కేజ్రీవాల్ సొంత మేనిఫెస్టో
చైనా ఆక్రమించిన మన భూభాగం వెనక్కి
యువతకు ప్రతిఏటా 2 కోట్ల ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత విద్యుత్
ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం
‘ఇండియా’ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో అమలు
హామీలపై కూటమి పారీ్టలను ఒప్పిస్తానని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరిట దేశ ప్రజలకు 10 హామీలు ఇచ్చారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే ఈ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. మోదీ కీ గ్యారంటీ కావాలో, కేజ్రీవాల్ కీ గ్యారంటీ కావాలో దేశ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. కేజ్రీవాల్ కీ గ్యారంటీ అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తాను ఇచి్చన హమీలన్నీ దేశాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవేనని తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఈ పది హామీల అమలును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. తాను ఇస్తున్న పది హామీలపై ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్యపక్షాలతో చర్చించలేదని అన్నారు. ఈ హామీలను నెరవేర్చేలా కూటమిలోని పారీ్టలను ఒప్పిస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు తాను గ్యారంటీలన్నీ అమలు చేశానని, మోదీ కీ గ్యారంటీ మాత్రం అమలు కాలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానంటూ మోదీ ఇచి్చన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు.
హామీలు ఇవే...
1. పేదలకు ఉచిత విద్యుత్
దేశవ్యాప్తంగా నిత్యం 24 గంటలపాటు కరెంటు సరఫరా చేస్తాం. ఎక్కడా కరెంటు కోతలు ఉండవు. దేశంలోని పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం.
2. నాణ్యమైన విద్య
ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య ఉచితంగా విద్య అందిస్తాం.
3. ఉచితంగా చికిత్స
ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్ నిర్మిస్తాం. ప్రతి జిల్లాలో అద్భుతమైన ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తాం. దేశంలోని ప్రతి వ్యక్తికీ మెరుగైన చికిత్స ఉచిత అందిస్తాం.
4. చైనా ఆక్రమించిన భూమి స్వా«దీనం
డ్రాగన్ దేశం చైనా ఆక్రమించిన మన దేశ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఈ విషయంలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాం.
5. అగి్నవీర్ యోజన నిలిపివేత
అగి్నవీర్ పథకాన్ని నిలిపివేస్తాం. అన్నిరకాల సైనిక నియామకాలు పూర్వ విధానంలోనే జరుగుతాయి. ఇప్పటివరకు అగ్నివీర్ పథకంలో రిక్రూట్ అయిన అగి్నవీరులందరినీ పర్మినెంట్ చేస్తాం.
6. పంటలకు కనీస మద్దతు ధర
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఖరారు చేస్తాం. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తాం.
7. ఢిల్లీకి రాష్ట్ర హోదా
ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తాం.
8. యువతకు ఉద్యోగాలు
నిరుద్యోగాన్ని క్రమపద్ధతిలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం. యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కలి్పస్తాం.
9. అవినీతి నుంచి విముక్తి
నిజాయితీపరులను జైలుకు పంపించి, అవినీతిపరులను రక్షించే బలమైన వ్యవస్థను బీజేపీ సృష్టించింది. ఈ వ్యవస్థను రద్దు చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బీజేపీ వాషింగ్ మెషీన్‌ను ప్రజల సక్షమంలోనే బద్ధలు కొడతాం.
10. స్వేచ్ఛా వాణిజ్యం
వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను సరళతరం చేస్తాం. వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం.
బీజేపీ కుట్ర విఫలం
తాను అరెస్టయిన తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ కుట్ర విఫలమైందని చెప్పారు. తన అరెస్టు తర్వాత ఆప్ మరింత ఐక్యంగా మారిందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై వారితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
‘ఆప్’ను గెలిపిస్తే నేను జైలుకెళ్లను
కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్లబోనని తెలిపారు. చీపురు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజల బాగు కోసం పనిచేసినందుకే తనను జైలుకు పంపించారని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం బీజేపీకి నచ్చలేదన్నారు. తాను మళ్లీ జైలుకు వెళితే ఢిల్లీలో అభివృద్ధి నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే భగవంతుడు తనను జైలు నుంచి బయటకు రప్పించాడని ప్రజలు చెబుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యనించారు.
Comments
Please login to add a commentAdd a comment