చేశారు. రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల నుంచి కొత్త అప్పులు పుట్టక డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. బెల్టు దుకాణాల రద్దు మద్యం బెల్టు షాపులను తక్షణమే రద్దు చేస్తున్నామని నమ్మబలుకుతూ ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు సంతకం చేశారు. తర్వాత ఆ సంగతే మర్చిపోయారు. ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా బెల్టు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.17,291 కోట్ల ఆదాయం వస్తుండగా, ఇందులో బెల్టు షాపుల వాటా రూ.9 వేల కోట్లకు పైమాటే. ఎన్టీఆర్ సుజల ఇంటింటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన చేసిన తొలి సంతకాల్లో ఎన్టీఆర్ సుజల పథకం అమలు కూడా ఒకటి. నాలుగున్నరేళ్లుగా ఈ పథకం పక్కాగా ఆమలైన దాఖలాలే లేవు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచినీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. మరో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాక్షి, అమరావతి: 2014 జూన్ 8వ తేదీన ప్రజల సమక్షంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నానంటూ సీఎం హోదాలో తొలిసారిగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. నాలుగున్నరేళ్లు దాటినా ఆ తొలి సంతకాలకు దిక్కులేకుండా పోయింది. తొలి సంతకాలంటే శిలాక్షరాలే. కానీ, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలపై ముఖ్యమంత్రి మళ్లీ కొత్త హామీల వల విసురుతుండడం గమనార్హం. తొలి సంతకాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో పరిశీలిస్తే చంద్రబాబు చేసిన మోసం తేటతెల్లమవుతుంది. రైతన్నలను నట్టేట ముంచేశారు రాష్ట్రంలో వ్యవసాయ రుణమాఫీ అటకెక్కింది. చంద్రబాబు చేసిన మొదటి సంతకమే పూర్తిగా అమలులోకి రాలేదు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రైతు రుణాలు బేషరతుగా మాఫీ కావాలి. అయితే ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ. 14,497 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ సొమ్ము అసలు రుణాలపై వడ్డీలకు కూడా సరిపోలేదు. దీంతో రైతుల రుణాలు, వడ్డీలు కలిపి రూ. 1,26,000 కోట్లకు చేరుకున్నాయి. రుణమాఫీ సక్రమంగా జరగకపోవడంతో 35 లక్షల మంది రైతుల ఖాతాలు డిఫాల్టర్లుగా మారాయి. వారికి కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదు. రుణాలు చెల్లించని రైతుల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. లక్షలాది మందికి బ్యాంకుల నుంచి తాఖీదులు వచ్చాయి. అప్పులు కడతారా? లేక అరెస్టులు చేయించి కోర్టులకు ఈడ్చమంటారా? అంటూ బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్న, చిన్నకారు, కౌలు రైతులు సాగు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. వడ్డీలు అమాంతం పెరిగిపోతున్నాయి. వాటిని తీర్చే దారి కనిపించక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పల్లెపల్లెనా బెల్టు షాపుల జాతర మద్యం బెల్టు దుకాణాలను వెంటనే రద్దు చేస్తున్నామంటూ చంద్రబాబు చేసిన సంతకం అపహాస్యం పాలైంది. బెల్టు దుకాణాల రద్దుపై చంద్రబాబు మొక్కుబడిగా ఓ జీవో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో బెల్టు షాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి కోసం గ్రామాల్లో ఏకంగా వేలంపాటలు జరుగుతున్నాయి. వీధివీధినా బెల్టు దుకాణాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎక్కడా లేకుండా కత్తిరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా చెబుతున్నప్పటికీ.. బెల్టు షాపుల రద్దు అనేది పెద్ద బూటకమని తేటతెల్లమైంది. నిన్న మొన్నటి దాకా ఫ్యాన్సీ దుకాణాలు, కూల్‌డ్రింక్ షాపులు, మెడికల్ షాపుల్లో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహించిన వారు ఇప్పుడు తోపుడు బండ్లపైనా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు, 800 వరకు బార్లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు అనుబంధంగా 10కిపైగా బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.17,291 కోట్ల ఆదాయం వస్తుండగా, ఇందులో బెల్టు దుకాణాల వాటా రూ.9 వేల కోట్ల పైమాటే కావడం గమనార్హం. జాడ లేని ఎన్టీఆర్ సుజల చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ఎన్టీఆర్ సుజల పథకం ఏమైందో తెలియదు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా అందిస్తామని, 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్‌ను సరఫరా చేస్తామని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆ మేరకు సంతకం కూడా చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 48,363 నివాసిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. అందులో కేవలం 906 నివాసిత ప్రాంతాల్లోనే తొలుత కొన్నాళ్లు ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని అమలు చేసింది. అనంతరం సర్కారు పట్టించుకోకపోవడంతో ఆ 906 నివాసిత ప్రాంతాల్లో మంచినీటి ప్లాంట్లు నిర్వహణ లేక మూతపడ్డాయి. పట్టణ ప్రాంతాల్లోనూ కేవలం 354 నివాసిత ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకం అమలు జరిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోక, బోర్లు, బావుల్లోని నీటిని తాగడానికి వీలులేక ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరకు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు అమ్ముతున్న నీటిలో నాణ్యత గురించి పట్టించుకునే వారే లేకుండాపోయారు. డ్వాక్రా మహిళలకు కన్నీరే మిగిలింది డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూరా తిరుగుతూ హామీ ఇచ్చారు. ఆయన అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 7.72 లక్షల డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల అప్పులు ఉన్నాయి. కానీ, నాలుగున్నరేళ్లుగా పైసాకూడా మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను కన్నీరు పెట్టించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క డ్వాక్రా సంఘాల రుణం మాఫీ చేయలేదని 2018 సెప్టెంబరు 7న మంత్రి పరిటాల సునీత శాసనసభకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. డ్వాక్రా మహిళలు సంఘాల పేరిట పొదుపు రూపంలో దాచుకున్న డబ్బులను అప్పుల కింద బ్యాంకులు జమచేసుకున్నాయి. గతంలో సున్నా వడ్డీ పథకం అమలయ్యేది. చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టాక ఆ పథకానికి నిధులు ఇవ్వడం మానేశారు. దాదాపు రెండేళ్లుగా సున్నా వడ్డీ డబ్బులను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించకపోవడంతో రూ.2,300 కోట్ల వడ్డీని డ్వాక్రా సంఘాల సభ్యులు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. -
ఎన్నికల హామీలు అమలయ్యేనా..?
సాక్షి, ఆసిఫాబాద్(కెరమెరి): ఎన్నికల్లో గెలుపుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రజలకు ఉచిత హామీలిస్తున్నాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా హామీలివ్వడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఉచిత హామీలిస్తున్న నాయకులు వాటికి బడ్జెట్‌ను ఎలా సమకూరుస్తారో చెప్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో తెలిపేందుకు మేనిఫెస్టోలు ప్రకటించారు. వాటిలో అనేక హామీలు ఉన్నాయి. నిజానికి ఈ తతంగం కేవలం ప్రచారం కోసమేనని పలువురు ఆరోపిస్తున్నారు. రాజకీయపార్టీల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుపై ప్రజల్లో చర్చ జరిగిన సందర్భం లేదు. అనేక సందర్భాల్లో పార్టీలు జనాకర్శక పథకాలను ప్రకటించడం, వాటి అమలులో అనేక అవకతవకలు జరిగి ప్రజాధనం వృథా కావడం పరిపాటిగా మారింది. ఓటరు మహాశయున్ని ప్రస్నం చేసుకునేందుకు ఉచిత కానుకలు ప్రకటించారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఆదాయ వ్యయాల స్పృహ లేకుండా కేవలం ఓటర్లకు గాలం వేయడానికి ఇటాంటి హామీలు గుప్పిస్తుంటారు. హామీల అమలు వివరించాలి హామీలిచ్చే పార్టీలు అధికారంలోకి వస్తే నిధులు ఎక్కడ నుంచి తెస్తారో స్పష్టం చేయాలి. హమీల అమలు కోసం బడ్జెట్ పద్దుల్లో వేరే వాటిపైన కోత విధిస్తారా లేక వనరుల సమీకరణ కోసం కొత్త పన్నులు వేస్తారా అన్నది వివరించాలి. ప్రతీ హామీ అమలుకు స్పష్టమైన కాల పరిమితి పెట్టాలి. అధికారంలోకి వచ్చాక నిర్దిష్ట కాలపరిమితిలోగా హామీని నెరవేర్చడంలో విఫలమైన పార్టీలు తామంత తాముగా వైదొలిగేలా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. ఓట్ల కోసం ప్రజలకు మోసపూరిత హామీలిచ్చే పార్టీలను అరికట్టాలి. పార్టీల మేనిఫెస్టోలో ప్రజలు, కూడు, గుడ్డతో సంబంధంలేని ప్రధానాంశాలు ఉన్నాయి. బ్రిటన్ తరహాలో చర్చించాలి బ్రిటన్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందే మేనిఫెస్టోను ప్రకటించి, అందులో పొందుపర్చిన హామీలపై విసృతంగా చర్చిస్తారు. మేనిఫెస్టోలను ఇంటర్నెట్లో చూసుకునే అవకాశం కూడా కల్పిస్తాయి. ఎన్నికల ప్రచారంలో డబ్బు వృథా కాకుండా నియంత్రిస్తారు. రుణాల రద్దు ఎందుకు..? రైతుకు నష్టం వచ్చినప్పుడు నష్టపరిహారం అందించడం సహజం. కానీ అన్ని రుణాలను రద్దు చేస్తామని ప్రకటించడం దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడమే అవుతుంది. బ్యాంకుల దివాళా తప్పదు. ఉచితం అనేది ఓట్లు పొందేందుకు వేసే మంత్రం. నీతికి ఓటేసి అవినీతిని సమాధి చేద్దాం. -సుజాయిత్ ఖాన్. సామాజిక కార్యకర్త, కెరమెరి ఉచితమే.. కానీ అందరికి కాదు ఎన్నికల్లో మొదట నాయకులు అన్ని ఉచితమే అంటారు. తర్వాత కొందరికే అంటారు. దానికి లక్షా తొంబై కారణాలు వెదుకుతారు. పేద, మధ్య ,తరగతికి ఉపయోగపడే మామీలను నాయకులు ఇవ్వాలి. చిత్తశుద్దితో వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. గెలవడానికి వేసే పాచికలు ఇవి. – ధర్మారావు, చౌపన్‌గూడ