సాక్షి, శ్రీకాకుళం: అధికారం చేపట్టి రెండేళ్లు కూడా గడవక ముందే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 92 శాతం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. (చదవండి: స్పీకర్ తమ్మినేనికి తప్పిన ప్రమాదం)
‘‘రూ.3,000 కోట్ల వ్యయంతో 8 ఫిషింగ్ హార్బర్లు, రూ. 225 కోట్ల వ్యయంతో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక ఆక్వా హబ్ నిర్మాణం, మొదటి విడతగా నాలుగు ఫిషింగ్ హార్బర్ లు, 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి కూడా వాటికి శంకుస్థాపన చేశారని’’ ఆయన చెప్పారు. (చదవండి: ‘సీఎం జగన్‌కు మత్స్యకారులు రుణపడి ఉంటారు’)
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న విశాలమైన 193 కిలోమీటర్ల సముద్ర తీరానికి కూడా అన్ని రకాలుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగానే భావనపాడు పోర్టు నిర్మాణం, మూడు మూడు చోట్ల జట్టీ ల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కృష్ణదాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment